గు
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
మొదటి రెండవ భాగాలు
సురవరం
¢
తాపరెడ్డి
ప్రధాన సంపాదకులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా॥ సి. నారాయణరెడ్డి అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు
సంపాదకులు డా॥ జె చెన్నయ్య ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఆంధ్ర సారస్వత పరిషత్తు తిలక్ రోడ్, హైదరాబాద్ - 500 001.
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు SURAVARAM PRATAPAREDDY VYASAALU
(్రచురణ:
ఆంధ్ర సారస్వత పరిషత్ తిలక్ రోడ్, హైదరాబాద్ - 500 001.
సర్వస్వామ్య సంకలితం
ప్రథమ ముద్రణ : 1988 ద్వితీయ ముద్రణ : మార్చి, 2015
పేజీలు : 402
ప్రతులు : 1000 వెల : రూ. 240/-
ప్రతులకు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు
తిలక్ రోడ్, హైదరాబాద్ - 500 001. ఫోన్ : 040-24758724
ముద్రణ: సాయిలిఖిత ఆఫ్‌సెట్ ప్రింటర్స్
హైదరాబాద్.
5
హ్ మ ఫి (౪
నా
10. 1.
13. 14. 15.
అనుకునుణీక మొదటి భాగం 2: సారస్వత వ్యాసాలు
అవతారిక: డా సి; నారాయణరెడ్డి = 7 ట్రవేశిక. కహ జే చెన్నయ్య See 10 వ్యాస శేముషి :: ఆచార్య ఎస్వీ రామారావు... 12 గాథాసప్తశతి (సుజాత - మార్చి, ఏప్రిల్, మే 1951).................. 15 ఆంధ్ర వాజ్మయ చరిత్ర (వ్యాస రత్నావళి - 1958).................... 40 ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ (మీజాన్) ....................... 64 తెలుగు వాజ్మయంలో హాస్యరసం (గోలకొండ పత్రిక - 1943)...... 70 బాల వాజ్మయం (సుజాత, మే 1958)... 76 గేయ వాజ్మయం (గోలకొండ -వర్రిక్... గ a ముల 80 పల్లెపదాలు (గోలకొండ పత్రిక 18-4-40, ౨౨౨౨౨౨౨౨౨౦ 88 22-4-40, 6-5-40, 7-9-40) పల్లె పాటలు (ప్రజాబంధు - 12-5-46) ౨౨౨౨౨౨౨౨౨౨ 102 జీవిత చరిత్రలు-వాటి రచన (గోలకొండ పత్రిక)..................... 108 దాక్షిణాత్య లోకోక్తులు (గోలకొండ పత్రిక - 1940)................. 112 శబ్దాల ముచ్చట (ప్రబుద్ధాంధ్ర, గోలకొండ పత్రిక) ................... 116 థన్ఫెతోడుంటు త) shit 1938 దశకుమార చరిత్రము (సుజాత - శుక్ల మాఘం) .................... 137 అప్పకవి (వ్రాతప్రతి- 7-11-19835)............=...౭౭౭౭౭లలలలలలలలలం 148
సుమతి శతకము (సుజాత - డిసెంబరు 1950)..................... 156
4 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
16. _ఎజ్టాప్రెగ్గడ (వ్రాతప్రతి)... 171 17. ద్విపద రామాయణము (కళ - 1922, దుందుభి మార్గశీర్ష) 180 18. గౌరన హరిశ్చంద్ర (విభూతి - 1939, ప్రమాది కార్తీకం)........... 190 19. చేమకూర వేంకటకవి (సుజాత, నవంబరు, 1928) ................. 195 20. అనర్భ రాఘవకర్త (17-1-1985). 207 21. వేదము వేంకటరాయశాస్తిగారు (సుజాత - శుక్ల, ఆషాఢం) ........ 211 రెండవ భాగం :: సాంన్యతిక, చారిత్రక వ్యాసాలు 1... ప్రాచీనార్యులు - వర్ణవ్యవస్థ (సుజాత, మే 1928)... 221
2. ఆంధ్రులు - కులవ్యవస్థ (నవభారతి, డిసెంబరు, 1979 - ఫిబ్రవరి 1980)
3. వర్ణాంతర వివాహాలు (గోలకొండ పత్రిక, ఆగస్టు, 1941
19.1941) 4. హిందూ ధర్మ శాస్తమందు స్ర్తీల స్థానము (గోలకొండ
సంవత్సరాది: పంలీక=2) niente 260 5. ఆయుర్వేదము (గోలకొండ పత్రిక)... లలల 270 6. గుర్రము (శోభ, జూన్, జులై 1950)... 7. తాంబూల సేవనము (రేడియో ప్రసంగం 1411. 1952)............. 286 8. మామిడిపండు (రేడియో ప్రసంగం 8.6. 1952, స్రవంతి 1955).... 294 9. బట్టల పస (గోలకొండ పత్రిక)... 300 10. చాక్యార్లు (మాతృ్ఫసేవ, జులై 1923) .....222౬2 2022ల 306
11. మన కవసరమగు చరిత్రలు (శోభ -ఆగస్టు, సెప్టెంబరు 1950)..... 310 12. ఎలిఫెంటా గుహలు (గోలకొండ సంవత్సరాది సంచిక-1)............ 321 18. తెలంగాణ చరిత్రము (గోలకొండ పత్రిక 27.7. 1944) ............... 328
15.
16. YT 18. 19. 20. 21. 22. 23.
24. 25.
“హైదరాబాదు రాష్ట్రములోని చారిత్రక స్థలములు (గోలకొండ పత్రిక 23.3. 1944)... హైదరాబాదు నగర ప్రాచీన స్థలాలు (గోలకొండ పత్రిక 27.6.1940)...
గొల్లకొండయే గోలకొండ (గోలకొండ పత్రిక 8.2.1941).. .345 పంచేశ్వరము (గోలకొండ పత్రిక 20.4. 1944)... 359 పానగల్లు కోట (గోలకొండ పత్రిక 3.419440)... 364 మావూరు (గోలకొండ పత్రిక 28.1, 19470)... 368 హజరత్ ఉమర్ (గోలకొండ పత్రిక 31.10.1946) .................. 378 రాజా జైసింగ్ (గోలకొండ పత్రిక)..........౬222౭౭ ౬222౭౭౭౭ 379 దివాన్ బహద్దరు వి. నాగమయ్య (మాతృసేవ, జూన్ 1928) ........ 381 పండిత మాడపాటి హనుమంతరావు గారు
(ప్రబుద్ధాంధ్ర, మార్చి 19838)... 385
రాజబహద్దరు వెంకటరామారెడ్డి గారు (ప్రబుద్ధాంధ్ర, మే 1935) .... 390 కొండా వెంకటరంగారెడ్డిగారు (గోలకొండ పత్రిక 12.4. 1943) ..... 398
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత Jnanpith Awardee
డాక్టర్ సి. నారాయణరెడ్డి ఎక్స ఎంపి. Dr. C. Narayana Reddy Ex. ౫8 ఎం.ఏ, పిహెచ్‌డి, డిలిట్. MA., Ph.D., D.Litt,
అధ్యక్షులు PRESIDENT
ఆంధ్ర సారస్వత పరిషత్తు Andhra Saraswatha Parishath
తిలక్ రోడ్, Tilak Road,
హైదరాబాదు-500001 Hyderabad - 500 001.
ఫోన్ : (ఆ) 24753724 Phone : (Off.) 24753724
అవతారిక
నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిస కాలంలో దాని పునరుద్దీప నానికి ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ బూర్గుల రామకృష్ణా రావు, శ్రీ లోకనంది శంకర నారాయణరావు, శ్రీ గడియారం రామకృష్ణశర్మ వంటి సాహితీమూర్తుల ప్రేరణతో పరిషత్తు 1943 మే 26న రూపుదిద్దుకొని, ఈ రోజు తెలంగాణలో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్టస్థానం వహించింది. మాన్య మిత్రులు డా॥ దేవులపల్లి రామానుజరావుగారు యావజ్జీవం పరిషత్తు అభివృద్ధికి శ్రమించినారు. పరిషత్తు బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అందరి ప్రశంస లందుకుంటున్నది. పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద తెలుగు పరీక్షలు జరపడంతో పాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాలను, ప్రాచ్యకళాశాలను నిర్వహిస్తున్నది. పరిషత్తు ఏర్పాటు చేసే సాహితీ సభలు, సమావేశాలు, ప్రసంగాలు సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్టులు, పరిణతవాణి ప్రసంగాలు, ప్రసంగాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి తెలంగాణ వైశిష్టానికి అద్దం పడుతున్నది. పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీలోకం అభిమానించి స్వాగతిస్తున్నది. ఇంతవరకు దాదాపు 800 గ్రంథాలను వెలువరించింది. 2013లో పరిషత్తు సప్తతి మహోత్సవా లను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రత్యేకతలోని వివిధ పార్య్వాలను ఆవిష్మరించే సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. నిపుణుల ప్రసంగ వ్యాసాలను “వ్యాసగుళుచ్చం” పేరుతో పరిషత్తు రెండు భాగాలు వెలువరించింది.
8 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వివిధ రంగాలలో తెలంగాణ వైశిష్ట్యాన్ని విశదీకరించే “తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం”పై సదస్సు వంటి కార్యక్రమాలను పరిషత్తు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమై 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణను సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, ప్రజలు ఉద్యమస్ఫూర్తితో కృషి చేయడం హర్షణీయం. తెలంగాణ భాషా సామిత్య కళాసంస్కృతుల వికాసాభ్యుదయాల కోసం ఏడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్రలో భాగంగా విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహిస్తున్నది. వాటిలో కొన్ని - తెలంగాణ మాండలిక పదాలు - ప్రయోగ వైశిష్ట్యం, తెలంగాణ ప్రాచీన తెలుగు కవుల కవితా ప్రాభవం, తెలంగాణ చిత్రకళ, శిల్పకళల వైభవం, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలపై సదస్సు, తెలంగాణ కవయిత్రుల, కథయిత్రుల రాష్టస్థాయి సమ్మేళనం.
తెలంగాణ వైభవోన్నతిపై పరిషత్తు గ్రంథప్రచురణను చేపట్టింది. ఈ పరంపరలో ప్రస్తుత గ్రంథం 'సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు’ దీనికర్త - నిజాం ఏలుబడికింద తెలుగు తీవ్ర ఉపేక్షకు గురైన దశలో ఆ భాషను పరివ్యాప్తం చేసి, సముద్దీపంగావించిన అగ్రేసర వైతాళికుడు - శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు. భాష, సాహిత్యం, పరిశోధన, విమర్శ, చరిత్ర, విద్య, సంఘుసేవ, స్వాతంత్ర్య సమరం, పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, సంస్థానిర్వహణ మొదలైన అనేక రంగాలలో విశేష కృషి చేసిన మేధాసంపన్నుడాయన. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపనలో ఆయన కీలక భూమిక వహించడం గమనార్హం. సురవరం వారు వివిధ ప్రక్రియల్లో 30కి పైగా అమూల్య (గ్రంథాలను వెలయించిన సారస్వతమూర్తి. ఒక సందర్భంలో ఆ మహనీయునికి నేనర్చించిన పద్యనివాళి.
అతదు ప్రతాపరెడ్డి: యిరులై వడియున్న తెలంగువారి గుం
డౌ తెరల దుల్సివెల్లులను నిల్చిన మిత్రుడు? మూర్భవోయిన
ట్టి తెలుగుజాతి నంస్కృతికి టీకలు దీనిన మళ్లినాథుదె
న్ని తరములైన ప్రాతపడనేరని నృష్టికి నాట్యుడాతడే.
అవతారిక 9
వ్యాసరచనలో ప్రతాపరెడ్డి గురుసిద్ధహస్తులు. 'గోలకొండ పత్రిక సంపాదకులు గానే కాకుండా ఇతర పత్రికలలో, ప్రచురణలలో ఆయన రచించిన 150కి పైగా వ్యాసాలు వస్తువైవిధ్యం, ఆలోచనా నైశిత్యం, పరిశోధనాపాటవం, శైవీరామణీయక వంటి గుణ విశేషాలు సంతరించుకున్నాయి. వీటిలో నుండి 46 సాహిత్య, సాహిత్యేతర వ్యాసాలను నేను అధ్యక్షుడిగా వున్న 'సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి” సంస్థ లోగడ ఆచార్య ఎస్వీ రామారావు సంపాదకత్వాన రెండు భాగాలుగా ప్రచురించింది. జిజ్ఞాసువులైన పాఠకులకు, పరిశోధకులకు అత్యంత ఉపయుక్తంగా వుంటుందని పరిషత్తు ఈ వ్యాసాలను ఒక సంపుటిగా ప్రచురిస్తున్నది.
పరిషత్తు వెలువరిస్తున్న ఈ (గ్రంథం ఎప్పటిలాగే అందరి మన్ననలను
పొందగలదని విశ్వసిస్తున్నాను. హైదరాబాదు
తేది: 15 మార్చి, 2015 (డా॥ సి. నారాయణరెడ్డి)
తిలక్ రోడ్, హైదరాబాదు-500001. ఫోన్ : 040-24753724
డా॥ జె చెన్నయ్య ప్రధాన కార్యదర్శి ఆంధ్ర సారస్వత పరిషత్తు
ప్రవేశిక
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న విభిన్నమైన కార్యక్రమాల్లో పుస్తక ప్రచురణ విశిష్టమైంది. పరిషత్తు ప్రచురించిన గ్రంథాల పట్టికను చూస్తే ఎంత గొప్పవైన ప్రచురణలు వచ్చాయో తెలుస్తుంది. పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు పరీక్షల నిర్వహణ, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి దోహదం చేసే సదస్సుల నిర్వహణ, పెద్దల పేరిట నిర్వహించే సంస్మరణ ప్రసంగాలు, పరిణతవాణి ప్రసంగ పరంపర కొనసాగుతూ అనుబంధంగా పుస్తక ప్రచురణ జరుగుతున్నది. 2013 సంవత్సరంలో పరిషత్తు అధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి నేతృత్వంలో సప్తతి పూర్తి సందర్భంగా ఏడాది పొడవునా అనేకమైన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 'తెలంగాణ తెలుగు సాహిత్య వికాసం, తెలంగాణ ప్రాచీన కవుల కవితా ప్రాభవం’, 'తెలంగాణ మాండలిక పదాలు-ప్రయోగ రీతులు’, ‘తెలంగాణ ప్రాచీన నృత్య రీతులు’, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు”, తెలంగాణ కవయిత్రులు, కథయిత్రుల సమ్మేళనం” వంటి అనేక సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని పెంపొందించే కృషిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పరిషత్తు భావించింది. నవ్యస్ఫూర్తితో ప్రచురణల్ని కూడా వెలువరించాలని నిర్ణయించింది. గత సంవత్సరం పరిణతవాణి ప్రసంగాలతో కూడిన తాజా సంపుటి, ‘తెలంగాణ సాహిత్య వికాసం”, 'వ్యాసగుళుచ్చం' రెండు సంపుటాలు ప్రచురించడం జరిగింది. వాటిని పాఠకులు ఆదరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిం[. ఈ నూతన యుగోదయవేళ తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రళ్యేక అధ్యయనం జరగాలి. ఆ అధ్యయనానికి కావలసిన పఠనసామాగ్రిని సమకూర్చుకోవాలి. ఇప్పటివరకు ఉమ్మడి చరిత్రలో అంతర్భాగంగా వుండి తగినంత ప్రాధాన్యం లభించలేదని ప్రజల్లో వున్న
ప్రవేశిక 1
అసంతృప్తిని పోగొట్టాలి. ఆ దిశగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అందిస్తున్న ప్రచురణల్లో తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలంగాణ ప్రాచీన కవుల కవితా ప్రాభవం, తెలంగాణ మాండలిక పదాలు-కావ్యప్రయోగాలు, కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్యసేవి, “మాఊరు మాట్లాడింది”, తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలు’, 'సురవరం ప్రతాపరెడ్డి వ్యాసావళి, తెలంగాణ ప్రముఖుల పరిణతవాణి”, “బంజారాల వివాహ ఆచార పద్ధతులు”, “యాభై సంవత్సరాల జ్ఞాపకాలు, “తెలంగాణ చరిత్ర, 'తెలుగు జానపద సాహిత్యం- ప్రీల గేయాల్లో సంప్రదాయం” ఈ సంవత్సరం వెలువడుతున్నాయి.
నిద్రాణమైన తెలంగాణ భాషా సాంస్కృతిక సీమలో తమ బహుముఖీనమైన వాజ్మయ సృష్టితో వెలుగులు నింపి పునరుజ్జీవింపజేసిన ఘనత సురవరం ప్రతాపరెడ్డి గారికి దక్కుతుంది. తొలితరం కథారచయితగా, ప్రాఢతర పద్య రచన చేసిన కవిగా, పరిశోధకునిగా, విమర్శకునిగా, పత్రికా సంపాదకునిగా అనేక అంవాల్లో ప్రతాపరెడ్డి గారిని తెలంగాణకు వైతాళికునిగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా తెలుగు బాషా సాహిత్యాలు అణగారి వున్న కాలంలో కూడా కవులకు కొదవలేదని చాటి చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతస్థానంలో నిలిపారు. వారి జీవిత చరిత్ర రచన, రచనల పునర్ముద్రణ విషయంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు చేసిన కృషి ఎన్నదగింది. విద్వన్మణి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సురవరం వారిపై ప్రామాణికమైన పరిశోధన చేసినారు. సురవరం గురించి సాధికారికంగా ప్రసంగించే వారిలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రథమ స్థానీయులు. సురవరం వారి రచనలు ఈనాడు చాలావరకు లభిస్తున్నాయి.
సాహిత్య సాంస్కృతిక అంశాలపై వారు రాసిన వ్యాసాలు అమూల్య సంపద. ఇవి అలభ్యమని చెప్పి రెండు సంపుటాల వ్యాసాలను మాకు ఇవ్వటంతో పాటు పునర్ముద్రించే అవకాశం కల్పించిన సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు వారికి, డా. సురవరం పుష్పలత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
దీని సంపాదకులుగానే గాక పరిషత్తు ప్రచురణల పరిశీలక సంఘం సభ్యులుగా తమ పూర్తి సహకారాన్ని అందించిన ఆచార్య ఎస్వీ రామారావు, సభ్యులు దా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. డి. చంద్రశేఖర్‌రెడ్డిగార్లకు కృతజ్ఞతలు.
3 సమీ హైదరాబాదు జ్ తేది:20 మార్చి, 2015 (జె. చెన్నయ్య)
తెలంగాణ వైతాళికుని వ్యాస ప్రదీప్తి
తేన కలం ద్వారా సుప్త తెలంగాణమును మేలుకొల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన బహుముఖ ప్రజ్ఞానిధి. పత్రికా సంపాదకుడు. పరిశోధక వతంసుడు. సంఘ చరిత్ర నిర్మాత. స్వాతంత్ర్య సమరయోధుడు. అది ఆంధ్ర మహాసభ కానీ, గ్రంథాలయోద్యమం కానీ, లిపి-భాషా సమస్య కానీ, విద్యార్థి వసతిగ్భృహ స్థాపన కానీ - ఆయన కృషి సల్పని రంగం లేదు. అయితే ప్రతాపరెడ్డిగారు ప్రధానంగా పాత్రికేయులు. గోలకొండ పత్రికను ఆలంబనగా చేసుకొని వారు తన ఉద్యమాలను కొనసాగించారు. చెన్నపట్నం నుండి కాశీనాథుని నాగేశ్వరరావుగారి ఆంధ్రపత్రిక, మచిలీపట్నం నుండి ముట్నూరి కృష్ణారావుగారి కృష్ణాపత్రిక ఏ విధంగా తెలుగుజాతి ప్రగతికి దోహదం చేశాయో, భాగ్యనగరం నుండి గోలకొండ పత్రిక కూడా ఆ విధంగానే సమాజ చైతన్యానికి సహకరించింది.
ప్రతాపరెడ్డిగారు నిరంతర జిజ్ఞాసువు. నిశితమైన పరిశీలనా చక్షువు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు ఆయన పరిశోధనా శేముషికి నిదర్శనాలు. ఇవేకాక వారి ప్రతిభకు పతాకలైన వ్యాసాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అయితే అవన్నీ పాత పత్రికల పుటల్లో, వ్రాత ప్రతుల రూపంలో చెల్లాచెదరుగా ఉన్నాయి. అవి వెలుగులోనికి వస్తే వారి పరిశోధనా వ్యక్తిత్వం ఎంత విశిష్టమైనదో నిరూపితం కాగలదు. వారిలో ఎంత విద్వత్తు నిక్షిప్తమై ఉన్నదో వెల్లడి కాగలదు.
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు మొదటి భాగం వారి సాహిత్య వ్యాసాల నుండి ఏరిన ముత్యాల సంపుటం. ఇవి 1922-58 మధ్య 80 సంవత్సరాల కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి. ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక (1926-47)లోనే కాక సమకాలీన పత్రికలు పెక్కింటిలో రచనలు వెలువరించారు. వానిలో పేర్కొన తగినది పి.ఎన్. శర్మ గడియారం రామకృష్ణశర్మగారి సంపాదకత్వంలో వెలువడిన సుజాత (1927-30, 1950-58). పి.వి. రాజమన్నార్ గారి 'కళి (మద్రాసు-1922)
తెలంగాణ వైతాళికుని వ్యాస ప్రదీప్తి 1
లోనూ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రిగారి 'ప్రబుద్ధాంధ్ర' (రాజమండ్రి-1930)లోనూ వారి రచనలు ప్రచురితమైనాయి. ఇంకా మీజాన్ (1942), విభూతి (1940), ప్రజాబంధు (1935) మొదలగు పత్రికలలోని వ్యాసాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి.
వీనియందలి వ్యాసాల వరుస కాలక్రమాన్ని అనుసరించి కాక విషయ విభాగాన్ని దృష్టిలో పెట్టుకొని కూర్చబడింది. సాహిత్య వీథిలోని అన్ని కోణాలపై సురవరం వారి దృష్టి ప్రసరించింది. మొదటి వ్యాసం ప్రాకృత కావ్యమైన గాథాసప్తశతిలోని సామాజిక చితణను, కవితా వైశిష్టాన్ని సమగ్రంగా దర్శింపజేస్తుంది. రెండు మూడు వ్యాసాలు వివిధ యుగాలలో వెలసిన ఆంధ్ర వాజ్మయ సంగ్రహ సమీక్షలు. తర్వాతి ఆరువ్యాసాలు ప్రక్రియా విమర్శలు. పల్లెపదాలపై ప్రతాపరెడ్డిగారి ఆసక్తి ప్రశంస నీయమైనది. జానపద వాజ్మయం గురించిన వారి రచనలు ప్రత్యేక సంపుటంగా రాదగినవి. పది, పదకొండు వ్యాసాలు లోకోక్తులు. శబ్దాల వ్యుత్పత్తికి సంబంధించినవి. వారి భాషా పరిజ్ఞానానికి తార్మాణాలు. తర్వాతి తొమ్మిది వ్యాసాలు నన్నెచోడుడు మొదలుకొని అనర్హరాఘవకర్త వరకు గల ప్రాచీనాంధ్ర కవుల, కావ్యాలపై సమాలోచనలు. కవుల దేశకాల చర్చలు, కావ్య కర్భత్వవాదాలు, కవిత్వానుశీలనం వీనిలో చోటుచేసుకొన్నాయి.
మొదటి భాగంలో సురవరం సాహిత్య వ్యాసాలు ప్రకటితం కాగా, రెండవ భాగంలో సాహిత్యేతర వ్యాసాలు సంకలితమైనాయి. 1928-52 మధ్య 25 సంవత్సరాల కాలంలో వ్రాయబడిన 25 వ్యాసాలు ఇందులో చేరినవి. వీనిలో చాలామటుకు గోలకొండ పత్రికలో ప్రచురితములైనవి. ఇంకా శోభ, సుజాత, ప్రబుద్ధాంధ్ర, మాతృసేవ పత్రికలలోని వ్యాసాలు ఇందు చోటుచేసుకొన్నాయి. రెండు వ్యాసాలు మాత్రం ప్రతాపరెడ్డి దివంగతులైన తర్వాత ప్రచురితమైనట్టివి. సామాజిక, సాంస్కృతిక రంగాలలోని అన్ని కోణాలపై సురవరం వారి దృష్టి
ప్రసరించింది. మొదటి నాలుగు వ్యాసాలలో వర్ణ వ్యవస్థ, హిందూ సమాజంలో స్త్రీ స్థానం మొదలగు అంశాలు వేద, శాస్త్ర, స్మృతి ప్రమాణాలతో పరిశీలించబడ్డాయి. తర్వాతి ఆరు వ్యాసాలలో ఆయుర్వేదం, తాంబూలం, మామిడిపండు మున్నగువాని ఉపయోగాలు వివరింపబడ్డాయి. ఇవి ప్రతాపరెడ్డి సహజ వ్యంగ్య, హాస్య ధోరణి విలసితంగా కొనసాగాయి.
సాంఘిక చరిత్ర నిర్మాణానికి పూనుకొన్న రెడ్డి గారు దేశ చరిత్రపై ఆసక్తి కనపరచడం సహజమే. ఈ సంపుటిలోని ఎనిమిది వ్యాసాలు స్థల చరిత్రకు సంబంధించినవి. తెలంగాణాలోని అనేక స్థలాల చరిత్రను 'ప్రతాపరెడ్డిగారు త్రవ్వి
14 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
తీశారు. జంటనగరాలలో మనం నిత్యమూ దర్శించే ప్రదేశాల గురించిన విశేషాలు వెల్లడించారు. చివరి ఆరు వ్యాసాలు పూర్వులు, సమకాలీనులు అయిన వ్యక్తుల చిత్రణలు. నైజాము ప్రభుత్వాన్ని ఎదిరించిన సురవరం వారు హజరత్ ఉమర్ గురించి వ్రాయటం వారి విశాల దృష్టికి నిదర్శనం. మాడపాటి, రాజాబహుద్దర్ అను పరిచయం చేసిన రచనలు ఆధునిక రేఖా చిత్రాలకు తొలి రూపాలుగా పేర్మొనదగినవి.
ఈ రెండు భాగాలలోని కొన్ని వ్యాసాలు ధారావాహికంగా పత్రికల్లో ముద్రితమైనట్టివి. వాని కూర్పులో స్వల్పమైన మార్పులు తప్ప ప్రతాపరెడ్డి గారి రచనలు యథాతథంగా ఇందులో ప్రచురితమైనాయి. ఇవి ఆయా సందర్భాలలో పత్రికల కోసం వ్రాసినవి కావటం వల్ల వాడుక భాషకు దగ్గరగా వుండటం, తెలంగాణా ప్రాంతంలోని పలుకుబడులు, మాండలికాలు వీనిలో చాలావరకు చోటుచేసుకోవటం గమనించవలసిన అంశం. సురవరం వారి లోకజ్ఞతకూ, బహు విషయ పరిజ్ఞానానికీ ఈ వ్యాసాలు దీపికలు.
పరిశోధన, విమర్శ సమతూకంగా సమ్మేళనం చెందిన విశిష్ట రచనలు సురవరం వారివి. కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి మున్నగు మహనీయుల కోవకు చెందిన పరిశోధకాగ్రగణ్యులు వారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రగతి పథంలో కొనసాగుతున్న శుభతరుణంలో సాహిత్య వైజయంతి ప్రచురించిన సురవరం వ్యాసాలు రెండు భాగాలను కలిపి ఒకే సంపుటంలో ముద్రించి పాఠకులకు అందుబాటులోనికి తేవటానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు పూనుకోవటం ముదావహం. పరిషత్తు అధ్యక్షులు, ప్రియతమ గురువర్యులు ఆచార్య సి, నారాయణరెడ్డిగారి ఆధ్వర్యంలో ఈ సారస్వత యజ్ఞం కొనసాగుతున్నందుకు వారికి నా కృతజ్ఞతాభివాదములు.
— art Jd, హైదరాబాదు లొ అన్ను mrt తేది: 15 మార్చి, 2015 (ఆచార్య ఎస్వీ రామారావు)
గాథా సప్తశతి
సంస్కృతమందు కాని, ప్రాకృతమందు కాని, దేశభాషలందు కాని గాథా సప్తశతితో సమానమగు కవిత లేదు. శాలివాహన చక్రవర్తులలో నొకడగు హాలుడు తన యాస్థానమందును తనకన్న ముందు కాలమందును నుండిన కవుల యొక్కయు కవయిత్రుల యొక్కయు ప్రాకృత పద్యముల నేర్చి కూర్చి యందు తన సొంత పద్దెములను కొన్నింటిని జేర్చి 800 పద్యముల పరిమితిగా సంకలించి ప్రపంచాని కందించెను. అదే గాథా సప్తశతి. హాలుడు తనను గూర్చి యేమియు తెలుపుకొనలేదు. ప్రతి శతకానంతర మొక పద్యములో తాను సంకలన కర్తనని మాత్రము తెలుపుకొనెను.
“రసిక జన హృదయ దయతే కవివత్సల ముఖ సుకవి సంకలితే”
అని ప్రథమ ద్వితీయ తృతీయ పంచమ షష్ట శత కాంతములందును “నరపాల హాల రచితే ప్రాకృత కావ్యేత్ర సప్తశతే' అని సప్తమ శతకాంత మందును “అత్ర చతుర్థం విరమతి నిసర్గ రమ్యం శతం హిగాథానాం! మధురత్వేనామృత మపినోలగతి హృదయే” అని చతుర్ధ శతకాంతమందును వ్రాసెను. ఈ పద్యములు నిసర్గ రమ్యమైనవనియు వాటి మాధుర్యము ముందర అమృతము కూడ చప్ప చప్పనిదే యనియు కవి హృదయము.
పై శ్లోకాలలో “కవివత్సల ముఖ సుకవి సంకలితే” అనునది యను మానమునకు తావిచ్చినది. రాజులు మందులనియు కవులు యశః కాముకులనియు, ఇతరులచే వ్రాయించిన కవితలకు పైకమిచ్చి తమ పేర్ల నతికింతురనియు, మన దేశమందు కథలల్లినారు. ఆ కథలలో నీ కథయు చేరినది. హాలుని యాస్థానమందు కవి వత్సలుడో, శ్రీపాలితుడో యొకడుండెననియు, అతడే సంకలనకర్తయనియు, హాలుని పేరు ద్రవ్యాశచే తగిలించె ననియు నందురు. కాని యది నిరాధారము, శతకాదియందే హాలుడిట్లు వ్రాసెను.
16 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“సప్త శతకాని కోటేర్మధ్యే
కవి వత్సలేన హాలేన
గాథానాం రచితాని హి నానాలంకార లలితానామ్” 1,3.
హాలుడే కవివత్సలుడు, హాలుని గురించి మనకు అయిదవ శతకమందు
మరికొన్ని విషయములు తెలియవచ్చినవి. దదతా సంవాహన సుఖ రస సంతుష్టేన తవక రేలాక్షాం విక్రమ నరేంద్ర చరితం చరణేన హి శిక్షితం తస్యాః 5-64
భార్యభర్తతో నిట్లన్నది. లక్కరంగు పూసిన నా సవతి కాళ్ళు పిసికినది నీ యరచేతిలోని లక్క గుర్తులే చెప్పుచున్నవిలే.
నా సవతి విక్రమార్క చక్రవర్తి యంతటిది! విక్రమార్కుడు శత్రుసంబాధమున పేరొందిన భటుని కొక్కొక్కని కొకలక్ష యిచ్చెడివాడు. (ప్రాకృతములో లక్ష - లక్కయు సంబాధము - సంవాహము ఒకటే) విక్రమార్ముని యొక్క యొక ప్రసిద్ధ చర్యను పేర్మొనుటచే విక్రమార్కుడు హాలునికన్న ముందుండిన చక్రవర్తియనియు, అతడు కల్పిత పురుషుడు కాడనియు దీనివలన స్పష్టమైనది.
“దీనులైన వారి తేకువ దీర్చి ర
క్షింప నేర్చువార లిరువురిలను పార్వతీశుడైన పరమేశ్వరుడు, రాజ వల్లభుండు శాలివాహనుండు. 5-62.
(గాథా సప్తశతీసారమున శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, లెక్చరర్, మైసూరు యూనివర్సిటీ, వ్రాసిన వద్యాల నుదాహరింతును. వారు అనువదించిన వాటిని ముఖ్యమని తోచిన వాటిని సంస్కృత మూలముననే యుదాహరింతును.)
కాళ్ళు పిసుకుటకు 564లో విక్రమార్ముడే యుపమానమును 566లో దీనుల నుద్ధరించుటలో నీశ్వరునితో తుల్యత్వమునకు శాలివాహన నరేంద్రుని పోల్చుటలో విక్రమార్క శాలివాహన వంశాలకుండు పోటీ సూచితము. దీనులనుటకు మూలములో
గాథా సప్తశతి 17
“అవణాయి” అని కలదు. అది ఆపన్నాని యనియు అపర్ణాని యనియు నగును. అపర్ణయన పార్వతి. అపర్డులు పార్వతేయులు అనగా శైవులు. ఆకులు కట్టని ఆదిమ నగ్నజనులలో వెలసిన దేవత యనియు సూచితమను కొందును. హాలుని కాలమందు శైవము బౌద్ధముతో పాటు ముఖ్యమతమనియు శాలివాహనులు శైవులనియు దీని నుండియే కాక, అలుకమెయి జేవురించిన యాదిశక్తి మోము జందురు నీడలో మొలచియుండ పూజ తామర దాల్చిన పోల్కి బొలుచు హరుని సంధ్యా జలాంజలి కెరగుదీరు. 1-1 అని ప్రథమ పద్యము నుండియు సంధ్య వార్చగ దోసిట జలము పట్టి నపుడు గౌరీ ముఖాంబుజమందు దోప మంత్ర మంతయు నొక మాలు మజచి పట్టి మోవినిగదల్చు శివునకు యొక్కులిడుదు 7-111 అని పాఠకుల శృంగార రసానందమందు ముంచి తేల్చిన తుది పద్యము నుండియు నిస్సందేహముగా వెల్లడియైనది. “తవరణజలద సమయ భయ చల విహ్వల పక్షకైరనుప్రియతే” 5-71 శాలివాహనుని శత్రువులు విజితులై భయ విహ్వలులై విధేయులై అనుసరించి సేవించిరని హాలుడు వ్రాసుకొనెను. సప్తశతిలో హాలుని గురించి సూచనలివియే. శాతవాహనులాంధ్ర రాజులని పురాణాలలో పేర్కొనబడినారు. హాలుడు క్రీస్తు శక ప్రథమ శతకమందుండిన వాడని పలువురు చరిత్రకారులు నిర్ణయించినారు. జెరంగబాదు జిల్లాలోని యిప్పటి పైఠానును అప్పటి ప్రతిష్టాన పురమును రాజధానిగా మధ్య దేశమంతయు నేలిన చక్రవర్తి. బహుశః ఇతడే శాలివాహన శక ప్రవర్తకుడై యుండును. ఇతనిని గూర్చి భట్ట శ్రీ మధురానాథ శాస్త్రి గారిట్లు సంస్కృత పీఠికలో వ్రాసిరి.
18 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“కథా సరిత్సాగరములోని రాజును గూర్చిన కథ కలదు. ఇతనికి మొదట సంస్కృతము రాకుండెను. ఇతని భార్యయగు మలయవతి కది బాగుగా వచ్చి యుండెను. ఒకనాటి జలకేళిలో రాజు నీటితో రాణిని కొట్టగా “మోదకైస్తాడయ” యనగా కుడుములు తెప్పించి కొట్టగా నామె పరిహసింప సిగ్గుపడి శర్వవర్మ బోధచే అచిరకాలమందు పండితుడయ్యెను. బాణాదులిట్లితనిని గూర్చి వ్రాసిరి.
“అవినాశినమగ్రామ్యమకరోత్
సాతవాహనః విశుద్ధ జాతిభిః
కోశరత్మైరివ సుభాషితైః” కాని యిది యుపచార వాక్య సూత్రమేమో? అభినంద ప్రణీతమగు రామచరిత మహాకావ్యమందు “హాలేనోత్తమ పూజయాకవి వృషః శ్రీ పాలితోలాలితః ఖ్యాతిం కామపి కాళిదాస కవి యోనితాః శకారాతినాః శ్రీహర్నోనిత తార గద్యకవియే బాణాయవాణీఫలం। సధ్య! సత్రియ యాభినందనుపిచ శ్రీహారవర్నో గ్రహత్!” అని శ్రీ పాలితుడను కవియే హాలుని పేర నీ సంకలనము చేసెనని వ్రాసినారు. దీనిని బట్టి శ్రీపాలితుడే దీని కర్తయనుట భావ్యము” భట్టశ్రీ గారు మరల ఇట్లు వ్రాసిరి.
“కేనానన్నాధ్య రాజన్య రాజ్యే ప్రాకృత భాషిణః
కాలేశ్రీ సహసాం కన్యకేన సంస్కృత భాషిణః”
అని భోజుడు సరస్వతీ కంఠాభరణమందు వ్రాసెను. “అధ్యరాజు (హాలుని) రాజ్యమందందరు ప్రాకృతము మాట్లాడిరి. విక్రమార్కుని రాజ్యమందందరును సంస్కృతము మాట్లాడిరి అని యితడు తెలిపెను. సప్తశతి శృంగార రసభూయిష్టము. ఇది అపూర్వ ధ్వని కావ్యము. రుద్రట, మమ్మట, వాగ్భట, విశ్వనాథ, భోజాది సాహిత్యశాస్త్రకర్తలు దీని నుండి యుదాహరణములను గైకొనిరి”.
సప్తశతి యందు 200 పద్యాలలోపాలితుని పేర నుండునవి తొమ్మిది పద్యాలు మాత్రమే. హాలుని పేరనుండు పద్యములు 47. ఈ పద్యాల నెవరు వ్రాసినట్లు? సహజముగా సంకలనకర్త తన పద్యాల నెక్కువగా చేర్చును. మరియు సంకలనము చేయుట కూడ కష్టమగు పనియా?
దానికి పాలితుడే యవసరమా? అభినందుని శ్లోకము పాలిత పక్షముగా నుండిన నంతకు చాలా ప్రాచీనుడగు “బాణాదుల” శ్లోకాలు హాలుని పక్షాన
గాథా సప్తశతి 19
వాదించినవి కదా. రాజుల కవిత్వాలకుండు నీ అపప్రథ హాలునికిని తగిలినది. హాలుడు సంకలనకర్త కాదనుటకు ప్రబలాధారములు కానరాలేదు. సప్తశతి కవులు సప్తశతి పద్యాలలో ఇంచుమించు 250 పద్యాలకు కర్తలెవరో తెలియరాలేదు. ఇందు పలువురి స్త్రీల పద్యాలున్నవి. రేవా (1-87-90). రోహయే (2-6-3), మాధవి (1-91), అణ్బుల లక్ష్మి (8,28,63,74,76), పాహయీవఏ (1-70-83), వద్ధవాహయే (1-60-70-86) శశిప్రభా (4-4) అనువారు కవయిత్రులు. ఈ విషయమాకాలపు స్త్రీల యౌన్నత్యమును సూచించును. ఇంకను ఇట్టి పద్యముల సంకలనములనేకములుండినట్లు ప్రాచీనులన్నారు. ఈ సప్తశతీ ప్రాశస్యమును దీనిపై పుట్టిన 19 వ్యాఖ్యానములే చాటుచున్నవి. అందు గంగాధరభట్టు వ్యాఖ్య ప్రసిద్ధమైనది. సప్తశతిలోని పద్యాలు సాహిత్య శాస్త్రకారులు విశేషంగా నుదాహరించుకొనిరి. భోజుడందరికన్న నెక్కుడుగా నీ పద్యాలు తన సరస్వతీ కంఠాభరణమందుదాహరించుకొనెను. ధ్వన్యాలోకకారుడును కొన్ని (2-75) పద్యాల నుదాహరించుకొనెను. మమ్మటుడు (1-44, 7-65), 7-67, 2-82, 5-55, 2-75) కొన్ని పద్యాలనుదాహరించుకొనెను. భాష సప్తశతిలోని భాష మహారాష్ట్ర ప్రాకృతము. ప్రాచీనులలో పలువురు సంస్కృత పండితులు ప్రాకృతమే సుకుమార సుందర భాషయని మెచ్చుకొనిరి. హాలుడే యిట్లనెను. “అమృతం ప్రాకృత కావ్యం.” చెవుల కమృతంబు ప్రాకృత కవనము చదువంగ వినగ గాననివారల్ పుపువిల్తు శాస్త మర్మము వివరించెదరెట్లు సిగ్గువిడిచి మనమునన్” 12 కర్పూర మంజరియను ప్రాకృత నాటకములో రాజశేఖరుడిట్లు వ్రాసెను. పరుషాః సంస్కృతబంధాః ప్రాకృత బంధోపి భవతి సుకుమారః పురుష మహిళానాం యాపదిహాంతరం తానదేతేషాం॥
20 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
స్రీ పురుషులకెంత భేదమో యంత ప్రాకృత సంస్కృతాలకున్నదని భట్టశ్రీగారు వజ్ఞాలగ్గ అను ప్రాకృత గ్రంథమునుండి ఈ క్రింది శ్లోకమునుదాహరించిరి. “లలితే మధురాక్షరే యువతి జనవల్లభే సశ్చంగారే సతి ప్రాకృత కావ్యే కః శక్నోతి సంస్కృతం పఠితుం. లలిత మధురమై యువతి జనాహ్లాదియెన ప్రాకృత కావ్యాన్ని వదలి సంస్కృతము నెవడు పఠింప సహించును. పై విషయాలనుబట్టి చూచిన శాలివాహనుల కాలము వరకు ప్రాకృత భాషలు జనుల మాతృభాషలగుటచేత వాటిపై గల యభిమానముచే సంస్కృతమును చిన్నచూపుతో జూచియుందురు. వివిధ ప్రాకృతములలో సప్తశతిలోనిది మహారాష్ట్ర ప్రాకృతమందురు. మహారాష్ట్రల మాతృభాషలో నిపదాలిరదెన్ని కలవోయేమో కాని మన తెనుగులో సాధారణమై వాడుకలోనున్న బహుపదములు సప్తశతిలో కానవచ్చును. ఎట్లనగా - అత్తశబ్దము శ్వశుమాతులాని శబ్దములకు మారుగా గ్రంథమందంతటను చాల మారులు వచ్చినది. అత్తా తహర మణిజ్ఞం (శ్వశ్రుతధా రమణీయం (4-8) మామ భార్య మాతులానికి “మామియని పలుమారు వాడినారు. (1-983, 99) ఇది మన మామకు సన్నిహితమగుమాట. పొట్ట (1-83, 2-71), పడి (పతిత) (5-27) వల (వలగొను) 1-25 పల్లి (పల్లె) 1-80 పాడి (పాడియావు 1-65) కంటె 1-75 కాకి (22) మడ (ఏటిమడ 2-5) దేవళ (ము) 2-9, చేట (2-69) అద్దం 3-4, సవతి 3-11, దివ్వె 8-22, కడప 8-29, అవ్వ (ఆశ్చర్యార్థకము - ఒరంగల్ ప్రాంతమందలి యాశ్చర్యార్థక ప్రయోగము) 3-78 గంజి ౩-86, చిప్పెర (చిప్పెర గడ్డి అలుము) 4-80 తరము (శక్యము) 4-49, గంటు (ముడిగ్రంథి) 4-51, తుపరీ (తువ్వ తొగరి-కంది-తువ్వనేల) 4-58 ఇట్టి పదాలు లభ్యమగు చున్నవి. గోదావరిని గోటాయనియు (1-58), గోలా యనియు (2-3) పలుమారు వాడినారు. పూర్వ రూపము గోలాయని తర్వాత గోదా యనియు (అదే గోదా ఏరు- గోదారి) తర్వాత గోదావరి యనియు (గ్రహింపవచ్చును. సప్తశతీ శృంగారరంగములు పల్లెలు, తటాకములు, పంటపొలాలు, గోదావరీ తీరములు, వింధ్య పరిసరాలు, దేవళములు.
గాథా సప్తశతి 21
అనుకరణములు
సప్తశతి ప్రాశస్యమును గ్రహించి యనేక కవులు దానిననుకరించిరి. అందు ముఖ్యులు అమరుడు, గోవర్ధనాచార్యుడు. బిహారి. అమరుడు అమరశతకమును వ్రాసెను. గోవర్ధనుడు ఆర్యాసప్తశతిని రచించెను. బిహారి ప్రజ భాషలో బిహారి సత్సయి (సప్తశతి) వ్రాసెను. వీరుకాక మరికొందరు దీని భావముల గ్రహించిరి. భట్టశ్రీగారు 1-46లోని యీ క్రింది
“రాతి మనసుతోడ నాతడు రేవూరు వదలి పోవుననెడు వార్తగలిగే వానికెపుడు దెల్లవారకయే యుండ రాత్రి తల్లి పెరిగిరావే నేడు”.
అను పద్యమునకు హిందీలో నీ క్రిందిది కలదని తెలిపినారు.
సజన్ సకారై జాయగే నైన్ మరేగే రోయ్ విధవా ఐసీరైన్ కరే భోర్ కబ్ హినహోయ్.
మరియు 2-61 “ఊర్వ్వాక్షః పిబతిజలం” అను పద్యాన్ని అప్పయ దీక్షితుడు మాటలు మార్చి ఇట్లు వ్రాసెననెను.
“యదోర్బోక్షు పిబత్యంబు
పథికో విరళాంగుళిః
తథా ప్రపా పాలికాపి
ధారాం వితనుతేతనుం[॥” (క్రీడాభిరామములో 3-38)
“విక్రీణీతే మాఘే ప్రావరణం పామరోహి బలదేన నిర్జూమ ముర్మరని భౌనూనం “శ్యామాస్తనౌ పశ్యన్ (8-38) అను పద్యానికి 'మాఘమానంబు పులివలె మలయుచుండ పచ్చడంబమ్ముకొన్నాడు. పణములకును ముదితచన్నులు పొగలేని ముర్మరములు చలికి నొఅగోయ కేలుండు సైరికుండు'- అను వద్యము కలదు.
సప్త శతిలోని (4-15) జంర్వూవాతోతృణితే గృహేరుదిత్యానిస్సహ నిషణ్ఞాం దర్శయతి గతిపతికాం
22 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
విద్యుదుద్దోతో జలధారాణాం అను పద్యానికి క్రీడాఖిరామములో నీ క్రింది పద్యము కలదని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ పీఠికలో వ్రాసిరి. మ. “పటు జంరూ పవనోతృణాలయములో భద్రంబునం బట్టెకం
కటిపై ముచ్చము డింగి నిర్భర వియోగగ్గాని శోషిల్లియె
కృటి నిద్రించుచునున్న వాడవనితన్‌గర్జా వచః ప్రౌఢిమన్ -
దటి దుద్యోతము సూపునట్టు నడురే ధారాధర్రేణికిన్॥”
శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిట్లు పీఠికలో రాసినారు. “వంగూరి సుబ్బారావుగారు ఎక్కడ నుండి సంపాదించారో కాని శ్రీనాథుని శాలివాహన సప్రశతి లోనిదని యీ క్రింది పద్యముదాహరించిరి.
“వారణసేయ దావగొనవా, నవనారిజమందు తేటిక్రో।
వ్వారుచునుంట నీవెరుగవా, ప్రియవా తెరగంటి గంటికె।
వ్వారికి గెంపురాదె, తెగవా మగవారల దూర, నీ విభుం!
డారసి నీనిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ”
కాని యిప్పటి సప్తశతిలో దీనికి మూలమైన ప్రాకృత గాథ కానరాదు”.
నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నొడివితి అని శ్రీనాథుడు చెప్పియుండెను. కాని యది యింతవరకు లభ్యము కాలేదు. సప్తశతి పద్యాలను బోలిన ప్రాకృత పద్యాలను కొన్నింటిని మమ్మటాదు లుదాహరించిరి. కాని యవి యెచ్చటివో తెలియదు. ఆర్యా సప్తశతికి దారి చూపినది శాలివాహన సప్తశతియే కాని ఆర్యా సప్తశతి పద్యాలు వీటి ముందర దిగదుడుపుగా నున్నవి. హాలుని గోవర్ధనుడు పూర్తిగా అనుకరించెను. ఇక అమరుక కవి శ్లోకాలను గురించి విచారింతము. అమరుక కవి బహుశ క్రీ.శ. 200 ప్రాంతము వాడై యుండును. అతని కసాధారణకీర్తి కలిగెను. 'అమరుకవే రేకః శ్లోకః ప్రబంధ శతాయతే” అను నానుడి యేర్పడెను. అమరు కవి యొక్కొక్క శోకము నూరు (ప్రబంధాలకు సాటియనిరి. అట్టి కవి తన పెక్కు శ్లోకాలలో పూర్ణముగ గాథా సప్తశతి భావములను దింపుకొనెను. భట్టశ్రీ మధురానాథ శాస్త్రిగారు గాథలకును అమరుని శ్లోకాలలో గల సంపూర్ణ సామ్యములను చక్కగా నిరూపించినారు. ఉభయ గ్రంథ శ్లోకాలను పూర్తిగా నుదాహరిం చుటకు వీలులేనందున రెంటిని మాత్రము చూపించి తక్కినవి సూచింతును.
గాథా సప్తశతి 23
“కృత కస్వాప నిమీలితనయన
సుభగ దేహి మహ్యమవకాశం
గండ పరిచుంబ నోద్దత పులక
పునర్నైవ చిరయిష్యే. 1-20”
శూన్యం వాసగృహం విలోక్య శయనాదుత్థాయ కించిచ్చెనై!
ర్నిద్రావ్యాజ ముపాగతస్యసుచిరం నిర్వర్ల్య పత్యుర్ముఖం।
విశ్రబ్దం పరిచుంబ్య జాతపులకా మాలోక్యగండస్థలీం।
లజ్ఞానమ్రముఖీ ప్రియేణహసతా బాలాచిరం చుంబితా॥” అమరుక శతకం - 77
“దయతే ప్రసీద, కుపితా కాని
సుతనుత్వం, పరేస్తికః కోపః?
కోస్తిపరో? నాథత్యం! కిమితిహి,
మనుదురిత శక్తిరియం” 4-84
“బాలే! నాథ! విముంచ మానిని రుషం, రోషాన్మయా కింకృతం, ఖేదోస్మాను, నమేపరాధ్యపతి భవాన్ సర్వే పరాధామయి, తత్మింరోదిషి గద్దదేన వచసా, కస్యాగ్ర తోరుద్యతే,
నన్వేతన్మమ, కాత వాస్మి దయితానాస్మీ త్యతో రుద్యతే” అమరు. 53.
ప్రణయ కుపిత 1-27 అన్యోన్య కటాక్ష 2-99
వీటికి సాటి అమరుక శ్లోకము ఏకస్మిన్ శయనే... 19 స్థగయిష్యామి 4-14
దీనికి అమరుని అనుకరణము భ్రూ భంగేరచితేపి-24 యత్‌ప్పచ్చసి నివాసన్మాం 7-11 దీనికి అమరుని అనుకరణము అంగానామదితానవం-4ర5
24 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అమరుడు అను రాజు చావగా అతని శరీరములో పరకాయ ప్రవేశవిద్యచే ఆదిశంకరాచార్యులు ప్రవేశించి అమరు రాజై అతని భార్యతో సుఖించి యీ శతకము వ్రాసెనని యొక అద్భుత కథకు విచిత్ర రూపమేర్చడినది. ఇదంతయు నవిశ్వసనీయము. శంకరుని కాలము 700-800 మధ్యకాలము. అమరుని ఆనందవర్ధన, మమ్మటాదులు గ్రహించినందున వారిరువురు క్రీ.శ. 10-11 శతాబ్దముల వారగుటవలన అమరుడు క్రీస్తు శకము 700 ఆ ప్రాంతము వాడనిన పొరపాటుండదు. అమరుడెవ్వడో తెలియదు.
విహారి సత్సయీ వ్రాసిన విహారి కవి యెప్పటివాడో తెలియదు. అమరు గోవర్భనుల తర్వాత వాడని మాత్రమే భట్టశ్రీ గారన్నారు. సత్సయీలోని భాష యిప్పటి హిందీకి చాలా దూరముగానున్నది. కబీరు, తులసీదాసుల భాష కన్న చాలా ప్రాక్తన మైనది. కావున అది క్రీ.శ. 1200-1300 ప్రాంతముదిగా నుండును. సత్సయీలోని చాలా దోహలు (ద్విపదలు) గాథా సప్తశతి నుండి యేర్చడినవే యని భట్టశ్రీ గారెత్తి చూపినారు.
తెనుగు సేత
శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు అసాధారణ కవి పండితులు. సంగీత సాహిత్య విద్యానామక యుగళంబు గ్రోలినవారై బహు భాషలను, ప్రాకృతమును నెరిగిన వారగుటను, తెనుగున ఉత్తమ వచన శైలిని, మధుర కవితను నల్లగలిగినవారు. వారు గాథా సప్తశతిలోని 395 పద్యముల నేరి తెనుగించినారు. వారి విచక్షణ సరియెనదే. పచ్చి శృంగారమును, అనవసరమగు పద్యాలను, అనుత్తమమైన వాటిని పరిహరించినారు. మూలమందలి భావములను అందలి గంభీరతను చెడకుండా సుందరముగా సులభ గ్రాహ్యమగునట్లుగా చేతికందించినారు. వారే దానికి పీఠిక బ్రాయవలసి యుండెను. అటులే కొంత చేసినట్లే! శ్రీనాథుని కృతియుత్సన్నమైన వ్యధను వీరు తొలగించినారు.
నాటి ఆచారాలు
గాధా సప్తశతి యొక్క కాలమును నిర్ణయించినాను. కావున ఆ కాలమందలి సాంఘికాద్యాచార విశ్వాసము లెట్టివో సప్తశతిలోని వర్గలను బట్టి మనము స్పష్టముగా నిరూపింపవచ్చును. గాథలన్నియు నుద్దేశ పూర్వకముగా శృంగార భూయిష్టముగా సంకలింపబడినందున నా కాలమున జనులందరు శృంగారలంపటులని తలపరాదు.
గాథా సప్తశతి 25
మత విశ్వాసాలు - ఉత్సవములు ఆ కాలమందు కొన్ని పురాణ దేవతలకు విశేష వ్యాప్తి యుండినట్లున్నది. రామలక్ష్మణులు (1-85) వామనుడు (5-6) రాధాకృష్ణులు (1-89) గణపతి (4-79) పేర్మొనబడినారు. అందు పాపము గణపతి పొట్టగలవాడగుటచే ఒక విలాసినికి రహస్య సంగతిలో తలగడగా పనికి వచ్చెను. యౌవనములో సురతసమయ పరిధానీకృత గణపతి వార్థక్య దశలో పాప పరిహర్తగా పూజితుడయ్యెను. ఎందరు పౌరాణిక దేవతలు పుట్టినను గిట్టినను నేటివలననే నాడును గ్రామదేవతలకే ప్రాముఖ్యముండెను. “ఈవు చేతులారా నిచ్చినదని ప్రాచి పూలసరము తావి పోయి యున్న నింతి దాల్బుచున్న దింకను, వ్రత పూజ ముగియ, నూరి వేల్పు బొమ్మవోలె (2-94) (ఉదాహృతాంధ్ర పద్యములన్నియు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారివని యెరుగవలెను). ఆ గ్రామ దేవర్లకు దున్నపోతుల బలి ఇచ్చుచుండిరి. కేవల హిందూ మతమే కాక బౌద్ధమతము కూడా మంచి వ్యాప్తిలో నుండెను. అందుచేత రెండు తావులలో తత్రసక్తియు వచ్చినది. భిక్షకుండు నాభి నీక్షించుచుండగా నదియు వానిమోము నరయుచుండె అతని చేతిచిప్ప నామె చేతుల తట్ట కాకులేరి తినుచు గాకుచేసె (2-62) ఇచట వీడు దొంగ సన్యాసి! చిలుక ముక్కు వన్నెచే నొప్పు మోదుగు సూలనరపు పొలిచె నేలనెల్ల బుద్ధ దేవు చరణములు మొక్క బుడమిపై బ్రాలియుండు భిక్షు జాలమట్లు 4-8 స్త్రీలు వాయనము లిల్లిల్లు దిరిగి యిచ్చు వాడుక యుండెను. (4-28) పండుగలలో హోలీ పండుగ (ఫల్గుణోత్సవము) చాల ముఖ్యమైనది. స్త్రీ పురుషులు
26 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
రంగులు చల్లుకొనుచు వినోదించెడి వారు. (4-69) 6-85 చూత లతికా క్రీడయనున దుండెను. ప్రియతమ నామమేమి చెప్పుమని ప్రియులు చూత లతికతో లేక నవ పలాశ లతతో కొట్టుట యీ క్రీడా విశేషమట! (1-28; 5-56) శైవ సాంప్రదాయకము లోని కాపాలికులందందుండిరి. (5-8) ప్రజలకు శకునాలపై విశ్వాసముండెను. “ఏ కోపి కృష్ణ సారో నదదాతివలనన్ ప్రదక్షిణం గంతుం” (1-25) ధన నిక్షేపములు నిన్న మొన్నటివరకు మనదేశమందలి ధనికులకు భూవివరములే బేంకులై యుందెననగా ఆ కాలమందు జనులు ధనమును, వెండి, బంగారును భూమిలో పూడ్చి దాచి పెట్టుకొనుచుండిరనిన చిత్రముగాదు. గాథలందు విరివిగా నీవిషయ చర్చలు వచ్చినవి. “తగిన చోటు గాదు దాచుట కిది; యేల సాహసంబు జేయ జనెదు కొడుక! 2-54 భూమిలో పాతిన ధనము పలుమారు నష్టమైనదని యిందు సూచితము. “చరోజనులు సారె సారెకు జూతురు భయము కోరికయును పైకొనంగ వీరవరుని పత్ని వీగు జన్నుల; పాము కాచు కొన్నలిచ్చి కడవలట్లు 6-72 బహుకాలము భూస్థాపితమైన ధనములపై పాములు కావలి యుండునన్న విశ్వాస మానాటికే ప్రాతదై యుండెను. శిక్షలు శిరచ్చేద శిక్ష పొందిన వాణ్ణి వధ్య స్థానమునకు తీసుకొని పోవుచూ తప్పెట వేసి యందరికి తెలియునట్లుగా వాని తప్పును, వాని శిక్షను ప్రకటించెడి వారు. దొంగతనం చేసిన వారికి మరణ దండనము, శృశానమందు చెట్టుపై వ్రేలాడ గట్టట యానాటి యాచారముగా కానవచ్చును. “శంకా శ్మశాన పాదలంబిత చోరే ణేవ ఖరేన” (6-36) అనుటయే నిదర్శనము. వ్యభిచారులను గ్రామాధికారులు శిక్షించుచుండిరి. (6-56)
గాథా సప్తశతి 27
స్త్రీల వేషభూషలు
స్రీలు స్నానము చేయునపుడు పసుపు రుద్దుకొనుచుండిరి. (1-80) కన్యలకు తొలి సమర్త కాలమందు పసుపులో నెయ్యి కలిపి ముఖమునకు చేతులకు కాళ్లకును రుద్దుచుండిరి. (3-46) ఇచ్చట మూలమందు “వర్ణఘృత లిప్తముఖం” అను పదముపై త్రీ మధురానాథ శాస్రిగారిట్లు వ్యాఖ్యానించిరి. “హరిద్రావర్ణ మిశ్ర ఘృతం వర్ణఘృతం దేశ విశేష రజస్వలా ముఖం వర్ణఘృతేన, లిష్యతి ఇతికా చిత్రథా” ఉత్తర హిందూ స్థాన మందీయాచారము లేదనియు “ఒకానొక దేశవిశేషమందు” ఈ యాచారముండె ననియు వ్యాఖ్యాత్రభిప్రాయము. ఇది ద్రావిడాచారము. సప్తశతిలో గోదావరీ తీర వాసుల యాచారాలు వర్ణించినందునను నేటికిని ఆంధ్రులలో నీయాచారముండుట వలనను దేశ విశేష నాంధ్రదేశమనుట స్పష్టము (చూడుడు 122 మరియు 619). ముత్తయిదువలు కాళ్ళకు లంకరంగు పూసుకొనుచుండిరి. (2-27) బుక్క పిండిని (కర్పూరాది గంధ ద్రవ్యకృత వర్ణ ధూళి) ప్రియులొండొరులపై చల్లుకొనుచుండిరి. (4-12) విలాసినుల ప్రసాదనములలో అద్దము, దువ్వెన ముఖ్యమైనవి. (3-4 మరియు 1-80) నాట్యమాడు స్రీలు ముఖమునకు హరిదళమును (అర్థళము - హరితాల మండిత ముఖీనటీవ) పూసుకొనెడివారు. (1-9) పూర్వమిండ్ల పెరడులందు ఆంకోల (ఊడుగ) వృక్షములు పెంచుచుండిరి. వాటి పూల సువాసన యువతీ జనాహ్లోదకారి (5-97) ముత్తయిదువలు కొప్పుముడిని, జడను వేసుకొనుచుండిరి. (3-73) మరువము స్ర్తీలకు ప్రీతికరమైయుండెను. (2-22) ధనిక యువతులు మరకతమణి పద్మరాగ సంవలితములైన (పచ్చల కెంపుల) కంటెలను ధరించిరి. (1-25) మట్టిగాజులను తొడుగుకొను నాచారము తెనుగు ముత్తయిదువలలో నిప్పటికే రూఢమై పోయెను. (5-38) “భగ్నకరవలయాని” అనుటలో భగ్న శబ్దమును బట్టి యవి మట్టి గాజులే యనవలెను. మరియు (5-58) వ్యాఖ్యలోనవి “కాచాది నిర్మితం” అని వివరించినారు.
స్రీలకు చీర రవిక ప్రధాన వస్త్రములు. రంగు వస్తములపై వారికి ప్రీతి మెండు. కుసుమవన్నె నుత్తమమైనదిగా నీలి వన్నెను సాధారణమైనదిగా భావించిరి. రవికలు “కుసుంభరంజితములు” (6-45) కుసుమవన్నె (చెంగావి) చీర యువతులకు ముచ్చట గొలుపునట్టిది.
28 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
దొరకకుండ నేడు దొరికిన చెంగావి
చీరకట్టె కాపువారి కోడ
లదిగో, చిన్నదయ్యు నడగక తిరిగెడు
విరివియైన యూరి వీధులందు. (3-4)
ఆనాటి పడచుల భావములో నీలిరంగు చీర మంచిది కాదట. పట్టుచీరయయిన
భేషట! (6-20) ఉత్తర హిందూస్థానమందు స్ర్తీల రవిక కట్టు వీపున నుండెడిది. దాక్షిణాత్య స్త్రీల కంచుక బంధనము ముందువైపే యుండెడిది. ముందు భాగమందు రెండు పార్వ్వములందు కొంత సందు కలిగి పొట్టపై రవిక రెండంచులను ముడివేయుట ఆనాటికే రూఢియె యుండెను. (7-20) “ద్వంగుల లలిత కావాటక, పినద్ధ సవిశేష నీలకంచులికా” స్రీలు నూపురములు ధరించుచుండిరి. (2-88)
జనుల యాచారములు కొన్ని
పిడుకల కాల్చుట ప్రాతకాలపు దురాచారమే (2-29). జనులు ముఖ్యముగా స్రీలు ఇప్పపూల నేరి సారాయి చేసుకొనుచుండిరి. ఆనాడు ఇప్ప సారాయికి లైసెన్సు లేకుండెనన్నమాట (3-3 మరియు 2-4). ప్రాత సారాయి (జీర్ణ సుర) చాలా రుచికలదై మైకమును మదనోన్మాదమును కలిగించు నట్టిదని యొక కవి యిట్లనెను.
“ఊరినిండ వయసువారు; ప్రాయము; ముదు
సలి మగండు; నవవసంత వేళ;
ప్రాతపడిన కల్లు చేతనున్నది; ఇంక
చెడక చావగలమే; చెప్పవమ్మ. (2-97)
పండ్లు తోముకొనుటకు జనులు కానుగ పుల్లలను వాడుచుండిరి. (2-65, 6-53). స్నానము చేయునపుడు నలుగు పిండిని వాడుచుండిరి. ఆ పిండిని రుద్దుకొని కడుగుకొనినప్పుడు “జంబూకషాయము” ఏర్పడుచుండెను. (2-89) పిల్లలకు అక్షరాభ్యాసము 'ఓనమాలితో సీధంనమఃతో ప్రారంభమగు చుండెను. (2-9).
“వర్ణావళీమష్య జానంతో లోకాలోకైర్గౌరవాభ్యధికాః సువర్ణకార తులా ఇవ నిరక్షరా లిపిస్మంధై రుధ్యంతే.
గాథా సప్తశతి 29 ఈ శ్లోకంలో శ్లేష కలదు. దీనిపై సాహిత్యాచార్య భట్టశ్రీ మధురానాథశాస్త్రి
గారిట్లు వ్యాఖ్యానించిరి. “జనైః ఓనమః సిద్ధం సిద్ధిరస్తు ఇత్యారభ్యాం వర్ణమాలా మహ్యజానంతో లోకాః గౌరవాభ్యధికాః” అని వ్రాసిరి. 'నమఃసిద్ధం' అని సాహిత్యా చార్యులవారు వ్రాయుట పాణినేయులకు, పాతంజలులకు సరిపడునో లేదో? ఉత్తరములు ట్రాసుకొనునప్పుడు 'స్వస్తి అను పదములతో ప్రారంభించుచుండిరి. పూర్వమందలి శాసనాలన్నియు స్వస్తి పదములతో ప్రారంభించుట భారతీయ చారిత్రకులెరిగియే యున్నారు. వ్రాతకు సాధనము లేఖిని యొకటి. తాటియాకులో భూర్ణపత్రాలో వాడి యుందురు. గాథలు దాక్షిణాత్యమువి కాన తాటాకులే వాడిరనవలెను. మరి లేఖిని యన గంట మనవలెను.
“వడకి చెమరించు వ్రేళ్ళకు వశముగాక
నిలిచి నడవక జారు నీ కలము తోడ
స్వస్తి శబ్బమె ముగియంప జాలనైతి
కమ్మ నింకేమి వ్రాయంగగలను చెలియ” (3-44)
జనులిండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయించుకొనువారు (3-17). ఆ
యాచారము క్రీస్తుశకము 19వ శతకాంతమువరకు ప్రచలితమై యుండెను. ఇండ్ల ముందు అరుగుల గదులుండెడివి. అవి పలుమారు బాటసారులకు రాత్రులందు విశ్రమస్థానాలగుచుండెను. (3-54). ధర్మశాస్రోక్తి ప్రకారము పుత్రులు తండ్రుల బుణములను తీర్చుచుండిరి. (2-13) చలివేంద్రములు పెట్టి పథికులకు నిదాఘకాలమందు ప్రపాపాలికలు ప్రచురించుచుండిరి. (2-61) రాజులు ధనికులు ధర్మకార్యములను శాసనాల ద్వారా ప్రకటించుకొనుచుండిరి. (3-32) గ్రామములందు అగ్ని ప్రమాదములు జరిగినపుడు స్రీ పురుషులు బావి వద్ద నుండి బారులు తీరి చేతుల యంచెలపై కడవలందించి యగ్నినార్పుచుండిరి. (3-29) జనులు మర్రి యాకులను విస్తళ్ళుగా కుట్టి యందు భుజించుచుండిరి. బాటసారులు విశేషముగానట్లు చేసెడివారు. కాని కాకి మున్నగు పక్షుల రెట్టకలిగిన మర్రి యాకులను వాడకుండిరి. (2-66) పెద్దవారి యాగమనమున వారి యడుగులకు మడుగులొత్తు చుండిరి. వారింటికి రాగానే రెండు కలశములతో కాలు మొగము కడుగుకొన నీరిచ్చుచుండిరి. (2-40)
30 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పంటలు వరిచేలు, జనుపచేలు విరివిగా నుండెను. “పండి తెల్లబారు వరితోటలను జూచి యేల మొగము వంచి యేడ్చెదమ్మ చూడు, జనుపచేను సొగసయ్యె హరిదళం బలదుకొన్న యాటవెలది వోలె” (1-4) (రహస్య సంకేతస్థానముగా వరికి మారు జనుపచేను సిద్ధమైనదని విలాసినికి ధైర్యము చెప్పుట). నువ్వులు కూడా పండించుచుండిరి. (1-8) మరికొన్ని తావులందు (బహుశా మహారాష్ట్ర ప్రాంతమందు) యవలు పండించుచుండిరి. వాటి కడవిపందుల బాధ యుండెను (5-8) సెనగలు కూడా పండించుచుండిరి. (6-57) ఆముదము లేక నూనెతో పత్తిని వెలిగించి దీపముగా వాడుచుండిరి. (3-64) వెలగపండ్లు, లడ్లు జనులకు ప్రీతిగా నుండెను. (7-41) ఓడిపట్టి దుర్గినములైనప్పుడు నిష్టాపరులు జ్యోతిశ్శాస్త్ర ప్రకారము గుణించుచుండిరి (5-35; పై ఈ శ్లోకమునందలి వ్యాఖ్యను జ్యోతిర్వేత్తలు చూచుకొనగలరు. ) “ప్రత్తిచేను దున్నవలసి మంచి దినాన మడకపూజలు సేయ” (2-65) యనుటచే ఏరువాక పున్నమ సూచితమవుచున్నది. నేటికినీ ఆంధ్రులు ఏరువాక నాడు మడకపూజ సేయుదురు. (ఏజు=నాగలి). వినోదములు ఆనాటి జనుల వేడుకలో ముఖ్యమైనవి నాటకాలు. అవి యక్షగానాలా? లేక సంస్కృత ప్రాకృత నాటకాలా? గట్టిగా చెప్పజాలము. సంస్కృత మర్యాదలతో కూడిన ప్రాకృత నాటకాలై యుండినవో? సంస్కృతము మాతృభాష నుండి దేవభాషగా హాలుని కనేక శతాబ్దములకు ముందే మారియుండెను. జనులకు వివిధ ప్రాకృతములు మాతృభాషలయ్యెను. కావున జనసామాన్యాని కాహ్లాదము నిచ్చునవి ప్రాకృత నాటకాలేయై యుండును. ఆ నాటకాలకును యక్షగానాల వాసన గోదావరీ ప్రాంతాలలో నుండియుండును. ఆనాటి నుండి యీ శతాబ్దివరకు నాటకాలాడువారు ముఖములకు అర్థళము (హరిదళము- హరితాళము) పూసుకొనుచుండిరి. స్త్రీల
గాథా సప్తశతి 31
పాత్రలను భోగము పడుచులు వేయుచుండిరా యను భ్రమ “హరిదళంబలదుకొన్న యాటవెలది వోలె” యను శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి అనువాదము నుండి కలుగును. కాని మూలమందు “నటి” వలె యనియే కలదు. “సురత నాటకము మనకు పూర్వరంగము” (4-44) అని యొకచో వర్ణించుటచేత రంగములు, పూర్వరంగము అను నాటక లక్షణములు పాటింపబడినవని యూహింప వీలుకలుగుతున్నది. మరొకతావున (4-51) నాట్య సూచన చేయబడినది.
గోడల మీద చిత్తరువులు వ్రాయించుకొనుచుండిరని తెలిపినాను. మరొకటి కనుడు.
మలినచిత్తుడైన మరదికి నిల్లాలు
గోడమీద వ్రాసికొన్న యట్టి
రాము వెంట దిరుగు సౌమిత్ర చరితంబు
చిన్న నవ్వుదోప జెప్పిచూపు. (1-35)
సమిష్టి కుటుంబాలలో నందందు రావణాంశజులుండుట చిత్రము కాదు.
అందు నొక కవి మరల ఇట్లనెను.
చెడ్డ మనసు కలిగి యడ్డాడు మరది బా
ధలను దెగువగల్లు దయితుతోడ
చెప్పదింటి బ్రతుకు చెడునంచు మదిలోన
యడచి నవయు కోడలార్యశీల. (1-59)
“బ్రతుకు బొంగరంబు వంటిది” (5-6) అని తెలుగుసేతలో కలదు కాని మూలమందు 'చలం జీవనం' అని కలదు. జీవనము శాశ్వతము కాదు అని యర్థమే 'యనుకొందును. కుండల పోత మోటకూడ నాకాలమందుండెను. దానిని సంస్కృతంలో ఘట యంత్రమనిరి. దానినే “రహట్టఘటకియనిరి. నేడును 'రహట్' మోట యంత్రమును గురించి ప్రకటించుటను గమనించుతున్నాము.
“రికా నమంతి సుచిరం రహట్ట ఘటకా ఇవే హకాపురుషా!” రహట్టపై భట్టశ్రీగారిట్లు వ్యాఖ్యానించారు. “రహట్టో ఘటయంత్రం... ఉదకం లబ్బాయధా ఘటికా ఊర్వముభాభవంతి తథా దుర్దనా అపిస్వల్ప లాభ ఏవదర్చేణ మస్తకమున్న యంతి”. పాచికల యాట బహు ప్రాచీనమైనది. కాయలను నడుపు నప్పుడిండ్లకు
32 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
దుగ, తిగ, చౌ, పంచ, బద్రికాది సంకేత పదములుండెను. తురకలు వచ్చిన తరువాత వాటి స్థానంలో ఉర్దూ 'పేళ్లేర్చడెను. దస్, పచ్చీస్, తీస్, బారా, చెక్కా అను సంకేతాలు మన యిండ్లలో మన స్రీల వాడుకకు వచ్చెను. ఈనాడీ యాటను “పచ్చీసాట” యంటున్నారు. హాలుడిట్లు దానిని వర్ణించెను. “శునక ప్రచురే గ్రామే భ్రామయంతి తవకృతేన సా బాలా పాశకశారీవ గృహంగృహేణ భాదిష్యతే కదాప్యంగ” (2-38)
దూతి విటునితో ఇట్లనెను. ఓయీ నీ కొర కావన్నెలాడి ఊరునం గండు కుక్కలున్నను లెక్కపెట్టక పచ్చీసు కాయవలె ఇల్లిల్లు తిరుగుచున్నది. పాశకశారిపై భట్ట శ్రీగారిట్లు వ్యాఖ్యానించిరి. “షతు ప్పటీగుటికా ద్యూత ఘటికా యధాద్యూత ఫ్టస్యప్రతి గేహం భ్రామ్యతి తథాగ్భహేణ గృహేణ గృహం భ్రామ్యతీ సా బాలా.”
ఉత్ఫల్లికా క్రీడ నొకచో వర్ణించినారు (2-96) అదెట్టిదో యర్థము కాలేదు. “ఉత్థానంశ యానస్య పాద యోరు పవిష్టానాం బాలానాం ముహుః పతనోత్సతన రూపాక్రీడా ఉత్పల్లి కేత్యాఖ్యాయే” టీకాకారులన్నారు.
- సుజాత (15 ఏప్రిల్ 1951) కవితా ప్రాశస్త్యము
గాథా సప్తశతిలోని కవిత యసాధారణమైనది. విశ్వ వాజ్మియములో దీని యనుకరణములే కలవు కాని ఇట్టిది మరొకటి లేదు. దీనినుండి భావములను విరివిగా గ్రహించిన అమరు శ్లోకాలకు “అమరు కవేరః శ్లోకః ప్రబంధ శతాయతే” అన్న కీర్తి కలిగినపుడు అమరు మాతృకయగు నీ గాథాసప్తశతి నేమనవలెను. గాథా సప్తశతిలోని నాయికా నాయకులు, దూతీచేటికలు, అత్తకోడండ్రు, గ్రామణి గ్రామీణులు జొన్న జనుప, నువ్వు, వరి, పెరిగిన పొలాలో చేసిన దుడుకులను, నర్మ గర్భముగా పదుగురికొక యర్థంగా తమ యిద్దరికొక యర్థంగా నుండు సంకేతములను చెప్పుకొనుటలను, నదీతీరాలలోని చాటు మాటు దాటులను, వన్నెలాడుల వయ్యారపు విహారములను, విలాసినిల చూపులోని మూగ పలుకరింతను, పథిక విటులలోని ఇంగితములను గ్రహించు మితిమీరిన చురుకు దనమును, సవతుల సహింపులేని తాకట్లను, మనము చిరునవ్వులతో మన్నింపవలెను. అందలి కవిత మనకెట్లాదేశిం చినది. ఉత్తమ టాకీలోని ప్రేమగాథలలో నటించిన వ్యక్తులను చూచి వచ్చిన తర్వాత
గాథా సప్తశతి 33
మన భావాంబరముపై నవి పలుమారెట్టు పునర్నాట్యము చేయునో యటులే 200 ఏండ్ల క్రిందట గోదావరి తీరములోనూ, పల్లె ప్రాంతములందునూ, చెరువు చెట్ల దాపులందును, శృంగార విలాసములతో కాలము గడిపిపోయిన యువతీయువకు లీనాడును నేనాడును గాథలను తిరుగ వేసినప్పుడంతయు మన మనోనాటక రంగమందు టికెటులేని నాటకములాడి మనల గిలిగింతలు పెట్టి మనకు బ్రహ్మంగారిని చూపి (ఆనందోబ్రహ్మ) వెడలి పోవుచుందురు.
గాథలోని కవిత, కవితలోని యసాధారణత, భాష, భాషలోని సౌకుమార్యము భావము, భావములో గంభీరత, ఛలోక్తులు, ఛలోక్తులలోని చందన స్పర్శ, మాయా మర్మములు లేనట్లుగా భాసించు ముగుద ముద్దుగుమ్మలముచ్చట్లలో దాగిన సుందర సుకుమార నర్మగర్భితములు, ఎన్నని చెప్పవలెను, శృంగార లోకమంతయు సప్తశతీ గీతములలో పంచాక్షరిలో శివునివలె చక్కగా నిమిడి యున్నదనిన కొంతకు కొంత వక్తయొక్క యభిప్రాయము వెల్లడి కాగలిగి నట్లనవచ్చును.
700 గాథలలో అన్నియు నుత్తమములనుటయు లేదు. కాని అందలి పనికి రాని గీతాలన్నియును బహు ప్రబంధాలలోని బహువర్ణనలకన్న రమ్యమైనవే యని నేననుకొందును. శ్రీ రాళ్ళపల్లి శర్మగారి భావములో 700లో 395 గాథలుత్తమమైనవి. కాని నా యభిప్రాయములో ఇంచుమించు మరి 50-60 ఉత్తమ పద్యాలను వారు చిన్నచూపుతో చూచినారు. మొత్తముపై (500) పద్యాలు సప్తశతిలోనివి అత్యంతానంద సంధాయకములు, వీటిలోని ప్రాశస్యమును ఎత్తి చూపవలెనన్న నన్నిటిగురించి తనివితీర వ్యాఖ్యానించుటయే సమంజసమగు కార్యము. అదికాని పని కాన మాసరకు (నమోనాకు) కొన్నింటి మాత్రమెత్తి చూపిన స్థాలీపులాక న్యాయ నిదర్శనమగును.
“బిసిసీ పత్రి నిశ్చల నిస్సందా పశ్య రాజతి బలాకా
నిర్మల మరకతభాజన పరిస్థితాశంఖుక్తిరివ (1-4)
దీనిని శ్రీ శర్మగారు తెనుగింపలేదు. పల్లవనాయికా నాయకులకొక సరస్తీరము సంకేతఘటనా ప్రదేశముగా నేర్పాటై యుండెను. కాని యందొకరు వచ్చి కాచుకొని ఇంకొకరు రానందున విసుగుకొని పోయి మరల పదిమందిలో రాని వ్యక్తిని చూచి తమ బాస తమకే పూర్ణార్థమిచ్చునట్లుగా నీ గాథ బహువిధ బావముల వెల్లడిస్తున్నది. ఎట్లనగా.
34 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“చూచితివా! కమల పత్రముపై కొంగ నిశ్చలముగా చకితము కాకుండా నిలిచినది. శుభ్రమైన మరకతపు తట్టలో శంఖముంచినట్లుగా నాబలాక యున్నది.”
పై గీతములో మరేమి లేకున్నను ఉత్తమోపమాన మున్నందున నంత మాత్రకే యది రమ్యమైనది. కాని యొక విశేషమున్నది. కొంగలు అందులో పెంటివి మెలకువ కలవి. అచ్చట యేమైన ఆకుల చప్పుడు కాని, మనిషి కాలిచప్పుడు కాని వినిన నిశ్చలముగా నిస్సందముగానే యుండును. కావున ఆ సంకేతస్థానము అత్యంత నిర్జన ప్రదేశమని 'ప్రియులలో నొకరింకొకరితో తెలుపుదురు. అనగా ఆ చెరువు వద్ద ఆ కమలముల సమృద్ధి కల ప్రదేశమున్నది కదా! అచ్చట మనుష్య సంచారము లేదు అది మన యేకాంతమునకద్భుత సంఘటనాస్థానము.
ఇంతేకాదు. మరొక విశేషమున్నది. ప్రియులతో నొకరిట్లనుచున్నారు. “నీవు నాకన్న ముందాగురుతుగల చోటికి పోయి నేను రాలేదని తిరిగిపోతివన్న మాట పూర్తిగా కల్ల.
నీ పలుకు చొప్పున నీవే ముందుపోయి వచ్చి యుండి తర్వాత నేను పోయినప్పుడు మనుష్య సంచారమును వినిన జూచిన బలాక అంతనిర్మల నిస్సందగా నేలయుండును. దానిలో చకితత్వలక్షణమే కానరాదు. దాని నిశ్చలతయే నీ మాటలు దుబ్బరలని సాక్ష్యమిచ్చునది.
అంతేకాదు. ఇంకొక విశేషమున్నది. నీవు నాకన్న ముందుగా పోయినది కల్ల నేను ముందుగా పోయియుంటిని. అది కొంగ యొక్క నిశ్చలతవల్ల తెలుస్తున్నది” తిరిగి వచ్చితినని సమాధానము.
ఇంతటితో కథ ముగియలేదు. ప్రియాప్రియులు సంకేతస్థానమందు కలియనే కలిసినారు. అప్పుడు ఒకరింకొకరితో సంభోగ కాలమందిన పద్యమిది. ఎందుకనగా (మరుగునకై సంస్కృత ప్రమాణమునుదాహరించి వదలుదును).
“కల్లోలినీ కాననకందరాదౌ దుఃఖాశ్రయే చార్చిత చిత్తవృత్తిః
మృదుక్రమారంభమఖిన్నదధైర్యః శ్లథోపిదీర్ణం రమతే రతేషు”
ఈ చిన్నగాథలో ఈ రెండు పంక్తులలోనే ఇన్ని కథలిమిడియున్నవి. “ఏకఃశ్లోకః ప్రబంధశతాయతే” అని యూరకే అన్నారామరి? మరొకటి చిత్తగించవలెను.
గాథా సప్తశతి 35 “మగని పయనమన్న మాటెవ్వడాడెనో వానిమనసుపాడుగాను; తాను విన్న మొదలు విసముగొన్నట్లు కోడలి యవయవంబు లెల్ల నయవసాగె (2-11) సవతిని నిందపాలు చేయుటకో లేక యున్నంత తెలుపుటకో దాని సవతి పై విధముగానన్నది. సవతి జారుడు పనిపై ప్రవాసము వెళ్ళుచున్నాడని దానికెట్లో తెలియకుండునా. తెలియనే తెలిసినదమ్మా! ఇక చూడు, అప్పటినుండి మొగము చిట్లించుకొని రుసరుసమని ఇంటి పనులన్నియు అడ్డదిడ్డిగా చెడజేయుచున్నది. దానికావార్త విసమునాకినట్లు కసిబిసియెనది. ఇంత విచ్చలవిడి తగునమ్మా? అని సవతి పోరొకదిక్కు దీనికింకొక కథ కూడ సాధ్యమైనది. ఏమనగా - పతి ప్రవాస మందున్నందున ఆ సుందరిని నాకు కూర్చుమని యెకలంపటవిటుడు తార్చుకత్తెను విచారింపగా నాదూతి యిట్లంటున్నది. “వయ్యారపు అయ్యవారూ! ఆ యువతి పతి వియోగముచే దుఃఖతయై యింటి పనులే చేయనొల్లదే, అంతటి పతిదత్తమానస నీకు చిక్కునా? అది వ్యర్థ ప్రయత్నము” అని మందలించుట యిందు ద్యోతకమైనది. అయితే మరొక విస్పష్టభావము పైననే కానవస్తున్నది. అత్తగారు తానెంతగా గట్టిగా కోడలి నెత్తిన మిరియాలు నూరినను, తన కొడుకు ప్రవాసమున కేగనున్నాడని కన్నకడుపు కావున తానాయసపడినదై తన కోడలి విరహతాపముపై కరుణ కలిగి ఇరుగుపొరుగు అమ్మలక్కలతో వెల్లడించుకొను వరకు మనసు పట్టలేకపోయినది. అత్త యిట్లన్నది. “నా కోడలికి దాని మగని ప్రవాస వార్త యెవరు చెప్పిరో యేమోనమ్మా విన్నప్పటినుండి మొగమింత చేసుకొని యింటిపనులన్నీ ముట్టక దుఃఖముతో బాధపడుతుందమ్మా- నా కోడలు!” మరొక గీతమును తిలకించండి. “ముద్దు కొడుకు మొదట మొలచిన పలుదోయి గారికి కొరికి కాటు వరిచెనిదిగొ రేగుపండు గంటిరే! యని పెండ్లాము నగుచు దెచ్చి పెట్టె మగనిచేత. (2-100)
36 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఆముక్తమాల్యదలో పై యభిప్రాయము నిచ్చు నీ క్రింది పద్యము మొదట మనకు మతికి వచ్చును. తస యుదరంబునం బొడమి తామ్రరుచిచ్చట లుల్లసిల్ల గో, ల్మొనుధరణీజ సంతతికింగోరక దంతములించుకంత, ని క్కినయది యాదిగాగ జెలగెన్ వనలక్ష్మి కడుంజెలంగగా జను బ్రియుడైన మాధవుని సంగతిమీదట జాల గల్లుటన్. ఆము. (5-116) ప్రసవానంతరము కన్న శిశువునకు తొలి రెండు పండ్లు మొలచిన తర్వాత భార్యాభర్తల పునస్సమాగమ కాలమని హిందువులలో శిష్టాచారమైనది. ఒక యిల్లాలు తాను పతి సంభోగ సుఖానుభవ యోగ్యతను పొందినదని తన పతికి సుకుమారముగా నెచ్చరిస్తున్నది. దానికి సాక్ష్యమేమి? ఇదిగో పలుకాటుల పడిన రేగుపండు. అదెక్కడున్నది. ఇదిగో యిప్పుడే నీ చేత నుంచుచున్నాను. అయితే భార్య “ప్రహసిత వదన”గా రేగుపండును తన భర్త సేత నెందుకుంచెను? అది అనుమానానికి తావిచ్చునని సరస్వతీ కంఠాభరణమందు “వికసితనయనా” యని కలదు. అప్పుడు భావము సుందర తరమగును. కాని ప్రహసిత వదనయను పదముపై తృతీయ పంథగా వ్యాఖ్యలు చేయునలవాటు పడిన గంగాధరుడిట్లంటున్నాడు. “యువతి కుమారునికి పండ్లు వచ్చువరకు తాళజాలనిదై తానే దంత యుగళాంకితము చేసి రేగుపంటిని భర్తకిచ్చినది. అందుచేతనే మగడు నమ్మడని ప్రహసిత వదనయినది” ఇదే ధోరణిలో నాలోచించిన మనమింకను నిట్లన వచ్చును. (ప్రత్యక్ష ప్రమాణముండగా అనుమాన ప్రమాణమేల? చిట్టివాని కొత్త చిరుపండ్లు చూడుమాయని శిశువు నోట భర్త వ్రేలిని పెట్టించి కొరికించి తామును నవ్వవచ్చును. శిశువునూ నవ్వించవచ్చును. అట్లు చేయక పిల్లవానిపండ్లు చూపించక రేగుపండుపై కాట్లను చూపింపనవసరమేమి? ఇది ఇట్లుండనిండు. రేగుపండునే కొరికించి చూపనేల? వేరు మెత్తని చిన్నపండు - ద్రాక్షవంటిది బాగుండదా? నాకిట్లు తోచినది. రేగుపండు వసంతాగమ కాలమందు సమృద్ధి. అందుచే కవి దానిని సూచించెనేమో. మరియు ఇతర భారతీయులలో యే ప్రాంతమందు కలదో లేదో కాని తెనుగునాటనొక యాచారము కలదు. సంక్రాంతి పండుగనాడు ఏడాదిలోపలి శిశువులను కూర్చొనబెట్టి వారి తలలపై నుండి రేగుపండ్లను
గాథా సప్తశతి 37
దిగబోసి యాపండ్లను బీదలకు పంచిపెట్టుదురు. అందుచే కవి రేగుపండునే తన గాథలో నుంచి యుండును. ప్రతిగాథకిన్ని కథలు! అన్నియు మనోహరములగు కథలే!
రమ్యమైనరూపు, రమణుడూరను లేడు;
పేదరికము; పెద్ద వీధినిల్లు;
పరువమైన వయస్సు పొరుగింటిచెలి జార;
యైన నౌర! చెడదు చాన; చూడు. (1-36)
స్రీ చెడుటకు కావలసిన అంగములన్నియు సిద్ధమే కాని “చెడదు చాన చూడు”
ఇదెవ్వరో పెద్దలన్న మాటగా భాసించును. లేదా కళంకకారణాభిశంకచే జనులు వృథాగా నన్ను నిందింతురు. నాకు చరిత్ర దోషము లేదు అని నిజదోష గోపనము చేసికొనుచు నొక కులట పలికిన పలుకులనవచ్చును.
కొండ సెలయేటి సుడికి జిక్కుకొని కలగి
తిరుగుచును కేసరంబులు విరిగిపోవ
కొంత మునుగుచు తేలుచు గొదమితేటి
వెంటనంటి, కడిమిపూవు వెల్లబోయె. 4-837
కడిమి పువ్వు నీటి సుడిలో కొట్టుకొని పోతున్నది. దాని మధువు నీటపడిన
వెంటనే క్షాళితమైనది. కాని, తుమ్మెద మాత్రము దాని వెంటనే పడినది. దీనివెనుక యెంత కరుణారసము దాగినదో చూడుడు. పువ్వుపై గల తమకము తుమ్మెద కెంత గొప్పది. “ఎన్ని పువ్వులన్ వ్రాలదుతేటి” అని తారాశశాంక కవి యన్నట్లుగా - ఆ పువ్వు కాక వేరే మంచి పూలు లేవా? ఆ తుమ్మెదకు? తేనె యేమియు లేదు, పువ్వు నలిగినది. కొన్ని రేకులు విరిగినవి, సంపూర్ణ శైథిల్యమిప్పుడో అప్పుడో! మరి దానితో నేమి పని. నీచులే ద్రోహులై యుందురు. తుమ్మెదనైన చూచి మనుష్యులు బుద్దితెచ్చుకొనరాదా? తాననుభవించిన స్రీ బిగువు సడలగా తిరిగి చూడని ప్రియులను గూర్చి యీ సంభోదన.
వల నడుమను సాగిన పో
గులలో మీగాళ్ళు దవులుకొన సాలీడిం
పలరె, కనరాని దార
మ్ముల గూర్చిన యొంటి పొగడపువువలె గంటే! 1-63
38 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఉపమానము బహుసుందరము. పొగడపువ్వును చూడనివా రీకాలంలో చాలామంది! చూచిన వారికి దీనిని సాలెపురుగుతో నుపమించుట యానందమిచ్చును. కాని మరొక కథయిందు దాగినది. ఒంటి సాలీడు. ఇంటిలో తాను తప్ప మరెవ్వరు లేరు. అందుచేతనే సాలీడింటి నిండుగా వలనల్లినాడు. “అత ఏవ సురుచిరం రతోత్సవో౭_ నుభూయతాం ఇత్యర్థోధ్వన్యతే. అందుచే నిర్భయముగా ఆనందింప వచ్చునని హెచ్చరిక! లోభివాని చేతిలో సిరియెంతగా వెలయుచున్న సుంతఫలము లేదు తెరువునడుచు వేళ కరకు వేసవియెండ మాడువానికి నీడవోలె.... 2-36 ఇది మంచినీతియే! అందులోను మంచి యుపమానముతో గూడిన నీతియే! ఒకదూతి లోభివిటునికి చల్లగా మెల్లగా సూచించినది. నీవు విరివిగా ధనమును వ్యయించకున్న ఆ సుందరి లభింపదు! ఈ దూతియు ఊరక రాయబారులు జరుపజాలదు!! ఊర గొడుకు లేక యుండగ కోడలు వచ్చి కాళ్ళు (మొక్క వంగినపుడు గాజులెల్ల జారగా జూచి కడు గోప కత్తె యయ్యు నేడ్చె నత్తగారు. 5-93 మూలములో వలయద్వయమని కలదు. చేతికొక్కొక గాజుండ ననవలెను. కాని తెనుగు సేతలో గాజులెల్ల అన్నారు. రెండు గాజులేమి! గాజులన్నియు జారినవని వారి యభిప్రాయమై యుండును! కృశించి కృశించి సన్నగిల్లుటవలన గాజులెప్పుడో జారిపడి పగిలిపోగా సౌభాగ్య చిహ్నముగా రెంటి నా సౌభాగ్యవతి మగనిమీద ప్రాణము నిలుపుకొన్నట్టిది. ఎటులో నిలుపుకొన్నది. ఆ యవస్థను కోపగత్తెయగు నత్త యెందుకు చూచును? ఏదో నిమిత్త కారణముగా తనను మైొక్కవచ్చినపుడు బాగుగా సన్నగిల్లిన చేతుల చూడగలిగినది. అప్పుడైనను కోడలిపై కరుణగలిగినదో లేదో? తన కొడుకు జ్ఞాపకము వచ్చి వాని బహుకాల ప్రవాసమును తలచుకొని యేడ్చియుండును. ఒక యేకాంకికకు కావలసినంత కరుణారసమిందున్నది.
గాథా సప్తశతి 39
కాని రసభంగము చేయదలచిన యొక వ్యాఖ్యాత యిట్లన్వయించినాడు. అంతటి యాప్రేమ యాకాంతకు తన ప్రియ భర్తపై నుండగా నామెను విటుడు కోరుట వ్యర్థమని దూతీ సూచనయట! లేదా యామె భర్తతో ఏమయ్యా! నీవు లేనందున కృశించి చావసిద్ధంగానున్న నీ భార్యను గూడ కెందుకాలస్యము చేసెదవు అని యతని భార్య యొక్క దయనీయస్థితిని యతనితల్లి దుఃఖమును ఎందరో మిత్రులు తెలిపిరని వ్యాఖ్యానింపవచ్చును.
ఇంచుమించు ప్రతి పద్యము అమృతర్సురియై (అమృతం ప్రాకృత కావ్యం 1-2) కామతత్వ చింతామణియై (కామస్యతత్త్వ చింతాం1-2) స్వభావ రమణీయమై (7-101) రసిక జన హృదయదయితై (1-101) అమృతమును కూడ నిరాకరింప జేయు మాధుర్యము కలదై (మధురత్వే నామృతమ ప్రియచ్చృత్వానోలగతిహ్రదయే (4-101) నానాలంకార లలితమై (1-3) ధ్వని ప్రధానమై సంతతాహ్లోద కారియె, గంభీర భావ పరంపరా సంపూరితమై రస సిద్ధుల పూర్ణ చంద్రోదయ ఫఘటికయై శ్లాఘాపాత్ర మైనట్టి గాథా సప్తశతి భారతీయ సాహిత్య రత్నములలో కొహినూర్! గాథలో కూర్చిన హాలుని రాజ్యమెన్నడో పోయెను. కాని యతని కావ్య సామ్రాజ్యమునకు కొట్టుబాటు లేదు. దానికి నిత్యనూత్నత కలదు. సుకవితా యద్యస్తి రాజ్యేనకిం?
ఇట్టిగాథలలో నూరింటి నేరి వ్యాఖ్యానించిన సర్వజ్ఞ చక్రవర్తి 'పెదకోమటి వేమభూపాలుని వ్యాఖ్య యేది? ఇంచుమించిరువది పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలేవీ? ఈ గాథలకు తెలుగు వ్యాఖ్యలను వ్రాసి ఉత్తమ పీఠికను చేర్చి ముద్రించుట అవసరము. ఈ సప్తశతిని రసికులందరును చదివి యానందింతురు గాక.
సంధ్యోపాత్త జలాంజలి బింబిత గౌరీముఖాంబురుహం స్ఫురితాధరం ముధైవహి విగళిత మంత్రం హరీం నమత. 7-100
సంధ్య వార్చగ దోసిట జలమువట్టి నపుడు గౌరీముఖాంబుజ మందుదోప మంత్రమంతయు నొకమారు మరచినట్టి మోవిని గదుల్చు శివునకు మొక్కులిడుదు.
శివునికి పట్టిన గతియే సప్తశతీ పాఠకులందరికిని పట్టుగాక! సుజాత. (15 మే 1951)
ఆంధ్ర వాజ్మయ చరిత్ర
ఆంధ్ర భాష, ఆంధ్ర వాజ్మయము చాలా ప్రాచీనమైనదేకాని మనకు లభించిన మొదటి గ్రంథము 900 ఏండ్లనాటి ఆంధ్ర మహాభారతమే. ఆంధ్రుల ప్రశంస సంస్కృత మహాభారతములో, రామాయణములో, ఐతరేయ బ్రాహ్మణములో - ఇట్టి అతి ప్రాచీన గ్రంథాలలో లభించినది. ఆంధ్రులు క్రీ.పూ. 200 ఏండ్ల ప్రాంతము నుండి మహా సామ్రాజ్యాలు స్థాపించి ప్రపంచ ఖ్యాతి కాంచిన వారు. అట్టివారి భాషలో క్రీపూ. 200 ఏండ్ల నాటి నుండి క్రీ.శ. 1050 వరకు అనగా నన్నయ భట్టు కాలము వరకు ఇంచుమించు 1200 ఏండ్ల కాలములో వ్రాసిన ఒక గ్రంథము కూడా లభించక పోవుట చాలా ఆశ్చర్యకరము. నన్నయ భట్టుకు పూర్వము తెనుగు భాష్క తెనుగు కవిత్వము లేదని కాదు. ఆ రెండున్నూ ఉండెను. కాని మనకు గ్రంథమొకటైన దొరుకలేదనుటయే విచారకరమైనది.
నన్నయ కంటె ఏడు నూరేండ్లకు పూర్వము నుండి అనగా క్రీ.శ. నాల్గవ శతాబ్దము నుండి తెనుగు రచనలు ఉండినట్లు మనకు కొన్ని నిదర్శనాలు కనిపించుచున్నవి. దినేశ చంద్ర సర్మారుగారు “శాతవాహనుల తర్వాతి వారు” అను తమ ఇంగ్లీషు గ్రంథములో ఇట్లు వ్రాసినారు.
“ఇక్ష్వాకు రాజుల ప్రాకృత శాసనాలు కొన్ని జగ్గయ్యపేటలో లభించినవి. నాగార్జున కొండలోని రికార్డుల భాషను గూర్చి అది ఒక విధమైన ప్రాకృతమని బహుశా కన్నడమయి యుండునని స్టెన్ కొనోప్‌గాను అభిప్రాయపడిరి. నాగార్జున కొండలో కొన్ని ప్రాకృత శాసనాలు దొరికినవి అయితే జగ్గయ్యపేట, నాగార్జున కొండ అను నీ రెండు స్థలాలు తెనుగు నడిగడ్డలో నున్నందున అచ్చటి ప్రాకృత భాష తెనుగు రూపమై యుండియుండును. కాని కన్నడము కానేరదు. కన్నడమైనను క్రీ.శ. నాల్గవ శతాబ్దిలో తెనుగు నుండి అంతగా భిన్నించినట్టిది కాదు.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 41
ఇక్ష్వాకులు, అశ్మక, ములక దేశములు రాజ్యము చేసినట్లు వాయు పురాణము చెప్పుచున్నది. ములక దేశము నిప్పటికిన్ని మొలకసీమ అని పిలుచుచున్నారు. అది యిప్పటి పాలమూరు జిల్లా. అక్కడ నుండి ములకసీమ (మురికినాడు) కర్నూలు, కడప మున్నగు ప్రాంతాల నాక్రమించుకొని యుండెను. శాలంకాయనులు అను రాజవంశము వారు తెనుగుదేశములో క్రీ.శ. 5వ శతాబ్దమందు రాజ్యము చేసినారు. వారి శాసనాలలో మన కర్థమగు కొన్ని తెనుగు పద్యములున్నవి. ఊరు, చెరువు, మునుడు ఇట్టి పదాలు కొన్ని గలవు. క్రీ.శ. 5వ శతాబ్దమందు అనగా నన్నయభట్టు కంటె 600 ఏండ్లకు ముందు ఆంధ్రదేశమున రాజ్యము చేసిన విష్ణుకుండిన రాజుల దాన శాసనములలో ఒక దానియందు “వర్షంబుల్” అను తెనుగు పదము గలదు. ఇట్టి నిదర్శనములను బట్టి తెనుగు భాషయు, తెనుగు రచనయు (శాసనములోనే అనుడు) క్రీ.శ. 400 నుండి యుండెననుట స్పష్టము. విష్ణుకుండిన రాజుల వంశములోని వాడగు జయాశ్రయుడు అను బిరుదు గల మాధవవర్మ నన్నయకు అయిదు నూరేండ్లకు ముందుండినవాడు. అతడు జనాశ్రయచ్చందమను ఛందఃశాస్తమును వ్రాసెను. అందు శీర్ష లక్షణము అనగా సీస పద్య లక్షణములను తెలిపినాడు. నన్నయకు పూర్వము తరువోజ, సీసము, అక్కరలు విశేషముగా ఉండి యుండును. నన్నయ తరువోజలు, అక్మరలు అను కొన్నిపద్యాలను మహాభారతములో వ్రాసెను. తర్వాతి కవులు వాటిని పరిహరించిరి. నన్నయకంటె ముందు ద్విపదలోను, దాని భేదములగు వృత్తములోను వ్రాసి జనులు పాడుకొను చుండిరి. ఇంచుమించు క్రీశ. 1240 నుండి 1300 వరకుండిన పాల్కురికి సోమనాథుడు తనకన్నా ముందు కాలములో నుండిన చాలా విధములైన పాటలను గూర్చి ఇట్లు తన పండితారాధ్య చరిత్రలో వ్రాసెను. “మదినుబ్బి సంసార మాయాస్తవంబు పదములు, తుమ్మెద పదముల్, ప్రభాత పదములు, శంకర పదముల్, నివాళి పదములు, వాలేశు పదములు, గొబ్బి
42
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పదములు, వెన్నెల పదములు - సెజ్జ వర్ణన మరి గణ వర్ణన పదములు”
ఇట్టి వెన్నో యుండెనట!
నన్నయభట్టు రాజమహేండ్ర వరము రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. అతడు క్రీ.శ. 1050 ప్రాంతమందుండినవాడు. అతనికంటె ముందుండిన కవితలో కొన్ని పద్యాలు కొన్ని శాసనాలలో మనకు లభించినవి. గుంటూరు మండలంలోని అద్దంకిలో ఒక శాసనము దొరికినది. అది క్రీశ. 848 ప్రాంతములోనిది. అనగా నన్నయభట్టు కంటె ఇన్నూరేండ్లకు పూర్వముది. నన్నయకంటె ముందు మనకు తెనుగు రచనలే దొరుక లేదనుట చేత మనకు దొరికిన ఈ అద్దంకి శాసనములోని ఒక పద్యము, ఒక వచనము ఎంతైనా విలువ చేయుట చేత వాటి
నిందుదాహరింతును. తరువోజ: పట్టంబుగట్టిన 'ప్రధమంబునేణ్జు
వచనము:
బలగవ్వ ౦ బొప్పంగ బైవేచి సేన
పట్టంబు గట్టిఇ్బ ప్రభు బజ్జరంగు.
బజ్బాున సమత్త! పడువతో బోయ
కొట్టంబుల్వణ్జెణ్డు గొణి వేంగి నాణ్జిం
గొళల్చి యాత్రి భువనాంకుశ బణనిల్చి
కట్టెపుదుర్దంబు గడుబయల్చేసి
కణ్డు కూర్చెజ వాడగావిళ్ళ మెచ్చి”
పండ రంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్య భట్టారకుని ఇచ్చిన భూమి యెనుబొది పుడ్ల అడ్ల పట్టునేల. దమ్మ పురంబున దమ్ముములు. వీని రక్షిఖ్బున వారికి అస్వమేదంబున ఫలంబు అగు”.
నన్నయ కంటె ముందటిదగు రెండవ శాసనము, యుద్ధమల్లుని బెజవాడ శాసనము. అది క్రీ.శ. 898 ప్రాంతముది. అనగా నన్నయ భట్టు కంటె 150 ఏండ్ల కన్న ముందటి శాసనము. దానిలో 5 మధ్యాక్మరలు ఒక వచనము మనకు లభించినవి. అందలి పద్యమొకటి యుదాహరింతును.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 43
“జనసుత చేబ్బోల నుణ్జి బెజవాడ జాత్రకు వచ్చి త్రినయను సుతుణ్ణాణ్జు సోట మెచ్చక తివిరి యిన్నెలన యనఘాణ్లు సేకొని యిన్టు ప్రత్యక్షబయన్న నిచ్చ
గని మల్లజ్జెత్తించె గుడియు మతంబునుం గార్తికేయునకు”
ఈ విధముగా నన్నయ భట్టు కంటెముందు తెనుగు రచనలుండెను. నన్నయభట్టు కంటె ముందు కాలములో కొందరు తెనుగువారు కన్నడములో కావ్యాలను రచించిరి. నన్నయకన్న ముందుండిన తెనుగు వాజ్మయ స్థితి మనకింతకంటె యెక్కువగా తెలియదు. ఇక నన్నయ కాలం నుండి నేటివరకు ఆంధ్ర వాజ్మయ చరిత్ర ఘట్టములను సంగ్రహముగా తెలుపుదుము. ఈ చరిత్రను ఏడు భాగాలుగా విభజింపవచ్చును.
. ఆది యుగము (పూర్వ చాళుక్య యుగము) . కాకతీయ యుగము
. రెడ్డి యుగము
. విజయనగర యుగము
తంజావూరి యుగము
. సంధియుగము
7. ఆధునిక యుగము
ఈ యుగములను గురించి వివరించుటకు పూర్వమొక విషయమును స్మరింపవలెను. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వములో ఆధర్వణాచార్యులను గూర్చి వ్రాయుచు ఇట్లు వ్రాసినారు.
“ఆధర్వణ కారికలలో పంచమ కాండమందిట్లున్నది. ఆధర్వణ శిభోపనిషది త్రిమూర్తీనాం సంస్కృతాంధ్ర (ప్రాకృతాః ప్రియంకరాః”
అందు యొక చోట ఇట్లు వ్రాసినారు.
“ప్రాకృృతే షడ్విధేచాపి వాల్మీకిం వా మహేశ్వరం ద్యాయేత్ ఆత్రతు మామేవస్మరేత్ పండిత సమ్మతః” - ఆధర్వణ కారికలలో పంచమ కాండము, 8వ కాండము, 4వ కాండము అని యుదాహరించినారు. (కాని వావిళ్ళ ముద్రిత ప్రతిలో ఈ విభాగము
pe
రాలా లస
44 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
లేదు. మరియు ఉదాహరింపబడిన విషయాలున్ను కానరావు) ఇంకను అందిట్లు వ్రాసినారు. ప్రాచీనాంధ్ర వేత్తలుగా నీక్రిందివారు (ఆధర్వణ కారికలలో) పేర్మొనబడినారు. బృహస్పతి, కణ్వుడు, హేమచంద్రుడు, పుష్పదంతుడు, రావణుడు, గౌతముడు, ధర్మరాజు... ఈ గ్రంథమందు పూర్వాంధ్ర వ్యాకర్తలుగా హరి, శ్రీకవి, విష్ణుశర్మ, ధూర్వహుడు, శృంగార భూషణుడు అనువారు కూడ పేర్కొనబడినారు. ఈ ప్రాచీనాంధ్ర వైయ్యాకరణులను గురించి మనకేమి తెలియదు. “సర్వస్వము” వారు ఏ ఆధర్వణ కారికల నుండి పై వాటి నుదహరించిరో తెలియదు. ఇప్పటి ముద్రిత పత్రికలో అవేవియు కానరావు.
నన్నయ భట్టు ఆంధ్ర శబ్ద చింతామణిని వ్రాసెనందురు. కాని దానిని ఎలకూచి బాల సరస్వతియో మరెవ్వరో (బ్రాసినారని కొందరి తలంపు. నన్నయ ప్రయోగాలు కొన్ని ఆంధ్ర శబ్ద చింతామణికి విరుద్ధమగుట దానికి తార్మాణమందురు. సకల భాషా వాగనుశాసనుడు అను బిరుదము పొందిన వాడగుటచేత నన్నయ యేదో వ్యాకరణము రచించి యుండును. ఇక పైన పేర్మొనిన ఆంధ్ర సారస్వత చరిత్రలోని యేడు యుగములను వివరించుట అవసరము.
“మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్ కుండలీంద్రుండు, త
న్మహనీయ స్థితి మూలమై నిలువ, శ్రీనాథుండు ప్రోవన్, మహా
మహులై సోముడు, భాస్మరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమునం దత్రాగల్భ్య మూహించెదన్”
ఈ పద్యమును రామరాజ భూషణుడు తన వసుచరిత్రలో వ్రాసెను. అనగా వారే తనకన్న ముందుండిన మహా కవులని అతని అభిప్రాయము. ఆంధ్ర సారస్వతమునకు మూలస్తంభములనియు అతని భావము. తనకన్న పూర్వులైన ఇతర కవులనతడు మెచ్చుకొనలేదన్నమాట.
1. ఆదియుగము
నన్నయభట్టు మొదలుకొని తిక్కన సోమయాజి కాలము వలకు స్థ్టూలముగా ఈ యుగమును విభజింపవచ్చును. నన్నయ రాజరాజనరేంద్ర చాళుక్యరాజు యొక్క ఆస్థానకవి. క్రీ.శ. 1050 ప్రాంతమువాడు. అతడు మహాభారతములో ఆదిపర్వము,
అంధ్ర వాజ్మయ చరిత్ర 45
సభాపర్వము, అరణ్యపర్వములో ముప్పాతిక భాగము రచించి పోయెను. తర్వాత నెల్లూరిలో మనుమసిద్ధి రాజ్యము చేసిన కాలములో క్రీ.శ. 1250 ప్రాంతములో తిక్కన సోమయాజి విరాటపర్వము మొదలుకొని భారతము తుదివరకు తెనిగించెను. తర్వాత రెడ్డ యాస్థానమందుండిన ఎజ్టాప్రగడ కవి భారతములోని అరణ్య పర్వ శేషమును పూరించెను. ఈ ముగ్గురు మహాభారత కవులను కవిత్రయము వారందురు. వారు వాడిన పదాలు, చేసిన ప్రయోగాలు అన్నియు అందరికిని ప్రమాణమైనవి. మహాభారతము మన తెనుగులో, ఆది గ్రంథమైనను, నేటికిని ఉత్తమోత్తమమని అందరిచే గౌరవింపబడుచున్నది.
నన్నయ తర్వాత ఇంచుమించు నూరేండ్లకు నన్నెచోడుడు అను రాజు కుమార సంభవము అను చక్కని తెనుగు కావ్యమును రచించెను. 2. కాకతీయ యుగము
ఓరుగంటిని రాజధానిగా జేసుకొని తెనుగు దేశమును కాకతీయులు క్రీ.శ. 1140 నుండి 1340 వరకు రాజ్యము చేసిరి. ఈ కాలములోమొదటి ప్రతాపరుద్రుడు, మహాదేవరాజు, గణపతిదేవుడు, అతని కూతురు రుద్రమ్మ, ఆమె మనుమడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ వంశపు రాజులు. ఢిల్లీ సుల్తానగు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలములో ఓరుగంటి రాజ్యము పడిపోయెను. కాని 1320 నుండి 1440 వరకు నామకార్థముగా కొంత కాలము హిందువుల పరిపాలన ముండెను.
కాకతీయుల కాలములో అనగా 1140 నుండి 1340 మధ్యకాలములో ఉత్తమ సారస్వతము బయలుదేరెను. ఈ కాలములోనే పాల్మురికి సోమనాథుడు (క్రీశ. 1250-1300 ప్రాంతమువాడు) బసవపురాణము, పండితారాధ్య చరిత్ర అను ద్విపద శైవ వాజ్మయమును రచించెను. ఇతడు జనగామ తాలూకాలోని పాలకుర్తివాడు. కాకతీయుల సామంతుడును, రాయచూరు ప్రభువును అయిన గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణమును తన తండ్రి విఠల (రంగనాథుని) పేర ద్విపదగా రచించెను. గోనబుద్ధారెడ్డి “కవి లోక భోజుండు”. మల్లికార్జున పండితా రాధ్యుడు “శివతత్వసారము” అను మంచి శైవ గ్రంథమును రచించెను. ఈ కాలమందే నెల్లూరిలో మనుమసిద్ధి రాజు నొద్ద తిక్కన సోమయాజియుండెను. ఇతని కన్న మించిన
46 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
కవి నేటివరకు పుట్టలేదు. ఇతడు నిర్వచనోత్తర రామాయణమును, మహాభారతములోని పదియేను పర్వములను రచించెను. ఇతని గొప్పతనమేమన ఇతనికే అభినవదండి అను బిరుదుగల కేతన తస దశకుమార చరిత్రమును అంకితమిచ్చి యిట్లు చెప్పుకొనెను- “కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ బరగ దశకుమార చరితంబు జెప్పిన ప్రోడ నన్ను వేరె పొగడనేల?” దశకుమార చరిత్ర కథలు చాలా మనోహరములైనవి. తిక్కన సోమయాజి శిష్యుడగు మారన మార్మండేయ పురాణమును రచించెను. తిక్మన శిష్యునిది కావున అది ఉత్తమమైనది. తిక్కన సోమయాజి ఉభయకవి మిత్రుడు. సకల విద్యాకళా విచక్షణుడు, కవిబ్రహ్మ, బుధజనవిరాజి. కావ్య ప్రౌఢి పాటించు శిల్ప్చమున పారగుడు. తను కావించిన సృష్టి తక్కొరులు చేయలేదు. సాటిలేని వాడనిపించుకొన్న ఆంధ్ర కవి కుల గురువు. క్రీ.శ. 1800 ప్రాంతముననున్న మంచన అను కవి కేయూర బాహు చరిత్రమును రచించెను. పుస్తకము చాలా చిన్నదే కాని కవిత చాలా గొప్పది. కాకతీయ యుగములోనే శతకములారంభమయ్యెను. అందు ముఖ్యమైనవి (బద్దెన) భద్ర భూపాలుడను నతనిచే రచితమని చెప్పబడు సుమతిశతకము, నీతి శాస్త్ర ముక్తావళి, పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకము, యథావాక్కుల అన్నమయ్య “సర్వేశ్వర శతకము”. 3. రెడ్డియుగము అద్దంకి, కొండవీడు, కోరుకొండ, రాజమహేంద్రవరములను రాజధానులనుగా జేసుకొని రెడ్డిరాజులు తెనుగు సీమను క్రీ.శ. 1300 నుండి 1450 వరకు రాజ్యము చేసిరి. ఒక దిక్కున సామ్రాజ్య విచ్చిత్తి కాగా ఇంకొక దిక్కున రెడ్డి రాజులు ఆంధ్రులను రక్షించి పాలించినవారైరి. రెడ్డి రాజుల నాశ్రయించిన కవులలో ప్రఖ్యాతులైనవారు ఎజ్టాప్రగడ, శ్రీనాథుడు, వామనభట్ట బాణుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 47
రెడ్డిరాజులు స్వయముగా సంస్కృత గ్రంథాలు, వ్యాఖ్యలు రచించిరి. కుమారగిరి వసంత రాజీయమను నాట్యశాస్త్రమును సంస్కృతమున రచించెను. పెదకోమటి వేమభూపాలునికి సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదముండెను. ఈరాజుల రసికతవలన దేశమందు కవులు బహుళమై శ్రీనాథుని హాస్యమునకు పాత్రులైరి. శ్రీనాథుడు కొండవీటి వీధిలో తిరుగు గాడిద నుద్దేశించి యిట్లు పద్యమల్లెను -
“బూడిద బుంగలై యొడలు పొడిమి దిక్క మొగంబు వెల్లనై వాడల వాడలం దిరిగి వాడును వీడును చొచ్చాచోయనన్ గోడల గొందు లందొదిగి కూయుచు నుందువు కొండవీటిలో గాడిద! నీవునుం గవివి కావుగదా యనుమాన మయ్యెడిన్”.
ఈ కాలములోని ఎజ్జాప్రగడ భారతములోని అరణ్య పర్వశేషమును ముగించిన కవిత్రయములోనివాడు. అతడు నృసింహ పురాణమును, హరివంశమును రచించెను. ఆ రచనతో ప్రబంధ పరమేశ్వరుడను బిరుదమును పొందెను.
రెడ్ల ఆస్థాన కవియు, ఆస్థాన విద్యాధికారియునైన శ్రీనాథుడు ఆనాటి వెలమ రాజులను, విజయనగర చక్రవర్తులను, ఇతర రాజులను దర్శించి వారిచే పూజితుడై దిగ్విజయమొంది తన గొప్పదనమును చూపెను. విజయనగరములో డిండిమభట్టు అను ఉద్దండుని జయించి 'నన్ను జయించేవారు లేరు” అని కంచు ధక్కను మోగించు కానుచుండిన ఆ డిండిమభట్టు ఢక్మను పగులగొట్టించి విజయనగర చక్రవర్తిచే ముత్యాల శాలలో బంగారు దీనారాలతో స్నాతుడై కవి సార్వభౌమ బిరుదమందెను. అట్టి శ్రీనాథుడు శృంగార నైషదమును, కాశీఖండమును, భీమ ఖండమును రచించెను. ఇంకా ఇతర కావ్యాలు వ్రాసెను. పల్నాటి వీరుల కథలను ద్విపదగా ఇతడే వ్రాసెనని యందురు. ఎవరు వ్రాసినను అది చక్కని వీరకావ్యము. శ్రీనాథుడు భోగి, బమ్మెర పోతన యోగి.
శ్రీనాథునికి సమకాలికుడగు వల్లభరాయలు అను చిన్న రాజుండెను. అతడు క్రీడాభిరామమను శృంగార ప్రధానమగు వీధి నాటకమును రచించెను. కాని అది శ్రీనాథుడే వ్రాసినట్లు శైలి తెలుపుచున్నది. ఇద్దరునూ కలిసి 'బ్రాసిరో యేమో కాని కాకతీయుల నాటి సాంఘిక చరిత్రకు క్రీడాభిరామమే ముఖ్యాధారమగు చక్కని గ్రంథము.
48 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వెన్నెలకంటి సూరన విష్ణు పురాణమును రచించెను. ఇది భారత భాగవతములవలె ఆంధ్రులలో ప్రచారమైనట్టిది కాదు. అయినను ఇతనిది చక్కని కవిత.
ఈ వంశమువాడే వెన్నెలకంటి అన్నయ్య అను కవియుండెను. అతడే కాలమువాడో తెలియదు కాని ప్రచురణకర్తలు అతడు క్రీ.శ. 18వ శతాబ్ద్యనంతరము వాడన్నారు. బహుశః ఈ రెడ్డియుగములోనివాడేనేమో! ఈ అన్నయ్య కవి “షోడశకుమార చరిత్రము”ను రచించెను. ఇది చక్కని కవిత. అచ్చు పోసినట్లు ఒకే ధోరణిలో విసుగెత్తించు కవిత్వమును, కథలను వ్రాసిన ప్రబంధ కవుల రచనలను చదివిన వారి కిట్టి కథలు చాలా ఆనందమునిచ్చును. ఈతని షోడశకుమార చరిత్ర కథలు మనోహరమైనవి. ఇట్టి కథలను వ్రాసిన వారిలో పేర్కొనదగినవారు వీరు.
జక్కన - విక్రమార్క చరిత్ర
అనంతామాత్యుడు - భోజరాజీయము
కదిరీపతి - శుకసప్తతి
కొరవి గోపరాజు - సింహాసన ద్వాత్రింశిక
కేతన - దశకుమార చరిత్ర
మంచన - కేయూర బాహుచరిత్ర
వెంకటనాథుడు - పంచతంత్రము
పింగళి సూరన - కళాపూర్ణోదయము
ఇవన్నియు ఉత్తమ కవితలు.
ఇంచుమించు క్రీ.శ. 1380 ప్రాంతంలో నుండినవాడు రావిపాటి త్రిపురాంత కుడు. సంస్కృతములో (ప్రేమాభిరామము రచించెను. అది మాయమై పోయినది. త్రిపురాంతక కవిని (తిప్పన్నను) గూర్చి క్రీడాభిరామములో ఇట్లన్నారు.
“నన్నయభట్టు తిక్కకవి నాయకులన్న హుళక్కిభాస్మరుం
డన్నను చిమ్మపూడి యమరాధిపుడన్నను సత్మవీశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు నింతురు జేయని రావిపాటి తి
ప్పన్నయ నంతవాడ తగునా యిటు దోసపు మాటలాడగన్?”
ఇతని తెనుగు కృతి త్రిపురాంతకోదాహరణము. ఇది ఒక్కటే మనకు లభించినది. అది ఉత్తమశైలి కలిగినట్టిది.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 49
రెడ్డిరాజుల సమకాలికులు రాచకొండ దేవరకొండలకు ప్రభువులైన వెలమరాజులు. అందు సర్వజ్ఞ బిరుదు వహించిన సింగమనాయకుడు సంస్కృతములో రచనలు చేసెను. అతని కాలమందే, అతని సీమ యందే కోలాచల మల్లినాథ సూరి యుండెను. జనగామ తాలూకాలో బమ్మెర అను గ్రామము కలదు. అది పాల్మురికి సోమనాథుని పాలకుర్తికి రెండు మూడు మైళ్ళ దూరముననున్నది. ఆ గ్రామము పోతనామాత్యుని జన్మదేశమై పవిత్రమైనది. పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవత మును రచించిన మహాకవి. అతని భాగవతము అనేకులు పారాయణము చేయుదురు. అతనికి శిష్యులైన ఏర్పూరి సింగయ్య, వెలిగందల నారయ్య, గంగయ్య అనువారు భాగవతములో కొన్ని భాగములను రచించిరి.
సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును తన కంకిత మీయనందున దానిని పాతి పెట్టించగా ఖిలమైన భాగాలను పోతన శిష్యులచే పూరించిరను అపవాదము కల్పితమయ్యెను. అది అబద్ధము. ఆ ముగ్గురు శిష్యులలో ఒకరు కూడ సూచన మాత్రముగానైనను ఆ మాట వ్రాయలేదు. అట్లయితే వారెందుకు కొన్ని భాగాలను 'బ్రాసిరనగా పోతన తన శిష్యులను అనుగ్రహించుటకై వారిచే కొన్ని భాగాలను వ్రాయించి తనతోపాటే వారిని గూడ వందనీయులనుగాజేయ సంకల్పించి యుండేనేమో. ఆ ముగ్గురు శిష్యుల కవనము కూడా పోతన కవితకు కుడియెడమగా ప్రశంసా పాత్రముగా నున్నది.
పోతన భగవద్భక్తుడు. అతడు భక్తిరసాన్ని అద్వితీయముగా అసామాన్యముగా భాగవతమందు చిప్పిల్లజేసెను. భక్తిరస ఘట్టములందు అతడు కవిత్రయాన్నే కాక ఆంధ్ర కవులందరిని కూడా మించినవాడయ్యెను. ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానము, గజేంద్రమోక్షము, ధృవచరిత్ర, అంబరీషోపాఖ్యానము ఉత్తమమైన భక్తిరస ప్రధాన ఘట్టములు. అందు ప్రహ్లోద చరిత్ర అగ్రస్థానమలంకరించును.
“మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు”
అను పద్యము వంటి పద్యాలు అందు నిండుగా గలవు. క్రీ.శ. 1420 ప్రాంతంలో రాచకొండ రాజుల యాశ్రములో నుండిన కొరవి గోపరాజు అతని సింహాసన ద్వాత్రింశిక మనోహరమగు విక్రమార్క కథల కావ్యము.
50 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
4 విజయనగర యుగము
క్రీ.శ. 1323లో మహ్మదీయులు ఓరుగంటిని పట్టుకొనిరి. ఆ సమయములో ఓరుగంటి నుండి సంగమ అనునతని అయిదుగురు కుమారులు హంపికిని, దాని దగ్గర నుండు కంపిలికిని వెళ్ళి అచ్చట విజయనగర దుర్గమును తుంగభద్రా తీరమందు నిర్మించి, కీ.శ. 1886లో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిరి. ఆ సోదరులలో హక్క (మొదటి హరిహరరాయలు) బుక్క(రాయలు) ముఖ్యులు. క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యము స్థాపితమయ్యెను. అది కొంతకాలానికి అయిదు చీలికలై పంచ సుల్తానులకు మూలమయ్యెను. హరిహరరాయ కాలము బహమనీ సుల్తానులతో పోరాడుటతో సరిపోయెను. అతని కొడుకు రెండవ హరిహరరాయలు క్రీ.శ. 1379 నుండి 1404 వరకు రాజ్యము చేసెను. తర్వాత మొదటి దేవరాయలు రాజయ్యెను. అతని కాలములో బహమనీ దాడి ఎక్కువై బాధ కలిగించెను. రెండవ దేవరాయలు 1421-1448 వరకు రాజ్యము చేసెను. అతడును దుర్భలుడగురాజు. తుదకు క్రీ.శ. 1486లో సాళువ నరసింహరాయలను చంద్రగిరి సామంతరాజు విజయ నగరాన్ని ఆక్రమించుకొని రాజ్యము చేసెను. అతడు ప్రబలుడై రాజ్యమును విస్తరించి, తురక ప్రభువులనోడించి రాజ్యమును స్థిరపరచెను. అతని కొడుకు ఇమ్మడి నరసింగ రాయలు. అతనిని క్రీ.శ. 1505లో అతని సేనాని తుళు వంశమువాడగు నరస నాయకుడు చంపి రాజ్యము నాక్రమించుకొనెను. అతని కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 నుండి 1529 వరకు దేదీప్యమానంగా, దిగ్విజయమానంగా రాజ్యం చేసెను. విజయనగర రాజ్యము గోదావరి నుండి రామేశ్వరము వరకు వ్యాపించి, మహాసామ్రజ్యమై సుల్తానుల బలమును భంగపఅచిన దయ్యెను. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అతని తమ్ముడు అచ్యుతరాయలు చక్రవర్తి యయ్యెను. అతడు దుర్భలుడు, అతని తమ్ముని కొడుకగు సదాశివరాయలు క్రీ.శ. 1542లో చక్రవర్తియయ్యెను. అతడు నామకార్థముగా రాజుగా నుండెను. కాని శ్రీకృష్ణదేవరాయలు అల్లుడగు అళియ రామరాజు నిజమైన చక్రవర్తిగా పరిపాలించెను. క్రీ.శ. 1565లో అయిదుగురు దక్కన్ సుల్తానులు కలిసి తళ్ళికోట యొద్ద రామరాజుతో యుద్ధము చేసి అతనిని చంపి విజయనగరమును ధ్వంసము చేసిరి. కాని విజయనగర బలము నాశనము కాలేదు.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 51
రామరాజు తమ్ముడు తిరుమలరాజు పెనుగొండను రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించెను. అతని తర్వాత శ్రీరంగరాయలు చంద్రగిరిని రాజధానిగా చేసుకొని ఇంచుమించు 1650 వరకు రాజ్యము చేసెను. అటు తర్వాత విజయనగర సామ్రాజ్యము సంపూర్ణముగా నశించెను. ఇక 1350 నుండి 1650 వరకు వాజ్మయ స్థితి ఎట్టిదో కనుగొందము. ఈ 3800 ఏండ్ల కాలమును ప్రబంధ యుగమని చెప్పవచ్చును. ఈ కాలంలో అష్టాదశ వర్ణనలతో సంస్కృతపద భూయిష్టశెలితో శబ్దాలంకార బాహుళ్యముతో గొప్ప గొప్ప ప్రబంధాలు రచింపబడెను. మొదట బుక్కరాయల కాలంలో నాచసోమనాథుడను మహాకవి యుండెను. అతనికి గుత్తి దుర్గము క్రింద నుండు పెంచికలదిన్నెను అగ్రహారముగా బుక్కరాయలు దానము చేసినందున అతడాగ్రామము వాడనుట స్పష్టము. ఆ దాన శాసనములో కవి నిట్లు వర్ణించినాడు. “యాజుషాణాం వరేణ్యాయ సకలాగమ వేదినే అష్టాదశ పురాణానా మభిజ్ఞాతార్థ వేదినే అష్ట భాషా కవిత్వశ్రీ వాణీ విజిత సంపదే సోమాయ నాచనాం భోధేః సోమాయామిత తేజసే” దీనిని బట్టి అతని పాండిత్య కవిత్వ మహత్వము సువ్యక్తమగుచున్నది. తిక్మనవలె అతడు అసాధారణ కవి. అతడు ఉత్తర హరివంశమును రచించెను. అతడు క్రీ.శ. 1340 ప్రాంతమువాడు. అతడు “సకల భాషా భూషణుడు”, “సాహిత్య రస పోషణ సంవిధాన చక్రవర్తి”. “అలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుడు”, అష్ట భాషా కవిత్వ విశారదుడు”, “నవీన గుణ సనాథుడు”. సీస పద్యము ఇతని చేతిలో పరిణతి నందెను. కల్హార మకరంద కలిత మందాకినీ లహరీపరీత కోలాహలంబు బాలేందు చంద్రికా పరభాగశోభా ప రాగ సంభావితా రగ్వధంబు 'సేవాసమాసన్న సిద్ధ సీమంతినీ తాలవృంతోత్తాల తాండవంబు
52 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
కాత్యాయనీ దత్త కర్ణావతంస క
ర్పూర ఖండామోద పూరితంబు మారుతంబది నామీద మలసియాడ గలుగునొకొ నాకు నొకనాడు కన్నులార శివుని జూచు పుణ్యంబును చింతనెరయ మొదలి వేలుపు బొడగంటి (మొక్కగంటి.
ఈ నడకను శ్రీనాథుడు నేర్చుకొని తన సీసపద్యాలను తీర్చిదిద్ది యలంకరించు కొనెను. నాచన సోమనాథుడు సామెతలను ఎక్కువగా వాడిన మొదటి తెనుగు కవి. ఉత్తమ హాస్యమునకుంగూడ నితడే మొదటివాడు.
మొదటి దేవరాయల మంత్రిగా నుండిన సిద్ధనకు జక్కన కవి తన విక్రమార్క చరిత్రను అంకితమిచ్చెను. జక్కన క్రీశ. 1430-1447 ప్రాంతమందుండెను. తన కవిత్వమును గూర్చి యిట్లు వ్రాసుకొనెను.
“చక్కన నీవైదుష్యము
చక్కన నీకావ్యరచన చాతుర్యంబుల్ చక్కన నీవాగ్ర్వైఖరి
చక్కన నీ వంశమమహిమ జక్కన సుకవీ!”
ఇతడు చక్కని కథలు వ్రాసెను. సంస్కృతాంధ్రములందు అనర్గళధార గలవాడు.
కల్పాంత దుర్జాంత కలుషాంతక స్వాంత దుర్వార వికి నోర్వవచ్చు నిష్ణుర నిర్జోష నిర్మాత సంఘాత జాత మహివష్ని సైపవచ్చు ప్రళయ కాలాభీల ఫాలలోచన ఫాల భాగానలస్ఫూర్తి (బ్రతుకవచ్చు కాకోదరేంద్ర పూత్మార సంభవ తీవ్ర కాకోల దహనంబు గదియవచ్చు
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 53
కాక సైరింపవచ్చునే లోకదహన దర్చితంబైన యస్మత్సతాప వహ్ని తావకోత్సాహ సాహసౌదార్య ధైర్య గతికి మెచ్చితి విక్రమార్క క్షితీంద్ర!”
అని సంస్కృత పద జటిలముగా వ్రాసెను.
“పలుకులు వేయు నేటికిక, బ్రాహ్మణసూనుడ వీవు, నీకు దో రృలమున కేమి కారణము, బాపనపోటును, కప్పకాటునుం గలదె ధరిత్రి? భట్టిమొన గట్టిగ నమ్మకు, మోసపోకు, నీ కొలదులె రాచకార్యములు, కోమటి బుద్ధుల దీర్చదీరునే?” అని లలితముగా గూడ రచించెను.
పిల్లలమళ్టి పినవీరన సూర్యాపేట యొద్దనుండు పిల్లలమళ్టివాడు యందురు. అతడు జైమినీ భారతము వ్రాసి సాళువ నరసింహరాయల కంకితమిచ్చెను. అతని శృంగార శాకుంతలము, జైమినీ భారతము ప్రసిద్ధ కావ్యములు. “వాణి నా రాణియని యెద విరుచుకొని పలికినదీ పినవీరనయేనట! ఈ వీరభద్రుడు “విపులచాటూక్తి నిర్ణిద్రుడు”. తుళు వంశపు నరసింహరాయలకు నంది మల్లయ్య, ఘంట సింగయ్య అను జంటకవులు తమ వరాహపురాణము నంకితమిచ్చిరి.
శ్రీకృష్ణదేవరాయల కాలము ఆంధ్ర సారస్వతమునకు మహావైభవకాలము. అతని యాస్థానములో అష్టదిగ్గజములు అను ఎనిమిది మంది కవులుండిరని ప్రతీతి. కాని యందు పేర్మొనబడిన కవులలో కొందరు అతని ఆస్థానమువారు కారు.
శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా మహాకవి. అతడు ఆముక్తమాల్యదను వ్రాసెను. దానినతడు వ్రాయలేదనీ, మను చరిత్ర వ్రాసిన అల్లసాని పెద్దన వ్రాసెననీ అందురు. కాని ఈ రెండు పుస్తకముల శైలిని చూచిన రెంటికిని ఏమిన్నీ పోలిక లేదు. ఆముక్తమాల్యద శైలి చాలా బిరుసు. మను చరిత్ర శైలి తీర్చి దిద్ది మృదువుగా, ఇంపుగా నుండునట్లు వ్రాసినది. ఆముక్త మాల్యద సానబట్టని గనిలోని రత్నము - మను చరిత్ర మెజుగిచ్చి వంకలు దిద్దిన వజ్రము.
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“గృహసమ్మార్దనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబో, వ్యజనాతపత్ర ధృతియో, బ్రాగ్టీపికారోపమో నృహరీ! వాదములేల? లేరెయితరుల్ నీ లీలకుం బాత్రముల్” - ఆముక్త మాల్యద
“బహురత్నద్యుతి మేదురోదర దరీభాగంబులం బొల్బుని మ్మిహికాహార్యమునం జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ (గ్రహణేందిందిర తుందిలంబులవి మత్మాంతార సంతాపముల్”
- మనుచరిత్ర ఏ పద్యము చూచినను రెంటిలో ఇట్టి శైలి భేదముండును - కాన శ్రీకృష్ణరాయలే
స్
ఆముక్త మాల్యదను రచించెనని విశ్వసింపవలెను. బ్రాహ్మణేతరుల కవిత్వమెంత మంచిదైనను అది కాకజుష్టంబైన హవ్యంబువోలె గ్రాహ్యంబు కాదు” అని తిట్టిన అప్పకవి తన అప్పకవీయములో ఆముక్తమాల్యదను ఉదాహరించిపుడంతయు అది పెద్దన్నగారిది అని వ్రాసెను. అక్కడనుండి ఈ కథకు వేళ్ళు వచ్చెను. ఆముక్త మాల్యదను విష్ణు చిత్తీయమనియు నందురు. శైలి బాగుగా లేకున్నను అందలి భావములు వర్ణనలు అనితర కావ్య లభ్యములు.
కృష్ణదేవరాయలకు ముఖ్యుడైన ఆస్థాన కవి అల్లసాని పెద్దన. అతనికి “ఆంధ్ర
కవితాపితామహ” అను బిరుదమిచ్చి అతని కాలికి ఆ చక్రవర్తి స్వయముగా గండపెండేరమును తొడిగించెను. శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన తర్వాత అల్లసాని పెద్దన అతనిని తలచుకొని వాపోయిన పద్యమును చదువు ఆంధ్రులు కూడ ఆనాటి వైభవమును తలచుకొని దుఃఖింపక మానరు. పెద్దన రాయల గూర్చి ఇట్లు విలపించెను.
“ఎదురైనచో దన మద కరీంద్రము డిగ్గి కేలూత యొసగి యెక్కించు కొనియె
మను చరిత్రంబందు కొనువేళ పురమేగ పల్లకి తనకేల బట్టి యెత్తి
ఆంధ్ర
పెద్దన, దె
వాజ్మయ చరిత్ర 55
బిరుదైన కవి గండపెండేరమున కీవె తగుదని తానె పాదమున దొడిగె
గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడగిన సీమలయందు నిచ్చె
ఆంధ్ర కవితా పితామహ యల్లసాని
పెద్దన కవీంద్రయని నన్ను బిలుచునట్టి
కృష్ణ రాయలతో దివి కేగలేక
బ్రతికి యున్నాడ జీవచ్చవంబ నగుచు.”
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన మందలి అష్ట దిగ్గజము లెవరనగా! 1. అల్లసాని 2. నంది తిమ్మన (ముక్కు తిమ్మన), 3. అయ్యలరాజు రామభద్ర కవి
4. ధూర్జటి, 5. మల్లన (ఫ్రౌడకవి), 6. పింగళి సూరన, 7. రామరాజ భూషణుడు, 8. తెనాలి రామకృష్ణుడు. తుది ముగ్గురు కృష్ణరాయల కాలములో గ్రంథాలేవి రచింపలేదు. నంది తిమ్మనకు ముక్కు పెద్దదిగా నుండెనేమో ముక్కు తిమ్మన అనియే
అతడు
ప్రసిద్ధి నొందెను.
“ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు”
అని నానుడి యేర్పడెను. అతడు పారిజాతాపహరణము రచించెను. అది కావ్యాలలో చేరినట్టిది.
“జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్ దొలగంద్రెసె లతాంగి యట్లయగు నాథుల్ నేరముల్ సేయ పే
రలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే?”
ఇట్టి సుందర పద్యములను నంది తిమ్మన వ్రాసెను.
కృష్ణరాయల కాలములో యెల్లనార్యుడు - నాదెండ్ల గోప ప్రధాని కూడా
రచనలు చేసిరి. అవి అంత గొప్పవి కావు.
ఉత్తమ
ధూర్జటి కవి కాళహస్తి మాహాత్యము అను కావ్యమును రచించెను. అది ప్రబంధాలలో చేరినట్టిది. మల్లన రాజశేఖర చరిత్రము కూడ అదే శ్రేణిలో
చేరినది.
56 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఆళియ రామరాజు ఆస్థానకవి యగుటచే రామరాజ భూషణుడు అను ఖ్యాతి గాంచిన భట్టుమూర్తి కవి వసుచరిత్రను వ్రాసెను. అందు శ్లేషలు. యమకములు, ఉహ్సేక్షలు విశేషముగా గలవు. అతడు వ్రాసిన పద్ధతిపై ఇతరులు వ్రాయబోయి వెల్లకిలబడిరి. అతనిని పూర్తిగా ప్రతి పద్యములో అనుకరించిన వాడు కొల్లాపుర మాధవరాయలు. అతడు చంద్రికా పరిణయము రచించెను.
రామరాజు కాలములో పింగళి సూరన కళాపూర్ణోదయమును రచించెను. అది అద్భుత కల్పనా కథ. అది తెనుగు సారస్వతములో అపూర్వమగు గ్రంథము. ఇతని ప్రభావతీ ప్రద్యుమ్నము కూడా చక్కని గ్రంథము. ఇతడు మొదటి ద్వ్యర్థి కావ్యమగు రాఘవ పాండవీయము రచించెను.
ఇదే కాలములో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్యమును రచించెను. అందు మారుమూల పదాలు బహుళము. కొన్ని వర్ణనలు చక్కగా ఆకర్షకములుగా నున్నవి.
విజయనగర సామ్రాజ్య కాలములో ఈ క్రింది వారుకూడా రచనలు చేసిరి. మనుమంచి భట్టు, దుగ్గన, తాళ్ళపాక చిన్నన్న సంకుసాల నృసింహకవి (కవి కర్ణ రసాయన కర్త) రామభద్రకవి, ఎజ్జన (శృంగార మల్దణ చరిత్రకర్త) రామరాజరంగన్న కుమార దూర్జటి (కృష్ణరాయ విజయము), తిరువెంగళ నాథుడు, మున్నగు పలువురు తమశక్తికొలది పద్యకావ్యములు రచించిరి. కాని ఉత్తమ ్రేణిలోనివికావు.
విజయనగరపు తుదిరాజగు శ్రీరంగరాయలు చంద్రగిరిలో రాజ్యము చేసిన కాలముననో ఇంచుక తర్వాతి కాలముననో క్రీ.శ. 1600-1650 ప్రాంతములో వుండినవాడు కదిరీపతి. ఇతడు అనంతపుర మండలములోని కదిరి నివాసి. ఇతడు శుకసప్తతి యను కథల పుస్తకమును రచించెను. ఈ శుకసప్తతి తెనుగు సారస్వతములో తృతీయ పంథ త్రొక్కినదనవచ్చును. ఇందు హాస్యము, తెనుగు నుడికారము, లలితమగు శైలి, లోకానుభవము, చక్కని శృంగార రసము అన్నియు నిండి ప్రతి పద్యము మనోహరముగా నుండును. ఇతని వర్ణనలు ఇతర ప్రబంధ కవులవలె అంధాను కరణములు కావు. విరహ తాపం కలిగితే కవులందరు చంద్రుని, గాలిని, చిలుకలను, వసంతుని తిట్టిరి. ఈ కవి కథలోని ఒక (బ్రాహ్మణుడు విరహతాపము పొంది
యిట్లవస్థపడినాడు.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 51
“ఒడిలోన పంచాంగ ముంచు కొన్నదిగాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు పనిలేనిపని వీధి జనుచు గ్రమ్మరు నాత్మ గృహమంచు నెంచి యిల్లిల్లు దూరు అపుడు భుక్తి యొనర్చి యవునసే సంకటి తింటినాయని యింటి తెజవ నడుగు కుచ దోవతి కట్టుకొని యెవ్వరోయిట్లు గట్టిపోయిరటంచు గలవరించు
గడియలో తెల్లవాఖె, భాస్కరుడు గ్రుంకె
జాగులేలంచు సందెపై సందెవార్చు
కంతుమాయల నుమ్మెత్తకాయం దిన్న
పొలుపు సారెకు దెల్పునప్పుడమి వేల్పు”.
వర్ణనయైనను సరే సహజాలంకారములతో స్వభావోక్తులతో చక్కని తెనుగుతో నిండియుండును.
గోలకొండ కవులు
విజయనగర రాజుల కాలములో గోలకొండ కుతుబ్బాల కాలములో అందు ముఖ్యముగా ఇబ్రహీం కుతుబ్నా కాలములో పలువురు తెనుగు కవులుండిరి. అందు ముఖ్యులు మొదటి అచ్చ తెనుగు కావ్యమగు యయాతి చరిత్రమును వ్రాసిన పొన్నగంటి తెలగనార్యుడు, మాలిక్ ఇబ్రాహీం కుతుబ్నా (మల్మిభరాముని) ఆస్థాన కవియెన అద్దంకి గంగాధర కవియునై యుండిరి. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానమును రచించెను. గోలకొండ ఖిల్లాలో కరణముగా నుండిన సారంగుతమ్మయ వైజయంతీ విలాసమను మంచి కావ్యమును రచించెను. ప్రౌఢ కవి మల్లారెడ్డియును ఈ కాలమువాడే. అతడు దోమకొండ ప్రభువులకు పూర్వ పురుషుడు. అతడు షట్చక్రవర్తి చరిత్ర మున్నగు పెక్కు గ్రంథాలను రచించెను. నిరంకుశోపాఖ్యానమును వ్రాసిన కందుకూరి రుద్రయ్య ఈ కాలము వాడే. ఓరుగల్లును కొంత కాలము పాలించిన షితాబ్‌ఖాన్ (సీతాపతి) కాలములో చరిగొండ ధర్మన్న చిత్ర భారతమును రచించెను.
58 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
క్రీ.శ. 1450 ప్రాంతములో రాయచూరు మండలములో కృష్ణాతీర మందుండిన అనంతామాత్యుడు భోజరాజరాజీయమను ఉత్తమ కావ్యమును రచించెను. ఇందలి శైలి సరళమే కాక విశిష్ట పాండిత్యముతో కూడినట్టి స్వభావ వర్ణన లిందెక్కువ కలవు. ఇతడు గొప్పలాక్షణికుడు. రసాభరణము అను అలంకార శాస్త్రమును రచించెను. క్రీ.శ. 1600 ప్రాంతమువాడు. కొల్లాపురము రాజగు మల్ల భూపాలు నాశ్రయించి బాలసరస్వతి మల్ల భూపాలీయము రచించెను. ఇది భరహరి శతకత్రయానికి తెనుగుసేత.
ఇంచుమించు క్రీ.శ. 1500 ప్రాంతమున సర్వజ్ఞ సింగభూపాలుని పుత్రుడగు మాధవుని వద్ద రాచకొండలో నుండునట్టి గౌరన అను కవి హరిశ్చంద్ర ద్విపదను, నవనాథ చరిత్ర ద్విపదను రచించెను. ఈ రెండును ఉత్తమ రచనలు. అందు హరిశ్చంద్ర ద్విపదయేమిన్న ద్విపద ప్రబంధాలలో నిది పూజ్య స్థానమందినది. గౌరన కుమారుడు భైరవుడు. శ్రీరంగ మాహాత్య్యమను ప్రబంధమును రచించెను. ర్. తంజావూరు యుగము
ఆంధ్ర సామ్రాజ్యము క్రమక్రమముగా దక్షిణాభిముఖమయ్యెను. విజయనగర సామంతులుగా, మండలాధిపతులుగా మధురను, తంజావూరును నాయకరాజులు పాలించుచుండిరి. అందులో మధుర సారస్వత పోషణకు ప్రసిద్ధికెక్క దయ్యెను. తంజావూరు రాజులు మాత్రము ఆంధ్రసారస్వతమును పోషించిన తుదిరాజులు. ఆ రాజులను గూర్చి ముందుకొంత తెలుసుకొనవలెను.
విజయనగర చక్రవర్తియగు అచ్యుతదేవరాయల భార్యకు చెల్లెలి భర్తయగు చిన చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1540 ప్రాంతమందు తంజావూరికి నాయక రాజయ్యెను. అతని కుమారుడు అచ్యుత నాయకుడు క్రీ.శ. 1561 లో రాజయి, ఇంచుమించు 50 ఏండ్లు రాజ్యము చేసెను. అతని తర్వాత తంజావూరు రాజ్యము క్షీణించి తుదకు శివాజీ సోదరుడైన ఏకోజీ వశమై మహారాష్టుల పాలనములోనికి వెళ్లి ఇంగ్లీషువారు ప్రభువులైన తర్వాత వారి వశమై పోయెను.
తంజావూరి రాజులలో రఘునాథరాయల కాలమునను, విజయరాఘవుని కాలమునను ఆంధ్ర సారస్వతము ఇంచుమించు నూరేండ్లకాలము పోషింపబడిన దయ్యెను. ఈ రాజుల కాలములో పలువురు స్ర్తీలు, భోగస్త్రీలు కూడా సంస్కృతాంధ్రము
ఆంధ్ర వాజ్మయ చరిత్ర వ్
లందు రచనలు చేసిరి. రఘునాథ రాజు స్వయముగా మహా పండితుడు; ఉత్తమకవి. సంగీతములో కొత్త రాగములను కనిపెట్టి ప్రచారము చేసినాడు. అప్రతిహత వీరుడు. ఈతడు రచించిన బహు సంస్కృతాంధ్ర గ్రంథములు లభించినవి కావు. వాల్మీకి చరిత్ర మనునదొక్కటి ముద్రితమైనది. అది యుత్తమ శ్రేణిలో చేరిన గ్రంథము.
రఘునాథ నాయకుని ఆస్థానకవి చేమకూర వేంకటపతి, “ఈ చేమకూర చక్కెర మడిలో అమృతము పాటించి పెట్టినది” అని శ్రీ వేదము వేంకటరాయ శాస్రిగారనిరి. ఈ చేమకూర వెంకటపతి సారంగధర చరిత్రము, విజయవిలాసము అను రెండు ప్రబంధములను రచించెను. ఈ రెండును ఆంధ్ర సారస్వతమందు అమూల్యమగు రత్నములు.
విజయ రాఘవుని కాలములో ఉత్తమ కావ్యాలు వెలవడలేదు. కాని పలువురు స్తీ పురుషులు యక్షగానాలను, చరిత్రలను మున్నగు వాటిని రచించిరి. అందు రంగాజమ్మ మన్నారు దాస విలాసము ముఖ్యమైనది. కాళకవి, వేంకటపతి సోమయాజి యనువారును ప్రబంధాలు వ్రాసిరి.
మధుర రాజులు
తంజావూరు రాజులెట్టు విజయనగరానికి యుండిరో అటులే మధుర నాయకులును అదే కాలములో సామంతులై తర్వాత స్వతంత్రులై యించుమించు తంజావూరు పడిపోయినప్పుడే పడిపోయిరి.
వారి కాలములో కొందరు సాధారణ ప్రబంధాలు వ్రాసిరి. అందులో ముఖ్యుడు శేషము వేంకటపతి తారాశశాంకము వేంకటకృష్ణప్ప నాయకుడు అహల్యా సంక్రందనమును వ్రాసెను. అతడే జైమినీ భారతమును వచనముగా వ్రాసెను. మట్ల అనంత భూపాలుడు, విజయరంగ చొక్కనాథుడును ప్రబంధాలు రచించిరి. వీరిలో శేషము వేంకటపతి తారాశశాంకము చక్కని శైలిగలది. 6. సంధి యుగము
విజయనగర పతనానంతరము చిల్లర పాలెగాళ్ళను, ధనికులను ఆశ్రయించి పలువురు కవులు రచనలు చేసిరి. వారినే యుగములోను చేర్చుటకు వీలు లేనందునను వారు మన ఆధునిక యుగానికి పూర్వులయినందునను క్రీ.శ. 1700-1900
60 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వరకుండు కాలమును సంధి యుగమని పేర్కొననైనది. ఈ కాలములో ఉత్తమ రచనలు కానవచ్చుట లేదు. అట్లున్నను సారస్వత చరిత్రలో ఆ కవులను గూడ సూచించుట అవసరము. ఈ కాలములో ముఖ్యులైన కవులను వారి రచనలను సూచింతుము.
శంకర కవి - హరిశ్చంద్రోపాఖ్యానము
చిత్రకవి సింగరార్యుడు - బిల్జణీయము
కిరీటి వెంకటాచార్యులు - ఆచలాత్మజా పరిణయము
కుమ్మరి మొల్ల - రామాయణము
ముద్దు పళని - రాధికా సాంత్వనము
ఆడిదము సూరకవి - రామలింగేశ శతకము
" కూచిమంచి తిమ్మకవి - రసికజన మనోభిరామము మున్నగు బహు
(గ్రంథములు
కూచిమంచి జగ్గకవి - చంద్రరేఖా విలాపము, సుభద్రా పరిణయము
శిష్టు కృష్ణమూర్తి - అనర్హ రాఘవము
కాణాదము పెద్ధన - ఆధ్యాత్మ రామాయణము, ముకుంద విలాసము
తరిగొండ వెంకమ్మ - వెకటాచల మహాత్యము
ఈ సంధి యుగములో ఇద్దరిని గురించి ప్రత్యేకముగా సూచింపవలెను. ఒకరు వేమన. ఇంకొకరు త్యాగరాజు. వేమన క్రీ.శ. 1700-1750 ప్రాంతములోని వాడు. అతడు ఆట వెలదులు వ్రాసినట్లుగా ఏ తెలుగు కవియు నేటివరకు వ్రాయలేదు. అతడు మహాకవి. గొప్ప వేదాంతి, అందులో సకల జనులకు అర్థమగు వేదాంతమును భోదించినాడు. అతడు అపూర్వ సంఘసంస్కర్త. సంస్కర్తలు విమర్శిస్తేనే జనులకు కోపము. వేమన లోపమున్న వారిని తిట్టి అందరిని నవ్వించి మెప్పు పొందినవాడు. అతని పద్యాలు కంఠపాఠము రాని తెనుగు విద్యావంతుడు కానరాడు.
క్రీ.శ. 1759 నుండి 1857 వరకు తంజావూరులోని తిరువాడిలో నివసించిన త్యాగరాజు ఆంధ్రుల చరిత్రలో అద్వితీయుడైన గాయక చక్రవర్తి అంతేకాదు. మొత్తము
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 61
ద్రావిడ భాషా కుటుంబమునకంతటికి ఇతడే సంగీత మందు ఆశ్రయ భూతుదైనాడు. ఇతని కీర్తనలు పాడినవారే గాయకులు. ఇతని కీర్తనలు పాడలేని వారు దక్షిణ దేశమందు గాయకులనిపించుకొనరు.
ఈ యుగములోని తక్కిన కవులెవరనగా
కనుపర్తి అబ్బయ - కవిరాజ మనోరంజనము నారాయణ దిట్ట కవి - రంగరాయ చరిత్ర అయ్యలరాజు నారాయణ కవి - హంస వింశతి
చెదలువాడ మల్లయ - విప్ర నారాయణ చరిత్ర కంకంటి పాపరాజు - ఉత్తర రామాయణము పుష్పగిరి తిమ్మన - సమీర కుమార విజయయు పిండిప్రోలు లక్ష్మణ కవి - లంకా విజయము గోపీనాథము వేంకట కవి _ - గోపీనాథ రామాయణము ఓగిరాల జగన్నాధ కవి - సుమనో మనోభి రంజనము
7. ఆధునిక యుగము
క్రీ.శ. 1880 ప్రాంతము నుండియే రచనలు చేసిన వారైను వారు మన కాలములో 1900 తర్వాత గతించినవారు పలువురు రచయితలుండినందున అట్టివారిని ఈ యుగములో చేర్చనైనది. నిజముగా ఈ యుగము అచ్చు విరివిగా ప్రారంభమైన నాటినుంచి అనగా 1770-1820 లో నుండిన బ్రౌన్, అదే కాలములో అతని యొద్దనుండిన జూలూరి అప్పయ కాలము నుండియే లెక్క పెట్టవలెను. అచ్చు పద్ధతి యూరోపు నుండి మనకు లభించినది. క్రీ.శ. 1577 లోనే గోవాలో చేరిన పోర్చుగీసు వారిచే ప్రవేశపెట్టబడెను. మొదటి తమిళ నిఘంటువు క్రీశ. 1679లో అచ్చయ్యెను. మొదటి అచ్చుపుస్తకాలు క్రైస్తవుల బైబిలు గ్రంథాలే. మన తెనుగులో క్రీ.శ. 1800 ప్రాంతములో అచ్చు మొదలయ్యెను. కాని 1860 తర్వాతనే దానికి వ్యాప్తి కలిగెను. బ్రౌను అను ఇంగ్లీషు పండితుడు ఇంగ్లీషు తెనుగు నిఘంటువును రచించెను. అతడు వేమన పద్యాలను ఇంగ్లీషులోనికి అనువదించెను. తెనుగులో తాతాచార్యుల కథలు అను పుస్తకాన్ని వ్రాసెను. అతడు తెనుగు తాటాకు పుస్తకాలను తెప్పించి మద్రాసులో ప్రాచ్య లిఖిత పుస్తకాగారములో నుంచెను. మెకంజీ అను
62 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
మరొక ఇంగ్లీషువాడు 1788 నుండి 1820 ప్రాంతము వణకు మద్రాసులో ఇంజనీయరుగా నుండెను. అతడు తెనుగుదేశములోని చారిత్రక గాథలను అన్నింటిని వ్రాయించి “కైఫియత్తులు” సమకూర్చి అదే లిఖిత పుస్తకాగారములో నుంచెను. నేటికిని అవి అమూల్యమైనవి. కాని వాటిని ముద్రించు ఆలోచన ఎవ్వరున్నూ చేయనందున అవి శిథిలమై పోతున్నవి. యూరోపు నుండి మన దేశమునకు వచ్చిన మిషనరీలకు మనము చాలా బుణపడియున్నాము. వారు మన దక్షిణ భాషలలోని ఆటవిక భాషలకు గూడ వ్యాకరణాలు వ్రాసి ఆ భాషలలో క్రైస్తవమత పుస్తకాలను రచించి అచ్చువేసిరి. క్రీ.శ. 1856లో కాల్టైల్ అను ఇంగ్లీషు పండితుడు తెనుగు, తమిళము, కన్నడము, మళయాళము మున్నగు దాక్షిణాత్య ద్రావిడ భాషల కన్నింటికిని ఒక భాషా శాస్త్రమును రచించి ముద్రించెను. “కురుఖు” అను లిపిలేని ఆటవిక భాషకు డాక్టర్ హోర్ అనువాడు వ్యాకరణము వ్రాసెను. “మల్లో” అను మరొక భాషకు డ్రౌజే అనువాడు వ్యాకరణము వ్రాసెను. గొండి భాషకు విలియం సన్ వ్యాకరణము వ్రాసెను. “కోదు” భాషకు బుషే మొదలగు ముగ్గురు పాశ్చాత్యులు వ్యాకరణములు వ్రాసి బైబిలును ఆ భాషలో ముద్రించిరి. గ్రియర్సన్ అను ఇంగ్లీషువాడు భారతీయ భాషలన్నింటిని గురించి పుస్తకాల సంపుటముల ననేకముగా రచించి ముద్రించెను. (Linguistic sur- V€y) మన తెనుగునకు గూడ క్రీ.శ. 1850 ప్రాంతములో ఫ్రెంచి మిషనరీలు నిఘంటువును, వ్యాకరణమును వ్రాసిరి. (క్రీ.శ. 1807లో తెనుగు వ్యాకరణమొకటి అచ్చయ్యెను. ఈ విధంగా ఇంగ్లీషు, ఫ్రెంచి, పోర్చుగీసువారు మన ద్రావిడ భాషలకు చేసిన సేవలో దశాంశమైనను నేటికిని మనము చేయలేదు.
ఇంగ్లీషువారు మన దేశమును జయించి మనల బానిసలనుగా చేసి రాజకీయముగా, ఆర్థికముగా పతితులనుగా జేసిరి. కాని మన సారస్వతానికి వారు అపారముగా ఉపకారము చేసినవారైరి.
ఒక వేయి యేండ్ల నుండి మనము వ్రాసిన పురాణాలనే వ్రాస్తూ, వర్ణించిన శృంగారాన్నే మళ్ళీ మళ్ళీ వర్ణిస్తూ, వ్రాసిన పద్యాలనే వ్రాస్తూ ఉండిన వారము. మనలో గొప్ప మార్చును ఇంగ్లీషు వాజ్మయము కలిగించెను. ఇంగ్లీషు విద్య దేశమందు వ్యాపించిన కొలది మనలో మార్పులు కలిగెను. తత్భలితముగా వచనములు, నవలలు, నాటకాలు, సైన్సులు, చరిత్రలు, భూగోళము, చిన్న కథలు, ఖండకావ్యాలు, గేయములు,
ఆంధ్ర వాజ్మయ చరిత్ర 63
కొత్త వర్ణనలు, నూత్న విధ విమర్శలు, వ్యాసములు, ఏకాంకికలు, హాస్య రచనలు, పరిశోధనలు, శాసనములు, భాషా శాస్త్రము, వివిధ పత్రికలు, పర భాషా సారస్వతముల భాషాంతరీకరణములు. కుప్ప తెప్పలుగా మనలో బయలుదేరెను. ఇతర దేశ భాషల పరిచయమేగాక, ప్రపంచములో అన్ని భాషల పరిచయము మనకు కలిగెను. ఈ కారణాల చేత మనవారి వేయేండ్ల కృషి ఒక యెత్తు. 1859 నుండి నేటివరకు జరిగిన ఈ నూరేండ్ల కృషి ఒక యెత్తు అనిన అతియోక్తి కానేరదు.
ఆధునిక యుగములో కలిగిన మార్పులు సూక్ష్మముగా తెలుపనైనది. ఆ మార్పులకు కారకులైన కవి పండితుల పట్టికలను ఇచ్చుటకు సాధ్యముకాని పని. అందువల్ల క్రీ.శ. 1900 నుండి ఇంతవరకు భాషా సేవ చేసినవారి పేరులు సూచించుటకు వీలు లేదు.
ఆంధ్ర వాజ్మయ చరిత్ర అతి సంగ్రహముగా ఇందు సూచితమైనది. ఇందు ఉత్తమ కృతులని సూచించిన వన్నియు సారస్వత ప్రియులు చదువవలెను.
ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము
గోలకొండ రాజ్యము నేలిన ఖుతుబుషాహీ ప్రభువులు గాఢమైన స్వమతాభిమానులే కాని బహమనీ సుల్తానులవలె పరమత ధ్వంసకులు కారు. రాజ్యకాంక్ష బాగా కలిగినవారే కాని బహమనీలవలె రక్తపిపాసులు కారు. స్వభాషను మాత్రమే వీరు బహమనీలవలె (ప్రేమించినవారు. దక్షిణ దేశమందు శిశుప్రాయమై యున్న ఉర్టూకు వీరు అవలంబన మిచ్చి పోషించిరి. ఈ ఖుతుబుషాహీలు స్వయముగా ఉర్టూ కవనమల్లిరి. పైగా తాము విశేషముగా తెలుగు దేశమును పాలించిన వారగుటచేత తెలుగును కూడా పోషించిరి. తమ సనదులను పార్ఫీలో వ్రాయించి యిచ్చుచు ఆ విషయములనే తెలుగులో వ్రాయించి ఇచ్చిరి. తెనుగు మండలములలో తెనుగు ద్వారానే రాజ్య వ్యవహారములను సాగించిరి.
మొదటి ఖుతుబుషా చిన్న కుమారుడును మూడవ గోల్మొండ సుల్తాను అగు ఇబ్రహీం ఖుతుబుషా ఏడేండ్లపాటు విజయనగరమందుండి తెనుగు బాగా నేర్చుకొనెను. తాను గోలకొండ సుల్తాను అయిన తరువాత విజయనగరమును నాశనము చేయుటకు ముఖ్య కారకుడయ్యెను. విజయనగర చక్రవర్తియగు అళియ రామరాజుకు దత్తపుత్రుడుగా స్వయంగా ఏర్పడిన అహమద్‌నగర్ సుల్తాను అగు అలీ ఆదిల్నాయును రామరాజుచే ఏడేండ్లు స్వపుత్రునివలె రక్షింపబడిన గోలకొండ ఇబ్రహీమును రామరాజును తళ్ళికోట యుద్ధములో చంపి విజయనగరమును భస్మము చేసి తుంగభద్రలో కడిగి వేసిరి. ప్రపంచంలో కని వినీ ఎరుగని ఉపకారమంటే ఇదొక్కటే యుండవచ్చును. ఈ విధంగా ఇబ్రహీము ఆంధ్రులకు క్షమింపరాని అపకారము చేసినను అతని కొద్దిపాటి తిరిపపు ఆదరణమును మాత్రము ఆంధ్రులు మరువ లేకపోయిరి. ఇదింకొక విచిత్రమగు కృతజ్ఞత. ఇబ్రహీం పేరునే మార్చి ఇభరామును చేసిరి. అతడు ఆంధ్రుల కందరికీ అభిరాముడయ్యెను.
ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము 65
“మల్మిభరాముడు” ఆంధ్రమును బాగా ఎరిగి యుండెను. సలక్షణముగా మాట్లాడుచుండెను. కవుల శ్రావ్యమగు కవితా ధారా సుధారసమును కుత్తుక బంటిగా గ్రోలెను. తన్మయుడై తల ఆడించెను. ఆవేశపరుడై అడ్డా దిడ్డగా తెనుగు కవసముసు స్వయముగా అల్లెను. రమ్ము పొమ్మని కవులతో సరసమాడెను. అద్దంకి గంగాధర కవిని పిలిపించి తపతీ సంవరణోపాఖ్యానమును వ్రాయించి కృతినందెను. అల్లాకాని రసులల్లా కాని ఇబ్రహీం సుల్తానును రక్షించి పోషించుగాక అని అద్దంకి దీవించలేదు. “శౌరి ఘనుడై కరుణారసవృష్టిచే నిరాయాసత బ్రోచుగావుత నృపాగ్ర... మాల్మిభరాము శాందిపున్” అని దీవించెను. ఇబ్రహీము అందులకు సంతసించి గంగాధరునితో నిట్లనెను.
“పెక్కు కృతుల్ చమత్కతులు బెంపుగ సందితిగాని స
మ్యక్కతి కన్యపైగల మమత్వము... వర్తింపదు”
ఇట్లని తపతీ సంవరణోపాఖ్యానమను పౌరాణిక గాథను కృతి పొందెను. సుల్తాను ఆంధ్రభాషను పోషించినది చూచి అతని సేనలో గొప్పయధికారియె యుండిన అమీన్ ఖాన్ గూడ ఒక కృతిని అందెను.
పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రము అను అచ్చతెనుగు కావ్యమును రచించి అమీన్‌ఖానున కంకితమిచ్చెను. తెనుగు వాజ్మయములో ఇదే మొదటి అచ్చ తెనుగుక్ళతి. అమీన్‌ఖాను కూడ మంచి సరసుడు. ఎన్నియో తరాల నుండి గోలకొండకు 20 మైళ్ళ దూరములోనున్న పొట్ల చెరువులో అతని పూర్వీకులు నివసించియుండిరి. అతని కుటుంబము హిందువులను (ప్రేమించి ఆదరించుచుండెను. అతడు చిన్న దర్చారు చేసి “దీవులేలు బలియులు రౌతుల్ మొదల్లా దను గొలువన్ సంతసమంది కబ్బములు పేర్మావించు” ఆనందించుచుండెడివాడు. అతనికి ముఖ్య సచివుడు మరింగంటి అప్పన్న అను ఆంధ్రుడు. అమీన్‌ఖాను ఏమాత్రమున్నూ మతద్వేష మేకోశములోను లేనివాడు. పైగా హిందువులను తనవారివలె ప్రేమించువాడు.
“కడక నమీనుఖానుడు జగంబు తనుం బొగడంగ వేద్మతో
విడువక యెప్పుడుం బుడమి వేల్పుల బిడ్డల పెండ్లిచేయు”.
అమీనుఖానునికి ముగ్గురు భార్యలు. అందరును ఉత్తమ పతివ్రతలు. పొట్లచెరువులోని జనులందరికిని చల్లని తల్లులు. అందు బదేబీబీ అను పెద్ద భార్య
సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే!
66
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“అత్తవారిండ్లకు నరుగు కన్నియలకు కట్నంబు లిచ్చుచు గారవించు, ప్రొద్దు ప్రొద్దుననె యెప్పుడు లేచి వాడల పసి బిడ్డలకునెల్ల పాలుబోయు, ఆ కొన్న వారల కద్దమి రేయైన ఆరగించబెట్టు నరసి యరసి పాలునీరెనసిన బాగుగా పెనిమిటి తలపులో మెలకువ మెలగ నేర్చు
జెర తన పుట్టినింటికి నత్తవారి యింటికిని వన్నెదెచ్చిన తుంటవిల్తు తల్లివంటి బడేబీబీ దరమె పొగడ తమ్మి పూమీద నెలకొన్న దంటకైన”
ఒక ముసల్మాన్ ప్రీ ఆ కాలములో హిందువులపై అంతటి, ఇంతటి
అభిమానము చూపుట అసామాన్యమైన విశిష్టగుణమనవలెను.
అంతకు నూరేండ్ల క్రిందటనే బహమనీ సుల్తాను ఒక్క ముసల్మాను ప్రాణానికి
ఒక లక్ష హిందువుల ప్రాణాలను తీసుకుంటాను, ఇదే మా మతాచారము అని చెప్పియుండెను. మహమూదుషా బహమనీ ఒక లక్ష హిందువులను చంపేవరకు అన్నము తినక పోయెను. అట్టి కాలములో అమీన్‌ఖాన్, అతని భార్యయు హిందువులను ప్రేమించినారంటే అది చాలా గొప్ప విషయము. అమీన్‌ఖాను బహుభాషావేత్త, అతని తమ్ముడు.
“అరబీ, పారసీ, గుజరాతీ, ఆరే, అచ్చ తెలుగు, కన్నోజి మొదలు౧* గలవి
తెలిసి వ్రాయదారి కన్నట్టి వాడు గతాత ఖాను”. ఇతడు,
“యిభరము శాహు చేపట్టె యనుంగుగా నడుపబాయక మూడు తరాల నుండి కన్పట్టు అమీనుఖానుడు”
ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము 67
ఖుతుబుషా వంశము వారు తెనుగు దేశములో చెరువులు కట్టించిరి. అనేక గ్రామాలను నిర్మించిరి. ఇతర (ప్రాంతాల నుండి సమర్ధులను పిలిపించి, వారికి జాగీరులిచ్చి క్రొత్త గ్రామాలను స్థాపింపచేసిరి. అట్టివారిలో దోమకొండ ప్రభువుల పూర్వీకులు ముఖ్యులు. రాజా మల్లారెడ్డి తన 'శివ ధర్మోత్తరమున' నిట్లు వ్రాసుకొనెను.
“ఘనుడా కాచనృపాల శేఖరుడు మున్ కర్ణాట రాజ్యంబు నం దున దుర్గాధిపతిత్వ వైభవముతోడ్లో కాంచి సుల్తాను పి
ల్పున కృష్ణానది దాటి యా, మెదకు, బల్ దుర్గంబు క్రిందన్ జిరం తనమౌ బిక్కనవోలునుండె నవి యాత్మస్థాన రాజంబుగన్”.
ఈ సంఘటన ఇబ్రహీం తర్వాతి వాడగు మహమ్మద్ కుతుబుషా కాలంలో అనగా 1612 క్రీశ.లోని మాట. ఆ మహమ్మద్ ఖుతుబుషా దోమకొండ పూర్వ ప్రభువులను చాలా గౌరవించెను.
“భవ్య సులతాను మహమదు పాదుషాహా లబ్ధ భూషణ లలిత పల్యంకితాత
పత్ర చామర సామ్రాజ్య భరిత విభవ రమ్య గుణశాలి శ్రీ కామరడ్డి మౌళి”.
రాజా మల్లారెడ్డి గొప్ప కవి. సంస్కృతాంధ్రములందు అద్వితీయ పాండితీ ప్రతిభను తన కవనమందు ప్రకాశింపజేసినాడు. అతడొక చాటువులో తాను ఖుతుబుషా ప్రభువుల కాస్టాన కవినని చెప్పుకొనెను. మల్లారెడ్డి సమకాలికుడైన గణనాథ కవి యను నతడు గొప్ప “సత్మవి” యనియు, అతని తండ్రి పండిత వరేణ్యుడనియు మల్లారెడ్డి తన పద్మ పురాణములో వ్రాసినాడు. అట్టి గణనాథ కవి ఖుతుబుషా (అనగా 1617లో) ఆస్థాన కవిగా నుండెననియు తెలిపియున్నాడు.
“ధీనిధి, సాహితీయుతు, ప్రతీతయశున్ కుతుపావనీశ్వరా
స్థాన మహాకవీంద్రు, నిజ దర్శన కౌతుక వైభవాగతున్
శ్రీ నరసింహ పండిత వరేణ్యకుమారు గణేశధీరు స
మ్మానముతో నెదుర్మొని నమస్కతి జేసి వసింప జేయుచున్”
ఇట్టి “మహా కవీంద్రుడైన” గణనాథ కవిని గురించి మనకింతకంటే ఎక్కువగా తెలియకపోవుట సంతాపకరము. అతడు “కుతుపావనీశ్వరాస్థాన కవీంద్రుడు”. కాని
68 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అతని గురించి మనమేమియు నెరుగజాలకున్నాము. మల్లారెడ్డి పుణ్యాన అతని పేరైన మనకు తెలిసినది. ఇదే మహమ్మద్ ఖుతుబుషా కాలములో గోలకొండ దుర్గములోనే సారంగుతమ్మయ అను గొప్ప కవియుండెను. అతడు నుల్తాన్ ఆశ్రయము కలిగినవాడేయని తానే తన వైజయంతీ విలాసములో ఇట్లు వ్రాసుకొనెను. “ఇనసమతేజు తా నృపులనెల్ల మహమ్మదు షాహి యేలు నీ యెనుబది నాల్గు దుర్గముల నేలిన యేలిక గోలకొండ, త ద్దన నగరస్థలిన్ కరణికం బొనరించెడు తమ్మమంత్రి, యా జనపతి రమ్ము పొమ్మన ప్రజల్ జయవెట్ట గృహస్థు తాననన్” గోలకొండ నగరానికి సారంగుతమ్మయ్య కరణము కావున పాదుషాకీతనితో పనిబడుచుండెను. అట్లున్నను తమ్మయ్య తన దైవభక్తిచే తన కావ్యాన్ని శ్రీరామార్చణము చేసెను. కందుకూరి రుద్రకవి వంశములో చాలామంది రుద్రకవి నామములుండిరని అందొక రుద్రకవి మల్మిభరాము (ఖుతుబుషా)చే 1480 శా.శ.లో రెంటచింతల పాలెము అను నగ్రహారమును పొందెదనియు వంగూరు సుబ్బారావుగారు శతక కవుల చరిత్రలో వ్రాసినారు. శ్రీ వంగూరి సుబ్బారావుగారు అదే చరిత్రలో మరొక చోట నిట్లు వ్రాసినారు - ఏనుగు పెద లక్ష్మణకవి తన తుల్యామాహత్యములో తన కృతిపతియగు వత్సవాయి తిమ్మరాజు పుత్రుడగు రాయ జగపతిరాజును గూర్చి యిట్లు వ్రాసెను. “సుల్తానబ్బుల్ హసన్ కోటీశ్వరుని చేత మాటిమాటికి బహుమానమందె మరియు పింగలి మాదన్న భానుజీ మంత్రజ్ఞువలన సన్మానమందె అక్కన్న మొదలైన యట్టి పెద్దలచేత మేలు భూషణములు మెప్పులందె” అక్కన్న మాదన్నలు సేవించినది అబ్బుల్ హసన్ పాదుషాను కాదు. వారు సేవించినది అబుల్ హసన్ తానీషాను. దీనిని బట్టి కుతుబుషాల సామంతులును తెనుగును బాగుగా పోషించిసట్లు నిదర్శసములు కనబడుచున్నవి. కంచెర్ల గోపన్న అక్కన్న మాదన్నల మేనల్లుడని ప్రతీతి. భద్రాచల ప్రాంతమందలి నేలకొండపల్లి గ్రామనివాసి. అతడే ప్రసిద్ధ రామదాసు. అతడు గొప్ప కవి. రామభక్తుడు. భద్రాచల తహసీల్దారుగా నియుక్తుడై వసూలైన పన్నును దేవాలయానికి వినియోగించి బందీకృతుడయ్యెను.
ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము 69
అబుల్ హసన్ తానీషాకు మంత్రి అక్కన్న అతడే ఈ దక్కన్ రాజ్యములోని తుది ఆంధ్ర మంత్రి. నాటి నేటివరకు మరల ఆంధ్రులు తలయెత్తలేదు. అక్కన్న మాదన్నలు తెనాలి రామలింగడు అను కమసాలి వ్రాసిన ధీరజనమనో విరాజితము అను తెనుగు కృతికి కృతిపతులైరి. ఆ గ్రంథ మందలి మొదటి రెండు పద్యాలిట్లున్నవి.
శ్రీరమ్యార్థి కళావతంస పద రాజీవార్చనాసక్తు లు
ర్వీరామాధిప కార్య సంఘటన ప్రావీణ్యాధికారుల్ మహా
పారావార గభీరు లాశ్రిత జన వ్రాతావనుల్ సంతతో
దారుల్ యక్కన మాదనాహ్వయులు తత్వజ్ఞాన సంపూర్ణులై. అందనుజన్ముడు మాదన
చందన మందార కీర్తి సంశోభితుడై పొందున నగ్రజుతో నిం
పొందగ తగురీతి పల్కె నురువాక్యములన్
ఈ విధముగా మనకు కుతుబుషా కాలములో సుల్తానుల ఆదరములో వెలసిన ఆంధ్ర కృతులను గురించి కొంతవరకు తెలియవచ్చినది. ఇబ్రహీం కాలము నుండి తానీషా కాలమువరకును గోలకొండ నేలిన సుల్తానులు తెలుగువారిని ఆదరించిరి. తెనుగుభాషను పోషించి, తెనుగు స్రీలను పెండ్లాడిరి. తెనుగు స్త్రీలలో ఉంపుడు గత్తెల నుంచుకొనిరి. వారిలో భాగ్యమతి, (ప్రేమావతి, తారామతి అనువారు ప్రసిద్ధులు. భాగీరథి అను స్రీ ఒక సుల్తాను పట్టపు భార్యయై యుండెను.
కుతుబ్బాకాలమునకు ముందు దేశభాషలపై ముసల్మాను ప్రభువుల కాదరణ లేకుండెను. వారి తరువాత ఏర్పడిన ఆసఫ్‌జాహి వంశము వారును “ముల్కీ” భాషలకు ఏ మాత్రమును ప్రోత్సాహమును కలిగించినవారు కారు. తెనుగు మంత్రులు, తెనుగు సుబేదారులు, తెనుగు సేనానులు కూడా కుతుబ్బాల అనంతరము ఎక్కడా కూడా లేకపోయిరి. ఇప్పుడు నిజాము రాష్ట్రములోని విద్యావిధానములో తెనుగు దిక్కులేనిదై క్షయమందుచున్నది. ఇది పూర్వాపర సంబంధములతో పరికించిస కుతుబుషాలకు ఈ విషయములో ధన్యవాదములు సమర్చించుకొనుట కృతజ్ఞతా విధియై యున్నది.
తెలుగు వాజ్కయంలో పోస్యరసము
నవరసములలో హాస్యరసమొకటియని భరతుని కాలమునుండియు ఆలంకారికులందరున్నూ అంగీకరించినారు. హాస్యమన నేమియో అందరెజుగుదురు. “సచ వికృత పరవేషాలంకార దార్భ్య లౌల్య కుహకాసత్రలాప వ్యంగ్య దర్శన దోషోదాహరణాదిభిర్విభావై రుత్పద్యతే”. అది ఆరువిధాలు. 1. స్మితం, 2. హసితం, 3. విహసితం, 4. ఉపహసితం, 5. అపహసితం 6. అతిహసితం అని ఇతరులను అనుసరించుట, వికృతముగా నాచరించుట, వ్యంగ్యముగా సంభాషించుట, పరదోషముల హేళనము చేయుట ఇట్టివన్నియు హాస్యమనబడును. సంస్కృత వాజ్మయములోనే హాన్యరసము తక్కువ. అది కావ్యాలలో పరిశోధించితే కాని కనబడదు. నాటకాలలో హాస్యానికిగాను విదూషకుని ప్రత్యేకముగా సృష్టించిరి. కాని వాడెల్లప్పుడును తిండిపోతు బాపడై యుండెను. భాణములలో హాస్యమును ప్రధానముగా పోషించదలచిరి. కాని యదంతయు పచ్చి బూతుల పంచాంగముగా పరిణమించెను. చాటువులలోను బూతులను వదలితే మిగిలిన హాస్యము తక్కువే. క్ ఇదే మర్యాద తెనుగునకునూ వర్తించునని స్థూలముగా చెప్పవచ్చును. తెనుగు ప్రబంధాలలోను పురాణాలలోను హాస్యము చాలా తక్కువ. నాటకాలు నిన్న మొన్నటివరకు లేకపోయెను. వాటికి బదులుగా శతకాలు వ్రాసిరి. అందులో కొన్నిటియందు హాస్యరసము కనబడుచున్నది. చాటువులలోనే యెక్కువగా హాస్యరసము నిండియున్నది. హాస్యానికి తెనుగువారు ప్రసిద్ధి. తెనాలి రామలింగడు జగద్విఖ్యాతుడు. మర్యాద రామన్న కూడా తెనుగువాడేమో? అక్బరు చక్రవర్తి విదూషకుడై యుండిన వీరబలుడు
తెలుగు వాజ్మయంలో హాస్యరసము 71
(టీర్చల్) గోదావరి డెల్టాలో పుట్టి పెరిగిన తెనుగువాడని చాలామందికి తెలియనే తెలియదు. ఇట్లుండినను తెలుగు సాహిత్యములో హాస్యసము విరివిగా కానరాకుండుట యెందులకు? పలువురు తెనుగు విద్వాంసులు హాస్యమంటే పచ్చి శృంగారమని భాణములను చూచి భ్రమపడిరి. అందుచేతనే తెనుగు సాహిత్యములో శృంగారాతిశయ వర్ణనలందును, జుగుష్సా వర్ణనలందును హాస్యమును సాధింపజూచినారు. శతక వాబ్మయములో హాస్యము కొంతవరకు కనపడుతున్నది. చంద్రశేఖర శతకము ముఖ్యముగా పేర్మొనదగినది. కాని దాని కర్త యెవరో తెలియదు. భాష నెల్లూరి యాస. రామలింగేశ శతకములోను, కుక్కటేశ్వర శతకములోను కొన్ని మంచి భాగాలు కలవు. వేణుగోపాల శతకము బాగున్నది. కాని తత్మర్త తిట్టనిది నవ్వింపలేడు. కవి చౌడప్ప సరేసరి. పుస్తకమంతా బూతుల బుంగయే. భాషీయ దండకము 200 ఏండ్ల నాటిది. కర్నూలు జిల్లా భాష అందు కలదు. అది బాగానే యున్నది. ఇక పురాణ ప్రబంధాలను గురించి విచారింతము. పురాణాలు సంస్కృతము
నుండి పరివర్తనము చేయబడినట్టి ఇతిహాసాదికములు. అందు హాస్య రసమునకు తావు లేదు. అయినను మన తెనుగు భారతములో అందందు మూలములో లేనట్టి హాస్య రసమును తిక్కన సోమయాజిగారు పోషించినారు. కీచకుని చంపుటకై ద్రౌపదికి మారుగా నర్తనశాలలో చీకటిలో భీముడు కాచుకొనియున్నాడు. కీచకుడు కామావేశముతో ద్రౌపదియే అందు కలదని తన కామ వికారమును ప్రకటించుకొనును. అప్పుడు భీముడిట్లనును.
ఇట్టివాడవు కావున నీవు నిన్ను
బొగడికొనదగు నకట నా పోల్మియాడు
దాని వెదకియు నెయ్యడనైన నీకు
బడయ వచ్చునె యెజుగక పలికితిట్లు.
నా యొడలు సేర్చి నప్పుడ
నీ యొడ లెట్లగునొ దాని నీ వెరిగెదు న న్నే యబలల తోడిదిగా జేయదలంచితివి తప్పు సేసితి గంటే.
72 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
నను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి బోవు వాడవె యైనం దను వేం బడసినఫలమే కనియెద విదె చిత్తభవ వికారములెల్లన్. కీచకుని దౌర్దన్యమును విరాటుని సభలో ద్రౌపది చెప్పుకొనినను ఎవ్వరున్నూ. వినలేదు. ధర్మరాజు ఆమెతో నీవేమి నాట్యకత్తెవా? ఇకపో అని మందలింపగా ద్రౌపది నర్మోక్తిగా నిట్లు పలికెను. “నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు పెద్దవారి యట్ల పిన్నవారు గాన పతుల విధమకాక యే శైలూషి గాననంగ రాదు కంకభట్ట. అట్లగుటం జేసి నాకు నాట్యంబులునుం బరిచితంబ, మత్పతి శైలూషుండ కాడు. కితవుండునుం గావున జూదరియాలికి గరువతనం బెక్కిడిది”. ఇదంతయూ గూడ మూలములో లేనట్టిది. శ్రీకృష్ణరాయబారమప్పుడు కృష్ణుడు భీమునితో సరసమాడుట, ద్రోణుని భీముడాక్షేపించుట, కర్ణుడు భీముని నిందించుట, ఇట్టి ఘట్టములు భారతములోపలుతావుల కాననగును. నాచన సోముడు ఊర్వశీ నరకాసురుల సంభాషణమందును, హంస డింభకోపాఖ్యాన మందును హాస్యరసమును చాలా యుతృష్టముగా పోషించినాడు. తెనాలి రామకృష్ణుని నిగమశర్మోపాఖ్యానములో హాస్యపుజాడ కానవచ్చును. గౌరన తన హరిశ్చంద్రలో కాలకౌశికుడు, వీరబాహువు, నక్షత్రకుడు అనుపాత్రల పోషించునప్పుడు హాస్యమును ప్రదర్శించినాడు. హరిశ్చంద్రుని వీరబాహు విట్లు వెక్కిరించెను. న్ ... ఈ రాజు సుకవాసి, పని పంద, చూపు గుజ్బంబు మామిడి క్రింది సోమరి, మేదకుండు బూమె తుంటరి, ఎనుబోతుపైన వాన, మొండరి, చల్లచప్పుడు, గోడ చేర్చు చండిపోతు నట్టి జాడనున్నాడు -
తెలుగు వాజ్మయంలో హాస్యరసము 73
ఇట్టి శబ్ద చిత్రములు కొంతవటకు పాలకుర్కి సోమనాథునిలో కూడ కనబడుచున్నవి. చేమకూర వెంకటకవి రెండు కావ్యాలలోను కొంతవరకు హాస్యము న్ఫురించుచున్నది. కదిరీపతి తన శుకనప్తతిలో తేలికయగు హాన్యమును గ్రంథమంతటను నింపియుండుటచేత దానికి తెనుగు సాహిత్యములో ఒక విశిష్టత యేర్చడుచున్నది. రంకు కథలు కాకుండినచో శుకసప్తతి తెనుగు వాబయములో అగ్రస్థానము వహించి యుండెడిది. శ్రీనాథునిలో అందందు హాస్యము కానవచ్చును. కాని విశేష భాగము పచ్చి శృంగారమే. బువ్వపు బంతి మున్నగు శృంగార నైషధ ఘట్టములట్టివే, వల్లభరాయని క్రీడాభిరామములోను ఇదే అవస్థ, కోళ్ళ పందెములోను,
బో
పొట్టేళ్ళ పందెములోను చచ్చినవాటికై కవి విలపించి (శ్రోతల నవ్వించిన భాగాలు _ అందముగా నున్నవి. జగ్గకవి తన చంద్రరేఖా విలాపమును హాస్యరస ప్రబంధరాజము అని వర్ణించుకొనెను. కాని గ్రంథమంతయు పచ్చిబూతులతో నిండినది, నీతులకేమి యొకించుక బూతాడక దొరకునవ్వు పుట్టదు ధరలో అన్న కవిచౌడప్ప ఇతని కాదర్శకవిగా కనబడుచున్నాడు. కాని పదినీతులు పదిబూతులు పది శృంగారములు గల్లు పద్యములు చౌడప్ప వ్రాసెను. ఇందునీతులే లేవు. అందుచేత అచ్చన బుచ్చనలోపల అచ్చనయే మేలు అన్నట్లు చౌడప్పయే మేలు రకమువాడు. ఇక మరొక్కని గూర్చి ప్రశంసింపవలసి యున్నది. అతడు వేమన. అతని పద్యాలలో నీతులును, హాస్యమున్నూ మేళవించి యున్నవి. అతని పద్యాలలోనూ కొన్ని బూతుపద్యాలు ఉన్నవి. అట్టివి అతని పేరుతో స్వార్థులు రచించినట్లున్నది. చాటువులలో మంచి హాస్యమున్నది. హాస్యరసమును గ్రోలదలచిన వారు చాటువులను చదువవలయును కొన్ని యుదహరింతును -
లంక పొగాకును తెచ్చియు పొంకముగా సున్నమేసి పొడిచేసిరయా
74 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పంకజనాభుడు నూరెను శంకరుడది పీల్చి పీల్చి శాభాస్ అనియెన్॥,
మంచిదినమునాడు మంగలి దొరకక చంద్రశేఖరుండు జడలు దాల్చె కొండియేమొ కట్టె గోపాలదేవుండు బ్రహ్మదేవుడెన్ని పాట్లు పడెనొ!
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధపడలేక సుమీ॥
చాకివానిచేత జగడాలు పడలేక సిరిగలాడు పట్టుచీర కట్టె
శివుడు తోలుకప్పె సీ! యని మదిరోసి ఖైరవుండు చీర పారవైచె.
అన్యాపదేశ పదములను చేర్చి చమత్మరించుట ఒక హాస్యము. హైదరాబాదు అగ్రహారికుడు తన అగ్రహార స్థితిని జంగలాత్ అధికారికి తౌరక్యాంధ్ర సంస్కృత భాషల సమ్మేళనముతో కూడిన శ్లోకాలతో ఇట్లు మనవి చేసుకొనెను. ఫలం లేదు మజ్యూర్ కలం బందుహాల్ సాల్ అలంమోదగాకుల్ క్వచిత్ టేకుమాకుల్ అవుర్‌కోయ కొంపల్ మరీమాల కొంపల్ హయేముళ్ళ కంపల్ హమారే (గ్రహారే.
తుమారా జవానుల్ హమారే గ్రహారే కదాపీహిదంగా సజా చేయకుండన్ హుకుందీయతాం నౌహకం చాపిదద్యాత్ ఖుదాతే ముదేస్తాక్ సదాజంగలీశ॥
తెలుగు వాజ్మయంలో హాస్యరసము 75
ఆధునిక వాజ్మయములో వచనములోను నాటకాలలోను హాస్యరసమును ప్రధానముగా పోషించినవారు పలువురు కలరు. వీరేశలింగంగారి ప్రహసనాలు సాధారణమైనవే. చిలకమర్తివారు తమవి ప్రహసనాలని చెప్పినందున తెలియవచ్చినవి. పానుగంటి వారి సాక్షి ఒక భాగము చదివితే వారి రచనలన్నీ చదివినట్లే. బారిష్టర్ పార్వతీశం ఉత్తమోత్తమ హాస్యరస (గ్రంథరాజము. కాని అది నేటికి అసంపూర్తిగానే ఉన్నది. మునిమాణిక్యాంగొరక్కరే గృహజీవనమును లలిత హాస్యముతో వర్ణించినారు. వేంకటరాయశాస్తిగారి ప్రతాపరుద్రీయము అద్భుత హాస్య రస ప్రపూరితము. ధర్మవరం కృష్ణమాచార్యులందందు హాస్య రంగములను రచించిరి. ఇటీవల మల్లాది అవధానిగారు హాస్యరచనల రచించిరి. కాని తల్లితో వసంత మాడినట్లు వారు గుడిపాటివారి వలె పురాణ పురుషులను అవహేళనము చేయజూచిరి. భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలలో హాస్యమున్నది. వ్యావహారిక భాషా మకుటమగు కన్యాశుల్మాన్ని ఎవరున్నూ మరువకూడదు - కాని ఇంగ్లీషు డొక్కశుద్ధి కలవారే దాన్ని ఆనందించగలుగుతారు. గిరీశాన్ని, పేరిగానిని, యెంకిని, కాంతమ్మను, జంఘాలశాస్రిని, పార్వతీశాన్ని కిన్నెరసానిని సృష్టించి ఆంధ్రులను ఆనందసాగర తరంగములపై ఓలలాడించిన కవి కుమారులు అపారమగు భాషాసేవ చేసినట్టి సిద్ధహస్తులు; అయినను ఆధునికాంధ్ర వాజ్మియములో హాస్యరసము ఇంకా (ప్రారంభ దశలోనే యున్నదని చెప్పవలెను.
జాల వాజయం
నేడు అన్ని దేశములలో బాల వాబ్మయమునకు ్రాధాన్యమియ్యబడుతున్నది. “బాల వాజ్మయమే దేశాభివృద్ధికి పునాది” అని గ్రహించినారు. కొన్ని దేశములీ విషయమున చాలా వెనుకబడి యున్నవి. అట్టి దేశాలలో మన ఇండియా చేరినదనవలెను.
ప్రాచీన కాలములో హిందువులు, బౌద్ధులు బాల వాజ్మయముపై కృషి బాగా చేసినట్లు కానవస్తున్నది. పిల్లలకు ముఖ్యమైనవి కథలు, బొమ్మలు. బొమ్మలతో కథలు చూపించి నిరూపించుట అత్యంత ్రేష్టమగు పద్ధతి. మన ప్రాచీన శిల్పములన్నియు ఈ విధానమునకు తోడ్చడుచుండిన ప్రతి దేవతా స్థానములో స్తంభములమీద గోడలమీద, కప్పుపైనా, గోపురములలోన పౌరాణిక కథలు బొమ్మలుగా చెక్కబడు చుండెను. కొన్ని తావులలో రంగులతో చిత్రింపబడుచుండిన చదువురాని వారు సహితము ఆ బొమ్మలను చూచి ఇవి బౌద్ధుల కథలు, ఇవి కృష్ణలీలలు, ఇవి పాండవుల కథలు, ఇవి రామాయణ ఘట్టములు అని ఒకరికొకరు చూపుకొని, చెప్పుకొని చెప్పుకొని ఆనందించెడివారు. బౌద్ధ మత వ్యాప్తి కాలములో బౌద్ధ జాతక కథలను శిల్పములలో నిరూపించిరి. అజంతా, ఎల్లోరా, అమరావతి, మధురా, తంజావూరు, లేపాక్షి శు చీంద్రము వంటి నూర్లకొలది దేవస్థానములలో పౌరాణిక గాథలను శిలలపై చెక్కిరి; గచ్చుతో చేసిరి, చిత్రించిరి.
ఆంధ్ర కర్ణాటక దేశాలలో “తోలు బొమ్మలాటలు” అనునవి ఇంచుమించు 1000 ఏండ్ల నుండి ప్రచారములో నుండినట్లు మన కాధారాలు కానవస్తున్నవి. అంతకన్న పూర్వమెప్పుడు ప్రారంభమయ్యెనో తెలియదు. తోలు బొమ్మల మూలాన కూడ పురాణ కథలను చక్కగా (గ్రహించుచుండిరి.
బాల వాజ్మయం 77
మన పురాణాలలో జంతువుల కథలు, బాలుర కథలు బహు సుందరముగా వ్రాయబడినవి. (ధృవ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, చిరకారి చరిత్ర మొదలైన వానిని మన బాలురందరెరుగుదురు. జంతువులు మాట్లాడినట్లు, మనుష్యులవలె వర్తించునట్లు నీతి కథలు వ్రాయుటకు ప్రారంభించిన వారు హిందువులేనని పాశ్చాత్య పరిశోధకు లంగీకరిస్తున్నారు. అట్టి కథలలో పంచతంత్రము జగద్విఖ్యాతి కాంచినది. దానిని ఇంచుమించు ప్రాశ్చాత్య భాషలన్నింటిలో అనువదించారు. క్రీస్తుశకము ఆరవ శతకమందే దానిని పార్మిలోనికి “అన్వారస్సు హేలీ” అను పేరుతో తర్జుమా చేసిరి. మన కరటకదమనకులే ఫార్శిలోని కలీలా దమాగ్‌లు. హితోపదేశము, బేతాళ పంచవింశతి, కథా సరిత్‌సాగరము, దశకుమార చరిత్ర, సాలభంజిక కథలు, ఇట్టివి కొల్లలుగా మన దేశమందు రచించిరి. ప్రజలలో ఉండిపోయిన కథలు వేలో లక్షలో చెప్పజాలము. పిట్టమ్మా కాకమ్మా కథలు, అవ్వ కథలు విశేషమయ్యెను. అనగనగా ఒక ఊరు, ఒక రాజు అని ప్రారంభించి కథ కంచికి మనమింటికి అని ముగించుట దాక్షిణాత్యుల పరిపాటి.
“పిల్లల పాటలు” అను విభాగము కూడ మనలో సమృద్ధిగా నుండెను. ఆ పాటలలో పెద్దలు కూడ పేర్కొనదగిన విశేషము లిమిడియుండెను. ఏమో అర్ధము కాని ప్రాసల మాటలను..... ...... యర్థమే కానవస్తున్నది.
“కొంగ రాజు - కాలు విరిగే
దానికేమి మందు -
వెల్లుల్లిగడ్డ నూనెమ్మ బొడ్డు
నూటొక్క ధర అనుదానిలో కాలు చేతులు విరిగినప్పుడు చేయవలసిన చికిత్స కలదు.
చెమ్మ చెక్క - చారడేసి బొక్కు అనువాటిలో మాచకమ్మలకు తగిన మందు తెలపబడినది. ఇటులే చాలా పాటలలో వైద్యపు చిట్మాలిమిడియున్నవి. ఈ వాజ్మయ భాగము అనాద్భృతమై విసృతమై పోయినది. పునురుద్ధరణము జరుగుతున్నది.
ప్రాశ్చాత్య దేశములలో (గ్రిమ్సు ఫెయిరీ కథలు, అండర్సన్ కథలు ప్రసిద్ధములు. ఇంగ్లీషులో ఛార్లస్ డిక్కెన్స్ అను నతడు పిల్లల కథలను రమ్యముగా వ్రాసిన వారిలో ప్రథముడు.
78 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అచ్చుయంత్రము లభివృద్ధియె, ఫోటో బ్లాకులు చేయుట వృద్ధియైన తర్వాత పాశ్చాత్య దేశములలో పిల్లల వాజ్మయము అపారముగా వృద్ధియయ్యెను. సచిత్రమైన చరిత్రలు భూగోళములు, కథలు, పాటలు, విశేషములు, విచిత్రములు మున్నగు విషయములు అతి సుందరముగా ఆకర్షణీయముగా అతి సులభ భాషలో అర్ధమగునట్లు విజ్ఞానము ప్రసాదించునట్లు రచించి ముద్రించిన గ్రంథములు వేలకొలదిగా పెరిగిపోయినవి. యూరపు, అమెరికా బాలురీవిషయములో ధన్యులైనారు. అందు పెద్ద నగరాలలో ప్రత్యేకముగా బాలుర గ్రంథాలయములు, బాలుర పత్రికలు కలవు. అనేక గ్రంథ ప్రకాశక సంస్థలు బయలుదేరి బాలురకు చరిత్ర, భూగోళము సైన్సులు పరిశ్రమలు, దేశ దేశ జనులు, వారి యాచార వ్యవహార విశేషములు, మున్నగు సహస్ర విషయములను తెలుపు ముచ్చటగు గ్రంథములను ప్రచురించారు.
మన పిల్లలకు చరిత్ర భూగోళ ఖగోళములన్న తలనొప్పి కాని ఆ దేశాలలోని గ్రంథములను చూచిన వాటిపై అత్యంత ఆసక్తి ఆనందము జనించును. చరిత్ర తేదీల పంచాంగము కాదనియు భూగోళము పేరుల వరుసకాదనియు స్పష్టమగును.
పట్టు, ప్రత్తి మున్నగునవి ఆదిలో ఏ దేశము వారు కనిపెట్టిరి? ఆ చెట్లు సంఘమున కుపరికరించునట్లు చేసిరి. అన్ని విషయాలు బొమ్మలతో చిన్న చిన్న (గ్రంథాలు రచించినారు. మన పట్టుభద్రులు ముప్పాతిక మందికి తెలియని విషయాలు కూడా ఆ చిట్టి పొత్తములలో గోచరించును. మన దేశములో సాధారణమైనట్టి బత్తాయ, పప్పాయ, సపోటా వంటి ఫలములు, వేరుశనగ వంటి నూనెగింజలు, మిరపవంటి ఘాటైనవి, పొగాకు వంటి విష వస్తువులు, మన దేశములోనివి కావనియు అవి అమెరికావంటి దేశాలనుండి మన దేశములో 300 ఏండ్లనుండి ప్రవేశపెట్టబడినవని ఎందరెరుగుదురు. అట్టి సహాస్రాధిక విషయాలను... సచిత్ర గ్రంథముల నుండి పాశ్చాత్య బాలురు గ్రహించగలుగుతున్నారు.
దీనినిబట్టి తేలిన విషయమేమనగా మనము ఆదిలో బాల వాజ్మయానికి ప్రపంచానికి దారి చూపినవారము. తుదిలో పాశ్చాత్యుల నుండి మరల నూతనముగా గుణపాఠం నేర్చుకోవలసిన వారమైనాము. పాశ్చాత్య దేశములలో నూటి కించుమించు నూరుమంది చదువుకొన్నారు. మనము నూటికి 15 మందియే చదువుకొన్నవారము. కావున మన మొదటిపని నూటికి నూరుమంది విద్యావంతులగునట్లు కృషిచేయుట
బాల వాజ్మయం 7
పాశ్చాత్య దేశాలలో ధనికులు తమ ద్రవ్యమును విద్యాభివృద్ధికె వినియోగింతురు. అమెరికాలో ఒక్క హెస్రీ కార్నెజీ అను కోటీశ్వరుడు 5000 గ్రంథాలయములకు భవనములు నిర్మించి వాటి నిండుగా గ్రంథములుంచి అవి చక్కగా నిరంతరాయముగా సాగునేర్చాట్లు చేసెను. అతడొక గ్రంథాలయమునకు మాత్రమే ఇంచుమించు ఏడుకోట్లు రూపాయలిచ్చెను. మన దేశములో ధనికులీవిధముగా సహాయము చేయుట కానరాదు. అందందు కొందరు కొన్ని లక్షలిచ్చినది అతి స్వల్పమగు సేవయే. మూడవది మన జనులలోని భావములు, రుచులు మారవలెను. మంచిదేది చెడ్డదేది గ్రహింపవలెను. ఈనాడు చెత్త పత్రికల కెక్కువ ప్రచారమున్నది. మంచి పత్రికలు బిచ్చమెత్తుకొనుచున్నవి. సినిమా తారల మూడురంగుల బొమ్మలు చూచి తబ్బిబై ఆనంద సాగరములో మునిగి ఉక్కిరిబిక్కిరై ఆ చెత్తను కొనువారే బహుళము. వెర్రిమొర్రి కథలు, దొంగ కథలు వ్రాస్తే వాటికి ప్రచార మెక్కువ.
మన తెలుగులో ఈనాడు బాల, చందమామ వంటి పత్రికలున్నవి. వాటి అనుకరణలు బయలుదేరి అపచారమే చేయుచున్నవి. పై రెండు పత్రికలలో కూడా విజ్ఞానప్రదమైన విషయాలు తక్కువగా కానవస్తున్నవి.
విద్యాశాఖవారు బాల వాజ్మయము సిద్ధము చేయించి సచిత్రముగా ప్రచురించు టకు కొంత ధనము ప్రత్యేకించి దారిచూపవలెను. మన కేంద్ర ప్రభుత్వ మీ విషయమున శ్రద్ధ కనబరచుచున్నది. కాని ద్రవ్యము మాత్రము ప్రత్యేకించినట్లుగా కానరాదు. హైదరాబాదు ప్రభుత్వము కూడా కేంద్ర ప్రభుత్వాదేశముపై బాల వాజ్మయ సమితి నేర్చాటు చేసినది. కాని యింతవరకూ వాజ్మయమునకై ఏమియు ద్రవ్యమును ప్రత్యేకించలేదు.
ఈ అనాదృత వాజ్మయముపై విద్యావంతుల దృష్టి కేంద్రీకృతము కావలెను.
గేయ వాజ్మయం
దేశికవిత:
పూర్వములో దేశికవిత ప్రాముఖ్యత వహించి యుండెను. కాని నన్నయ భట్టు నుండి మార్గకవిత స్థిరపడిపోయి దేశికవిత పల్లెలలో పామర జనులలో దాగిపోయెను. మార్గకవిత సంస్కృత మర్యాదలతో రాజుల ఆస్థానములలో మురిసిపోయినది. దానిని పల్లెటూరివారు నేటివరకు కూడ ఆదరింపక శిష్టమ్మన్యులచే అనాద్భతమైన ఆదేశి కవితకే ప్రాముఖ్యతనిచ్చిరి. ఈ దేశికవిత పల్లెటూరివారి పాటలలో నేటివరకును నిలిచియున్నది. అప్పకవి విభజన:
అప్పకవి కావ్యములను ద్వివిధములుగా - ప్రబంధములనియు, చాటుప్రబంధములనియు - విభజించెను. చాటు ప్రబంధములు మరల రెండు విధములట. (1) సంఖ్యా బద్ధములనియు (2) అసంఖ్యా బద్ధములనియు. సంఖ్యాబద్ధములలో ఉదాహరణములు, ముక్తకాదులు చేరినవి. అసంఖ్యా బద్ధములో గద్య, రగడ, ద్విపద, దండకము, మంజరి చేరినవి. ఈ రెండవ భాగమందే గేయ వాజ్మయ మిమిడియున్నది.
అప్పకవి ఛందస్సును విభజించుచు దానిని కూడ రెండు భాగములు చేసెను.
“పాద నియంమంబుగల యట్టి పద్యసమితి
వృత్తములు, జాతులను అన ద్వివిధమయ్యె
నిట నిసర్గగణంబులు వృత్తములగు
జాతు లుపగణ మాత్రల జరుగుచుండు”
గేయ వాజ్మయం 81
ఈ రెండింటిలో మన చర్చకు సంబంధించినది జాతులు”, ఈ జాతులు రెండు విధాలట.
జాతి-ఉపజాతి అని. అందు జాతిలో షడ్విధ కందములు, ఉత్సాహి, తరువోజ, అక్కరలు, మంజరి, ద్విపద, త్రిపద, చతుష్పద, పంచపది, షట్పద, నవవిధ రగడలు, కళికలు చేరినవి. ఉపజాతిలో నవ విధ గీతములు, సప్తవిధసీసములు చేరినవి.
అప్పకవి తన ఛందోభాగములో లాలి, పెండ్లి పాట, శ్రీ ధవళము, సువ్వాలె, సువ్వి, యక్షగానము, అను పాటలకు ఛందస్సు నిచ్చి యున్నాడు.
గేయ వాజ్మయ నిరసనము:
పూర్వము సంస్కృతములో నారితేరిన పండితులు అచ్చ తెనుగు గూడిన పల్లె పాటలను నిరసించినారు. ఈ పల్లెపాటలు విశేషముగా ద్విపదలోను, రగడలోను నుండెడివి. ఈ పాటలను “పదములు” అనియు వ్యవహరించుచుండిరి. శ్రీనాథుడు యొక చాటువున.
“ముది విటులు విధవ లంజలు
పదకవితలు మారు బాస బాపన వారల్” అని పాటలను వ్రాయు కవులను పడ దిట్టె నందురు. మరియు వేణుగోపాల శతక కారుడు
“ద్విపద కావ్యంబు ముదిలంజ దిడ్డి కంతి” అని చెడ దిట్టెను.
అయినను శ్రీకృష్ణదేవరాయల కాలములో సహితము కొందరు గొప్ప పండితులు
ద్విపదలను, పదములను వ్రాసి సంస్కృత పండితుల చేత సహితము మెప్పొందిరి.
“చిన్నన్న ద్విపద కెరగును బన్నుగ పెద తిరుమలయ్య పదమున కెరగున్ మిన్నంది మొరసె నరసిం గన్న కవిత్వంబు పద్య గద్య శ్రేణిన్” అని తెనాలి రామలింగడు చెప్పెను.
82 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పాటల వివరములు
తెనుగు వారు పల్లెలలో పాడుకొను పాటలు నానా విధములై యున్నవి. వారి నిత్యజీవనముతో అవి సంబంధించినవై యున్నవి. అందు కొన్ని భేదములివి.
1. ఏల పాటలు, 2. ఉయ్యాల పాటలు, 3. పెండ్లి పాటలు, 4. దసర పాటలు, 5. మేలుకొలుపులు 6. ధవళాలు, 7. సువ్వాల, 8. దంపుడు, విసురుడు పాటలు, 9. మోటపాటలు, 10. భిక్షగాండ్ల పాటలు 11. జంగం పాటలు, 12. తత్వాలు, 18. రాటము పాటలు, 14. వినోదాలు, 15. స్తోత్రాలు 16. కోలన్న పాటలు, 17. రల్లు పాటలు మున్నగునవి. ద్విపదలు
ద్విపదలను గురించి ముఖ్యముగా చెప్పవలసినదేమన పల్లెపాటలలో ముప్పాతిక భాగము ద్విపద వాజ్మయమే. రాగభేదములచే ద్విపదను పది పదియేను విధములుగా పాడుకొన వీలున్నది. అదేవిధముగా నేటికిని జనులు పాడుకొనుచున్నారు. ఎట్లనగా:
1. దసరా పాటలు.
“శ్రీగణాధీశాయ శివకుమారాయ” ఇత్యాది చరణము లన్నియు ద్విపదలే.
2. జంగం కథ అనబడు తందాన కథలు విశేషముగా ద్విపదల యొక్క రూపమే.
శ్రీనాథుని వంటివాడు “పల్నాటి వీరుల సుద్దులను” ద్విపదలో వ్రాసెను. ఈ సుద్దులన్నియు ద్విపదలో ట్రాసినవే. తాళ, లయ యుక్తముగా పూర్వము నుండియు పాడుచుండినవనుటకు క్రీడాభిరామములోని ఈ పద్యమే నిదర్శనము.
ద్రుత తాళంబున వీర గుంఫిత
కథుం ధుం ధుం కటాత్మార సం గతి వాయించుచు నాంతరాళిక యతి గ్రామాభిరామంబుగా
యతి గూడన్ ద్విపద ప్రబంధమున
వీరానీకముం బాడెనొ
గేయ వాజ్మయం 83
కృత ప్రత్యేకముగా గుమారకులు ఫీట్కా రంబునం దూలగన్. బాలనాగమ్మ కథలో ప్రారంభమిట్లున్నది. “కాళ్లికి పడమట మున్నూ రామల ఆ భూమికి ఒక చక్ర పట్నమేమి పట్నము నేలు సహ భోజరాజా” ఇదంతయు ద్విపదయే. 3. రాటపు పాటలు కూడ ద్విపదలోనే యున్నట్లున్నవి. శుక సప్తతిలో రాటముల వర్ణించుచు కదిరీపతి యిట్లు వ్రాసెను. “ప్రాయంపు పడుచుల పనిగొంటివే దూది” “అనెడు తేనీయ పాట చినుకు లీనా ఇందు ఉదాహృత మొదటి భాగము ఒక మాత్రా భేదముతో ద్విపదగా నున్నది. 4. ధవళాలు, సువ్వాలలు అనునవి పల్లెలో ముఖ్యముగా వివాహములలో పాడుకొనుచుందురు. కదిరీపతి కాలములో సహితమివి చాలా ప్రాధాన్యత వహించినట్లు కనబడుచున్నది. “ఆ లలనా మణి కౌ గ య్యాళి యొకానొక్కవేళ నక్కరతో సు వ్వాలున్ శోభనములు ధవళాలున్ మొదలైన పాటలం దగనేర్చు” అని తన శుకసప్తతిలో వర్ణించినాడు. మేలుకొలుపులు ఇది చాలా మనోహరమైన గానము. నిన్న మొన్నటివరకు పల్లెటూరి బళ్ళలో తెల్లవారు జాముననే బాలురు బళ్ళలో “తెల్లవారెను మేలుకొలుపులు అల్లనల్లన వికసె కుముదము
84 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అని శ్రావ్యముగా భూపాళ రాగయుక్తముగా పాడుచుండెడివారు. ఈ మేలు కొలుపుల ధాటిలోనే డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు “ఉమర్ ఖయ్యాము”ను రచించినారు. శృంగారము
నగరవాసులకు కృతకశ్ళంగారము మెండు. పల్లెటూరి వారిది నిజమైన శృంగారము. పూర్వము వ్రాసిన శృంగార గేయములలో ముఖ్యమైనవి “క్షేత్రయ్య పదములు”. ఇవి క్షేత్రయ్య కవిచే తంజావూరి రఘునాథరాయల కాలములో రచింపబడిన పాటలు. ఇప్పుడు కొన్ని పాటలు ముద్రితములు. “సారంగపాణి పదములు” అనునవి కూడ చాలా వ్యాప్తిలో నున్నవి. నావద్ద నున్న ప్రతి 1899 క్రీశ. బరూరు త్యాగరాయ శాస్తులవారి కంపెనీలో ముద్రితమైనట్టిది. ఈ పదములను నాలుగు భాగములుగా విభజించినారు. అందొక భాగములో గ్రామ్యభాషలో పాటలు కలవు. తెలంగాణాలో చాలా ప్రాంతములలో “చందమ్ర్మ-వెంకయ్య” పాటలు ప్రచారములో నున్నవి. కాని అవి పామరులలోబడి మార్పులు చెంది బూతులతో నిండిపోయినవి. యక్షగానాలు - తోలుబొమ్మలు
ఈ వాజ్మయమును గురించి తందాన కథవలె ప్రత్యేకముగా చెప్పవలసి యుండును. యక్షగానాలు పూర్వములో గొప్ప గొప్ప కవులచేత వ్రాయబడెను. అప్పకవి, కంకంటి పాపరాజువంటి గొప్ప కవులు యక్షగానాలు వ్రాసిరి. అయినను మనము చూచునట్టి యక్షగానాలలోను, విశేషించి తోలుబొమ్మల పాటలలోను, ప్రదర్శనముల లోను తుచ్చ శృంగారము, బూతులు కనబడుచున్నవి. తత్వాలు:
పాటలలో తత్వాలు విశేషముగా ఇమిడియున్నవి. తెనుగువారిలో చాలా తత్వాలు రచించి అనేక శిష్యులను ఆకర్షించిన గురువులు చాలామంది కలరు. అందు పేర్కొనదగిన వారెవరనగా:- 1. పోతులూరి వీరబ్రహ్మం -వీరు కర్నూలు ప్రాంతము వారుగా కనిపింతురు. వీరు గొప్ప సంఘ సంస్మారులు.
గేయ వాజ్మయం 85
ఏ కులమని నన్నెవరడిగిన నేమని తెల్పుదు నీ లోకులకూ పలుగాకులకూ - దుష్టాత్ములకూ అని కులాలను తిరస్కరించిన మహానుభావులు. దూదేకుల సిద్ధప్ప - (పింజారి) మెదకు మండలవాసుడేమో. ఏగంటప్ప - పోతులూరి వారి తర్వాత దేశమంతటను ఖ్యాతిగాంచిన వాడు. 4. _ తోట గజేంద్రకవి - వైష్ణవ మతప్రచారకుడు. ఇతని గురించి మద్రాసు 'కళ పత్రికలో పంచాగ్నుల ఆదినారాయణ శాస్తులవారు వ్రాసి యుండిరి. పాటలు మనోహరముగా నుండును. “పుట్టుట యెల్లను గిట్టుట కొరకే పుణ్యమేమి రాదోరన్నా! చావక పుట్టుట జన్మదేశమున జరుగుచు నుండుర వోరన్నా! ఈ ప్రకారముగా బోధించినాడు. 5. _అనిమ పాపయ్య 6. జ్ఞాన బ్రహ్మానందయోగి 7. వీరలింగ గురులు, 8. కంబగిరి, 9. ఇంద్రపీఠ భీమన్న 10. వర నారాయణదాసు, 11. ఆదికేశవులు, 12. చిత్తూరు నరసింహదాసు 18. పరశురామ నరసింహ దాసు 14. వీరస్వామి 15. మహ్మదు హుసేను. ఈ మహ్మదు హుసేను శైలి కుదాహరణము. “ఒకటి మొదలూ వృక్షము లెక్కకు మిక్కిలి కొమ్మలురా ఎక్కి చూచితే ఎంతో పొడవునా కాశమంటినదిరా రెండు త్రోవలూ కూడిన చోట రేపు ఒక్కటేరా రెండు రేకులా పద్మములోపలి అఖండ తేజమురా”
2. 3.
86 సురవరం ప్రతాపరెద్ది వ్యాసాలు
16. బాలకృష్ణదాసు 17. శివయోగీంద్రులు, 18. తరికొండ వెంకమ్మ 19. అంగప్ప 20. చుండూరు చెన్నుదాసు 21. పోకల శేషాచలం 22. నాసీర్ మహమ్మద్ ఇతని శైలి కుదాహరణము.
“మేలుకొనుమీ తత్పదంబున
మేలుకొనుమీ త్వంపదంబున
మేలుకొనిమీ అసిపదంబున
మేదినిలో వెలినీ -
ఆత్మా - మేలుకొనవే.
వాదులాడుచు వారు వీరని
భేదముననే మోదమెరుగక
లేదు జననము లేదు మరణము
లేదు నీకెపుడూ - ఆత్మా,
చాలుపుష్పము మేలుకొమ్మని
గాలమార్యుల మూలమెరిగిన
ఫాల లోచనను విష్ణుకమలము
బోల జాలుదురే - ఆత్మా
ఇట్టి యాత్మకు నిద్రమెలుకువ
పుట్టబోదని గుట్టుదెలిపిన
గురుడు గాలిబు కరుణనాసరు
గట్టి మాటలను - ఆత్మా
ఈ తత్వాల చర్చను ముగించుటకు పూర్వమింకొక్కరి విషయము చెప్పవలసి
యున్నది. రాయలసీమలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమగు “కదిరి”లోని నృసింహస్వామిని పూర్వమొక హరిజనుడు దర్శింపగోరగా పూజారులు నిరాకరించి తలుపులు తాళ మేసుకొని పోగా ఆ హరిజనులు వీలావేశము పొంది యిట్లు పాడిరట.
“బేట్రాయి సామి దేవుడా
కదిరీ నరసింహరాయుడా
కాటామరాయుడా
నన్నేలీనవాడ - బేట్రాయి”
గేయ వాజ్మయం 87
ఈ ప్రకారముగా శ్రీ విష్ణువు యొక్క దశావతారములు వర్ణించి పాడెననియు తలుపులు విరిగిపడి దేవునిదర్శన మతనికి లభించెననియు జనులు చెప్పుకొందురు. వివిధములు
పల్లెటూరి వారు వినోదార్థము ఎన్నియో పాటలు పాడుకొందురు. అవన్నియు సమకూర్చుట చాలా అవసరము.
“ధీరుడా జమదారుడా మళ్లెన్న డొస్తవు నాయుడా”
అని యుల్లాసమును ప్రకటించిన పాటలు “బండిరా పొగ బండిరా దొరలెక్కు రైలుబండిరా వంగిదండం పెట్టువరకు మంగపట్నం చేరెరా”
అని రైళ్ళను గురించి పాటలను
“దిగు దిగురా నాగా దివ్య సుందరి నాగా”
అనునట్టి పాటలను “పెరుమాళ్ళ చిన్నని”
పాటలు “బాలబాలికల” పాటలు ఇంకను నిట్టివి వేనవేలు. జానపదులలో నిలిచియున్నవి. భావకవులమని చెప్పుకొనువారు భాషాసేవ చేయదలచిన ఈ అనాద్భృతమైన వాజ్మయమును పునరుద్ధరించి సంస్కరించి ఉన్నత స్థానమలంకరింప జేతురుగాక.
పల్లెపదాలు 1
నన్నయభట్టు కాలమునుండియు ఆంధ్రులు సంస్కృత ప్రాబంధిక కవితా పద్ధతికే ప్రాధాన్యతనిచ్చిరి. నన్నెచోడుడు తన కుమార సంభవములో నిట్లు వ్రాసెను. “మును మార్గ కవిత లోకం బున వెలయగ దేశికవితబుట్టించి తెనుం గున నిలిపి రంధ్ర విషయం బున జనజాళుక్య రాజు మొదలుగ పలువుర్”. అనగా చాళుక్య రాజుల కాలములో (మార్గ కవిత) సంస్కృత కవితా పద్ధతి దేశాన్ని ముంచివేసిందట, అప్పటికే (దేశి కవిత) సంస్కృత మర్యాదకు భిన్నమైన తెనుగు కవిత్వము ప్రచారములో నుండినది. మరల అట్టి దానినే చాళుక్యుల తర్వాత శివకవులు తెలుగుదనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకున్నారు. బసవ పురాణంలో పాల్కురికి సోమనాధ కవి నాథుడిట్లు వ్రాసినాడు: “ఉరుతర గద్యపద్యోక్తుల కంటె సరసమై పరగిన జాను దెనుంగు చర్చింపగా సర్వ సామాన్య మగుట గూర్చెద ద్విపదలు కోర్మెదైవార తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదియు కాజూడుడిలనెట్టులనిన. ఇదే సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తన కాలమందుండిన నానావిధ పదములను (పాటల భేదములను) గురించి యిట్లు పేర్మొన్నాడు.
పల్లెపదాలు 89
“మదినుబ్బి సంసార మాయాస్తవంబు పదములు “తుమ్మెద పదముల్” “ప్రభాత పదములు” “పర్వత పదము” “లానంద పదములు” “శంకర పదముల్” “నివాళి పదములు” “వాలేశు పదములు” “గొబ్బి పదములు” “వెన్నెల పదములు” సెజ్జ వర్ణన, మరి “గణ వర్ణన పదము” ఆరవ ఘోషణ ఘూర్జిల్లుచుండ బాడుచు నాడుచు పరమహర్షమున....” జానుతెనుగులోనేమి విశేషము? అనిన సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో మరలనిట్లు పల్మినాడు. “ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన, మానుగా సర్వసామాన్యంబుగామి, జానుతెనుగు విశేషము ప్రసన్నతకు” సోమనాథుడు పేర్మొన్న తుమ్మెదపదాలు, ప్రొద్దు పొడుపు పాటలు, నివాళి పాటలు, వాలేశు పాటలు, గొబ్బిళ్ళు, వెన్నెల పాటలు ఇవన్ని యెందరికి తెలియును? ఇందులో చాల భాగము నశించినట్లే కదా? తెనుగువారు సంస్కృత కవులననుసరింపబోయి అటు పూర్తిగా సంస్కృతాన్ని సాధించలేకపోయిరి. ఇటు తమ జాతీయతను పోగొట్టుకొనిరి. పైగా తమ స్వచ్చతను నిలబెట్టే దానికి ప్రయత్నం చేసిన మహానుభావులను బాగా వెక్కిరించినారు. “ఇవేం పాటలోయ్, పిచ్చికుంట్ల పాటలు, ముసలితనాన మిండరికమువలె మొగడుపోయిన పిదప జేసే లంజరికము వలనే ఉందే” అని కొక్కిరించినాడట శ్రీనాథకవి సార్వభౌముడు. అతని ఆసరాచూచుకొని వేణుగోపాల శతకం వ్రాసినాతడు “ఇదేటి ద్విపదనోయ్. ముసలితనాన లంజరికం చేసేదాని సరసంగా ఉందే” అని వెక్కిరించినాడు. విజయనగర రాజులు, రెడ్డిరాజులు మరీ విజృంభించి పూర్తిగా దేశికవితను అణగద్రాక్సిరి.
90 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ధనికులు కృతక లోకంలో సంచారం చేసినారు. బీదవారు దిక్కులేక వెర్రిచూపులతో చూచినారు. పండితులు రాణివాసాల ముచ్చట్లు వ్రాసినారు. గిరికాదేవి, వరూధిని, యామినీ పూర్ణ తిలక వంటివారు విరహతాపాలు పొంది చిగురుటాకులు కలువలు తెప్పించుకొని వాటిపై పండుకున్నారు. ఉస్సురంచూ బుసకొట్టినారు. చంద్రుణ్ణి ఏడుతరాలటూ ఏడుతరాలిటూ ఎగదీసి దిగతీసి చెడతిట్టినారు. మన్మథుణ్ణి మరీ తూర్చారబట్టినారు. కోయిలలను ఒక చెట్టు మీదనైనా ఒక క్షణమైనా కూర్చోనిచ్చిన వారు కారు. ఇట్లు నానా భీభత్సపడినారు. చదువురాని వారికి కీలకాలన్ని తెలియకపోయెను. చంద్రమ్మ యెంకయ్యలు తమకు వచ్చినట్లు వినోదం చేసుకున్నారు. బుద్ధులు చెప్పేవారు లేనందున ఇచ్చావిహారంగా (ప్రవర్తించుకున్నారు. లేకపోతేనా చంద్రమ్మ ముందుర గిరికాదేవి నాల్గు గిరాట్లు కొట్టియుండేది. పామర జనులు తమకు తోచిన భావాలను దేశీయగానములలో ద్విపదలలో రగడలలో పాడుకున్నారు. అవియే వారికానందము కలిగించి వారి జీవితాలను తరింపజేసినవి. పల్లెటూరి వేదాంతులు తమకు తోచిన తత్వాలు పాడినారు. జనులు గుంపులు గుంపులుగా మూగినారు. వారికి దాసానుదాసులైనారు. పీఠాధిపతులు అప్పుడప్పుడు తమ ప్రాంతాలకు ఏనుగునెక్కి భేరీభాంకారములతో పంచమహాధ్వనులతో సకలాట్ట హాసములతో వచ్చేవారు. పెద్ద పెద్ద సిద్ధాంత చర్చలు చేస్తే పల్లెటూరివారు మనకేమి తెలుస్తుంది పదరా అని వెళ్ళిపొయ్యేవారు. ఉగాది దాటిందంటే జంగం కథ వారు వచ్చి తాంబూరా ఢక్కా తీసుకొని తాండ్ర పాపారాయుని కథనో, బాలనాగమ్మ కథనో, కాంభోజరాజు కథనో, స్థానిక వీరుల సుద్దులనో తందాన తాన లయ యుక్తముగా రాత్రుల్లంతా పాడినప్పుడు పిల్లలూ తల్లులూ ముసలివారు, కాపులూ, గొల్లలూ, మాలలూ, మాదిగలూ మున్నగు జాతుల వారంతా ముచ్చటగా వినిపొయ్యేవారు. బయలు నాటకాలో తోలుబొమ్మలోవస్తే మునిమాపే జనులు ఊరి ముందటి బయలంతా నిండిపోయి గొంగళ్ళను వేసుకొని ముచ్చటగా కూర్చునేవారు. ఈ విధంగా రాజాదరణ లేకున్నా పండితులు నిరసించినా, కవులు వెక్కిరించినా, బీద జనులు మాత్రం తమ నిజమైన “దేశికవితొను పోషించుతూ వచ్చినారు.
“ఈ దేశికవితలో ఏమైనా పొగడదగిన విషయముందా? ఎందుకింత ఆర్భాటం చేస్తారు. ఏదీ? ఏమీ విశేషమో చూపించండీ” అని భాషా సనాతనులెవరైనా
పల్లెపదాలు 9
హుంకరించవచ్చును. మనవి చేసుకుంటాను వినండి. సవాలుకు సవాలు చేస్తే అదే మంచి జవాబు. “మీ ప్రాబంధిక కవిత్వంలో మీరేమి గొప్ప తనం చూపించుతారయ్యా” అని ప్రశ్న వేయుచున్నాను. ఎంతసేపు చెప్పినా పంచకావ్యాల మాటే. అందు అస్వాభావికము, కృతకము ఎంత కలదో చెప్పండి. పదాడంబరము కవిత్వమేనా? నోరుబట్టని సంస్కృత దీర్ణసమాసాలు తెనుగేనా? వర్ణనలన్నీ సహజమేనా? కథలలో నవ్యతయున్నదా? లేక “ఉండంగా ఉండంగా ఒక రాజుండె, ఆయన వేటకు పోయెను, ఒక సుందరాంగిని చూచెను. మన్మథుడు నాయికా నాయకులపై బాణాలు వేసెను. ఇద్దరున్నూ పొర్లి పొర్లి చచ్చే అంత విరహతాపం అనుభవించి, ఎట్లో భేటీ అయినారు. తర్వాత పెండ్లి, శోభనం, పుత్ర జననం, కథ కంచికి మనమింటికి” ఇంతకు మించిందిం కేమైనా ఉన్నదా? కొన్ని ఉత్తమ గ్రంథాలున్నవిలెండి, అవి వేళ్ళమీద లెక్కకు వచ్చేవిగా నున్నవి.
మరి తందాన కథలలో, పాటలలో, జానపదుల గేయాలలో, స్రీల పాటలలో నిజమైన కవిత ఉంది. ఉత్రేక్షాతిశయోక్తులను, శాప్రోక్తముగా సరిచూచి వీరు వ్రాయించుకోలేదు. ద్వ్యర్థిత్యర్థి చతుర్ధి అను వ్యర్థములను గాని, చక్ర, నాగ, ఖద్దాది బంధాలను గాని చెక్కించుకోలేదు. వీరి భాషను మనమింకా నేర్చుకోవలసియున్నది. వీరి పాటలలో నిజమైన తెనుగు నుడికారమున్నది. సూటిగా మనకు తగిలే భావాలున్నాయి. వీరి కథలకు భాష్యకారులతో, పౌరాణికులతో, వ్యాఖ్యాన కర్తలతో అవసరము లేదు.
“అయితే వీటివలన నేమి లాభమయ్యా” అని ఒక గడ్డు పండితుడు నిలదీసి అడుగవచ్చును. మాటకు మాట. “మీ ప్రబంధాల వల్ల ఏమి లాభమయ్యా” అంతకంటే ఎక్కువ లాభకారి కాకున్నా అంతమాత్రమైనా లాభకారిలెండి. ఏ జాతి తన పూర్వ సంస్కృతిని, తన జనుల విశ్వాసములను, భారత గాథలను, కథలను, పాటలను విస్మరించునో ఆ జాతికి నిష్ఫతియే లేదు. పాశ్చాత్య దేశాలలోను గత శతాబ్దములో (Folk Tales) జనుల కథలను, (FOlk 50185) జనుల పాటలను, (Ballads) వీర గాథలను ఉదహరించినారు. ప్రాబీనమందు పాళిలో బౌద్ధ జైనులు వ్రాసిన “జాతక కథలు” సంస్కృతమందు వ్రాసిన హితోపదేశ కథలు, భేతాళ పంచవింశతి, పంచతంత్ర కథలు, కథాసరిత్సాగరము ఇట్టి వాటిలోనెల్ల పిట్ట కథలు, నక్క బావ కథలు, పిల్లిమామ కథలు ఎందుకు వ్రాసినారు వారంతా పిచ్చి పుల్లయ్యలేనా మరి.
92 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
క్రీశ. 1703లో స్మాట్లండు దేశీయుడగు ఆండ్రూ ప్లెచ్చర్ అను దేశభక్తుడు “ప్రతి జాతి యొక్క జానపదములు ఆ జాతి యొక్క శాసనాల కన్నను ముఖ్యమైనవి” అని సెలవిచ్చెను. మన తెనుగు వారిలోని జానపదులు చారిత్రక గాథలు, శృంగారము, వేడుకలు, వినోదాలు, కష్ట సుఖాలు అన్నింటిని గేయ రూపములో పాడుకొంటూ వచ్చినారు. శోభనాలు, సువ్వాలలు, ధవళాలు, సుద్దులు ఇవన్నియూ గాన యుక్తములే. మోటకొట్టినా, కలుపు తీసినా, దంచినా, విసిరినా, బంతి తిప్పినా, చేల కోతలు కోసినా, పండుగలు పబ్బాలు చేసుకొన్నా తుదకు శవాన్ని కాటికి తీసుకొనిపోయినా తదనుగుణ్యమైన గానములను చేసినారు. ఇవన్నియు నుద్ధరించినచో భాషకు గొప్ప అభివృద్ధి. కవితకు విజృంభణము, జన సామాన్య సముద్ధరణానికి సులభ మార్గము అలవడుతుంది.
2
పూర్వమందు తెనుగుదేఫశములో మార్గకవిత, దేశికవిత యను రెండు విధాల కవిత్వముండినట్లు మనకు మొదటిసారి నన్నెచోడుని కుమార సంభవము ద్వారా తెలిసినట్లు చూపించియుంటిని. అయితే ఈ విభాగము తెనుగు కవులు చేసినదేనా లేక మరెందైనా ఇట్టి మర్యాద యుండెనా అని చూచిన ఇది అతి ప్రాచీనము నుండియు వర్తించినదని తెలియగలదు. ఆది కావ్యమగు వాల్మీకి రామాయణములోని బాలకాండలోని చతుర్ధ సర్గలో కుశలవులు వాల్మీకిచే రచితమగు రామయాణమును శ్రీరాముని కాలములోనే వారి సన్నిధిలోనే గాన లయయుక్తముగా పాడిరని తెలుపబడినది. ఎట్లన - శ్లో! తతస్తు తౌ రామవచః ప్రచోదితా వగాయతాం మార్గవిధాన సంపదా సచాపిరామః పరిషద్లతశ్శనై ర్చుభూషయాసక్త మనాబభూవ బాల -4 సర్గ శ్లో.31 అనగా శ్రీరాముల ప్రేరణచే ఆ లవకుశులు “మార్గము” అనునట్టి పద్ధతితో గానము చేసిరి. రాముడును చాలా ఆనందించిన వాడయ్యెను అని యర్థము. ఈ శ్లోకముపై వ్యాఖ్యానకర్త లిట్లభిప్రాయమిచ్చినారు.
“మార్గ విధాన సంపదా దేశీ మార్గశ్చేతి ద్వౌగాన ప్రకారౌ తత్రమార్గస్సార్వత్రికః దేశిక్వాచిత్య దేశిశేషణైరపేక్ష్యేణ శాస్త్ర ప్రతిపాది తో మార్గస్సార్వత్రికరాగ ప్రకారః తయోర్మధ్యే మార్గ నిర్వాహ సామగ్ర్యా గాయతాం” మార్గము, దేశి అను రెండు విధాలైన గానములుండెననియు, మార్గవిధాన గానము దేశమంతటను వ్యాపించినట్టి సార్వత్రికమైనట్టిదనియు, దేశి విధాన గానము కేవలము క్వాచిత్మమైనదనియు అనగా కొన్ని ప్రాంతాలలో నుండినట్టిదనియు వ్యాఖ్యాన కర్తలు తెలిపినారు. అనగా మార్గ గానము సంస్కృత భాషాయుక్తమనియు దేశిగానము, ప్రాంతీయ ప్రాకృతాది భాషలతో కూడినట్టిదనియు మన మర్థము చేసుకొనవచ్చును. మొదటి వ్యాసము వ్రాసిన తర్వాత ఏప్రిల్ నెల మాడరన్ రెవ్యూ చూచితిని. అందు “ఊర్మిళాదేవి నిద్ర” అను తెనుగునాటి పాటను ఇంగ్లీషు ఛందస్సులో అనువదించి 5-6 పుటల పెద్ద వ్యాసాన్ని దేవేంద్ర సత్యార్థి అనువారు వ్రాసినది చూచితిని. నేనున్నూ ఎన్నెన్నో గ్రంథాలు చదివినానని గర్వించిన వాణ్ణి కదా- మరి మాడరన్ రెవ్యూలో ఒక పంజాబీ పండితునిచేత శ్రమించి సంపాదించినట్టి తెనుగు దేశములోని ఆడువారు పాడుకొను పాట నింతవరకు చూడకపోతినే అని వెంటనే గ్రంథమెంతటిదో వెలయెంతనో తెలియక 6 అణాలు మనిషి చేతిలో బెట్టి గుజరీ పాతచ్చులో దొరకవచ్చును “ఊర్మిళాదేవి నిద్ర అనే పుస్తకాన్ని కొనుక్కురా అని పంపితిని. 8 పుటల గ్రంథము వెల ఒక అణా. అందు ప్రారంభమిట్లున్నది. శ్రీరామ భూపాలుడూ పట్టాభి షేకుడై కొలువుండగా భరత శత్రుఘ్నులపుడా సౌమిత్రి వరునకు సేవలు చేయగా ఈ ధాటిపై కథంతా నడిచింది. ఇట్టివింకా చాలా కథలున్నవని విన్నాను. ఒకనాడు పని కల్పించుకొని పాతచ్చు పెద్దచ్చు పుస్తకాల వారి వద్దకు పోయి అవన్ని
94 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
సేకరించుతానులెండి. అయితే చెప్పవచ్చినదేమంటే మన తెనుగు ఊర్మిళను గౌరవింపకపోతిమి. ఇంగ్లీషులో కెక్కవరకు గౌరవము కలిగినది. చూచినారా? ఇతర రాష్ట్రాల వారు దేశికవిత నుద్ధరించుటకై యెంత కృషి చేయుచున్నారో?
పూర్వము మనదేశములో “కోలన్న” లేక “కోలాటము” అను వేడుక ఆటపాటలతో కూడినది సాధారణముగా నుండెడిది. ఆడువారు కోలాటమును జడవలె త్రాళ్ళనల్లుట ఇప్పటి నాగరికులకు పరిచితమైంది. కాని పురుషులు 10-12 మంది కలిసి యెత్తులు అందెలు వేయుచు పాటలు పాడుచు కోలలు కొట్టుచు పండుగల వేళలలో వెన్నెల రాత్రులలో వినోదాలు చేసేవారు. సుమారు 200 ఏండ్ల క్రిందటి వాడగు గండ్లూరు నరసింహరాయ కవియను కర్నూలు మండల కవి తన భాషీయదండకములో ఒక స్రీచే నిట్లు పలికించినాడు. “నీవాడ కోలన్న వేస్తుండగా చూసినాల్నుండి నాకిట్లరా తాపమంటింది. (విరహతాపము కలిగింది)” ఇప్పుడు మన దేశీకోలన్న మాయమగుచున్నాడు. పండరి భజనలు ఆస్థాన మాక్రమించుకున్నవి. ఈ కొత్తదానిలో మన పూర్వపు దానిలోని ధాటి, దర్జా, వీరత్వము కానరావు.
మనదేశములో జంగము కథలు (తందాన కథలు) ఎన్నియున్నవి, విద్యావంతులమనుకొన్నవారు వాటిలో ఒకటి రెండైన ఎప్పుడైనా విన్నారా? మరి భావకవులమని చెప్పుకొనుచు ప్రబంధాల పేరు చెప్పితే తలనొప్పి కలిగిందని తలపట్టుకొనువారు, ఈ జంగము కథలలో పాట, భావము, చరిత్ర, వర్ణన, సులభశైలి, అచ్చతెనుగు నుడికారము, అన్నియు నున్నవి కదా. ఉద్ధరించే ప్రయత్నమేమైన చేసినారా? ఈ నిజాము రాష్ట్రములోనే వనపర్తి సంస్థాన పూర్వికులగు సవై వెంకటరెడ్డి, రాజారామేశ్వరరావు అను వీరుల కథలను, చించోడివారి పూర్వీకుల కథలను, గద్వాల వారిలో సోమనాద్రి కథను, పాపన్న వారి పూర్వీకులలో రాణీ శంకరమ్మ, నరసింహారెడ్డి సదాశివరెడ్డి కథలను తందానవారు తరతరాలనుండి చెప్పుచున్నారు కదా! పై సంస్థానాల వారు తమ పూర్వీకుల యశోగానాలను సమకూర్చి సంస్కరించి, చారిత్రక సమన్వయముతోను, ఇతరాధారాములతోను కూడిన పీఠికతో ముద్రించరాదా? అదొక కష్టమా? నష్టమగు కార్యమా? నిజాం రాష్ట్రములో ఇంకను ఎన్నియో కథలు ఆదరము లేక కాలగర్భములో పడి మాయమగుచున్నవి. భాషా సేవ జేయదలచిన వానికి చేతి నిండుగా పనియే దొరకును.
పల్లెపదాలు 95
స్రీలకు విద్య యెందుకు? స్త్రీలను నమ్మరాదు; (పురుషులను మాత్రము నమ్మవచ్చునేమో, పాపము వారెంతటి మేదకులో యేమో) స్రీలకు చదువు వచ్చిన తంటాలు చేయుదురు అను భావాలు హిందువులలో విశేషముగా వ్యాపించిపోయెను. ఆ కారణముచేతనోయేమో (స్రీలు ఊర్మిళాదేవి నిద్రవంటి పాటలపై అభిమానము కలవారైరి. పెండ్లి 'పేరంటములలోను, పండుగలలోను, స్రీలు నానా విధములగు పాటలను పాడుకొని కాలము వెళ్ళబుచ్చుకొందురు. ఇప్పుడు ఆ సంతతివారు కూడ అరుదగుచున్నారు. ఆధునిక స్ర్తీలకు పాతదంతయు మోటైపోవుచున్నది. తమ జాతీయ సంస్కృతిని విస్మరించుచున్నారు. కాని పాశ్చాత్య పద్ధతిలో అమిత దుష్టములగు నాచారములే మనవారి కెక్కువగా పట్టుబడుచున్నవి. వృద్ధులైన స్త్రీల నుండి పాటలనన్నిటిని సేకరించి వ్రాసుకొని కాపాడుట చాలా యవసరము. నానా ప్రాంతములలో ఇప్పటికిని పాటలు నేర్చినట్టి ముదుసళ్ళగు ఆడువారు చాలామంది కలరు. ఆ ముసలమ్మలు మోటువారనియు, విద్యాశూన్యులనియు, మూర్భులనియు, నవనాగరికులు భావించినందున వారిలో దాగినట్టి గేయ వాబ్మయము ప్రకాశమగుట లేదు.
ఈ సందర్భములో ఒక సూచన చేయదలచినాను. మన ఆంధ్రులను ఆశ్రయించుకొని ఆంధ్రులుగానే పరిగణింపబడునట్టి అడవిజాతులవారు కలరు. చెంచులు అను తెగవారు కర్నూలు జిల్లాలోను మహబూబు నగరము జిల్లాలోను ఆ(మ్రాబాదులోను కలరు. అనగా శ్రీశైల ప్రాంతములో వీరున్నారు. మరియు “కోయదొరలు” అనుపేరుతో కోయజాతివారు వరంగల్ జిల్లాలోనున్నారు. సవరలు గంజాం జిల్లాలో కలరు. ఈ సవరలు (శబరులు) ఆంధ్రులు కారు. కాని పై చెంచుకోయవారాంధ్రులు. వారికి సమీపములోగల నాగరికులు వారి నుద్ధరించు విషయములో ఏమియు శ్రద్ధ తీసికొనుటలేదు. ఏ ఇంగ్లాండునుండియో, ఏ అమెరికా నుండియో వచ్చిన పాద్రీలు ఇట్టి జాతులకై (శ్రమించుచున్నురు. వీరి భాషకు వ్యాకరణాలు, గ్రంథాలు వ్రాసినారు. వీరికి బళ్ళు స్థాపించినారు. వీరితో జీవితాలు గడిపి సంస్కరించినారు. మరి మనము వారి ప్రక్మననే యుండియు వారి భావాలు, వారి ఆచారాలు గమనింపకపోతిమి. ఈ చెంచుల నాటకము చాల అందముగా నుండును. వీరి పాట, వీరి ఆట మన ఆంధ్రులెల్లరు చూచినారు. గావున వీరికి
96 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
సమీపములోనుండు మహబూబునగరు, వరంగల్ జిల్లా ఆంధ్రులు చెంచు కోయ సోదరుల విషయమై మంచి శ్రద్ధ తీసుకొని వారి పాటలను సేకరించగలరు. అవి కూడా భాషకుపకరించుకునేమో!
భారతదేశములోని మహారాష్టులు, కర్ణాటకులు, బంగాళీలు, హిందీవారు, తమ తమ భాషలలోని పల్లె పాటలను అప్పుడే సమకూర్చి అనేక గ్రంథాలను ముద్రించినారు. మన తెలుగులో ఒక గ్రంథమైనా ఈ విషయానికి సంంధించినది కలదా? లేదు మరి తక్కిన భారతీయులకన్న మనమే తెలివిపరులమా యేమి? ఈ గేయ వాబ్మయాన్ని ఉద్ధరించుటలో గ్రాంథిక వాదులకన్న భావకవుల మీదనే యెక్కువ భారమున్నది.
తి
ఇదివరలో వల్లెపాటల యొక్క ప్రాముఖ్యమును వీలైనంతవరకు తెలుపుకున్నాను. అయితే ఇది ఎవరో నావంటి చాదస్థులకు పట్టిన పిచ్చియేనా కాక మరెవ్వరైనా యిట్టి పిచ్చివారున్నారా అని కొందరికైనా సంశయము కలుగవచ్చును. భారతదేశములో మనము తప్ప తక్కిన అన్ని భాషల వారును జానపదుల వాజ్మయమును సేకరించి ఉద్ధరించి సమకూర్చి ముద్రించి తమ తమ భాషా సముద్ధరణమునకు తోడ్చడినారు. రెండవ వ్యాసములో దేవేంద్ర సత్యార్థి గారు మాదరన్ రెవ్యూలో వ్రాసిన మన ఊర్మిళాదేవి నిద్రను గురించిన దీర్భ వ్యాసమును గురించి సూచించితిని. సత్యార్థిగారు పంజాబు వాస్తవ్యులు. వారు మన తెలుగుదేశానికి వచ్చి తెనుగు వారి పరిచయాన్ని కలిగించుకొని మీలోనున్న పాటలేమి? అని విచారించి వాటిని సమకూర్చుకొని తర్జుమా చేసుకొని కష్టపడుచున్నారు కదా? వారి (శ్రద్ధలో శతాంశమైన మనకు కలదా? ఈ సత్యార్థి గారు బెంగాలు, కాళ్ళీరు, అయోధ్య, నాగపూరు, ఆంధ్ర, కర్ణాటక మున్నగు ప్రాంతాలన్ని తిరిగినారు.
ఈ సత్యార్థిగారు “రూరల్ ఇండియా” అను మాసపత్రికలో జనవరి సంచికలో “భారతదేశపు పల్లెపాటలే జాతీయ వాజ్మయము” అనునొక అమూల్య వ్యాసమును వ్రాసినది చూడ తటస్థించినది. దానిని చదివిన తర్వాత మనమెంత వెనుకబడినామో మన వాజ్మయానికి మనమెట్లపచారము చేయుచున్నామో మనకెంత అ[శ్రద్ధయు
పల్లెపదాలు 97
అనాదరణమును మన సోదరుల పాటలపై కలదో విశదమగును. సత్యార్థిగారు వ్రాసిన వ్యాసము నుండి కొన్ని భాగాల నిందుదుహరింతును.
“పంజాబులో నూర్లకొది గొల్లలు మంచి మంచి భావయుక్తమైన పాటలు పాడుచున్నారు.
గోండులు అను అడవిజాతి వారిలో మంచి సుందరమైన గానాలు కలవు.
“ఆంధ్ర దేశమందు పల్లెపడుచులు ప్రత్తి విరుచునపుడు ముద్దయిన పాటలు పాడుదురు”.
“పఠాన్ స్రీలు శతాబ్దముల తరబడి అందమైన పాటలు పాడుకొనుచున్నారు.
క్రీ.శ. 1872లో గోవర్ అను యూరోపియన్ దక్షిణ దేశపు పల్లెపాటలు (Folk songs of Southern India) అను గ్రంథాన్ని ముద్రించినారు. ఈ వాజ్మయాన్ని తెలుపు మొదటి (గ్రంథమిదే. 1885లో సర్.ఆర్.సి. టెంపిల్ పంజాబు లిజెండులు అను గ్రంథాన్ని ప్రకటించెను. చంద్రకుమారదేవు తూర్పు బంగళా గేయములు ప్రకటించెను. దీనినే ఇటీవల రోమన్ రోలెండుగారి సోదరి (ఫ్రెంచి భాషలో తర్జుమా చేసి ప్రకటించెను. కే.యం. మున్నీ గుజరాతు వాబ్మయము అను గ్రంథాన్ని ప్రకటించి అందు చాలా పాటలు ముద్రించెను. దానికి మహాత్మాగాంధీగారు పీఠిక రాశారు. రామనరేశత్రిపాఠీగారు “గ్రామగీతములు” అను గ్రంథాన్ని హిందీలో ప్రకటించెను. ఒక రైలు స్టేషనులో కొందరు స్రీలు తమ భర్తలు కలకత్తాకు పోవుచుండగా వారిని సాగనంపుటకై ఒక పాట పాడిరి. దాని అందము చందము విని త్రిపాఠీగారికి ఆనందమైనది. ఆనాటి నుండి వారు గ్రామ గీతాలను సమకూర్చుటలో నిమగ్గులైరి. స్త్రీలు వరి పొలాలలో కలుపు తీస్తూ పాడినప్పుడు అదేపనిగా పొంచి యుండి ఈ త్రిపాఠీగారు పొలములోని వరాలపై కూర్చుని విన్నది విన్నట్లుగా వ్రాసుకున్నారు. కొన్ని గ్రామాలలోని మంది అతన్ని చూచి ఎవరో ప్రభుత్వచారుడని భయపడి దూరము పోయినారు. ఇతడేదో తప్పుజేసి జైలు నుండి తప్పించుకొని పారివచ్చినాడురా అని గుసగుసలు పోయినారు. ఎట్లయితేనేమి పట్టినపట్టు వదలని ధీరుడు. అతడు హిందీలో “కవితాకౌముది” అను పేరుతో అయిదు పెద్ద సంపుటాలు ప్రకటించినాడు. అందులో పూర్వకవిత, ప్రాచీన కవిత,
98 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
మధ్యకవిత, ఆధునిక కవిత ప్రకటించి తుది అయిదవ సంపుటములో “గ్రామగీతములు” ప్రకటించినాడు.
పండిత రామశరణదాసుగారు ఉర్టూలిపిలో “పంజాబుకే గీత్” అను గ్రంథాన్ని ప్రకటించినారు. సంత్‌రాం పంజాబీగీత్ అను గ్రంథాన్ని ప్రకటించెను. ఈ రెంటిలోను జానపదుల ్రేమగానాలు పూర్వకాలము నుండి అనుశ్రుతముగా వచ్చుచున్న వాటిని సేకరించి ముద్రించినారు.
“రాజస్టాన్‌కీ లోకగీత్” అను హిందీ పాటల గ్రంథములో 230 పాత పాటలను క్రోడీకరించి ముద్రించినారు. ఇవన్నియు రాజపుత్ర స్థానములోని స్రీల పాటలు. ఇంకను ఈ పద్ధతిపై అచ్చైన గ్రంథాల సంఖ్య పెరుగుతూ వచ్చినది.
మదన్‌లాలూగారు మార్వాడీ గీతములను, నిహల్ చందువర్మగారు మార్వాడీ గీతములను, భేటారాం మాలీగారు మార్వాడీ గీతా సంగ్రహమును, తారాచందు ఓరూగారు మార్వాడీ స్త్రీ గీత సంగ్రహమునున్ను జగదీశ సింగు గహిలోటు గారు మార్వాడకీ గ్రామగీత్‌నున్ను ప్రకటించినారు.
వెరియర్ ఎల్విన్ అను ఇంగ్లీషు పాద్రీగారు 290 గోండుపాటలను సేకరించి అరణ్యగానము ($01953 of the forest) అను పేర ప్రకటించినారు. మహారాష్ట్ర భాషలోని పాటలను కొన్నిటిని సేకరించి వామన్ కృష్ణ చోర్‌ఘారే అనువారు సాహిత్యాచే మూలధన్ అను గ్రంథాన్ని ప్రకటించినారు.
పై సత్యార్థిగారి వ్యాసములోని విషయమును చూడగా భారతీయ భాషా కుటుంబంలో చేరిన కాళ్ళీరీ, పంజాబీ, రాజస్థానీ, హిందీ, మరారీ, బెంగాలీ, గోండు, గుజరాతీ మున్నగు భాషలన్నిటిలోను గ్రామ గీతములు సేకరించి ముద్రింపబడినవి కర్ణాటకులును ఇట్టి గేయాలను ప్రకటించినారని తెలిపినాను. ఇక మిగిలిన వారము మనమే! ఇతరులను చూచియైన మనము గుణపాఠము నేర్చుకొందుము గాక. మన యువకులలో ఈ విషయమైన ఢ్రద్ధ హెచ్చగుగాక. నశించిపోవుచున్న వీర కథలు, సుద్దులు, తందాన పాటలు, ఏల పాటలు మున్నగునవన్నియు నుద్ధరింపబడు గాక!
4
మన తెనుగు దేశములోని జనులు తాము పనులు జేయునప్పుడు పాటలు
పాడుచుందురు. మోటకొట్టిన, కలుపు తీసిన, దంచిన, విసరిన, రాట్నము త్రిప్పిన,
పల్లెపదాలు 99 కళ్లాలలో బంతులు త్రిప్పిన, బండితోలిన, బరువులాగిన, ఏ కాయ కష్టము చేసినను సరే ఆ సమయములలో పాటలు పాడుచుందురు. అవన్నియు సేకరించవలసిన అవసరము చాలా కలదు.
తుదకు చిన్న పిల్లలు గూడ ఏవో పాటలు పాడుచుందురు. శ్రీ చింతాదీక్షితులు గారు పిల్లలకై వాచకములు ప్రకటించినారు. అందు పిల్లల పాటలను కొన్ని చేర్చినారు. అయినను వారుగూడ వానిలోని అంతరార్థమును గుర్తించిన వారు కారు. దానిని మొట్టమొదటిసారి గుర్తించినవారు మిత్రులగు ఆయుర్వేదాచార్య శ్రీ వేదాల తిరుమల వేంకట రామానుజస్వామిగారు. బాలబాలికల పాటలందు పెక్కింటిలో వైద్యపు చిట్కాలున్నవని వారు గుర్తించినారు. ఆ చికిత్స పాటలలో నెట్లిమిడియున్నదో ఆచార్యులవారు ఒక చిన్న గ్రంథముగానే ప్రకటించవలసినదని పలుమార్లు కోరినాను. కాని వారట్లు చేయుటలేదు.
స్త్రీలలో ముసలివారిప్పటికిన్ని పలుతావులలో కొన్ని కథలను పాటలుగా పాడుకొనుచుందురు. ఊర్మిళాదేవి నిద్ర, రామాయణ కీర్తనలు, కామేశ్వరీ పాటలు మున్నగునవి వారిలో ప్రచారమందున్నవి. వల్లభరాయుడు తన క్రీడాభిరామములో ఒక బ్రాహ్మణ వితంతువు రామాయణమును తెల్లవార్లు పాడుచుండెనని ఇట్లు వర్ణించినాడు.
ఉ. కోయిల పంచమ స్వరము కాల్చిన భంగిని విద్ధి చూచిరా మాయణ మారుకాండములు నచ్యుత జాగర వేళబాడెనా రాయ వితంతురత్న మను రాగముతోడ నమశ్శివాయ శాం తాయ సమస్త దోష హరణాయ సమానమె దాని కెవ్వరున్ కామేశ్వరీ లేక మహాలక్ష్మి పాటలను పాడుచుండిరని అదే క్రీడాభిరామమందిట్లు వర్ణింపబడినది.
100 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
గీ. _ రాగమున నుండి లంఘించు రాగమునకు
నురు మయూరు ద్వయంబుపై నొత్తగిల్ల
కావ తల్లీ మహాలక్ష్మి కైట భారి
వలపు పాడుచు వచ్చె జక్కుల పురంధ్రి
జమదగ్ని భార్యయు, పరశురాముని తల్లియునగు రేణుకను కాకతీయుల కాలములో ఏకవీరాదేవి అను పేర పూజించుచుండిరి. ఇప్పటికిని తెనుగుదేశమందు కొన్ని ప్రాంతాలలో ఈరమ్మ (ఏకవీరమ్మ) అను దేవతను పామరులు పూజింతురు. తెనుగు స్రీలకు చాలామందికి ఈరమ్మ అను పేరు కూడా పెట్టుదురు. ఈ వీరమ్మయే ఎల్లమ్మ. నేటికిని పల్లెలలో ఎల్లమ్మ దేవరను చేయుదురు. ఆమె కథను బవని వారు (మాదిగజాతిలో ఒక శాఖ) రెండు రాత్రుల వరకు చెప్పుదురు. అదంతయు రేణుకా పరశురాముల కథయే. ఈ కథలను పాడినట్లు క్రీడాఖిరామములోనే యిట్లు వర్ణించినారు. గీ॥ _ వాద్యవైఖరి కడు నెరవాది యనగ
నేకవీరామహాదేవి యెదుట నిల్చి
పరశురాముని కథలెల్ల ప్రొఢి బాడె
చారుతర కీర్తి బవనీల చక్రవర్తి
ఆంధ్రదేశమందు బహు ప్రాంతాలలో కోలాటమును పురుషులు వేయుచు పాటలు పాడేవారు. దీనినే రాయలసీమలో కోలన్న పాటలు అనిన్నీ కోలంట్ల ఆట యనిన్ని యందురు. 200 ఏండ్ల క్రిందట కర్నూలు జిల్లా కవియెన గండ్లూరి నరసింహరాయ కవియను నతడు భాషీయ దండకములో దీనిని వర్ణించినాడు. ఒక ప్రీ తన ప్రియుడు 'కోలన్న' వేయుచుండగా చూచి మరునాడతనితో ఇట్లన్నదట. “నీవాడ కోలన్న వేస్తుండగా చూచినాట్నుండి నాకి ట్లిరాతాపమంటింది- నీ మీద మొహాన నే తాళలేనోయి” (ఇరాతాపమనగా విరహతాపము)
విజయనగర చక్రవర్తులు తాము దండయాత్రలు చేయుటకుముందు ప్రొద్దుననే కొన్ని శకునాలను చూచేవారు. శ్రీకృష్ణదేవరాయలు కటకంపై దండెత్తుటకాలో చించినప్పుడు ఒకనాడు తెల్లవార చీకటిలో ఒక చాకలి యిట్లు పాడుకొనుచుండుట విననయ్యెను.
పల్లెపదాలు 101
కొండవీడు మనదేరా
కొండపల్లి మనదేరా
కాదని యెవ్వరు వాదుకు వచ్చిన
కటకందాకా మనదేరా!
పల్లెపాటలలో జన సామాన్యమందుండు భాష, భావములు పూర్తిగా నిండి యున్నవి. గ్రంథస్థ భాషలోనికి పల్లె పదాలలోని పదాలెక్కలేదు. అట్టి పదాలు వేలకొలదిగా ఉన్నవి. ఆ పదాలన్నియు ఏ నిఘంటువులందును లేవు. ఆ సుందరమగు వదాలు విద్యావంతుల అనాదరణముచేత మూలబడియున్నవి. మరియు జనసామాన్యమునుండి విద్యావంతులు దూరమగుచు వచ్చినారు. ఈ కారణముచేత భాషకు కూడా చాలా నష్టము కలిగినది. శుకసప్తతి కవితలోని కొన్ని పదాలు ఏ నిఘంటువులోనులేవు. “బందారాకు” “నభరువాడు” “కూనలమ్మ చీరో ఇట్టి పదాలు 100 వరకైనా కదిరీపతి యొక్క శుకసప్తతిలో కలవు. ఈ దేశ ప్రాంతమందలి ఈలకత్తి కూడ నిఘంటువులలో లేదు. దానిని శుకసప్తతిలోన పాడిరి. ఇట్టి పదాలలో అనేక పదాలకర్థమును మంగలివారిని పల్లెటూరివారిని విచారించి తెలుసుకొన గలిగితిని. 300 ఏండ్ల క్రిందట ఒక ప్రామాణిక కవి వాడిన పదాలకే యీ గతి పట్టినప్పుడు పల్లెపదాలలో ఎన్ని పదాలు ఇప్పుడు విద్యావంతులకర్థమగునో యేమో?
భారతదేశమం దితర భాషలలోని పల్లెపదాలను గొప్ప గొప్ప పండితులు సమకూర్చి గ్రంథస్థము చేసి పెద్ద పెద్ద సంపుటాలుగా ప్రకటించినారు. తుదకు ముండా, కోయ, గోండు, భిల్లు, సంధాలులవంటి ఆటవికుల పాటలు గూడా ముద్రితములైనవి. మనము మన పల్లెపదాలను ఇంతవరకు ఒకచోట చేర్చి ముద్రించకపోయితిమి. ఈ కార్యమును ముఖ్యముగా భావకవులు చేయవలసి యుండెను. వారు గూడా చేయకపోయిరి. ఈ నిజాం రాష్ట్రములోనే చాలా తందాన కథలున్నవి. అవి విశేషముగా మన తెనుగు సంస్థానాలకు సంబంధించినవి. మన సంస్థానాధిపతులును తమకు సంబంధించిన జంగముల కథలనైనా ముద్రింపించక పోయిరి. అవి అనాదరణచేత దినదినము నశించిపోవుచున్నవి. విద్యావంతులు పల్లెపదాలను శ్రద్ధతో ఉద్ధరించి మరల వాటికి మంచి ప్రచారమును కలిగించవలెను. కొన్ని పల్లె పదాలలో అసభ్యత కలదు. అట్టి వాటిలో మంచి భావాలను గ్రహించి అసభ్యతను పరిహరించవలెను. మంచి పాటలు వేలకు వేలు కలవు. వాటిని సేకరించితే అదొక మహోపకారమగును.
పల్లెపొటలు
స్మాట్లండు దేశీయుడు ఆండ్రూ ప్లెచర్ అనునతడు క్రీ. శ. 1208లో ఇట్లన్నాడు. “ప్రతి జాతియొక్క జానపదములు ఆ జాతియొక్క శాసనాలకన్నను ముఖ్యమైనవి.” యూరపు దేశములో పల్లెపాటల ప్రాముఖ్యమును ఏండ్ల క్రిదట గుర్తించిరి. మనవారు 2000 ఏండ్లకు పూర్వమే గుర్తించి మధ్యకాలములో అదంతా మరచిపోయి యిప్పుడు మళ్ళీ పాశ్చాత్యులను జూచి పునరుద్దరించుకొను ప్రయత్నము చేస్తున్నారు. సంస్కృతములో అనేక విధాల పాటలుండెడివి. రత్నావళి వంటి నాటకాలలో కొన్ని మనకు నిదర్శనాలు దొరుకుచున్నవి. గీత గోవిందములోని పాటలు భక్తి శృంగార రసములతో కూడినవి. పూర్వము సంస్కృతములో చాలా విధములగు పాటలుండినట్లు కాళిదాసాదుల వర్ణనల వలన తెలియవస్తున్నది. శ్లో॥ ఇక్షుచ్భాయ నిషాదిన్య స్తస్య గోప్తర్గుణోదయం ఆ కుమార కథోద్దాతం శాలిగోప్యో జగుర్యశః ॥ రఘువంశము-4-20 వరి పైరును కావలికాచే స్రీలు ప్రక్కన నుండిన చెరకు చేలలో చెరకు గడల నీడలలో కూర్చుని రఘు మహారాజు చరిత్రను పాటలుగా పాడుకొని కాలము గడిపిరి అని కవి వర్ణించినాడు. రఘు మహారాజు కాలములో పొలము కాచువారు పాటలు పాడుకొనుచుండిరని స్పష్టమైనది. శ్లో॥ _ శరైరుత్సవ సంకేతాన్ సకృత్యా విరతోత్సవాన్ జయోదాహరణం బాహార్లా పయామాస కిన్నరాన్ రఘువంశము 4-28
పల్లెపాటలు 103
రఘుమహారాజు ఉత్సవ సంకేతులను గణములను జయించిన తర్వాత కిన్నరులను ఒక దేశమువారు అతని జయోదాహరణమును పాటలుగా గానము చేసిరి. ఉదాహరణమనగా ఒక విధముగ ప్రబంధము. మన తందాన కథ వంటిది.
సంస్కృతములో దేశీగానము, మార్గవిధానగానము అను గానపద్ధతులుండెను. శ్రీరాముని చరిత్రమును వాల్మీకి మార్గవిధానముగా రచించి కుశలవులచే గానము చేయించెను. శ్లో! తతస్తుతౌ
రామవచ ప్రచోదితౌ
ఆగాయతాం
మార్గ విధాన సంపదా వాల్మీకి రామాయణము - బాలకాండ
సంస్కృతములో కన్న తెలుగులో బహు విధాల పల్లె పాటలుండెను. నన్నయభట్టు భారత రచనతో ఆ పాటలు క్రమక్రమముగా అనాదృతములయ్యెను. తుదకు ద్విపద కావ్యము రచించుట ఉత్తమ కవిత కాదను భావము ముదిరిపోయెను. అందుచేత పాల్మురికి సోమనాథుడు దాని విశిష్టతను తెలుపుటకై ప్రత్యేక శ్రద్ధను చూపవలసి వచ్చెను. తన కాలములోను అంతకు ముందు తెనుగు దేశములో ప్రచారమందుండిన పాటలను కొన్నింటిని పాల్కురికి పండితారాధ్య చరిత్రలో వ్రాసి వుంచినందున మనకు వాటి పేరులైనా తెలియవచ్చుటకు వీలు కలిగినది. తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు, పర్వత పదాలు, ఆనంద పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, గొబ్బి పదాలు, వెన్నెల పదాలు ఇట్టి వింకా చాలా పదాల జనులు “పాడుచు ఆడుచుండిరి” అని అతడు తెలిపినాడు.
ఇప్పటికిని తెనుగు దేశంలోని ప్రీలలో అనేక పాటలు నిలిచిపోయినవి. ఇప్పటికిని కొన్ని యిండ్లలో పెండ్లిండ్ల కాలములో సువ్వాలలు, ధవళాలు పాడుదురు. కలుపు తీయునప్పుడు, కల్లము చేయునప్పుడు రాటము త్రిప్పునపుడు, మోటకొట్టు నప్పుడు, విసురునప్పుడు దంచునప్పుడు, చాలామంది పాటలు పాడుచుందురు. పనితోపాటు పాటలుండును. అదుచేతనే కాబోలు “పనీ పాటా” అను సామెత మన భాషలో కలదు. స్రీల పాటలలో కామేశ్వరీ పాట కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో
104 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
కలదు. అదే మల్లమ్మ పాటగా పరిణమించినట్లు కానవస్తున్నది. గుజరాత్ దేశములో గర్భ నృత్యమున్నది. లంబాడీలట్టిదే ఆడుదురు. అదే విధమగు నృత్యాన్ని మన తెనుగువారు తెలంగాణములో బతకమ్మ అనుపేరుతో దేవి నవరాత్రులలో ఆడుచు పాడుచుందురు. దీనినే కర్నూలు జిల్లాలో “బొడ్డెమ్మ” అను పేరుతో వెన్నెల రాత్రులందు స్రీలు ఆచరిస్తూ ఉందురు. పురుషులు కోలన్న పదాలను పాడుచు ఆడుచుందురు. వెన్నెల రాత్రులందే ఈ ఆటనాడుదురు. దీనినే కొద్ది భేదముతో కోలాటమని బాలికలచే ఆడింతురు.
అప్పకవి కాలములో కూడా పల్లె పాటలు కొల్లలుగా ఉండెను. అతడు తన ఛందస్సులో ఇట్లు తెలిపెను. “అసంఖ్యా బద్ధములగునవి పాటలు. రచనలు వృత్తములని, జాతులని రెండు తెగలవి కలవు. అందు జాతులనునట్టివి పాటలు. మంజరి, రగడ, కళిక, లాలిపాట, ధవళాలు, సువ్వాలలు అనునవి పాటలు. కన్నడ భాషలో ఒక్క ద్విపదలో ద్విపద, త్రిపద, షట్పద అను భేదాలు చాలా ఉండుటయేగాక వాటిలో గొప్ప కవులు చాలా రచనలు చేసిరి. మన తెనుగులో ద్విపదయే ఆలా పాటలకు మూలము. దానిని మధ్యలో విరిచి తుమ్మెద, వెన్నెల, తందాన మొదలగు ఊత పదాలను వాడుతూ ఇద్దరు వ్యక్తులు పాడుట పరిపాటి. శృంగార గానములను జావళీలందురు. తెనుగులో క్షేత్రయ్య, సారంగపాణి రచించిన జావళీలు ప్రసిద్ధములైనవి.
వైద్యులు కూడా తమ చికిత్సలను పిల్లల పాటలుగా రచించి ప్రచారము చేసిరి. కాని అవి అర్థము లేని తిక్క మాటల జోడింవు అని అందరున్నూ అనుకొనుచుండిరి. బాలబాలికల పాటలలోని కొన్నింటిలో గొప్ప వైద్య, చికిత్సలు కలవని మొట్టమొదట కనిపెట్టిన వారలు శ్రీమాన్ వేదాల తిరుమల రామానుజ స్వామిగారు.
తెనుగు దేశములోని పోతులూరి వీరబ్రహ్మం, యాగంటయ్య, తోటి గజేంద్రుడు, దూదేకుల సిద్దప్ప మొదలగు భక్తులు తమ బోధలన్నింటిని పాటలలోనే రచించి ప్రచారము చేసిరి.
హిందూస్థానములోని ఇతర భాషా సోదరులు మనకంటే ముందుగానే బాగా మేల్కొని యున్నారు. దేవేంద్రసత్యార్థి అను పంజాబీ రసికుడు పల్లె పాటలనుద్ధరించుటకే తన యావజ్జీవితము నర్చించియున్నాడు. అతడు భారతదేశమందలి అన్ని ప్రాంతాలలో
పల్లెపాటలు 105
తిరిగి అన్ని భాషలలోని పల్లెపాటలను సమకూర్చుతున్నాడు. రామనరేశ త్రిపాఠీ అనునతడు కవితా కౌముది అను పేరుతో హిందీ పాటలను సమకూర్చి ముద్రించినాడు. పంజాబు గీతాలు, మార్వాడ గీతాలు, కన్నడ గీతాలు ముద్రితమైనవి. తుదకు గోండులను అడవి జాతులవారి గీతాలను గూడా ఎల్వి అను మిషనరీ సమకూర్చి ముద్రించినాడు. మన తెలుగువారింకను ఈ విషయములో ఎక్కువ (శ్రద్ధ బూనలేదు. స్త్రీల పాటలు అనునవి కొన్ని చాలా ఏండ్ల (క్రిందట ముద్రింపబడెను. ఈ మధ్య కొన్ని పిల్లల పాటలు ముద్రితమైనవి. మన తందాన కథను (బుర్రకథలను) పండితులు సంస్కరించి చక్కని పీఠికలతో ముద్రించు ఆలోచన ఇంకా చేయలేదు. హైద్రాబాదు రాష్ట్రములో ఎన్నో చారిత్రక గాథలు తందాన కథలుగా ఇంకా నిలిచియున్నవి. వాటిని ముద్రించే ఆలోచన ఎవరున్నూ చేయుట లేదు. గద్వాల వనపర్తి పాపన్నపేట సంస్థానాల పూర్వరాజుల వీరగాథలు చాలా రమ్యమైనవి కొన్ని కలవు. ఆ సంస్థానం వారికే తమ పూర్వుల గాథలపై అభిమానము లేకపోయెను. వారికభిమానం కలిగితే అవి దిక్కులేని చావు చావకుండ బ్రదికి యుండగలవు. తెలంగాణములో ప్రతి చోటనూ వీర గాథలు కొల్లలుగా గలవు. ప్రతి ఊరిలోనూ ఎన్నో సుందరమగు పాటలు కలవు. ఆ పాటలలో ప్రబంధాలలో దొరకని చక్కని జాను తెనుగు పదాలు కలవు. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు వాటిని సేకరించి ముద్రించుట భావ్యము. భావ కవులు అభినవ సారస్వతమువారు, నవ్య కవితా కుమారులు ఈ కార్యమునకు పూనుకొనవలెను. పల్లెపాటల నుద్ధరించిన భాషకు కూడా చాలా లాభము కలుగును.
తెనుగు దేశంలోని గుంటూరు బెజవాడ మధ్య ప్రదేశములో చంద్రమ్మ వెంకయ్య పాటలు కలవు. అవి మంచి పాటలే అయినను కొందరు అందు తమ బూతు రచనలు చేర్చి వాని స్వరూపమును మార్చినారు. చంద్రమ్మ వెంకయ్యల గాథలో అనేక విశిష్టతలు కలవు. చంద్రమ్మ కాపు కులములోని పడుచు. వెంకయ్య మాల, ఇద్దరికి పొలాల కాచునప్పుడు ప్రేమ కలిగినది. వారు వివాహమాడదలిచిరి. సంఘము ఓర్వలేకపోయెను. వారు సంఘ బహిష్మరణకు, సంఘ దౌర్జన్యమునకు గురియై తుదకు ఆత్మహత్యలు చేసుకొనిరి. ఇట్టి విషాద గాథలో ఆ యిరువురి భావాలు ఎంతో మనోహరముగా దానిని రచించిన అజ్ఞాత కవి చిత్రించినాడు.
106
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“మిడి మిడి యెండలో నడిచి వస్తుండావు జోడు కుట్టి తెచ్చినానే చంద్రమ్మా -
ఆకు చెప్పులు కుట్టినానే చంద్రమ్మా” -
“మాలోన్ని పెండ్లాడ్తె మర్యాద పోతాది మాట్లాడ కూరకోవే చంద్రమ్మా” -
“ఏడు కొండల రేడు వేంకటేశ్వర స్వామి కడకు పోయీ మొక్కులడుక్నొని వద్దామా మీ తల్లితో చెప్పిరావే చంద్రమ్మా” -
“ఇద్దరము కలిసి ఏకమొగముంటేను ఏడు లోకాలు
మన కాడనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళ వద్దే చంద్రమ్మా -
ఇక్కడనే ఉండిపోదామే చంద్రమ్మా” -
పల్లెపాటలు 107
“గోదావరికి పోయి గోవిందునికి మొక్కి కడతేరి పోతానురో
వెంకయ్య - కడసారి చూపిదేరో
యంకయ్య”
“స్వర్గ లోకములో చల్లనీ చోటులో సరసము లాడుదామే చంద్రమ్మా - చందమామను చూతమే చంద్రమ్మా” -
ఇట్టి వెన్ని అజ్ఞాత వాసము చేస్తున్నవో ఆంధ్ర విజ్ఞాన ప్రియులంతా అన్వేషించి వాటి నుద్ధరించవలసి యుండునని మనవి చేస్తున్నా.
జీవిత చరిత్రలు - వాటి రచన
జీవిత చరిత్రలకూ దేశచరిత్రలకూ సన్నిహిత సంబంధం కలదు. మహా పురుషులే దేశ చరిత్రలకు ముఖ్యకారకులు. ఒక్కొక్క మహాపురుషుడు తన శక్తి చేత గొప్ప భూభాగమునే కాక ఖండాలనే మార్చిపోయినాడు. ఏసుక్రీస్తు, మహమ్మదు, బుద్దుడు గొప్ప మత పరివర్తనము కావించి పోయినట్టివారు. అలెగ్జాండరు, హానిబాల్, నెపోలియన్ చక్రవర్తి, అశోకుడు మరొక వర్గానికి చేరినట్టివారు. వారు శూరులును, సాహసికులునునై యుండిరి, కొలంబసు, కుక్, వాస్మోడిగామా వంటి నావికులు కూడా ప్రపంచముపై తమ ప్రభావము వేసిపోయిరి. కొలంబసు తేరకు తేరగా అమెరికాను స్పెయిను కిచ్చెను. కుక్ అనువాడు ఆస్ట్రేలియాను చూడబోయి అచ్చట ఇంగ్లీషు జండాపాతి ఇది మాది అనెను. వాస్మోడిగామా ఇండియాకు దారితీసే పాశ్చాత్యులకు ఇండియాను అప్పగించుటకు పాటుపడెను. వాట్, స్ట్రీవెన్సన్, గూటెన్ బర్జు, రైటు సోదరులు మున్నగు వారు చాలా గొప్పవారు. వారు రసాయనాది శాస్త్రాలలో ప్రవీణులై రైళ్ళు, ఇంజనులు, అచ్చుయంత్రాలు, విమానాలు మున్నగునవి కనుగొని ఏషియా, ఆఫ్రికా ఖండాల ఆర్థిక విజయమునకు కారకులైరి.
పై విషయాలను బట్టి మతకర్తలు, సేనానులు, రాజులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు వీరందరూ చారిత్రక పురుషులని విశదమగును. వారిని ఆదర్శముగా తీసుకొని తర్వాతి కాలములో క్రొత్తవారు బయలుదేరి ప్రపంచ కళ్యాణమునకు తోడ్చడుట కవకాశమేర్చడును. జీవిత చరిత్రలు నీతిని బోధించును. మన పూర్వుల మంచి చెడ్డలను తెలుసుకొని మనము వాటివల్ల లాభం పొందగలము.
జీవిత చరిత్రలు వ్రాయుటలో గ్రీకులో ప్రథమంలో క్రీస్తునకు పూర్వమందే క్షణఫ్ అనునతడు సోక్రటీసు చరిత్రను వ్రాసెను. హ్లటార్ అనునతడు 46 మంది గ్రీసు రోముదేశాల మహాపురుషుల జీవితమును వ్రాసెను. గ్రీకుల తర్వాత జీవిత చరిత్రలు వ్రాయుటలో రోమువారు ప్రసిద్ధులు.
జీవిత చరిత్రలు - వాటి రచన 109
హిందువులలో చరిత్రలే లేకుండెనను అపవాద మున్నందున ఇక జీవిత చరిత్రల కెక్కడ తావున్నది. హిందువులు ఒక విధముగ ప్రపంచములో మొట్టమొదట జీవిత చరిత్రలు వ్రాసినవారు. కాని ఆ మాటను నమ్మకుండునట్లుగా తర్వాత మనవారే చేసి వేసినారు. మన పురాణములు జీవిత చరిత్రలతో నిండియుండెను. రామాయణము శ్రీరాముని జీవిత చరిత్రము కాదా? దానిని చదువని లేక వినని హిందువు లేడు కదా! భాగవతము శ్రీకృష్ణుని జీవిత చరిత్రము, దానిని విననివారు అరుదు. హరిశ్చంద్రుని చరిత్ర, నలచరిత్ర, అజామిళుని చరిత్ర ఇట్టివి వేలకొలది కలవు. అవన్నీ జీవిత చరిత్రలే! కాని హిందువులలో ఒక లక్షణమున్నది. తమకు నచ్చిన వారిని దేవతలుగా చేసిరి. మెచ్చని వారిని రాక్షసులుగా చేసిరి. ఆ చేయుటలోనూ మహిమలతో పూర్తిగా నింపివేసిరి. ఈ కారణాలచేత నిజమైన చరిత్ర మాటుపడి, నమ్మరానిదై పోయెను. అంత ప్రాచీన కాలపు ముచ్చట్లు వదలినా నిన్న మొన్నటి అనగా 200 ఏండ్ల క్రిందటి చరిత్రలు కూడా మనవారట్లే వ్రాసిరి. తుకారాం 'విమానములో సశరీరుడై పోయెనట. నామదేవుడు బజ్జైచేత వేదాలు చదివించెనట. ఇవన్నీ భక్త విజయములో చూచుకొనవచ్చును. వైష్ణవులను చూచి శైవులు, శైవులను చూచి వైష్ణవులు భక్తుల చరిత్రలను కొల్లులుగా వ్రాసిరి. ఇక మనవారి రెండవలోప మేమనగా జీవిత చరిత్రలను ఉన్న దున్నట్లుగా వ్రాయక ఉత్రేక్షలతో అబద్దాలతో నింపివేసిరి. విక్రమాంకదేవ చరిత్ర, మహ్మద్ మదమర్ధనం, శంకర విజయము, వేమభూపాల చరిత్ర, హర్షచరిత్ర, సాకువాభ్యుదయము, పృథ్వీరాజ విజయము మున్నగు సంస్కృత జీవిత చరిత్రములు వందలకొలదిగా నున్నవి. అవి కొంతవరకే పనికి వచ్చును.
అజ్ఞానుల వల్ల వ్రాయబడిన జీవిత చరిత్రలు దేశకాలాదులను తెలుపక, అపభ్రంశ రూపాలతో నిండిన జంగము కథలు, పవాడాలు, సుద్దులు దేశమంతట నిండినవి. అవి జీవిత చరిత్రలె కాని బహు లోప భూయిష్టముగానున్నవి.
మన తెనుగులో కొన్ని జీవిత చరిత్రలు కానవచ్చుచున్నవి. కృష్ణరాయ విజయము, నరపతి విజయము, కైఫియత్తులు, ప్రతాప చరిత్రము మున్నగునవీ వర్గములో చేరును. కాని ఇవి ట్రేళ్ళమీది లెక్కలోనివి, ఇవికూడా లోపాలకు గురియెనవి.
110 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
యూరపు దేశములో ఆధునిక పద్ధతులపై జీవిత చరిత్రలు మున్నూరు నున్నూరు ఏండ్ల క్రిందటనే రచింపబడుటకు మొదలయ్యెను. ఎనిమిదవ హెన్రీ కాలములో ఇంగ్లండు దేశములో జీవిత చరిత్రలు వ్రాయనారంభించిరి. కాని బాస్వెల్ వ్రాసిన జాన్సన్ జీవితమే ఇంగ్లీషు భాషకూ, జాతికీ జగద్విఖ్యాతిని తెచ్చెను. అదే తర్వాతి వారికి ఒరవడి అయ్యెను. నెల్సన్ జీవితము, స్మాటు జీవితము ప్రఖ్యాతములైనవి. యూరపు ఖండములోని ఫ్రాన్సు, జర్మనీ, రష్యా దేశాలలో జీవిత చరిత్రల రచన బాగా గత శతాబ్దమందు వృద్ధి యయ్యెను. అమెరికాలోను అదే కాలమందు అవి వ్యాప్తికి వచ్చెను.
జీవిత చరిత్రలో ఆత్మకథలు (AUt0 biographies) చేరినవి. ప్రపంచ మందలి కొందరు మహాపురుషులు తామే తమ జీవిత చరిత్రలను ప్రాసి పెట్టినారు. మహాత్మాగాంధీగారు తమ జీవిత చరిత్రను వ్రాసినది సుప్రసిద్ధము. ప్రపంచ స్వీయచరిత్రలలో గాంధీగారి ఆత్మకథ ఉత్తమ స్థానము వహిస్తున్నది. ఆత్మకథ 'బ్రాయువారు తమ లోపాలను బయటపెట్టరు గాంధీగారు తనలోని మంచివీ చెడ్డవీ అన్నీ బయటపెట్టారు.
మన తెనుగులో స్వీయచరిత్రను వ్రాసిన వారిలో మొట్టమొదటివారు శ్రీ కందుకూరి వీరేశలింగము గారే. మన తెనుగులో జీవిత చరిత్రలు మొన్న మొన్నటివరకు లేకుండెను. ఈ ముప్ఫై యేండ్ల నుండియే జీవిత చరిత్రలను అందందు వ్రాయుటకు మొదలు పెట్టినారు. మన తెనుగు లోనికి మొట్టమొదట ఆబట్ రచితమగు నెపోలియన్ చరిత్రము, లడ్విగ్ వ్రాసిన చరిత్రములు, ఆరంస్టాంగ్ వ్రాసిన కమాల్‌పాషా ఇబసాదు చరిత్రలు జాన్సన్ జీవిత చరిత్ర, కార్లెల్ వీరుల చరిత్ర మొదలైన ఉత్తమ జీవిత చరిత్రలు పరివర్తనలు కావలెను. తర్వాత ప్రపంచ మహాపురుషులను గూర్చి వ్రాసిన ఉత్తమ చరిత్రల నన్నింటిని అనువదింప జేయవలెను.
పాశ్చాత్యులు మన పూర్వులకు సరియగు న్యాయమును చూపించి యుండలేదు. పాశ్చుయర్, యూక్లెడ్, ఆర్మిమిడిస్, గాలిలియో మొదలైన యూరపు పరిశోధకుల చరిత్రలను విపులముగా వ్రాయుదురు. కాని ప్రపంచానికి సంస్కృత భిక్షను పెట్టిన హిందూ ఆర్య మహాపురుషుల పేరులనైనా స్మరించరు. రేఖాగణితము, బీజగణితము (Geometry & Algebra) లెక్కలలోని పూర్ణాంకమును (సున్నాను) దశాంశమును
జీవిత చరిత్రలు - వాటి రచన 111
(Decimal) మొట్టమొదట కనిపెట్టినది హిందువులు. ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య, నాగార్జున, భోజరాజు, శుల్బ, కణాద, ధన్వంతరి, అగస్త్య, కౌండిన్య, భరత, జయసింహాది పరశ్శత మహాపురుషుల పేరు లెక్కడా ఆంగ్ల జీవిత చరిత్రలలో కానరావు. పై వారిలో జ్యోతిర్వేత్తలు, గణితాచార్యులు, రసాయనశాస్త్ర ప్రవర్తకులు, కణ సిద్ధాంత స్థాపకులు (Atomic theory) వలస రాజ్యాలను స్థాపించినవారు, శిల్పాచార్యులు, విమానశాస్త్ర నిర్మాతలు చేరియున్నారు.. తెల్లవారు చేయలేదని మనమూరకొనవలెనా? అందుచేతనే మన మింకనూ అధికముగా పరిశోధించి శ్రమించి మన పూర్వ మహామహుల చరిత్రలను మన భాషలందును పరభాషలందును వ్రాసి వ్యాప్తికి తేవలెను. ప్రత్యేకముగా పైన సూచించిన వారిని గూర్చి ఇతరార్య మహాపురుషుల గూర్చి యెవరైనా పరిశోధించి రచించిన బాగుండునని నేను చాలా కాలము నుండి అనుకొనుచుందును. ఆ పుణ్యకాలము రాకమానదు.
జీవిత చరిత్రలను వ్రాయుట సామాన్య విషయము కాదు. జీవిత చరిత్రను కూలికి వ్రాయువారు చాలామంది కలరు. తమ పొట్ట నింపుకొనుటకై శక్తి సంపన్నులను సకలాలంకారములతో వర్ణించి రావణుని రామునిగా, హిరణ్యకశిపుని హిరణ్య గర్భునిగా, పోతురాజును భోజరాజుగా, లుబ్బాగ్రేసరుని దానకర్ణునిగా చిత్రించి హాస్యస్పదులగుచున్నారు. అట్టి చరిత్రలు నాలుగుదినాల పాటు కూడా నిలువవు. జాన్సన్ చరిత్ర వ్రాసిన బాస్వెల్‌కు దమ్మిడి లాభము లేకుండెను. అది లోకోత్తర జీవిత చరిత్ర యయ్యెను. జీవిత చరిత్రలను కొని చదువుడనిన జనులు వాటితోపాటు అమృతాంజనం కొనవలెనంటారు. అవి నీరసముగా నుండునని తలతురు. జీవిత చరిత్ర వ్రాయు రచయిత తన గ్రంథాన్ని రమ్యముగా ఆకర్షణీయముగా వినోద హేతువుగా చేయుటకై అబద్ధాలను తన సొంత పైత్యాన్ని తన గ్రంథములో నింపిన అది మదనకామరాజు కథలుగా మారిపోవచ్చును. సత్యమునే చెప్పవలెను. చక్మగానే చెప్పవలెను. ఆ విధముగా చెప్పినవాడే ఘనుడు. రచయిత శైలి ద్వారా చాలా రమ్యతను తన గ్రంథానికి చేకూర్చగలడు. కావున జీవిత చరిత్రలకు శైలి చాలా ముఖ్యమైనదిగా నుండును.
దాక్షిణాత్య లోకోక్తులు
సామెతలలో ఎంతో అర్ధము ఇమిడి యుండును. భాషకు ఒక అలంకార ప్రాయము, చరిత్రకు కొంత ఉపకరణము, కవిత్వానికి తోడు నీడ, భావ ప్రకటనకు పుష్టి, పండిత పామరులకు సంగమస్థానము. ఇవి సామెతలలోని విశేషములు. ప్రతి దేశములోను ప్రతి జాతిలోను, ప్రతి భాషలోను సామెతలకు మంచి స్థానమున్నది. ఒక్కొక్క ప్రాంతములో ఒక విధమైన సామెతలు, అవి జనుల భావములను, ఆచారములను వ్యక్తపరచునవై యుండును.
ఇతరుల మాటయేమోకాని తెనుగువారి సామెతలకు ప్రత్యేక స్థానము కలదు. ప్రాయికముగా సామెతలు యతి ప్రాసయుక్తముగానుండును. ప్రాసతో తిట్టరా పాడు ముండాకొడుకా అని ఎవ్వరో అన్నారట. సామెతలు మూడు నాలుగు విధాలుగా నుండును. హాస్యరసయుక్తమయినవి. బూతులతో నిండినవి. లోకానుభవయుక్తమైనవి యిట్లు పలు తెరగులుగా నుండును.
తెనుగులోని సామెతలను ఒకచోట చేర్చి ఒకటి రెండు గ్రంథాలు ప్రకటించి నారు. అయితే అందు దశాంశమైనా కూర్చలేదని చెప్పవచ్చును. ఒక్కొక్క జిల్లాలో ఒక విధమైన సామెతలు కలవు. ఇవన్నింటిని ప్రతి మండలమువారును కూర్చి వివరములతో కూడినవిగా ప్రకటించుచు వచ్చిన కొంత కాలానికి మరెవ్వరైనా అన్నింటినొకచోట కూర్చుటకు వీలుండును.
మన ఆంధ్రులకు అరవలకు పూర్వకాలము నుండి అదెందుకో సరిపడ కున్నట్లున్నది. అరవలు కూడా తెనుగు వారిని గురించి హేళనముగా సామెతలు చెప్పుకొందురు. తెనుగువారును అదే పద్ధతిపై అరవవారిని గురించి చెప్పుకొందురు.
శ్రీనాథ మహాకవికి అరవ సాంబారు రసము రుచించకపోయెను. ఆంధ్రులకు ఇప్పటికిని సాంబారు రసం అంటే సరిపడదు. (శ్రీనాథునికి అరవదేశము మంది
దాక్షిణాత్య లోకోక్తులు 113
కూడా సరిపడినట్లులేదు. “పిళ్ళె” జాతి వారిని వర్ణించినది వింటే ఈ సంగతి అర్థ మౌతుంది, అతని తర్వాత పండిత జగన్నాథ రాయలవారికిని ఇదే విరోధముండినది. ఆయన ప్రౌఢ “మనోరమా కుచమర్జిని”లో ద్రావిడుల దూషణ అచ్చటచ్చట వ్యక్తమగుచున్నది.
దక్షిణ దేశములోని కొన్ని పట్టణాలు, ఆచారాలు ఆంధ్రుల సామెతలలో కెక్కి సాధారణమైపోయినవి. అట్టి సామెత లెన్నియున్నవో కాని నాకు తెలిసిన అయిదారింటిని ఇందు తెలుపుకొంటాను.
అరవ భాష మనవారికి సరిపడినట్లు లేదు, ఎవరైనా మాట్లాడే దానిలో అర్ధము కాకుంటే - ఏమిటదీ “అరవ మొత్తుకోళ్ళు” అని ఎగబడతారు. “అరవ అధ్వాన్నము” అనియు మరొక సామెత కలదు. ఎవరైనా బండచాకిరీ చేస్తే దాన్ని “అరవ చాకిరీ” అంటారు.
భిక్షపతి క్షౌరం అంటే అందరికీ తెలిసిన సంగతే. తిరుపతికి పోయే యాత్రికులెక్కువ. మంగళ్ళు తక్కువ. వేంకటేశ్వరునికి వెంట్రుకలంటే చాలా ప్రీతి. ముత్తైదువలు కూడా నున్నగా బోడి కొట్టించుకొని వెంట్రుకలు సమర్పించుకొని వస్తారు.
అయితే మంగళ్ళు క్షౌరానికి పోయిన వారిని వరుసగా కూర్చొనబెట్టి ప్రతివాని నెత్తిన ఒక పట్టె పెట్టి ఆ మనిషి తనవాడని రిజిస్టర్ చేసుకొందురు. ఆ ప్రకారము కాబడ్డ మనిషిని ఇంకొక మంగలివాడు మూడు నాల్గంతల పైకమిత్తునన్నను ముట్టడు. అట్లు ముట్టినా మంగలి కత్తులతో ఘోరయుద్ధము ప్రారంభమైనదన్న మాటే. ఇట్టి పట్టెల క్షౌరానికి మనవారు తిరుపతి క్షౌరం అని ప్రసిద్ధినించినారు.
ఇంకా కాస్త దక్షిణానికి విజయం చేస్తే “చిదంబర రహన్యమును” తెలుసుకొనవచ్చును. చిదంబర క్షేత్రములోని ఒక దేవాలయములో ఒక పర్ణా కట్టి యుంటారట. దాని లోపల ఏమిన్ని ఉండదు. అయినా యాత్రికులు అందు దేవుడున్నాడని భావించుకొనవలెనట. ఏమిన్నీ లేని వస్తువును ఉన్నదనడానికి మనవారు చిదంబర రహస్యం అంటారు.
ఇంకా కొంచెము దక్షిణానికి తర్లినామంటే మనకు “పుంగనూరు మనుషులు” కనబడతారు. మనలోని మూర్చులను “పుంగనూరు మనిషీ” అని తిట్టుతాము. ఇప్పటికి నీ పుంగనూరు గురుస్థానమొకటి మద్రాసు రాజధానిలోనున్నది. అయితే అచటి
114 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
మనుషులు మనవలెనే తెలివితేటలు కలవారే కాని యెవ్వరో మహానుభావులు ఈ సామెతను కల్పించి పోయినారు. పుంగనూరులో నౌకరులను విస్తర్లు ఎత్తివేయరా అంటే యెంతమంది తిన్నారు అని అడుగుతారట. ఫలానివాణ్ణి పిలుచుకొని రారా అంటే అతడు లేకపోతే యేమి చేయాలె అని అడుగుతారట. ఉన్నాడు పోరా అంటే “రాకపోతే మరి” అని అడుగుతారట. ఈ కల్పనలు ముచ్చటగానే ఉన్నవి. తిరుపతికి సమీపంలో “కంచి” అనే క్షేత్రము కలదు. “నగరేషు కాంచీ నారీషు రంభా” అని ప్రాచీనమునుండి దీనికి ప్రఖ్యాతి. “కంచంత కాపురము” అనే సామెత కలదు. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహత్యములో నిట్లు వర్ణించినాడు.
“కాపు కోడలు కంచంత కాపురంబు
బాలవంటి కులంబు కాడ్బరచి యురికె
మగని నటుబెట్టి రెండవ మగనివెంట
నువిదలకు బుద్ధి పెడతల నుండుగాదె” అంటే కంచి పట్నమంత పెద్ద కాపురము అన్నమాట. ఇక్కడ మాత్రము మనవారు ఒక్కమారైనా మెచ్చుకొన్నారు.
“ద్రావిడ ప్రాణాయామము” అనే సామెత సాధారణము. ద్రావిడులు ప్రాణాయామము చేయవలెనంటే నేరుగా ముక్కు పట్టుకోకుండా కుడిచేతిని నెత్తి వెనుకనుండి పెనవేసుకొని వచ్చి దానితో ముక్కు పట్టించుకొందురట. ఆ ప్రకారము ఎవ్వరును చేయరు కాని సామెత ఏర్పడింది. అంటే ఎవ్వరైనా సూటిగా చెప్పుటకు మారుగా డొంక తిరుగుడులు సవ్యాపసవ్య (ప్రదక్షిణాలు చేసి చెప్పదలచిన ఆ రెండు ముక్కలు యిన్నూరు మాటల వరకు పెంచి పావుగంట కాలహరణము చేసి అంతయైనను ఒక్కొక్క మారు తమ అభిప్రాయాన్ని వినే నెత్తిలో పూర్తిగా యెక్కించలేని సందర్భములో ఈ సామెతను చెప్పుతారు.
ఇంకా దక్షిణానికి యాత్ర చేస్తే మనకు కుంభకోణము ప్రత్యక్షమౌతుంది. “వాడు కుంభకోణము చేసినాడురా” అని మన వారిలో నొక సామెత. అనగా మోసము చేసినాడని అర్థము. ఇది కూడా అన్యాయంగా వ్యాప్తి గావింపబడినట్టి సామెతయే అని చెప్పవలసిందే.
దాక్షిణాత్య లోకోక్తులు 115
ఇంకా దక్షిణానికి దిగితే శ్రీరంగం అనే పవిత్ర శ్రీవైష్ణవ క్షేత్రం ప్రత్యక్షం అవుతుంది. “శ్రీరంగనీతులు” అనే సామెత తెనుగు వారిలో చాలా ప్రసిద్ధి. అంటే తాము మాత్రము ఆచరింపక ఏమేమో నీతులు బోధించితే అవి శ్రీరంగనీతులు అని మన వారంటారు.
ఇంకా దక్షిణానికి పోతే “ఆడ మళయాళం” లో పడిపోతాము. ఆ ఆడ మళయాళం అనే దేశాన్ని గురించి మన దేశంలో వ్యాపించినన్ని కథలు, కల్లలు మరెచ్చటను లేకుండ వచ్చును. ఈనాడు కూడా పల్లెలలోని జనులు కట్టు కథల నంతా నమ్ముతారు. ఆడ మళయాళంలో అంతా ఆడవాళ్ళేనట. మగవాడు పోతే దక్కడట. అయితే గాలికి పిల్లలు పుట్టుతారట. “మళయాళ భగవతీ” అని మంత్రం వేసినారంటే రాయినో రప్పనో పశువో అయి పోవలసిందేనట. ఇంకా ఇట్టి చిత్ర కథలు కొల్లలుగా మన దేశములో చెప్పుకొంటూ వుంటారు.
మళయాళ మంత్రాలకు ప్రసిద్ధి అయిపోయింది. పూర్వంలో మంత్రగాండ్లు మళయాళం పోనీ పోకపోనీ తమకేమైనా మంత్రాలు వచ్చి వుంటే వాటిని వారు మళయాళంలో నేర్చుకొన్నామని చెప్పుకొనే వారు. అందుచేతనే మంత్రగాండ్లు యిప్పటికినీ మోడీ గారడీ వంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించే దానికి ముందు, “ఛూ, మళయాళ భగవతీ” అని ఆడ మళయాళ శక్తిని తలచుకొంటారు.
ఇంకా ఇట్టి సామెతలు మరెన్ని వున్నవో యేమో.
శబ్దాల ముచ్చట
మా శ్రీపాద శాస్రిగారితో మాటల సందర్భమున నా పుస్తకములో వ్రాసికొనిన కొన్ని శబ్దముల చరిత్రను ముచ్చటించి యుంటిని. కాని వాని నింత త్వరగా ప్రకటించదలచి యుండలేదు. మా శాస్త్రిగారు మాత్రము ఇప్పుడే కావలనెనని పట్టుపట్టినారు. సంస్కృత ఫార్సీ భాషలకు పరస్పర సన్నిహిత సంబంధమెట్లు కలదో, ఈ రెంటికినీ కించిద్భేదమెట్లేర్పడెనో, ఎన్నడేర్చడెనో ఇత్యాది విషయముల నొక చిన్న గ్రంథముగా వ్రాయ తలపెట్టి యుంటిని.
అప్పుడు నేను సంగ్రహించి యుంచిన ఫార్సీ శబ్దములను గురించియు వ్రాయదలచి యుంటిని - అదెన్నడో యేమోకాని యిప్పుడు మాత్రము నాకు తోచిన కొన్ని శబ్దముల నిందు ప్రకటించుచున్నాను. నేను వ్రాసిన అభిప్రాయములు సరిగాకపోవచ్చును. విమర్శకులకు మార్గదర్శకముగ నైన నుండవచ్చునను ఊహతో ప్రకటించుచున్నాను.
1. ద్వార - ద్వి+ అర రెండు రెక్కలు కలది. ప్రాచీనమందు ఒంటిరెక్క తలపులకన్న రెండు రెక్కల తలుపులే విశేషమేమో.
2. డప్పు - ఇది ఉత్తర సర్మారులలో విశేషము వాడుకలో కలదు. ఫార్సీలో దఫ్ అని కలదు. తప్పెట అను నర్భములో నుపయోగింతురు.
8. హంవీరుడు - శూరుడను నర్థములో ప్రయుక్తము. తారా శశాంక విజయమందు ప్రయోగించబడినది.
“దండ హంవీర తలగుండు గండ” అని శుకసప్తతిలో (పు. 128) కలదు. “రాజమాన్య హంవీరులు దక్కణీలు” అనియు నొక చాటువు. హంవీరుడు రాజపుత్ర స్థాన చిత్తూరు రాజగు అర్సికుమారుడు. మహావీరుడగుటచే శూరపద పర్యాయ
మయ్యెను.
శబ్దాల ముచ్చట 117
4. దేవానాం ప్రియ - ఇది షష్టీ తత్పురుష అలుక్సమాసముగానే మూర్చుడను నర్ధములో వాడినారు. అమరసింహుడు త్రికాండ శేషములో దీని యర్థము “ఛాగము” అని వ్రాసెను. ఛాగసమానుడు మూర్చుడు. మరియు ఛాగము యజ్ఞములందు దేవానాం ప్రియమైనది. నిఘంటుకారులు మూర్చునికే యీ పదము అలుక్సమాస స్పరూపమందే వర్తించుననిరి. దీనికి చారిత్రక కారణము కలదు. బౌద్ధులు తమ మతమందు ్రేష్టులైన వారిని “దేవానాం ప్రియులు” అని పిలుచుచుండిరి. ఆశోక చక్రవర్తి బిరుదులలో నిదొక్కటి. హిందువులు బౌద్ధులను హేళనము అవమానము చేయు నుద్దేశముతో నీ యలుక్సమాస మూర్ధనిర్వచనము చేసి యుందురు.
5. హజారము - దర్బారు అను నర్ధములో వాడుదురు. ఫార్సీ హుజూరీ నుండి వచ్చియుండును.
6. హసాదు - “చిత్తము అట్లే” అను నర్థము హాస్రాబ్ అను దానినుండి యేమో?
7. చొక్కా - అంగీ, ఫార్ఫీలోని “చొగా” నుండియే వచ్చినది. నిస్సందేహము.
8. కాగితము - ఫార్సీ - కాగజ్ నుండి
9. బులాకి - ముక్కుకొనను అలంకారముగా (?) వాడుకొను ఆభరణ విశేషము. ఫార్సీలో “బులాఖ్” ఈ ఆభరణమును ముసల్మానులే తెచ్చి ఈ దేశ స్త్రీల ముక్కుల కెక్కించినారేమో, ఆలోచించుడు.
10. కందిల్ - హైద్రాబాదులో ప్రయుక్తము దీపమని యర్థము. ఇంగ్లీషు క్యాండిల్ (C241౭) నుండి వచ్చినదీ వెలుగు.
11. గడ్డినూనె - ఉత్తర సర్మారులలో నున్నదో లేదో కర్నూలులో నిజాం రాష్ట్రంలో కొన్ని భాగములలో కిరోసిన్ నూనెకు పర్యాయపదముగా నున్నది. కిరోసిన్ నుండి గ్యాస్ కూడా వచ్చును. కావున గ్యాసును ముసల్మానులు 'ఘాస్‌నూనెనుగా జేసిరి. ఉర్దూలో ఘాస్ (ఘాసశబ్దమే) అనగా గడ్డి కావున కిరోసిన్ గడ్డినూనె అయినది.
12. చీనా గొలుసు - ఇది నంబి సోమయాజి వంటి పదము. ఇంగ్లీషు చైన్ (Chain) అనగా గొలుసు. ఆక్స్ (0౫) ఎద్దు అన్న చదువు పరిణామమే చైన్ గొలుసు తుదకు చైనా గొలుసు , చీనా గొలుసు అయినది. చీనా దేశమున కిప్పుడిప్పుడే గొలుసు సంబంధము కలుగుచున్నది.
118 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
13. తంబలి - ఒక శైవజాతి - తాంబల శబ్ద భవమని తలతును. పూర్వము ఒక్కొక్క జాతి ఒక్కొక్క వృత్తి. నంబులకు పూజయే కాక పూలను వర్తనగా తెచ్చియిచ్చుట (నంబి వాడిచ్చిన గన్నేరు పూవులు” అని శుకసప్తతి కారుడు) అటులే తంబలవారికి గ్రామములో తమలపాకుల నిచ్చుట.
14. యోజన - ఈ శబ్దము ఒక యూర పొడవగును, ఒకచోట చిన్నదగును. కొందరు పది మైళ్ళందురు. కొందరు ఎనిమిది, మరికొందరు ఆరు మైళ్లు యుజ్యంతేతి యోజన. ఎద్దులను బండికి కట్టుట యని యర్థము. అనగా ఎద్దులబండి ఒక దినములో ఎంత దూరము పోవునో అంతదూరము. అది ఐదు మైళ్ళ నుండి పది మైళ్ళు కావచ్చును. బాటలను బట్టి యది నిర్ణయింపదగినది.
15. సెమ్మె - దీపము పెట్టు స్తంభము అని యర్థము. ఫార్సీలో “షమ” అనగా దీపము (దీప స్తంభముకాదు) దాని నుండియె మన సెమ్మె ఏర్పడినది.
16. కాక పక్షము - గిర్జాలు, జుంపాలు. కాకి రెక్కలవలె ఉభయ పార్య్వములందుండునవి. శ్రీరాములకు కాకపక్ష ముండెనని వాల్మీకి అభిప్రాయము.
17. కవాట - పాణిని కాలములో మన దేశమందు తలుపులు చిన్నవిగా నుండెనేమో. క=తలను, పాటయతీతి=పగుల గొట్టునది కనుక - కవాటమయ్యెను.
18. కీసర - కీస అనికూడ యందురు. జేబు అని యర్థము. ఈ జేబు కూడా అన్యదేశ్యమే. (మన పూర్వలకు జేబులు లేకుండె నన్నమాట. మన మెప్పుడను పరులకై జీవించువారము కాన మనకు జేబులెందుకు?) కీసర్ అని ఫార్సీరూపము నుండి వచ్చినది.
19. దుహిత - బిడ్డ అని యందరకు తెలిసినదే. ఈ శబ్బార్థము రెండు విధములు. ఈ అర్థములో ప్రాచీనుల ఇంటి బిడ్డయొక్క స్థానము విశదమగును. దుహ్ ధాతువు. పితుకుట అను దానినుండి వచ్చినదీ పదము. పూర్వము ఇంటి యాడుపడుచు దినము ఆవులను, బర్రెలను చూచుకొనుచుండెనని యూహ్యము. ద్వేహితా - రెండు కుటుంబములకు - పుట్టినయింటికి మెట్టినయింటికి హితురాలు అగుట కావచ్చును.
20. పునాస - వర్షకాలారంభమున విత్తునట్టి పంటకు అర్ధము. పునర్వసు కార్తిలో సజ్జలు, కొర్రలు మున్నగునవి వేయుదురు. ఈ పునర్వసు నుండియె పునాస పదముద్భవించినదని నా యూహ.
శబ్దాల ముచ్చట 119
21. అక్ష (మాల) - శ్లో ఆదిక్షాంతార్దయోగిత్వా దక్షమాలేతి కీర్తితా తద్వర్ణ సంఖ్యైర్మణిభి ర్థపమాలాం ప్రకల్పయేత్ - శారదా తిలకము - 22. ఏడుగడ - క. గురుడును 1. తల్లియు 2. దండ్రియు 8. బురుషుడు 4. విద్యయును 5. దైవమును 6. దాతయు 7. నా బొరి నేడు గడయు దానై హరి నను రక్షించుగాత ననవరతంబున్ - వాసిష్టము -
23. హెగ్గడి - ద్వారపాలకుడు, బహు భార్యాయుక్తులగు రాజులు నాటికి నేటికి తమ దేవిడీలవద్ద పురుషుల పహిరాను అంతగా పసందు చేయరు. నపుంసకులను అంతఃపురమువద్ద కావలి పెట్టుచుందురు. ఉర్దూలో హిజ్‌డా అను పదము యొక్క అపభ్రంశమీ హెగ్గడియై యుండును.
24. చిలువ - చీలినన - వ - నోరు కలది - పాము
25. నలువ - నాల్గు - వ- మోములవాడు. ఇట్లే గట్టివ మున్నగునవి.
26. కింపచ - దరిద్రుడు - ఈ దినమేమి వండుకుందునా అని చేతులు పిసికికొనువాడు.
27. ముత్తైదువ - అయిదు వన్నెలు కలది - మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు - కడపటిది అరవల సొమ్ము. తెలుగు స్రీలకు మట్టియలు - (మెట్టెలు)
28. హురుమంజి - హురుమంజి ముత్యములు. పర్వాదేశపు సంధిని హురుముజ్ సంధి యందురు (౮౪11 0£ Hurmuz). పూర్వము మనదేశానికీ సముద్రభాగము నుండి తీసిన ముత్తెములు విశేషముగా నెగుమతి యగుచుండెను.
29. నంగనాచి - ఈ పేరు గలది ఏలేశ్వరోపాధ్యాయుల కూతురనియు నామెనొక కంసాలి తన కులము దాచి వివాహమాడెననియు తదనంతర మామోసమెరిగి యామె యాత్మహత్య చేసుకొనెననియు అప్పటినుండియు “ఎంతటి నంగనాచివే”
120 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అనీన “ఎంతటి సాహసురాలవు” అను సామెత యయ్యెననియు కొందరందురు. హిందీలో నగ్నము (నంగా)గా ఆడునట్టి (నాచ్) స్రీల నృత్యమునకు నంగా నాచ్ అందురు. ఈ నృత్యముచేయు స్రీ సాహసికురాలు కాదా! అంతటి సిగ్గు విడిచిన దను నర్థము ప్రయుక్తమే కాని ఏలేశ్వరోపాధ్యాయుని కూతురునకు మంచి పేరు దొరకక యంతటి సుందర నామము పెట్టి యుండరు.
30. మోజాలు - బగ్జాదు పాదరక్షలకే యీ పేరుండెను. ఆ దేశము నుండి దిగుమతి యగుచుండెను.
31. దేవర - ద్వితీయో వరః మరది-వితంతువైన వదినెకు నియోగ న్యాయముచే ద్వితీయ వరుడై యుండెను. ఉర్దూ, హిందీ భాషలలో నీ పదమే (దేవర్) అని నేటికిని మరదికి వాడుచున్నారు.
32. దరుబేసి - యోగి. ఫార్సీలో దర్వేష్, ఒక తెనుగు కవి (శృంగార అహల్యా సంక్రందన మేమో?) యీ పదమును ప్రయోగించినాడు.
33. వర్గ - అధ్యాయము, భాగము, ప్రకరణమను నర్థము. ప్రాచీన కాలములో గ్రంథములు ఆకులపై వ్రాయుచుండిరి. ఫార్సీలో బర్గ్ అన ఆకు. (బవయోరభేదః - వర్డ్)
34. సూక్త - (హోమము చేయునప్పుడుచ్చరించు) మంత్రము. ఫార్సీలో సోక్త్ అన కాల్చుట, వ్రేల్చుట అని యర్థము.
85. పుస్తకము - ఫార్సీలో పొస్తక్ అన చర్మము. బహుశః ప్రాబీనమందు గ్రంథములకు జింక చర్మములు మున్నగునవి అట్టలుగా నుంచుచుండిరో లేక చర్మపు సంచులలో గ్రంథముల భద్రపరచుచుండిరో యని దీనివలన గ్రహింపవచ్చును.
36. ద్విబిస్తా - బిస్తా 80 రతుల తూకపు బంగారు నాణెము. (సూ. ఆపరిమాణ బిస్తా చితకం బల్వేభ్యోనతద్దితలుకి) రెండు బిస్తలకు కొన్న బానిస ప్రీ.
27. పంచాశ్వా - అయిదు గుగ్రములిచ్చి కొన్నట్టి బానిస స్రీ. ఈ రెండు పదములను బట్టి ప్రాచీనార్యులలో బానిసలను కొనుటయు, వ్యాపారమందు బానిసల విలువయు వెల్లడియగుచున్నది.
38. చండాల - సుప్రసిద్ధుడే! ఫార్సీలో నీచుని జందాల్ అనిరి.
శబ్దాల ముచ్చట 121
39. దేవ అసుర - ఈ పదములకర్థము ఫార్సీలో అపసవ్యముగా నున్నది. దేవ్ అన భూతము లేక రాక్షసి అని, అహుర్ (ఫార్సీలో సకారమునకు హకారముంచుదురు. ఉ॥ సప్త=హప్త. సింధు=హిందు) అనగా ఫార్సీ మతమున మంచి దేవత. ఫార్సీలు, ఆర్యులును మొదట ఏకస్థులుగా నుండి సురాసుర పూజాదులందు భేదాభిప్రాయులై వేరైన నాట నుండి యా పరస్పర విరుద్ధార్థములు ప్రారంభమై యుండును.
ఢి ధి ణి
1935లో ప్రబుద్ధాంధ్రలో నేను “కొన్ని శబ్దముల కథలు” అను విషయముపై చర్చించి యుంటిని. ఇప్పుడు మరికొన్నింటిని గూర్చి నా ఊహలను తెలుపుకొందును. అందు సగము తప్పయినను మిగిలినవి సరియగుచో ఈ చర్చవల్ల నష్టము లేదని అనుకొందును.
1. టక్కు
టక్కులాడు, టక్కరి అను పదాలు టక్కు నుండి వచ్చినవి. నాకు తెలిసినంత వరకు ఈ పదాన్ని ఒకరిద్దరు కవులే పూర్వములో వాడినారు. నాచన సోమన “తిరిపెపు కూడు దెచ్చి” అను పద్యములో “టక్కరి బలుమోపు మోచు నయగాకితనంబడి యుట్టిగట్టిన౯” అని ప్రయోగించెను. క్రీ.శ. 17వ వతాబ్ది తర్వాతి కవులీపదాన్ని ఎక్కువగా వాడిరి. ఠగ్ అను హిందీ పదము కలదు. తగ్గులు ప్రసిద్ధులే. మన దక్కు నుండి ఠగు అనునది వచ్చెనా? లేక ఈ రెంటికినీ మూల సంస్కృత పదము కలదా? 2. మ్లేచ్చ
ఈ పదము బలూచ్ పదము నుండి ఏర్పడినదని మాక్సుమూలర్ అభిప్రాయము. బెలుచిస్తాన్‌లోని వారు ఆర్యావర్తము సరిహద్దులోని వారనార్యులుగా ఉండి అపభ్రంశమును మాట్లాడిన వారని మహర్షి పతంజలి అభిప్రాయము.
3. బగర్రైెంకపూలు
బర్రెంక అను విష వృక్షమొకటి మహబూబ్‌నగరులో కలదు. కాని ఆదిలాబాదు
జిల్లాలో పారిజాత పుష్పాలను బర్రెంక పూలని అందురు.
122 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
4. శరభము
మన సంస్కృత కవులు “సింహ శరభ శార్జూలములు” అని చాలా వర్ణించేవారు. శరభం ఎట్టి మృగమో ఎవ్వరున్నూ చూడలేదు. ఈ పదము అసీరియా నుండి వచ్చినట్లు కానవచ్చును. అసీరియాలో 016740 అను ఊహ మృగాన్ని భయంకరముగా చిత్రించేవారు. దేవతలు దానిపై స్వారీ చేసినట్లు చిత్రించుచుండిరి చెరుబిం (Cherubmim) అను పదము లాటిన్ లోనికినీ ఎక్కెను. ఆ చెరుబిం పదమే మన శరభం అయినదేమో?
5. ఖుదా
దేవుడు అను ఫార్సీలో అర్ధము. ఇది సంస్కృతంలోని స్వధా అను పదము నుండి యేర్పడి యుండును. సకారము ఫార్సీలో ఖకారముగా మారును. స్వసుర ఖుసర్ అయినది.
6. జగడము
హిందీలో రుగడా ఏది మొదటిది? భారతములో యుద్ధవర్ణనలు నిండుగా ఉండినను జగడము అను పదము కానరాలేదు. హిందీ నుండియే తెనుగులోనికి వచ్చెనేమో?!
7. కుల్లాయి
పొడువైన బట్టటోపీ కర్ణము. విజయనగర చక్రవర్తుల కాలములో పలువురు హిందూ ముసల్మానులు మూరెడు పొడవు గలిగి తలక్రిందులుగా ఉంచిన కాగితము పొట్లము వంటి టోపీని ధరించేవారు.
“కుల్లా పెట్టితి కోక జుట్టితి మహాకూర్చాసమున్ దొడిగితిన్” అని శ్రీనాథుడనెను. ఫార్సీలో కులా: అనగా టోపి. ఇది ఫార్ఫీ వారి నుండి మనవారు తీసుకొన్న ఆచారము. 8. పంతులు
ఈ పదమును ఇప్పుడు నియోగులు తమ బిరుదు పదముగా వాడుకొను చున్నారు. తెనుగు దేశములో చదువు చెప్పే ఉపాధ్యాయుని పంతులు అని అంటారు. ఈ పదము తెనుగు వాజ్మయములో కానరాదు. ఇది మరాటీ పదమని తోస్తున్నది. పంథ్ అనునది మరాఠీ పదము. మరాఠీ బ్రాహ్మణోద్యోగులు ఈ పదాన్ని తమ
శబ్దాల ముచ్చట 123
పేరుల తుదిలో నుంచుచునుండిరి. మోరో పంథ్ వంటి విట్టివే, పంథ్ బహువచనము మన పంతులు అయి యుండును. ఇది గోలకొండ నవాబుల కాలములోను పీష్వాల కాలములోను తెనుగు దేశములోనికి వచ్చినట్లున్నది. 9. ఫిరంగి
ఇంగ్లీషులో క్యానన్ అందురు. ఈ పదము ఫ్రెంచివారి నుండి యేర్పడినది. ఫ్రెంచి వారే ఫిరంగీలు, వారు తెచ్చిన మారణయంత్రమే ఫిరంగి. ఈ పదాన్ని క్రీ.శ. 1600 తర్వాత కవులెక్కువగా వాడినారు. అంతకు పూర్వమీ పదము మన వాబ్మయములో లేదు. 10. గేరి
వాడ, వీధి అని యర్థము. రాయలసీమలో, మహబూబ్‌నగర్ జిల్లాలో వాడుదురు. మాదిగగేరి, బాపనిగేరి, కాపుగేరి అని కన్నడములోని కేరి అనుపదమే గేరి అయినది. 11. కురువ
గొల్లజాతిలోని ఒక జాతి. కన్నడములో కురి అనగా గొర్రె. కురికి సంబంధించిన జాతి కురువగా ఏర్పడియుండును. 12. అడకొత్తు
కన్నడములో అడకె అనగా వక్క దానిని ఒత్తునది అడకొత్తు. 13. క్రమేలక
ఒంటె ఇంగ్లీషులోని క్యామెల్ అనునది దీనికి దగ్గరి పదము. ఇది సెమిటిక్ భాష నుండి సంస్కృతములోని కెక్కిన పదమని భాషాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయము. 14. మేలా
సంస్కృతములో మసి-సిరా-అనుదానికి వాడుదురట. మేలాంధుక అనగా మసిబుడ్డి (0100 అట. ఇది గ్రీకు భాష నుండి సంస్కృతములోనికి వచ్చినదట. 15. లిపి
ఇది పురాతన ఫార్సీ నుండి సంస్కృతములోని కెక్కెనని భాషాశాస్తవాదుల వాదము. పాణిని నాటికిది మన సంస్కృతములో నుండినట్టిది.
124 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
16. శేరక
వ్యాఘ్రము - అనునర్ధములో సంస్కృతములోని కెక్కెనట. ఫార్సీ షేర్ పదాన్ని సంస్కృతములో శేరక అన్నారట. 17. శిరోబంధనము
రుమాల. ఫార్సీలో సర్‌బంద్ అందురు. అదే ఇంగ్లీషు టరుబన్ అయ్యెను.
18. సమరె హింద్
చింత చెట్టు ఈరాన్‌లో లేనిది - ఫార్సీలు దీనికి హిందూదేశపు (సమర్) పండ్ల చెట్టు అనిరి - అదే ఇంగ్రీషులో టామరండ్ అయ్యెను.
19. సిస్తు
శిష్టము (పరిశిష్టము) నుండి వచ్చియుండును. సేద్యము ఖర్చు కూలి ఇంటి బత్తెముపోగా మిగిలినది. (శిష్టము) రాజుకు చెల్లించుట అను నర్భములో వాడియుందురు.
20. వరహా మూడున్నర రూపాయి- విలువగల బంగారు నాణెము. విజయనగర రాజుల కాలములో ఆ నాణెములపై వరాహ చిహ్నముండెను. వరాహమే వరహా అయ్యెను.
ఆ నాణెమునకు రెండవ ప్రక్కన దేవాలయ చిహ్నముండినందున ఇంగ్లీషువారు దానిని పగోడా అనిరి.
21. తత్తెరేని
మట్టితో చేసిన గుండ్రని కూజా. దీనిని ఉత్తర సర్మారు వారు తాబేటిబుర్ర అని అందురు. తత్తెరేని పదము కర్నూలు మండలము రాయచూరు పాలమూరు జిల్లాలో వాడుటను ఎరుగుదును. శబ్ధరత్నాకరములో తత్తెర అను పదమిచ్చి దానికి సారాబుడ్డి అని యర్థము వ్రాసినారు. వ్యవసాయకులు పొలాలకు వెళ్ళునప్పుడు తాబేటిచిప్ప వంటి యాకారముకల మట్టికూజాలో నీరు తీసుకొనిపోదురు. దానిని తత్తెరేని యందురు.
శబ్దాల ముచ్చట 125
22. మేజువాణి
ఉత్తర సర్మారులలో భోగము సానుల ఆటకు మేజువాణి యందురు. ఇది ఉర్టూలోని మేజ్‌బానీ అను పదము యొక్క అపభ్రంశరూపము. మేజ్‌బాన్ అసగా విందునిచ్చువాడు. మేజుబానీ అనగా విందు. సాహెబులలో విందులలో పూర్వము నాచ్ ప్రధానముగా నుండెను. అందుచేత మనవారు సానుల ఆటకు వారి పాటకచ్చేరీకి మేజువాణి అని పేరు పెట్టినారు. 28. పోతి
బాలిక అని అర్ధము. ఇది అల్పార్థమందు తక్కువ వారి పిల్లలను పిలుచుటకై వాడుదురు. కాని పూర్వము గొప్పవారి కూతుండ్ర కీ పదమును వాడిరి. వేంగీ చాళు క్యులలో మంగిరాజు క్రీ.శ. 701-725 వరకు వేంగీ రాజ్యమును పాలించెను. అతని కూతురు పేరు “పృథివీ పోతి” అని అతని శాసనములో వ్రాసినారు. పోటి శబ్దము ఇప్పుడు తెలంగాణాలో చాలా ప్రాంతాలలో విరివిగా వాడుకలో కలదు. పిల్లవానిని పోడు, పోజగాడు అని యందురు. 24. వంద
నూజు యని యర్థము. ఈ పదము భారతములో కానరాదని నా నమ్మకం. ఇతర పూర్వ కవులలో, మధ్యకాలపు కవులలోను ఇది కానవచ్చినటుల నాకు తోచదు. మరి యిదెట్లేర్చడెను? ఈ పదము తెలంగాణాలో, రాయలసీమలో జనసామాన్యమందు వాడుకలో లేదు. ఉత్తర సర్కారు వారిని జూచి తక్కిన వారు వందయనుటయే బాగని ప్రయోగించుటకు నేర్చుకొనుచున్నారు. బహుశ బృంద (సమూహము) అను పదము యొక్క తద్భవముగా ఈ వంద అను పదమేర్చడెనేమో? 25. కరడా
ఇప్పుడు బళ్ళలో కాసీలు వ్రాయింతురు. అందుచేత కాపీ [వ్రాయుట అని మనము వ్యవహరించుతున్నాము. కాని మనకు కాపీ శబ్దమునకు సరియగు పదము కలదు. అదే కరడా అను పదము. ఈ శబ్దము నిఘంటులలో లేదు. తెలంగాణాలో ఇది విరివిగా ప్రయోగింపబడుతున్నది. అక్షరాలు బాగా కుదురుటకై మంచి అక్షరాలను ఒరవడిగా నుంచుకొని వ్రాయుటకు కరడాలు వ్రాయుట అని యందురు.
126 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
26. అరి కంఠము తల చెవులు మూసుకొనునటుల వస్త్రమును చలినాపుటకు చుట్టుకొనుట కందురు. ఇది నిఘంటులలోలేదు.
27. మాంగో
మామిడి పండు అను నర్థము కల ఇంగ్లీషు పదము. ఇంగ్లండులో మామిడి చెట్లు పండ్లు లేవు. ఈ పదాన్ని మన దేశమునుండి తీసుకొనిపోయి యుందురు. మచిలీ బందరులో మొదట ఇంగ్లీషువారు మొఖాము వేసిననాడు తెనుగువారి నుండి మావికాయ మాగాయ అని దాని పేరు తెలుసుకొని దానినే ఆంగో అని మార్చుకొని యుందురు.
28. దుముదారు
rear guard అని యింగ్లీషులో దానికి సరియగు పదము. సేనకు వెనక భాగమందుండి శత్రువుల నుండి రక్షించుటకై నియుక్తులగు సేనానుల కీ పదమును విజయనగర చక్రవర్తుల కాలములో వాడినారు. “సకుటుంబముగ వీగి చరమ శైలము చేరు తుహినంవు దుముదారు దొరయనంగ” మనుచరిత్ర. ఆ ౩ ప. 54 ఇచ్చట దుముదారు అన సేనానాయకుడని అర్ధము వ్రాసినారు. సేనకు వెనక దిక్కుననుండు రక్షక సేనాని యనుటయే స్వారస్యము. దుముదారు అనునది దుందార్ అను ఉర్దూ పదము. దుం అనగా తోక దుందార్ అనగా తోక దిక్కుండువాడు అని యర్థము. 29. తాయెతు దీన్ని గూర్చి అప్పకవి ఒక వ్యల్పిత్తిని చెప్పసాహసించెను. “ఎత్తులనగా దక్షిణ దేశీయమున దండలకు పేరు. దాని జడ్డన తేలబలికిన ఎతులాయెను. తాయి అనగా తల్లి. ఆ తాయి శిశువులకు శరీర రక్షగా కట్టునవి యెత్తులు కనుక తాయెతులు” అని వ్రాసెను. అప్పకవి తనకు పూర్వము ముద్దరాజు రామన తాయెత్తును తాయతు
శబ్దాల ముచ్చట 127
అని వ్రాసి యుండెనని యాక్షేపించెను. మరియు తనకు పూర్వుడైన కవి తన చంద్రభాను చరిత్రయందిట్లు వ్రాసెనని యుదాహరించెను. “ఒక యింతి యొరగిన సికమీద ముడి పువ్వు టెత్తులు దొరయు తాయెతులు చుట్టి”
చంద్రభాను చరిత్రమును వ్రాసిన తరిగొప్పుల మల్లన కవి క్రీ.శ. 1600 ప్రాంతము వాడని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు పీఠికలో వ్రాసినారు. తరిగొప్పుల మల్లన ముద్దరాజు రామన కంటే పూర్వకవులెవ్వరును తాయెతు శబ్దమును ప్రయోగించి నటుల కానరాదు. అనగా క్రీ.శ. 1500 తర్వాతనే యీ శబ్దము తెనుగులోనికి ప్రవేశించిన దనవలెను. ప్రవేశించిన దగుటచేత ఇది విదేశీ శబ్దమై యుండవలెను. అప్పకవి (భ్రమించినట్లుగా ఇది దక్షిణ దేశీ పదము కాదు. ఎత్తు లేక ఎతు అను పదాలకు దండ (హస్తముపై భాగము) అను నర్ధమెందును కానరాదు. నిఘంటువులలో గాని ప్రయోగాలలోగాని ఈ యర్థము కానరాదు.
ఇక ఈ పదమెక్కడిదనగా ఇది అరబీ పదమనవలెను. అరబీలో తావీజ్ అను పదము కలదు. అరబీ నిఘంటువులలో దానికర్థము చేతులకు కట్టుకొనే ఖురాను మంత్ర విషయిక రక్ష అని వ్రాసినారు. తెనుగుదేశముపై గోలకొండ సుల్తానుల పరిపాలనము క్రీ.శ. 1512 నుండి స్థిరపడెను. వారి పరిపాలనములో ఫకీరుల ద్వారా హిందువులు తావీజులను పొంది అవి తమకు సకల పీడానివారక రక్షలుగా నుండునని భ్రమించిరి. తావీజు శబ్దమే తెనుగు నోళ్ళలో నలిగి తుదకు తాయెతు రూపము దాల్చెను. దీని పుట్టుకను సరిగా గుర్తించక తానేమో సరిగా నుచ్చరించినట్లు తలచి మల్లనను ఆధారము చేసుకొని ముద్దరాజు రామన్నను తప్పుపట్టిన అప్పకవి శాసనమును ఎవ్వరును అవుగాదనిన వారు కారు.
నన్నెచోడుండు
నన్నెచోడుని కాలము వివాదంగ్రస్తము. ఆదిమ కాలమునందీకవి ఏలనో వెలుగుజూడని వాడైనాండు. ఇరువదియవ శతాబ్దిదనుక నీతని రచనలకు నవియున్నవను సంగతి తెలియరాలేదు.
తత్మవి కాలవిషయమై స్టూలముగా నాలుగు వాదములున్నవి. పలువురు తదనుగుణ భావవ్యక్తీకరణ గావించిరి. అందు, నన్నయకు బ్రాచీనుండుగను, నన్నపార్యునకు సమకాలికుండుగను, ఆది కవికిని కవి బ్రహ్మకును నడిమి కాలము వాడుగను, ఉభయకవి మిత్రునికి తరువాతి వాడుగను, గన్పట్టి సందేహపుటూయల యందూగుచున్నాడు.
నన్నపార్యునకు సోమయాజికి నడుమ కాలము వాడని పెక్కురభిప్రాయ మగుటం జేసి తద్రచయితనట్లే స్వీకరించుట ఉచితము.
రచనలు - బిరుదులు- కవితారీతులు
సూర్యవంశ క్షత్రియ, కాశ్యపగోత్ర, చోడబల్లి, హైహయాన్వయాంబర శశిరేఖల యనుంగు పుత్ర, నన్నెచోడ నామాంకిత మహాకవి “బెంకణాదిత్య” - కవిరాజ శిఖామణి” బిరుధేయుడై యొప్పెను.
శివభక్తాగ్రగణ్యుండైన యీతని గురువరేణ్యుడు “జంగమ మల్లిఖార్జును”డుగ గుర్తింపబడినాడు.
అదియునుంగాక నాతడే ఇక్కతికన్య స్వీకర్ల. అచ్చటచ్చట ఈశ్వరునకు సద్దురువునకు నాతడభేదము చూపుట వలనంబరమేశ్వరుడే ఈతని గురువు కానోపునను సందియమించుక బొడసూపక తప్పదు.
“కుమార సంభవము” కళావిలాసమను కవితా కన్నియం సృష్టించిన నన్నెచోడుడు ప్రప్రథమముగా షష్ట్రంతముల బ్రవేశపెట్టెను.
నన్నెచోడుందు 129
ఉద్భటుని సంస్కృత కృతి దీనికి మూలమని తెలియనగును. తారకాసురమర్దనుని చరితయందు, సంస్కృతమునలేని “దక్షయజ్ఞ” చరితమును ఈతడు తన కావ్యమున బ్రవేశపెట్టెను. గణపతి జననముసైతమీతని కృతియందు విశేషము. శ్రీకారముతో బ్రారంభించి (మంగళమహా)శ్రీకారములో ముగించు పద్ధతి గూడ నీతండే ప్రవేశపెట్టెను. “మి గణము గదియ రగణము వగవక కృతి మొదట నిలుపు వానికి మరణం బగునిక్మమందడ్రు, మడియండే యగునని యిడి తొల్లి 'టెంకనాదిత్యుడనిన్” నన్నెచోడుండు తత్మారణముగ యుద్ధమున మడిసెనని అభిప్రాయపడుచున్నారు. నన్నెచోడునిది వస్తుకవిత. అనగ వస్తు ప్రధాన కవితయని విన్నకోట పెద్దన వచించెను. ప్రకృతి పరిశీలనము నందును, వర్ణనానైపుణియందును సిద్ధహస్తుడైన చోడుండు తనంతతానే తనది వస్తు కవితయని చెప్పుకొనినాడు. “నింగిముట్టియున్న జంగమ మల్లయ వరమునందుంగనిన వస్తుకవిత దగిలివారి యంద నెగడింతు రవికి దీ పముననర్చలిచ్చు పగిదివోలె”
“జంగమ మల్లికార్జునుని సర్గకవి స్తవనీయ సూక్తియు
క్రింగొనియాడి సత్మవితం గానము లేకసురక్తియైన భా
షాంగనం దక్మనేలిన మహత్వము లోకమునం ట్రసిద్ధిగా
భంగిగ విస్తరించెదం బ్రబంధము సద్రసబంధురంబుగాన్”
ఆశ్వాసాంతమున కందమును వాడుట పరిపాటికాగా నన్నెచోడు 'మాలినిని”
వాడినాడు. తదుపరి కవులెల్లరకును ఇందు మార్గదర్శకుడైనాడు. “వనమయూరి వృత్తమును తృతీయాశ్వాసాంతమున విరచించినాడు. చతుర్థాశ్వాసాంతమున 'వసంత తిలక' వృత్తమును రచించెను. “వసంత తిలకం భాతి సంకరే వీరరౌద్రయోః” అనుటం
130 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
జేసి పంచమాశ్వాసమును సంభవింపనున్న కంతుని వీరవిక్రమమును, రుద్రుని రౌద్రమును సూచించెనని నుడువ వచ్చును. శార్దూల విక్రీడితము
శార్టూల విక్రీడితము జెప్పుటలో తిక్కన ప్రసిద్ధుడని చెప్పుటకుదాహృతమున ఈ పద్యమును సూచింతురు.
“సింగం బాంకటితో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్రోధమై వచ్చునో
జం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపైం వీడే వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమర స్టేమాభిరామా కృతిన్” ఇంతటి నేర్పీతనికి నేర్చినవాడు నన్నెచోడుడుగా నోపును.
“భర్గుండంతక వాహినుల్........... మద్చాణ వర్షంబునన్”
“వీరేకాదశ రుద్రులష్ట వసువుల్
పాణ జప సుమహద్విఖ్యాత కార్తీశ్వరా!
శౌర్య వర్ణనతో నిండియున్న పై పద్యములన్నియును అతనెంత జాగరూకతతో తూచి తూచి ప్రాసినాడో తెలియనగును.
ఒక్క శార్జూలమునకే గాక తక్కిన పద్యముల వాడుట యందు కూండ నన్నెచోడుండు బెచిత్య పోషణ గావించినాడు.
కందము
కథాగమనమును శీఘ్రతర మొనర్చుటకీ కందము మిక్కిలి యనుకూలము. చోడుండు వాడిన పద్యము లనివియే నెక్కుండుగ నున్నవి.
“తగుందగదని మనమును
వగవగ నొడబడగ వగవ వగవగ బడయున్
దగుదగదని వగవని వగ
వగవగం బని గలదె తనకు వగ మణి జగతిన్”
ఇది సర్వ లఘు కందము. దీని నడక చూచిన పోతరాజు “లక్ష్మినడక” మనకు జ్ఞప్తికి రాక దప్పదు. కనుక నీ విషయమునకు ఆతనికీతండు మార్గదర్శకుడైనాడు.
నన్నెచోదుండు 131
తన చిత్తము వచ్చినట్లు కందమును నడపించినవాడీతండు. ఎన్ని పోకలవలంబించిన నన్ని పోకలంబోయినది. దుష్మర ప్రాసముతోం బొల్లు మాటలు లేక వచనమువలె సాగిపోయిన కందములీతని కృతియందనేకములు.
“చక్షు మదనేంద్రియములు ము
ముక్షులు మదిగెలుతు రెటింగిమును (శ్రోతృత్వ
కుళ్లు ర్లిహ్వాఘాణస
పక్షగ వాక్సాణి పాద పాయూపస్థల్” శ్లేషాభి రామమగు కందము నడచిన తీరు:
“కమలాభి శోభితము హరి
రమణీయము విద్రుమాభి రామము శుకర
మ్యమునై గగనాబ్బులతో
సమమై వనమధ్య జలజషండం బొప్పెన్”
చతుర్విధ కందము
“రెండవ చరణంబునకున్
రెండవ గణమాది గాగ నిర్మించినచో దండి జతుర్విధ కందము
పాండవ పక్షా! మెలంగు ్రాజ్జుల సభలన్”
నన్నెచోడుని చతుర్విధ కందము
ప్రథమ కందము
“సుజ్ఞాన యోగతత్వ వి
ధిజ్ఞులు భవ బంధనముల ద్రెంచుచు భువిలో నజ్ఞాన పదముం బొందక
ప్రాజ్ఞులు శివుంగొల్తు రచల భావనం దవులన్”
132 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ద్వితీయ కందము భవ బంధనములం దెంచుచు భువిలోన జ్ఞాన పదముం బొందక ప్రాజ్ఞులు శివుగొల్తు రచల భావనం దవులన్ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్” తృతీయ కందము “అజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచల భావనం దవులన్ సుజ్ఞానయోగతత్వవి ధిజ్ఞుల్ భవబంధనములం డ్రెంచుచు భువిలో” చతుర్ధ కందము “శివుగొల్తు రచల భావన దవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞుల్ భవబంధనములం (దెంచుచు భువిలోన జ్ఞాన పదముం బొందక ప్రాజ్జులొ” సీసము కవిరాజు క్రొత్త మార్గమునకుం దిప్పి సొగసుగా రచించిన మజియొక పద్యము సీసము. చోడుని సీసములందు తూంగు సీసములే మెండు. “వెలిమిడి నలికంబు చెలుపంగం బోవుచోం దెలుపార మై నిండ నలది కొనుచు బూవులు దుజుమంగం బోవుచో వెలిగొంత దోపంగ నడ్డంబు దురిమికొనుచు మోవిలత్తుక బూయంబోవుచో లాలాట పట్టిక దిలకంబు వెట్టికొనుచు కాటుక మెదుచుచు గన్నుల నిడబోయి పొల్తుక గళమున బూసికొనుచు
నన్నెచోడుండు 133
సితరుచీం, దుఖండ, శిఖి నేత్ర గరళంబు లొడల, దలను, నుదుట, మెడను, దాల్చి పొల్పు శంభు నోర్తు పొలిచూ పజుదస కెజగుచుండ వచ్చె నీశుజూడ”
సీసము చమత్మారముగా నుండుటకు మరియొక కారణము గీత పద్యమద్దానికి జీవము పోయునట్లు మార్చుట. ఈతడు సీస పద్యమును పెక్కుబాటల నడిపించి తరువాతి వారికి మార్గదర్శకుడైనాడు. తరువోజ దేశి పద్యముల ఎడ నభిమానము గల్గిన చోడుండు తరువోజ, ఉత్సాహ, లయగ్రాహి లయ హారిణ్యాది పద్యములను సందర్భోచితముగ జెప్పినాడు. చోడుండు తరువోజ పద్యమును దక్షునిచే నల్లునిపై నలిగిన తరుణమున - భార్యకు జెప్పు సమయమున జెప్పించినాడు. రతీ విలాపమును (పంచమాశ్వాసము) గూడ నీ పద్యముననే జెప్పించినాడు. “కాయజుండాయగ్ని గాలెనో నెజయం గాలంగ నెడ యెద్దిగడు భీతి బాణీ పోయెనో? ననుం బెట్టిపోవునే కడచి? పోయిన నీ భస్మపుంజ మెక్కడిది” విరహావస్థ యందు (పార్వతీ) సైత మీతడు పైని చెప్పిన పద్యమును వ్రాసినాడు. లయగ్రాహి వీర రసానుమూలమైన ఈ పద్యము నీతడు మనోహరముగ జిత్రించినాడు. “ముట్టి గజయూధముల బట్టి రద నాగముల గుట్టి తెగం జీరి పలు తట్టములు వెట్టుం గట్టి దురదాకి పడంజెట్ట మొగపెట్టుం బెద ముట్టు సనివాలముల బెట్టుకొని వీడున్ బిట్టడరి కేల మెడసుట్టి తెగ నెత్తువడు
134 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
నట్టలు శిరంబులును మెట్టలు గొనం బ్రో పెట్టు జనదట్టు జెడమెట్టు నలిగొట్టుం గని కట్టలుకం దారక సురారి కరివారన్” కుమార సంభవములోని వృత్తములకు స్రీ పర్వములోని వృత్తము లనుకరణములుగ గన్పట్టును. ప్రగ్ధర - మహస్రగ్ధరలు చోడుండు '్రద్ధరను రెండు పట్టుల యందే వాడినాడు. (గ్రంథాది మగళా చరణమందును, దక్షాధ్వర విధ్వంసమునను) మహాస్రద్ధరను మాత్రము నూట తొంబది పద్యముల, కుమార సంభవమున జెప్పినాడు. మంగళ మహాశ్రీ కావ్యాదిని ్రగ్ధరా వృత్తము నన్నెచోడుని ప్రత్యేక మార్గమయినట్లే కావ్యాంతమున మంగళ మహాశ్రీ వృత్తమును రచించుటయు నీకవి ప్రత్యేక మార్గము. ఈ మంగళ మహాశ్రీ యనునది కాకతీయ శాసనముల కాననగును. పదపరికరము “నన్నెచోడుని కవిత్వ మన్యభాషా దూషణగాదేని యుత్తమిమని పంతులు గారు జెప్పుటకు అతడుపయోగించిన ప్రాంత పదము లాధారముగా స్వీకరింపవచ్చును. చోడుని కవిత్వమునందాంధ్రేతరములైన తమిళ, కన్నడ భాషా పదములుండుట సత్యదూరము కాదు. జాను తెనుగు ఇదమిత్ధముగా నిర్ణయించుటక సాధ్యమైన ఈ జాను తెనుగు స్వరూపమెట్టిదో జనసామాన్యమునకు సుదూరముననున్నది. నన్నెచోడుని యనుగాలములో నొకడైన పాల్కురికి సోమనాథుడు జాను తెనుగునిట్లు నిర్వచించినాడు. “ఉరుతరగద్య పద్యోక్తుల కంటె సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట” (బ.పు)
నన్నెచోడుండు 135
“పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా సర్వసామాన్యంబుగామి జానుతెనుగు విశేషము ప్రసన్నతకును (పం.ఆ.చ)
తత్మాలమున వ్యావహారికములగు నాంధ్రేతర పదములనే యాతడుపయో గించెనని అంగీకరించుట కాలంబనముగా, ఆతని తరువాతివారు యా పదముల నుపయోగించుట మనము దీసికొనవచ్చును.
శతక వాజ్మయము
శతకరచనకు బీజములు నాటినవాడు నన్నెచోడుండు. దారిద్ర్య విద్రావణాయను మకుటముతో పది పద్యములు వరుసగా నింద్రుండు శివుని స్తుతించినట్లు రచించెను.
కుమార సంభవము ప్రథమ ప్రబంధము
ప్రబంధములో నితివృత్తమున వస్వైక్యముండవలయును. తదితివృత్తము పురాణమునుండి గ్రహింపబడినదై, శృంగార రస ప్రధానమై, వీరరసము అంగరసము కాగా వర్ణనాబాహుళ్యత నొప్పుచు నుండవలెను. ప్రబంధ శబ్దమును తొలిసారిగ నుపయోగించిన చోడుని కృతి యందుగల ప్రబంధ లక్షణా పరీక్షణ. అష్టాదశ వర్ణన: “వనజలకేళీ రవిశశి తనయోదయ మంత్రగతిరతి క్షితి పరణాం బునిధి మధు బుతు పురో ద్వా హ నగ విరహ దూత్య వర్ణనాష్టాదశమున్” వనవిహారము: “తన్నిన బూచె నెందు గడు దైన్యమ శోకము, బాహుపీడనం గ్రన్నన బూచె నీకురువకంబును, నెంగిలికల్లు సల్లినన్ మన్నన దప్ప పూచె దొరమాయగ గేసరమేము సూచుడుం గన్నుల సన్న బూచె దిలకంబని దానికి మెచ్చి రంగనల్” ఈ పుష్పాపచయవర్ణన మనంతర కవులు తూ.చా. తప్పక వర్ణించిరి.
136 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
సూర్యోదయ వర్ణన: అష్టాదశ వర్ణనలో ఈత డతిమనోహరముగ జిత్రించిన వానిలో నిదియొకటి. శ్లేషాత్మకముగ జెప్పిన ఈ క్రింది పద్యముదాహరణముగ గైకొనవచ్చును. “రాజరుచివాయ గువలయ రమణ దఅ గె గలయ దమ్ముల మొగములు నెలమి మిగిలె శీతకరుడైన రాజు పాసిన ధరిత్రి వందుగాకెందు దాయలు వగతు రెట్లు” ఇట్లు చంద్రోదయ, తనయోదయ, మంత్రాలోచన, యాత్రా, సురత, యుద్ధ, సముద్ర, మధుపాన, బుతు, నగ, పుర, పరిణయ, విరహ, దూత్య వర్ణనలు మనోహరముగా జేయబడినవి. షట్రింశదలంకారాలంకృతంబై యొప్పు కావ్యకన్య సృష్టికర్తయు, ప్రథమ ప్రబంధ కర్తయు, షష్ట్రంత్య శతక, శ్రీకారాది పద్యములకు మార్గదర్శకుడై మాయని కాంతిని గాంచినప్పటికిని, అటు శివకవుల యొక్కయు, నిటు వైష్ణవ కవుల యొక్కయు ఆదరమును బొందలేమి యాతడు వెలుగు చూడలేదు. అనేక విషయములం దనేకులకు మార్గదర్శకుడైన ఈ కవిరాజశిఖామణి అనల్ప కల్పనాశక్తితో, అపూర్వ వర్ణనాయుక్తితో, అలతి యలతి అలంకారములతో రమణీయాక్షరముల పొందికతో కథను అందముగ, కర్పూర తాంబూలమువలె మలచి యందించి, సమస్త వస్తు కవీశ్వర నూత్న కావ్య రుచిర రత్న వీధి యెట్లుండవలెనో విశదీకరించి, దశప్రాణంబుల సప్రాణంబై నవరస భావ భరితమైన రచనతో కావ్య కన్యను నిర్మించి చిరస్మరణీయుడైనాడు.
దశకుమార చరిత్రము
సంస్కృత వాజ్మయమందే దశకుమార చరిత్రము వంటి రమ్యమైన కథలు కలిగిన గ్రంథము లేదనిన నింక తెనుగు విషయము జెప్ప నవరసమే లేదు. తెనుగు నేటివరకు నొక యనుకరణ భాషగానున్నది. నాడు సంస్కృతము దీనికి మార్గదర్శకమైన నేడు ఇంగ్లీషు బంగాలీ భాషలా స్థానము వహించినవి. సంస్కృతమందు హితోపదేశ కథాసరిత్సాగర బృహత్మథా కాదంబరీ కథల వంటి వనేకములు కలవు. కాని యవియు నీ దశకుమార చరిత్రలోని కథలలో నొక్కొక్కటి యొక్క నవలకు మూలాధారము కాదగినది. నేటి నవలా కర్తలిట్టి కథలనే పెంచి సాహస కథలనుగా (Novels of Adventure) వ్రాయుచున్నారు. ఈ కథలలో రాజవాహనుడు పాతాళలోకమునకు బోవుట, ఒకమంత్రి యక్ష స్త్రీని వివాహమాడుట, ఒక బ్రాహ్మణ (బ్రువుడు యమలోక మేగి వచ్చుట, నిట్టి యంశములు నాలుగైదు ఆవిశ్వసనీయములైన వానిని వదలిన దక్కిన భాగమంతయు నేటి నవలా కర్తలు సమ్మతించునవే యైయున్నవి.
కథలు వ్రాయు కవులకు ముఖ్యముగా గథా మాత్రము నవిచ్చిన్నముగా నడపుట (Narration) దానికనుకూలమగు సులభశైలి యీ రెండును నవసరములు. మన తెనుగు ప్రబంధములలో నూటికి తొంబది తొమ్మిది ప్రబంధములోని కథలు “పిట్టమ్మ కాకమ్మ కథల వంటివి”. మన కవులు కథా చమత్యృతిని చాటింపక శైలి చమత్కతిని బూజించిరి. సంస్కృతమందును కాదంబరి యిట్టి గ్రంథమే. బాణుడు కథలు జెప్పుచు జెవ్చుచు మధ్యన నలుబరి యేబది వుటలే నరోవర వర్ణనమునో, యే రాజకుమారోపదేశమునో వర్ణించును. ఈ వర్ణనలును దెగబారెడు సమాసములతో నిండియుండును. చదువు వారికి విసుగు పుట్టుట తుది ఫలితము. మన దశకుమార చరిత్ర మట్టు కాదు. వర్ణనాంశము లిందు తక్కువ. శైలి నాతికఠినము. కథ మనోహరము. స్వాభావికము. ఇది సంస్కృత దశకుమార చరిత్ర సంబంధమగు చర్చ.
138 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఇక మన తెనుగు దశకుమార చరిత్ర గుణించి యించుక వ్రాసెదను. కేతన తెలుగులో గథలందొక్క చోట కొంచెము మార్చుచేసెను. రాజవాహనుని ప్రేమకథ యంతయు నొక యుచ్చ్వాసమున మూల మందుండ దానినే తెలుగున పుష్పోద్భవుని కథలో కొంతయు, చతుర్థాశ్వాసమందు సోమదత్తుని కథ యందు గొంతయు విభాగించి వ్రాసియున్నాడు. ఈ రెండు పద్ధతులవలన కేతన (ప్రతిభను గనుగొనవచ్చును. ఈ కేతన ప్రబంధమును కేవలము (తర్జుమా) భాషాంతరీకరణ ముగా భావింపజనదు. ఇతడు స్వతంత్ర వర్ణనములు వ్రాసి తన భావ వైశాల్యమును జూపించినాడు. దండి యెంత రసికుడో, యంతకన్న రసికుడు మనకేతన. దండి వచనము వ్రాసియు “కవిర్ణండీ” యని ప్రఖ్యాతి గాంచెను. కావుననే కేతన “యభినవదండి” యను బిరుద మందభిమానము కలవాడయ్యెను. కేతన మూలమున కెందెందు భిన్నముగా వ్రాసెనో యన్నియు నిందు జూప వీలుండదు. కావున గొన్నింటినే కేతన వర్ణనా సామర్థ్యమును జూపుటకై యుదాహరించెదను. ప్రారంభముననే పుర వర్ణనము భిన్నించినది. దాని వెంటనే రాణియగు వసుమతీదేవి సౌందర్య వర్ణనము విపులముగా మూలమందుండ మన కేతన “వసుమతికి సవతియనందగు వసుమతీదేవీ” యనినాడు. మూలమందలి వర్ణనలో విశేషమేమియు లేదు. కవి సంప్రదాయానుసారముగా పద్మములు మీనములు, పూర్ణకుంభములు మున్నగు వస్తువులు యంగముల కుపమానములుగా గైకొనబడినవి. మగధ మాళవదేశ రాజుల యుద్ధము వర్ణించుచో మన కేతన యిట్లు తన సొంత పద్దెమొకటి కలిపినాడు.
చ. ఆ మగధేశ మాళవ ధరాధిపు
లెక్కటిం బోరి రాజిలోం
గాముడు శంబరుండు శశిఖండ ధరుండు గజా సురేంద్రుండున్
రాముడు రావణుండు సురరాజ త నూజుడు సింధునాథుడున్
భీముడు దుస్ససేనుడు నుపేంద్రును కంసుడు బోరు నాకృతిన్”
దశకుమార చరిత్రము 139
మూలమందు కామ మంజరి యను భోగముది మరీచికి కామతత్త్వమును బోధించునప్పుడిట్లు వర్ణింపబడినది. “బాధితో పిచాల్పాయాప్రతి సమాహితస్త మరపి దక్షషం నిర్హత్య శ్రేయసే నల్పాయ కల్పతే, తథాహి పితా మహస్య తిలోత్త మాభిలాషః భవానీ పతేర్ముని పత్నీ సహస్రం సందూషణం పద్మనాభస్య షోడశసహగస్రాంతః పురవిహారః ప్రజాపతేః స్వదుహితర్యపి ప్రణయ ప్రవృత్తిః శచీపతే రహల్యా జారతాః” ఈ వర్ణన తెనుగునందు లేదు. దానికి బదులీ పద్యము మూలమందు లేనిది కలదు. చ. అలరులుం బూత లంబరము లాభరణంబులు దమ్ములంబు నె చ్చెలులు మృదూపధానములు సెజ్జలుం గేలి గృహంబు లాదిగా గలుగు పదార్థముల్ నడుపుం గామము దాను మనోహరంబు త తృల మగు సౌఖ్యసిద్ధిం దెలుపన్ యశమే యనుభూతిం దక్మంగన్॥ మూలమందొక జైనుండు (క్షపణకుడు) వ్యసనియై యొకచో నుండినట్లు వర్ణింపబడినాడు. ఆదర్శంచ... మస్పష్ట సమాధి మాథిక్షీణ మగ్రగణ్య మానభి రూపాణాం కృపణ వర్ణం కమపిక్షపణకం” అనగా నా క్షపణకుడు దీనుడై మానస పీడా దుర్భలుడై కురూపియై యుండెనని దీని అర్థము. ఈ క్షపణకుని వేషమును వాని వ్యసనమును నెట్లు కేతన చిత్రించినాండో చిత్తగింపుడు సీ. భూరేణు పటలంబు పొదవిన వక్షంబుం గన్నీటం దోడ్తోడంగడగు వాని డాకేలు నెక్కువ దాపిడి తనలోనం తలపోసి తలపోసి యలయువాని ధరలోన గలుగు నొప్పరి మిండలకు నెల్ల మొరలు నాం జాలిన మూర్తివాని బరివోవ సూంచినం బలుచనై తల మీద దూగాడు వెండ్రుక తోకవాని
140 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
తే. గూటికుంచెయు వెడచింపి చేటకెలన దొంతి బుజ్జల చిక్కంబు పొంతంబెట్టి వగలం బొగిలెడువాని నిర్వాణి నొక్క తరుణ తాపసి గాంచితి ధరణినాథ. ఇందు మొదటి పంక్తి మాత్రమే మూలమున కనుకూలము. కేతన ప్రతిభా ప్రభావమే. మూలములో సూర్యోదయ మయ్యెను అని మాత్రమున్నది. గాని యా భాగమునే కేతన పంచమాశ్వాసమున నిట్లు వర్ణించినాడు. సీ. _ ప్రాచీన శైలాగ్ర భాగస్థమగు నశో కంబునం జిగురు జొంపంబనంగ వర్షాధిపతియని వాసవు గొలువ జే రిన యింద్రగోపక శ్రేణియనగ నురుతర పూర్వభూధరము నెత్తంబున బొలుచు గైరిక గండ శిలయనంగ కాశ్మీర పటమున గావించి సురపతి విడిచి యాడెడు వాలుబడగ యనగ తే. నరుణ కిరణుండు దోతెంచె నంబుజాత నర్మసచివ స్మితా పాదనంబునందు జతురుడై యుష్టకరముల జక్రవాక తాపముడుపుట నాశ్చర్య ధాముడగుచు.
ఒక ధనికుని ఇంట దొంగతనము కాగా పౌరజనులాచోరుని చాకచక్యము నివ్విధముగా వర్ణించిరని మూలమున లేని విశేషమును దెనుగులో కేతన కల్పించి నాడు చూడుడు. సీ. _ ఇమ్మూక లిబ్బంగి నింటిలో దిరుగంగ సరకు సేయక వచ్చుటరిది కాదె... పంచ ఆశ్వా 180 పద్యము. మూలమందొక లంజ తల్లి రాజుతో తన కులాచారమును గురించి యిట్లను.
దశకుమార చరిత్రము 141
నహ్యర్థెర్న్యా యార్జితెరేన పురుషావేశ ముపతిష్టంతి (విటులు ఆన్యాయార్జితమైన ధనములను వేశ్యకిచ్చి వారిని బొందుదురు అని దీని యర్థము) ఈ వాక్యము నాధారముగా విటుల న్యాయార్జితము లెట్టివి తెత్తురో మనకేతన వర్ణించిన విధమిది. సీ. _ కన్నంబు వెట్టి తెక్కలి కొని యంకంబు పలువురితో నాడి బందివెట్టి జూదంబునకుం జొచ్చి చూఅకాండ్రం గూడి పరదేశముల కేగి తెరువులడిచి.... ....ఆ, 6 ప. 95. షష్టాశ్వాసమందు అపహార వర్యరాజ కన్యను జూచినప్పుడామె సౌందర్య వర్ణనము మూలమందు విశేషముగా కలదు. మన యాంధ్ర దశకుమార చరిత్ర మందది విడువంబడినది. అపహార వర్మ రాత్రి రాజగృహము కన్నము వెట్టి సృగాలికయను దానిని వెంబడించుకొని వీధులందు బోవుచుండ దలవరులు వచ్చుటయు వారిని జూచి యితండు తప్పించుకొను నుపాయము కానక విధి కృతము తప్పునేయని వారి ఎదుటికిబోయి నేను దొంగను నన్ను పట్టుకొనుడు అని పలికెను. కాని సృగాలిక యిట్లనెను. “అయ్యా! ఇతడు నా కొడుకు. పిచ్చి యెత్తినది. ఇంటిలో బంధించి యుంచ తప్పించుకొని వచ్చి యిట్లు వెళ్టిని మీ యెదుట ప్రకటించుచున్నాడు. మూలమందింతయ యున్నది. వెళ్ళి పట్టినదను విషయమును నాధారము చేసుకొని మనకేతన బహురమ్యముగా హాస్య జనకముగా నీవెజ్టి తనమును వర్ణించిన ఘట్టము ముఖ్యముగా గమనింపదగినది. సీ. _ చేసంకు పట్టుచుం జిడుపలు వెదకుచు నొరి గాలదేవుడు నులికి పడుచు విందులు విందులు విందులంచును బజ తెంచి మ్రకులు కౌగలించి కొనుచు మునుకుచు వెలుగుతో ముచ్చటలాడుచు బొరిపొలి గూయుచు బొబ్బలిడుచు గల మాటలాడుచు మొలపుండ్ల మల్లని బాడుచు నొడలెల్ల బరికి కొనుచు
142
వ.
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
నేవమగ ఉొమ్ముపై నిండ ద్రేవు డొలుక
నన్న కుడుములు దినవన్న యనుచు డాసి గుండ్ర గుడ్లను జూపుచు గునిసి గునిసి బయలు నవ్వుచు బడుకిళ్ళు వాచి కొనుచు “అయ్యారె కులదిక్కు మరలి”
నేల జేతులు సమరి మైనిక్కమెల్ల
నఅచి యుంకించి యడువులు గజచుటయును వారలద్దిరా! యని వచ్చి నలియబాజ
దోలికొని వారినిలిపితి సూల వొడచి
“దానికి వారలందరు బెలుచ నవ్వుచు నరిగిన” మూలమందు ఒక కోమటి నానాదేశములు తిరిగి యొకచోం దనకు నచ్చి
నట్టి కన్యను జూచెను. ఆ కన్యక లక్షణములు - అనగా - వివాహయోగ్య కన్యాలక్షణము లను దండి విశేషముగా వర్ణించినాడు. కేతన యిది వదిలినాడు. కథా సందర్భమునకు దగినట్లుగా నాయా తావుల కేతన మంచి యుపమానములను సామెతలను జొనిపి నాడు. మూలమందులేని యొండు రెండు చూపెదను.
క
ఆ రమణీ తిలకమునకు గారవమున శిశిరవిధులు గావించిన బొం గారెడు నేతికి బయిపై
నీరలికినయట్లవోలె నిష్పలమయ్యెన్. ఆ.౩
.. ఆడబోయిన తీర్ధం బెదురుగ వచ్చిన క్రియ ఆ. 3 చుంబక శిలాప్రతిమం దగులు నయోరూపంబునంబోలె ముని తన సజ్ఞ యరుగుదేరు డరుణి రాజ మందరిమునకుం జని (6.5) తేనియబడ్డ యీగగతి ధీరత గోల్పడి బిట్టు చాక్కతిన్ (ప్రణయ వర్ణన) (ఆ.6)
ఏను జోరవృత్తి నిచ్చితినేనియు మేలి వస్తువైన తోలుతిత్తి దక్కునెట్లు మీకు గుక్కకు డెంకాయ దక్కదనిన పలుకు నిక్కమయ్యె॥
దశకుమార చరిత్రము 143
దండి మహాకవి క్రీ.శ. ఏడవ శతాబ్దమందుండెనని పండితులు నిర్ణయించి నారు. మణియు కేతన తన గ్రంథమును దిక్మన సోమయాజికంకిత మిచ్చుటం జేసి యితడు తిక్కన సమకాలికుడనియు క్రీ.శ. 13వ శతాబ్దమందు జీవించిన వాడనియు పండితులు నిరూపించినారు. ఈ యుభయులకు మధ్య సుమారు 500 సంవత్సరముల యంతరాయమున్నది. దండి యాంధ్రుడో కాడో మనకు తెలియదు. దండి గ్రంథమందు జూదము, కోడిపందెము, సముద్రయానము వర్ణింపబడుటచేత నాతని కాలమున నివి జనులందు వాడుకగా నుండెనని చెప్పవచ్చును. ఈ వర్ణనలు తెనుగులో తర్ణుమాయె నందున నివి కేతన కాలమున నాంధ్రదేశమందుండెనో లేదోయని సంశయింపబని లేదు. కేతనకు సుమారు 100-200 సంవత్సరాల తర్వాతివాడగు వల్లభరాయుడు తన క్రీడాభిరామమందు ఓరుగంటి పట్టణములో, జూదము, కోడి పందెములు జరిగినట్లు వర్ణించినాడు. కోడిపందెము మొట్టమొదట మన దేశమందే కనిపెట్టబడినది. అమరసింహుడు క్రీస్తు శకాదిలో నుండినాడు, అతడు నిఘంటువునందు కోడికి పర్యాయపదములనిట్లు వ్రాసినాడు.
“కృక వాకస్తామచూడః కుక్కుట శ్చరణాయుధః” ఇందు కోడికి చరణాయుధః అని చెప్పు మాటను జూచిన - నాతని కాలమందే కోళ్ళ పందెములు జరుగుచుండెనని యూహింపవచ్చును. కోళ్ళ పందెమును గుణించి యొక శాస్త్రమే యున్నది.
ఆంధ్రదేశమందు పందెగ్రాండు నేటికిని కోళ్ళలో కాకిజాతి దేగజాతి నెమిలి జాతి మున్నగున వున్నవనియు నొక్కొక్క జాతి యొక్కొక్క కాలమందింకొక జాతి కోడిపై జయము పొందుననియు శాస్త్రములో వ్రాసికొని పందెములప్పుడు చూచు కొందురు. దశకుమార చరిత్రయందు ఒక జాతి నారికేళ జాతులు వర్ణింపబడినవి. మూలమందు నారికేళ జాతి ఒకజాతి కోడిని గెలిచెనని మాత్రమున్నది. కాని మన కేతన కోళ్ళ యుద్ధమునే వర్ణించినాడు. సీ. _ ఎదిరిన కోడి మున్నెనసి యారెలు మెడ
నెసగాడ నురువడి ట్రేసి ట్రేసి అది వ్రేయ మదికిన్మ నడరి బల్పున బట్టి కబళించి యందంద కదిమి కదిమి విశిఖ ముఖంబులు వెనువెంట దగులుచు నంతంత బోనీక యాగి యాగి వాగాటులకు వచ్చి వసుమతి నిలువక యొంటి తన్నున గొసరుడిపియుడిపి
144 సురవరం ప్రతాపరెద్ది వ్యాసాలు
గీ॥ _ గెలిచె నా మాట దగ నారికేళ జాతి యగ్గలికనంత బ్రజయెల్ల నార్చుచుండె జెలగి ఒక జాతి మాత్రోపజీవియెన బ్రాహ్మణుండు నన్నెంతయు (బ్రస్తుతించి.
జూదము ఇరువదియెదు విధములదని దండి వర్ణించినాడు. ఆ జూదమందు అపహారవర్మ పదివేల దీనారముల గెలిచెనట. దీనిచే దండికాలమున దీనారములు నాణెములుగా విశేష ప్రచారమందుండెనని తెలిసెడి. కేతన తన భాషాంతరీకరణమున నెందును దీనారముల పేర్కొనలేదు. దానిచే నితని కాలమందివి లేవని కాదు. ఇతని తర్వాతవాడగు శ్రీనాథుడు.
“దీనారటంకాల తీర్ధ మాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల” యని చెప్పికొనినాడు.
దండి కథలలో తలవరుల ప్రాముఖ్యము చాల గనబడుచున్నది. నిజాములో బీటు జవానులీ కాలములో చలాయించు నధికారముకన్న జాల హెచ్చుగా నధికారబలము కలవారై యుండిరనవచ్చును. వారు రాత్రికాలమందు కోల దీవటీలతో గస్తీ తిరుగుచు వీధులందు సంచరించు జార చోరులకు గుండె గాలములై ఉండిరి. మన ఆపహారవర్మ (ఈతని కథయే కథలన్నిటిలో రమ్యము) వీరిచే బలు సంకటముల బడినాడు. వారి నుండి తప్పించికొనుటకై ఒక తూరి పాము కజచినట్లు నటించినాడు. ఈ తలవరులను మూలమందు రక్షకబలమనియు నాగరక బలమనియు వర్ణించియున్నాడు. మన కేతన వీరిని ఆరెకులు, తలవరులు అని తెనిగించినాడు. అయితే యీ తలవరుల యధికారములు దండి కాలమున నుండెనేమో కాని కేతన కాలమున నాంధ్రదేశమున లేకుండెననజాలము. కేతనకు తర్వాత వాడును క్రీ.శ. 1600 ప్రాంతమున నుండిన కదిరీపతి తన శుకసప్తతిలో తలార్లను ననేక స్థలముల వర్ణించినాడు చూడుడు. కు చుట్టాలకుం దెల్పుదు మది
దొట్టిన కినుకం దలార్లతో జెప్పుదు గూ
పెట్టుడు దొరముందర నను
బట్టకుమని పజివ నతడు బరువగుఖీతిన్.
దశకుమార చరిత్రము 145
ఉ. _ అంత తలారు లాత్మవిభు డచ్చటికిం జనుదేర జార వృ త్తాంతము దెల్ప బట్టుడని యాతడనం గుడి సొచ్చి దివ్విటీల్ చెంతకు దెచ్చి చూచి....
సీ చనుజక్మవలుగన్న సన్యాసులైనను దలవరి వారితో జెలిమిసేయ కావున కేతనకాలమందును దలవరుల పోలీసుతనము విశేషముగానుండెను. కావుననే
తే. _ కోలదివియల వెలుగు దిక్కులకు నిగిడి
తొడరి పురివీధి చీకటి దొలగ దోల
బటురయంబున తలవరి బలమురాక
చూచి యొక్కింత చిత్త సంక్షోభ మెసగ. అని వర్ణించినాడు.
చోరులనేగాక జారులను గూడ బట్టు నధికారము తలవరులకు నుండెనని తెలిపితిమి. ఈ యాచారమును గుణించి యెన్నటి విషయమో త్రవ్వనేల నిన్న మొన్నటి వజికు గద్వాల సంస్థానములో గణాచారిగుత్తయని యొకటి రాజు లేర్పాటు చేసియుండిరి. ప్రతి గ్రామము గుత్తను నొకడు తీసుకొని యా మొత్తమును రాజుగారికి చెల్లించును. గుత్త తీసుకొన్న వాడా గ్రామమందెవ్వరైనా వ్యభిచరించినట్లు తలార్లవలన గుర్తెరిగిన వారి నుండి తాను దండుగలు తీసుకొనుచుండెడివాడు. ఈ గుత్తనే గణాచారి గుత్తాయని వ్యవహరించుచుండిరి.
జైన మతము దండి కాలమునందును కేతన కాలములోను బ్రచార మందుండెననియు జైనులు బ్రాహ్మణ దూషకులునై యుండిరని దెలియవచ్చెడి. కేతన జైన వేషమును వర్ణించుటచేత నాతని కాలమందు జైన వేషాచారము లెట్లుండెనో వివరముగా తెలియవచ్చెడి.
దండి కాలమందును కేతన కాలమందును స్రీలు సాధారణముగా నెట్టి సొమ్ములు పెట్టుకొనుచుండిరో యీ క్రింది యుదాహరణముల వలన దెలియగలదు.
146 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“ఆహ మపి మణి నూపుర మేఖలా కంకణ కటక తాటంక హార మరాకజ్ఞల వనితా యోగ్యం మండన జాతం నిపుణత యాతత్త స్టానేఘ నిక్షిప్య” అని దండి వర్ణించినాడు. సీ మట్టియ లుజ్వుల మణి నూపురంబులు
మొలనూలు వస్రముల్ ముత్తియములు కన్న వడంబులు గట్టి నూళ్ళాను సుద్ద
సరితీగె మినుకులు సంది దండ నంగుళీయములు హారి కంకణములు
చేకట్టు పాలెలు చెన్ను మెలుగు టాకులు సరిపెణ లాలక్తకము పూత
కాటుక తిలకంబు కమ్మపువ్వు
తే. _ లాదిగా గల మేలిద్రవ్యముల నొప్ప
బసదనము చేసి యుచిత రూపంబు దాల్చి
బాలచంద్రిక బోటినై పజ్జ కరిగి
దారువర్శుని లోగిలి దరియ జొచ్చి.
ఈ పద్యమందు పెద్ద అక్షరాలు మూలమున కనుకూలములు. తక్కినవన్నియు కేతన చేర్చినవే. ఇవి బాగుగా గమనింపదగినవి. కేతన కాలమందీ యలంకారములనే ఆంధ్ర స్రీలలంకరించుకొనుచుండిరి. భూషణముల పేర్లు విశేషముగా నచ్చ తెనుగు పదములు. ఈ భూషణములు నేటికిని మన యాంధ్ర స్రీలు పాటించుచున్నారు.
ఇది యాంధ్ర దశకుమార చరిత్ర మందు నాకు దోచిన విశేషములు. ఈ కవి శైలి విషయము నేను ప్రత్యేకముగా నిరూపించనవసరము లేదు. కేతనయే వ్రాసికొనిన యీ పద్యము నుదాహరించిన జాలును.
ఆ. కవితం జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమార చరితంబు జెప్పిన
'ప్రోడ నన్ను వేజ పొగడనేల.
దశకుమార చరిత్రము 147
ఈ కేతన దశకుమార చరిత్రను జూడని నిర్భాగ్యులైన యాంధ్రు లెవ్వరైన
i నుండిన వారు తప్పక యా గ్రంథమునైన దిలకింతురని గోరుచున్నాను. ఈ దశకుమార
| చరిత్రమున కుత్తమముగా బీఠికను శ్రీ శేషాద్రి రమణ కవులు వ్రాసియున్నారు. దాని నవశ్యము పాఠకులు చదువుదురని మనవి.
అప్పకవి
ఇటీవల ప్రచురితమైన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రెండవ భాగము చూచితిని. అప్పకవిని గురించి ఇందు ఇంచుక వ్రాసినారు. అతడు గుంటూరులో వాడని నిరూపించుటకు ముప్పుతిప్పలు పడినారు. స్థానికాభిమానముతో అట్లు వ్రాయుట కారణము కానరాదు కాని నిజాం రాష్టమువారి యభిప్రాయముల గమనింపని వివేకము వారికి చేకూరినది. కందుకూరి వీరేశలింగము పంతులువారు అప్పకవి కృష్ణామండలము వాడని వ్రాసిరి. మరియు శతఘంటము వేంకటశాస్రిగారు తమ భారతపీరికలో నిదే సూచించిరి. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమువారు ప్రథమ ముద్రణములో అప్పకవి గుంటూరు వాడని వ్రాసి ఇప్పుడును అదేమాట వ్రాసినారు. కాని యిది సరియైనది కాదు. సంపూర్ణంగా తప్పువ్రాతయే. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ ప్రథమ ద్వితీయ ముద్రణములును, నిజాం రాష్ట్ర పత్రికలలో మూడు వ్యాసములును బయలుదేరెను.
దేశబంధు మాసపత్రికలో శుక్ల సంవత్సర జ్యేష్ట మాసములో నేను వ్రాసిన వ్యాసము.
బూర్గుల రామకృష్ణారావుగారు గోలకొండ పత్రిక 2వ సంపుటము మొదటి సంచికలో అంగీరస వైశాఖ శు॥లు 2నాడు వ్రాసిన అతివిపులమగు వ్యాసము.
గత సంవత్సరము గోలకొండ సంచికలోని పూర్వకవి భాగములో శ్రీ శేషాద్రి రమణకవులచే సంకలిత వివరణము.
ఇవన్నియు సర్వస్వమువారు చూడకపోవుట తటస్థించినది. ఈ సవరణ వ్యాసమును గూడ చూడకుండిన నాశ్చర్యమేమి?
ఈ వ్యానమును నేను నిజాం రాష్ట్రాభిమానముతో వ్రాయుటకాదు. యథార్థమును వెల్లడించుటయే దీని యుద్దేశ్యము. అప్పకవి మరియు నిచ్చటివారు
అప్పకవి 149
చేయు భాషాసేవను నెరుకపరచుటయు జ్ఞాపకము చేయుటయు ద్వితీయోద్దేశము. అప్పకవి నిజముగా నిజాం రాష్ట్రమువాడు గాడని అతనిని కృష్ణలో వేసినను గోదావరిలో వేసినను మేమేమి చేయగలము?
ఇక ప్రకృత విషయము - అప్పకవి నిజాం రాష్ట్రములోని మహబూబునగరు జిల్లావాడు. పాలమూరను పూర్వనామమునకు నూతన నామకరణమే మహబూబు నగరు. నేను దేశబంధులో వ్రాసిన భాగమిది.
అప్పకవి వ్రాతలగూర్చి చర్చించుటకు పూర్వము వారి నివాసస్థలమును గూర్చి బయలుదేరిన సందిగ్ధములకు తోడుగ నింకొక సందిగ్ధమును జతపరుప నెంచితిని. అతడు గుంటూరు మండలమువాడని యొకరు, కృష్ణకు దక్షిణమున నొక యోజనము దూరమున (నెచ్చటనో) యుండెనని యొకరును వ్రాసిరి. అతడు మహబూబునగరు జిల్లావాడేమోనని నాకనుమానము కలిగినది. ఏలన నతడు తన గ్రంథములో నుదహరించిన స్థల నామములు మహబూబునగరములో గాన వచ్చుచున్నవి.
“కొండూరు” అనుననది “కోడూరు” ఏమో! చలిమల్ల యిప్పటి చెలిమిళ్ళయేమో! తంగెడ విషయము యిప్పటి తంగెళ్ళపల్లి యేమో. అభినవచూత గ్రామము అను అచ్చుతెనుగు చేసిన లేమావిళ్ళ యగును. వట్టెము యిప్పటికి వట్టెముగానే యున్నది. ఈ గ్రామములన్నియు మహబూబునగరు జిల్లాలో నున్నవి. శ్రీశైలమునకు సమీపమున నున్నవి. కావున ననుమానముతో సూచించితిని గాని నేనా జిల్లా వాడను ఐనందున స్థలాభిమానముతో గాదని ముందే విన్నవించుకొనుచున్నాను.
ఈ అనుమానమును నిస్సందేహ పరచినది మా మిత్రులును పండితులును యగు శ్రీయుత బూర్గుల రామకృష్ణారావుగారు. వారు గోలకొండ పత్రికలో నిట్లు వ్రాసిరి.
“కాకునూరు గ్రామ మెచ్చటనుండిన దెవ్వరికినీ తెలియనట్లున్నది. కాని పై పద్యము చదివినచో
(బాలుడై కాశికాపట్టణంబునకేగి
బ్రహ్మేంద్రు నొద్ద శాస్త్రములు జదివె॥)
నిజాం రాష్ట్ర వాసులమగు మనకు ఈ కాకునూరు గ్రామము నిశ్చితముగా నిర్ధేశించుటకు వీలుగలదు. చరికొండసీమలో అని వ్రాసియున్నాడు మహబూబునగర్
150 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
జిల్లాలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి తాలూకాలలో చేరియున్న గ్రామాదులన్నియు దాదాపు నాడు చరికొండ సీమలో చేరియుండినవి. చరికొండ గ్రామము కల్వకుర్తి తాలూకాలో నున్నది. ఈ సీమలో చేరిన కాకునూరు నా జన్మస్థానమగు బూర్గులకు నాలుగు కోనల దూరమున్నది. ఇపుడది గుమార్‌గీర్ అను గోస్వాములకు సర్వాగ్రహారముగా నున్నది. నిడుదవెల్లి బొద్దనేవెల్లి మొదలగు గ్రామాదులందు మాన్యక్షేత్రముల గడించెనని వ్రాసికొనియున్నారు కదా! పై జెప్పిన కాకునూరునకు మిగుల సమీపముననే యొక యామడలోపల పై గ్రామాదులన్నియు నిప్పటికి కలవు. కాకునూరికి రెండు క్రోశములలో నిడుదవెల్లి కలదు. బొద్దినేపల్లియు రెండు క్రోశములలో నున్నది. కల్వకుర్తి తాలూకాలో చేరినది. “నివరళపురి” యను పాఠము సరికాదు.” నవదళపురి యని నా ప్రబలమైన యనుమానము. కాకునూరికి రెండు క్రోశములలో తొమ్మిదిరేకుల యను గ్రామము కలదు. ప్రాత ప్రతుల మూలములు మరల పరిశీలింపదగినవి.... “అభినవచూత సద్రామము” విషయమై క్రీ.శ. లక్ష్మణరావుగారును, గిడుగు సీతాపతిగారును పొరపడినారు. ఈ గ్రామమును క్రొత్త మామిడిపల్లె యనిరి. మామిళ్లపల్లి యను గ్రామము లిక్కడను గలవు. అమరాబాదు తాలూకాలో నొక గ్రామము కలదు.... కాకునూరికి క్రోసెడు దూరముననే “లేమామిడి” లేక “లేతమామిడి” యను గ్రామము పురాతన ప్రసిద్ధముగా నున్నది. “వట్టెము” నాగర్‌కర్నూలు తాలూకాలో చేరిన గ్రామము. ఇది రావుగారి వ్యాస సారాంశము. ఆ వ్యాస మతి విపులమై సమగ్ర చర్చగలదై యున్నను స్థల విస్తరణమగునని సూచన మాత్రముతో తృప్తి బొందుచున్నాను. అభిలాషులు దానిని జూడగలరు.
తర్వాత గోలకొండ కవుల సంచికలో పై బూర్లులవారి యభిప్రాయమునే బలపరచుచు శ్రీ శేషాద్రి రమణ కవులు వ్రాసిరి - గత సంవత్సరము కాకునూరు ప్రాంత మిత్రుడొకడు నాతో చెప్పిన విషయములేమన కాకునూరు నిడదవెల్లికి రెండు మైళ్ళ దూరమున సున్నదనియు, తొమ్మిది రేకులకు (రామకృష్ణారావుగారు సరిగా చదివిన నవదళపురి పాఠము నిరవళిపురికాదు) రెండుమైళ్ళ దూరమునను కలదనియు నీ గ్రామములన్నియు తనకు పరిచితములే యనియు తెలిపినారు. మరియు కాకునూరు కల్వకుర్తిలో ఖాల్సా యిలాకా మఖామనియు తెలిపినారు. చరికొండ కాకునూరునకు
అప్పకవి 151
ఎనిమిది కోసుల దూరములో నున్నదనినారు. బొద్దినేపల్లి కాకునూరికి ఒక కోసు దూరములో నున్నదనినారు. కామెపల్లి యెక్కడిదోనని అందరు తికమకలగుచున్నారు. దేవరకొండకు (నల్లగొండలోని తాలూకా గ్రామము నాగర కర్నూలు తాలూకా సరిహద్దులో నుండునది) 20 మైళ్ళ దూరములో నున్నదని పై మిత్రులే చెప్పినారు. గోననాని పల్లె అను గ్రామమునకు 10-15 మైళ్ళ దూరములో నున్నదనియు చెప్పినారు. ఇదే సందర్భములో తిరుమలభట్టారకుని విషయము సూచించుట అ ప్రస్తుతము కాదనియు ముందు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము వారీ వ్యాసమును చూడ తటస్థించిన తప్పుదిద్దుకొనదలచిన తిరుమల భట్టారకు నొద్దనైన సరియైన సమాధానము జెప్పిన అతని వంశీయుడగు అప్పకవికి చేసిన యపచారమునకు “మాఫీ” యగునని తలచి వ్రాయుచున్నాము. అప్పకవీయములో చతుర్థాశ్వాసములో గణదేవతాఫలశీర్షికలో 68 సంఖ్య గల వచనములో వావిళ్ళవారి 1910 వ సంవత్సరపు ముద్రిత ప్రతిలోని పుటలో నిట్లున్నది. “కాలామృతమునందు (శ్రీమద్వేంకట నాయకమ్మని, మదీయాన్వయ ప్రభువుండగు తిరుమల భట్టారకుండును...” అను వాక్యము గమనింపదగినది. సుప్రసిద్ధ కాలామృత (గ్రంథకర్తయు తిరుమల భట్టారకుడు అప్పకవి పూర్వీకుడును, వంశస్థుడును. తే అందులో కాకునూరి రంగాహ్వయుండు గనియె నలువురి తనయుల గన్నమాంబ యందు దిరుమలభట్టు గంగార్యవర్యు నెలమి బెదసోము జినసోము నిందులోన అను పద్యములోని తిరుమల భట్టితడోయోమో! మరియు అప్పకవి వంశస్థుడు శేషయ్య యను పేరుగల యువకుడు మహబూబునగరు జిల్లాలో వట్టెము ప్రాంతములో నున్నాడనియు, తమవద్ద కొంతకాలము చదువుకొనియె ననియు నా మిత్రులును కర్నూలులో పాఠశాల పండితులునగు (శ్రీ అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్రిగారు నాతో చెప్పినారు.
152 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఇన్ని కారణములుండినను అప్పకవి గుంటూరు మండలము వాడై యుండెననియే యొండు రెండూహలు చేసి నిర్ణయించుట సరికాదని మనవి చేయుచున్నాను. ఇక అప్పకవి కావ్య విశేషముల నరయుదము కల మన యాంధ్రకవులు చాలా ధన్యులు. వారికి గ్రంథములు వ్రాయబుద్ధి వొడమిన తప్పక వారి కులదైవము వారికి ప్రత్యక్షమై గ్రంథమును వ్రాసి తనకు అంకితమీయ కోరుటయు సంభవించును. కలలో కేవలము కనిపించుటయే కాదు. వీరి దైవము వీరితో చాలాసేపు ముచ్చటించి నన్నయ, భీమన, సారంగధరుల కథయు, తాతన, కేతన రచించిన గ్రంథములు మెచ్చకపోవుటయు మున్నగు ముచ్చటలు గూడ నిందు గలవు. ధన్యోస్మి అని మరునాడే గ్రంథము ప్రారంభించెను మన అప్పకవి. ప్రబంధ లక్షణము ప్రబంధ లక్షణమును నిరూపించిన వీరి పద్ధతి ఆంధ్ర భాషకు చాల కష్టము గలిగించినదని నా అభిప్రాయము. ఏలయన, వీరు జూపించిన వర్ణనములన్నియు ప్రతి గ్రంథమందుండిన సామాన్యమై రుచి తగ్గుటయు, కవికి స్వాతంత్యమీయక వర్ణనములందు కూడ దాసునిగా జేయుటయు, కథా సందర్భమునకు సంబంధించక పోయినను బలవంతముగా వర్ణనములను పట్టుకొని వచ్చి కూర్చుటయు, జలవిహార, సురతములను వర్ణించుట చేత గ్రామ్యత్వము కవులకు సిద్ధించుటయే ఈ అప్పకవి గారి మార్గమున నడుచుటవలన కలుగు ఫలితములు. చూడుడు వారి ఆదేశము. సీ! పురమును బుతుషట్మమును ప్రయాణంబును శైలంబు వేటయు సాగరంబు మౌనీంద్ర పుణ్యాశ్రమంబును మంత్రంబు ద్యూతంబు పిదప నద్భుత రణంబు విజయంబు మద్యపానజ వికారంబును వనవిహారంబును వారికేళి కన్యాంగ సౌందర్య కథనంబు హిమకరా భ్యుదయంబు విప్రలంభోదితంబు
అప్పకవి 153
పద్మ మిత్రోదయంబును బరిణయంబు సురతమును దౌహృదంబును సుత జననము ననగ నిరువది రండు వర్ణనలు గూర్చి చెప్పవలయు బ్రబంధంబు థీనివాస!
కల్లుద్రావి చెప్పి వికార చేష్టలు కూడ వర్ణించవలయునట. కొడుకు పుట్టని కథ ఉండినను కొడుకును పుట్టించి వర్ణించవలయునేమో! కన్యాంగ సౌందర్య కథనంబు అని చెప్పుటచేత కవులనేకులు పిచ్చి పిచ్చిగా వర్ణించినది అట్లుండ కొందరు చెప్పరాని అంగవర్జనలు కూడ చేసిరి. చాల కట్టి (వరుస పెట్టి) మధ్యకాలపు కవులందరు “ఉండంగ ఉండంగ ఒక ఊరుండె” అని పురవర్ణనతో కథ ప్రారంభించిరి. కాళిదాసు కుమార సంభవములో 'అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా అని ప్రారంభము తోడనే హిమాలయ వర్ణన తోడను, మేఘసందేశములో 'కశ్చిత్మాంతా విరహ గురుణా” అని శాపాస్తంగమిత మహిముడై విరహార్తి పొందుచుండిన యక్షుని వర్ణన తోడను, భారవి “శ్రియఃకురూణాం” అనియు ప్రారంభించిన గ్రంథము లెంత మనోహరముగా నున్నవో వేరుగా చెప్పనవసరము లేదు. సారస్వతౌషధములు
అప్పకవి కొన్ని బెషధములు తయారుచేసియున్నాడు. మనదేశములో వైద్యము ఒక రహస్య శాగ్త్రముగా నుండెడిది. సిద్ధుల వలనను, సన్యాసుల వలనను, యోగుల వలనను, హిమత్సర్వత మూలికల నెరిగిన అనుభవజ్ఞుల వలనను, ఎవరైనను ఒక చిటికలగానీ, ఘటికలోగానీ, చేయనేర్చుకొనిన దాని నతిగోప్యముగా నుంచుకొని ఇతరులకు చెప్పకుండెడివారు. అట్టిచో “సూక్తులు ఘటించు, మందులను కర్షమాత్రంబు భక్షింపగలిగెనేని” - గడియకొక పద్యశతకంబు నుడువ జేయునట్టి మందును, నలువచెలువ 'నాలుకను కాపురంబుండు” నట్లు చేయు దివ్య ఘటికను నెరిగిన అప్పకవి ఏ మాత్రమును దాచక లోకోపకారార్థమై వెల్లడించినందులకు కృతజ్ఞతా బద్భులుగా నుండవలసినదే. కాని, ఎవరైన నిది నిజమనినమ్మి చూపించిన ప్రకారము మందుల సేవించిరో లేదో తెలియదు. శతఘంటము వారమని బిరుదుల నుంచుకొనిన వారికేమైన నీ రహస్యము తెలియనేమో!
154 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
పోతనామాత్యుడు రేఫ ర కారములు మైత్రిని చేసెనని పోతనామాత్యుని తప్పుపట్టి ఈ అప్పకవి ఆ మహాకవిని ఉదాహరించుటయే మానుకొనెను. కాని, రేఫ అ కారమైత్రి చేసిన ఇతర కవులను నెందరినో ఉదాహరించుటలోని మర్మమేమో ఊహింపజాలను. పోతన విషయమయి ఇట్లు సెలవిచ్చిరి. బమ్మెర పోతరాజకృత భాగవతంబు సలక్షణంబుగా కిమ్మహినేమిటిం గొదువ యెంతయు నారసి చూడగాను రే ఫమ్ములు జాలునుం గలిసి ప్రాసములైన కతంబునంగదా యిమ్ముల నాది లాక్షణికులెల్లను మాని రుదాహరింపగన్ అయిన అప్పకవి తర్వాత వచ్చిన కూచిమంచి తిమ్మకవి సార్వభౌముడు తన సర్వలక్షణ సారసంగ్రహములో నిట్లు పోతనగారి నిజమయిన గొప్పదనమును నిరూపించి పుణ్యము కట్టుకొనెను. పోతన ప్రాశస్యమును ఇట్లు వర్ణించెను. అఖిల వేదాంత విద్యారహస్యవిదుండు సహజ పాండిత్య విశారదుండు పటుతర కవితా విభాసిత ప్రతిభుండు సకలాంధ్ర లక్షణ చక్రవర్తి రఘుకులేశు నిదేశ రచిత మహా భాగవత పురాణుడు పుణ్యవర్థ
బుధజనహితుండు బమ్మెర పోత సుకవి ఎన్న రేఫ అ కారంబు లెరుగడనుచు నజ్ఞు లొక కొందరాడుదు రమ్మహాత్ము కవిత కెందును లోపంబు గలుగదభవ పోతన భాగవతము కొంత శిథిలముకాగా దానిని పూరించిన కవుల పద్యము లందే ఈ సాంకర్యము కలదు. కాని పోతన కవితలో లేదని పద్యముల ననేకము లాయా కవులవి ఉదాహరించి తిమ్మకవి నిరూపించెను.
అప్పకవి 155
సంస్కృతాంధ్ర కవితా పటుత్వముచేత నొప్పి ఈ 300 సంవత్సరముల నుండి వెలసిన కవుల కందరకును భిక్షపెట్టిన అప్పకవిని తప్పుపట్టు నుద్దేశముతో ఈ వ్యాసమును వ్రాయలేదు. అట్టి మహాకవి కీ లోపములు లేకుండిన బాగుగా నుండెడిదనియె నా అభిప్రాయము.
(ఈ వ్యాసం అప్పకవి గురించి వ్రాసిన రెండు వ్యాసాల సంక్షిప్త రూపం)
సుమతి శతకము
కర్త యెవరు?
సుమతి శతకమును వ్రాసిన మహాకవి యెవ్వరో ఇంతవరకెవ్వరును నిశ్చయముగా తెలిపినవారు కారు. ఈ శతకమున కుండినంత ప్రచారము మరే తెలుగు గ్రంథమునకు లేదు. క్రీ.శ. 1910 లో వనపర్తిలో శ్రీ మానవల్లి రామకృష్ణ కవి పాదులు భద్ర భూపాలుని నీతిశాస్త ముక్తావళిని ముద్రించి దానికొక యుత్తమ పీఠికను రచించి అందిట్లు వ్రాసిరి.
“ఇతడే భద్ర భూపాలుడు (బద్దెన) సుమతి శతకమును రచించెనని ప్రథమ పద్యము చూచిన దోచును. కాని యీ పద్యము నాకు లభించిన యైదు ప్రతులలో నొక్క దానిలో మాత్రమే యున్నది. రెండు ప్రతులలో ప్రారంభము లేదు. సుమతి శతకమునకును దీనికిని పాఠభేదము గానవచ్చుచున్నది. జాతీయ వాచకములలో భేదమగుపడును. సుమతి శతకమును రచించినవాడు భీమకవి యను లోక ప్రవాదమేకాక సుమతి శతకము తాళపత్రములలో ప్రథమ పద్యము భీమన పేరుతో నుండ నేను జూచియున్నాడను. ఇతడు వేములవాడ భీమ కవియా? లేక చదలవాడ భీమ కవియా? నృసింహపురాణమును రచించినవాడు దాక్షారామ వేశ్యలను వర్ణించినందున వేములవాడ భీమకవియే యని తోచుచున్నది... కావున సుమతి శతకమెవ్వరు రచించిరో గుర్తెరుగవలయును. నీతులు బద్దెన నీతులు వలెనున్నవి కాని శైలి మాత్రము భేదముగా నున్నది. ఇదియును పైయంశము వలెనే యనిశ్చితము.
నీతిశాస్త్ర ముక్తావళిలో శ్రీ మానవల్లివారు ప్రకటించిన దానిలో మొదటి పద్యమిట్లున్నది.
సుమతి శతకము 157
“శ్రీవిభుడ, గర్వితారి
క్షాపర దళనోపలబ్ధ జయలక్ష్మీ సం భావితుడ, సుమతి శతకము
గావించిన ప్రౌఢ, గావ్య కమలాసనుడన్”
(శ్రీ.మా. రామకృష్ణ కవిగారన్నట్లుగా సుమతిశతకము యొక్కయు నీతి శాస్తముక్తావళి యొక్కయు శైలిలో చాలా భేదము కలదు. అందుచేత సుమతి శతకమును ముందు రచించి తర్వాత నీతి శాస్త్ర ముక్తావళిని రచించి యుండిన సుమతి శతకములోని శైలీ సూచక పదజాలము కొంతయైనను రెండవదానిలో పడవలసి యుండవలెను. అట్టి జాడలేవియు గానరావు.
భీమకవి వ్రాసెననుటకు తాళపత్రపద్యము లేవియు ్రీకవిగారుదహరింప లేదు. మరియు వేములవాడ భీమకవియు చాలా ప్రాచీనుడు. నన్నయ తిక్కనల కాలపు శైలియే వేరు. సుమతిశతకములోని శైలి (శ్రీనాథుని యనంతర శైలిగా కానవస్తున్నది. కాళిదాసుని గురించి మనకెంత తెలియునో తుదకు సుమతి శతక కర్తను గురించియు మనకంతే తెలిసినదనవలెను.
కవియెవ్వరో తెలియనప్పుడు కవి కాలమెట్లు తెలియును. అయినను శతకములోని శైలినిబట్టి కొంత యూహింపవచ్చును. భద్ర భూపాలుడు క్రీ.శ. 1150కి పూర్వమందే ఉండిన వాడనియు అతనిని అతని పద్యాలను నీతి సారములో రుద్రదేవుడును సకల నీతి సమ్మతములో మడికి సింగనయు మరికొందరును నుదాహరించిరని ఆ కవిగారు తెలిపినారు. సింగనాదులు సుమతి శతకము నుండి పద్యాలనేల యుదహరింపలేదు. మడికి సింగన తర్వాతిదే ఈ సుమతి శతకమని చెప్పవచ్చును. నీతి శాస్త్రముక్తావళిలో తిక్సనయు నతనికి పూర్వులును వాడిన పదాలెక్కువగా కలవు. కెలసము, పొరచి, ఎత్తికోలు, పురులు, ఒరిమే, కురగట, మున్నగు బహు ప్రాచీన పదములతడు వాడినాడు. అయితే ఈ పదాలను తిక్కన తర్వాతి వారును వాడిరని పరిశోధించి చూపించ వచ్చును. కాని అవి పరిశోధన శ్రమకు లోనైనవే యగును. శతకములో నిట్టి శబ్దాలు కానరావు.
158 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
సుమతికి మూలములు
సుమతి శతకకారుడు విశేషముగా సంస్ఫృతములోని శ్లోకాల నుండి భావములను స్వీకరించెను. అదే పనిగా పరిశోధించు వారికి విశేషముగా మూల శ్లోకములు లభింపగలవు. స్టూలముగా నాకు తెలిసిన కొన్ని మూలములను తెలుపుకొందును. క. అధరము కదలీ కదలక
మధురములగు బాసలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ
శ్లో బధిరయతి కర్ణ వివరం వాచం మూకయతి గాత్రయష్టిం సంపద్రో గోయ మద్భుతోరాజన్
“ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను చెరకు కైవడినేవో” అనునది. హితోపదేశ మందిట్టి భావముగల శ్లోకమును బోలినది. “చెఅకు తుద వెన్ను బుట్టిన జెజికున దీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ. ఇట్టి భావమే తమిళ నీతి కారులు వాడినారు. “కరంబు (చెజకు-క-చ- అగును) పూవోలొ (చెరకు పూవువోలె) అని తమిళ పద్య పంక్తి ఈ రెంటికిని సంస్కృత మూలముండి యుండును. “తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తలతోక యనక నుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ”
సుమతి శతకము 159
దీనికి సరియగు శ్లోకము “వృశ్చికస్య విషం పుచ్చం మక్షికస్య విషంశిరః తక్షకస్య విషందంష్ర్టా సర్వాంగం దుర్దనే విషః
“తల దడిపి బాస చేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ. చేమకూర వేంకటపతి సారంగధరలో
“తల తడిపి బాస చేసిన
జలజాక్షులు నమ్మరాదు సారంగధరా అని వ్రాసెను. ఇందెవ్వరెవ్వరికి బుణ పడినట్లు? వెంకటపతియే తన చిన్నతనమందు సుమతి శతకము చదివి యుండెనా?
“పర సతుల గోష్టి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్ అన్న భావమునే చేమకూర తన సారంగధరలో
“నిజము భీష్మ నంతటి జితేంద్రియునకైన
నాశపుట్టు మదిని రాశపుట్ట దితరులనగ
నెంత ధనము పట్ల యువతి జనము పట్ల అని వ్రాసెను.
“పర నారీ సోదరుడై
పర ధనముల కాశపడక పరులకు హితుడై. అన్నది
“మాతృ వత్సర దారేషు, పరద్రవ్యేషు లోష్టవత్
ఆత్మ వత్సర్వ భూతేషు యః పశ్యతి స పండితః అన్న దానిని బోలినది.
సిరిదా వచ్చిన వచ్చును
సరిపోల్పగ నారకేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మింగిన వెలగపండు కరణిని సుమతీ.
160 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అనుదానికి సంస్కృతము.
సమాయాతి యథాలక్ష్మీః
నారికేల ఫలాంబువత్
వినిర్యాతి యథాలక్ష్మీః
గజభుక్త కపిత్ధవత్.
అయితే ఏనుగు వెలగపండును నమలక అమాంతముగా (మింగుటను మరునాడు లద్దితోపాటు ఆ పండులోని గుజ్జును కడుపులో పెట్టుకొని, పండు చిప్ప పగులకుండా లోపల యేమియు లేనట్లుగా చేసి బయట పడవేయుటను ఎవ్వరైనా పరీక్షించినారా? గతానుగతికముగా అందరనగా మనమును ఆ ప్రకారమేనా! క్రీశ 1907లో నిర్ణయసాగర ముద్రాలయము వారు ప్రచురించిన “సమయోచిత పద్యమాలికా” అను సంకలనములో పై శ్లోకమునకు పుట అడుగున “కపిత్థాంతర్గతః కీటోగజ ఇత్యభిధీయతే” అని యుదాహరించినారు. వెలగకాయలో పుట్టి దానిలోపలి భాగమును తిను కీటకము గజము అని దీని యభిప్రాయము. గజమున కీయర్థమే నిఘంటులోను కానరాదు. మరి ఏ నిఘంటు ప్రమాణమో వారును తెలుపలేదు.
“అప్పిచ్చువాడు వైద్యుండు
నెప్పుడు నెగ తెగక పారు యేరును ద్విజుండుం
జొప్పడిన యూరనుండుము
జొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” అనుదానికి మూలము.
“బుణదాతాచ వైద్యశ్చ (శ్రోత్రియః సుజలానది
యత్రహ్యేతే నవిద్యంతే నతత్ర దివసంవసేత్
కోమలి నిజమున్... ... అన్నదానికి మూలము.
“జెదుంబరాణి పుష్పాణి, శ్వేత వర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యేన్న నారీ హృదయస్థితం
“తన వారు లేనిచోటును
చనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువందగదు మహిలో సుమతీ”
తెల్లని కాకులును లేవు
సుమతి శతకము 161
యనుదానికి మూలము. “యస్మిన్ దేశోన సన్మానో నప్రీతిర్నచ బాంధవా; నవిద్యా నాస్తిధనికో, నతత్ర దివసం వ్రజేత్” ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాని..... అనుదానికి మూలము. “దుష్టా భార్య, శరోమిత్రః భృత్యోల_ హంకార సంయుతః “పతి కడకు, దన్ను గూర్చిన సతికడకున్ వేల్పు కడకు, సద్గురు కడకున్. సుతుకడకు, రిత్తచేతుల మతి మంతులు చనరు నీతిమార్గము సుమతీ” (పతి-రాజు) అనుదానికి మూలము. “అగ్ని హోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధబాలకా రిక్త హస్తేన నోపేయాత్ రాజానం దైవతంగురుః “పాలసునకైన యాపద జాలింబడి తీర్చవలదు సర్వజ్ఞునకున్ తేలగ్ని బడగ బట్టిన మేలెరుగనె మీటుగాక మేదిని సుమతీ అనుదానికి మూలచ్చ్భాయ. “ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే పయః పానం భుజంగనాం కేవలం విషవర్ధనం”
“అడవిని తోడ రయక”
అనుదానికి పూర్వపు జాడ “నైక ప్రపద్యేతా ధ్వానం” ఉడుముండదె నూరేండ్లును
162 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అన్నదానికొక విధమగు ఛాయ. కాకోపి జీవతి చిరంచ బలించ భుంక్తే
“పనిసేయు నెడల దాసియు
ననుభవమున రంభ, మంత్రి యాలోచనకున్” అను పద్యమునకు సరియగు శ్లోమిది.
“కార్యేషు మంత్రీ కరణేషు దాసీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
ధర్మేల_ను కూలా క్షమయా ధరిత్రీ
భార్యాచ షాడ్గుణ్యవతీహ దుర్లభా”
గడనకల మగని జూచిన
అడుగడుగుకు మడుగులిడుదు రతివలు, అనునది
“యావద్వితోపార్దనశక్తః
తావన్ని జపరి నారోరక్తి అన్నదానిని బోలినది.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేంత జిక్కి చావదె సుమతీ. అనుదానికి మూలము
“బహుభిర్న విరోద్ధవ్యం దుర్దనైస్ప్వజనైరపి
స్ఫురంత మపి నాగేంద్రం భక్షయంతిపిపీలికాః” పరిశోధించు వారికెన్ని యిట్టివి లభించునో యెమో?
సుమతి శతకము 163
సుమతి నీతి
ప్రాచీన సంస్కృత కవులును నీతి శాస్త్రకారులును తెలిపిన భావములనే సుమతి శతకకారుడును వెల్లడించినాడు. అందుకొన్ని ఈనాటి నీతికోవిదులు మెచ్చనట్టివియు కలవు. “గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజము... లేవు తెలియర సుమతీ” అనుట విచారకరము. ఏమీ! గొల్లవారంతటి మూర్చులా? ఇతరుల స్వత్వమేనా సాహిత్యవిద్య! “ఒల్లని సతినొల్లని పతి నొల్లని చెలికాని విడువనొల్లని వాడే గొల్లండు” ప్రాసకై గొల్లడే దొరికినాడే కవికి! కోమలికి నిజము కల్లయట. “లేదు సుమీ సతులవలపు” అని మరొకమారన్నాడు కవి. పురుషులె నిజాన్ని గుత్తగొన్నట్టి వారు కాబోలు! కోమలులే వ్రాసియుండిన వారేమని యుందురు. “మగవారినిలా నమ్మరాదే చెలీ” అని యుందురు కదా! పులియే చిత్తరవు వ్రాసి యుండిన నెట్లుండును? (మానవుడు పులిని జంపి దానిపై కాలుంచినట్లు చిత్రించిన దానిని పులికి జూపగా, పులియే చిత్రించిన మరొక విధముగా నుండునులే అని పులి యన్నదట)” మేకల పాడియే యుతృష్టమని వైద్యుల యభిప్రాయము.
“కొక్ళోకమెల్ల జదివిన
చిక్కదురా వారకాంత” అన్నాడు.
వాత్స్యాయనుని శాస్త్రమునకు తెనుగు దేశములో ప్రచారము లేదయ్యెను. ఎవడో మళయాళీయుడగు కొక్కోకుడు వ్రాసిన అనుత్తమ గ్రంథానికే ప్రచారమెక్కు వయ్యెను. తెనుగులో ఎర్రన కవి యనునతడు క్రీ.శ. 1600 ప్రాంతములో దానిని రచించెను. సుమతికారుడు ఎర్రనకవి కొక్కోకముగా సంస్కృత రతి రహస్యముగా పేర్మొనినది. సంస్కృతములో కవి పేరు కొక్కోకుడు. తెలుగులో కృతి పేరే కొక్కోకముగా ప్రసిద్ధమయ్యెను.
“కరణము కరణము నమ్మిన మరణాంతక మౌను”
“ఒక యూరికి నొక కరణము”
“కరణముల ననుసరింపక, విరసంబున తిన్న తిండి వికటించు సుమీ”
“కరణము సాదై యున్నను లెక్క గొనరు గదరా సుమతీ”
“కరణము వైదికుడైనను మరణాంతక మౌను”
164 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“ధరకాపు కొండెడైనను కరణాలకు బ్రతుకులేదు”
అని ఆరుమారులు కరణాలను స్మరించినాడు సుమతి,
కాని ఆ స్మరణ కరణాలకు ప్రశంసాపాత్రము కాదు. కరణాలొకరి నొకరు నమ్మరనియు, కరణాలు సాధువులెన్నటికి కారనియు, వారు రైతులను భాదించెడి వారనియు, కరణాలు సాధారణముగా నియోగులేననియు, కవి యభిప్రాయము. రాయని భాస్మరుని కాలానికి పూర్వము కమసాలులు కరణాలై యుండిరనియు, భాస్కరుడు వారిని తొలగించి నియోగుల నేర్పాటుచేసెననియు(?) నొక కథకు ప్రచారము కలిగింది. అది నిజమగుచో సుమతి కవి క్రీ.శ. 1600 ప్రాంతము వాడగును.
“వెలయాలు సేయు బాసలు
వెలయగ నగసాలి పొందు వెలమ చెలిమియున్
కలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ”
కవికి గొల్లలన్న అసహ్యము. కరణాలన్న కోపము. వైదికుడు మరణాంతకుడు. వెలమలు నమ్మరానివారు. “నమ్మకు మగసాలవాని”, నమ్మకు మంగడి వానిని”, అనుటకూడ అగసాలి వారు కూడా దుర్మార్గులు. అంగడి వాడస వ్యాపారి. బహుశ కోమటియని కవి దృష్టిలో నుండును. దుష్టరాజులను దొరలను, అధికారులను పలుమారు దూషించెను. కాపుల వృత్తియు నంత మెచ్చు వచ్చినట్లు కానరాదు.
అడిగిన జీతం బియ్యని
మిడి మేలపు దొరను గొలచి మిడుకుట కంటెన్
వడిగల రెండెద్దుల కట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ. అని నికృష్ణ పక్షములో మేలు రకముగా తలచెను.
“మేలెంచని మాలిన్యుని
మాలను నగసాల వాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవు గాని నెగడదు సుమతీ,
సుమతి శతకము 165
అని చెప్పుటచే మాల, మంగలివారు నీచులైరి. అగసాలిని, వెలుమలను, కరణాలను, మాల, మంగలివారిని నిరసించిన పద్యాలు కవి సొంత భావములై యుండును. కవి యే జాతివాడో పై నిరసనములను బట్టి ఊహించుట మరింత కష్టమైనది.
“కలకంఠ కంఠి కన్నీరొలికిన
సిరి యింట నుండ నొల్లదు సుమతీ.”
“అక్కరకు రాని చుట్టము
మొక్కిన వర మీని వేల్పు...”
“అపకారికి నుపకారము
నెపమెన్నక సేయు వాడె నేర్పరి సుమతీ”
“ఎప్పుడు సంపద గలిగిన
పసిబాలల పొందు వాడు పశువుర సుమతీ”
“బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పల్కుటమేలా”
“సరసము విరసము కొరకే....
ఇట్టి పద్యాలు ఉత్తమమై శతక వాజ్మయములో మకుటాయమానమై యొప్పుచున్నవి. సుమతి శైలి
అన్ని శతకములలోను సుమతిశతక శైలి విలక్షణమైనది. ఇతనికి అనుప్రాసము లపై ప్రీతి యెక్కుడు. సులభముగా పద్యములను జ్ఞాపక ముంచుకొను విధమున వ్రాసినాడు. వేమన పద్యములైనను, సుమతి పద్యాలైనను తెలియని విద్యావంతులు తెలుగు వారిలో అరుదు. (ఈ కాలము తెనుగుతో డిగ్రీలు పొందిన వారిలో కొందరికివి రాకపోవచ్చును కాని జన సామాన్యములో సుమతికిని వేమనకును బాగా ఆదరము కలదు.)
ఇక ఈ కవి వాడిన పదాలను కొన్నింటిని విచారింతము. “ఎద్దుల కట్టుక”, “మడి దున్నుక” అని కవి ప్రయోగించినాడు. ఇవి భారత కవులలోను, వారి కాలపు కవులలోను ఉండిన ప్రయోగాలు కావని వైయాకరణుల అభిప్రాయము. అట్లగుటచేత ఎర్రాపగ్రడ శ్రీనాథుల తర్వాతి వాడని చెప్పవచ్చును.
166 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“గుడి మనియము సేయరాదు” అని ముద్రిత ప్రతులలో కలదు. మణియము శబ్ద రత్నాకరము (శ.ర)లో లేదు. మణివము, మణిగము అను పదాలిచ్చినాడు. కాని వాటికి ప్రమాణములు తెలుపలేదు. మన్నెము, మన్యము, మాన్యము అను శబ్దాల కీమణియము సమానముగ నున్నందున ఇదియే సరియగు రూపమేమో? అధరము కదలీ కదలక అని కొన్ని ప్రతులలో కలదు. కొన్నిటిలో కదలియు కదలక అని ముద్రించినారు. ఏది సరి? “ప్రాకొన్న నూతి యుదకము, అనుచో ప్రాకొన్న అనగా ప్రాతబడి వాడుక లేకయున్న అని ఒకరి వ్యాఖ్య. ప్రాకు-కొను= ప్రాకొను పాచిపట్టు అని శ.ర.లో అర్థమిచ్చి దానికీ పంక్తినే యుదహరించినారు.
“వాదుకు దెచ్చునదె కీడు” అనుటలో వాదునకు అనుటకు మారుగా వాదుకు అని కవి ప్రయోగించినది గమనింపదగినది. “సర్పంబు పడగనీడను” ప్పకు నుర్చకు ప్రాస కలిపి ముద్రించినారు. కాని సర్పము తద్భవములో సప్పమగును. ఆ రూపమియ్యవచ్చును. శ.ర.ములో సప్పము అను పదమిచ్చి ఇదే పంక్తి నుదహ రించినారు.
ఈ కవి రేఫశకట రేఫల ప్రాసలను పాటించినాడు. కవి ప్రాచీనుడు కాదని తెలుపుటకిది ముఖ్యాధారము. శ్రీనాథునికి పూర్వమువారు (ప్రమాదోధీమతా మపి అనునది కాక) రేఫద్వయ సాంకర్యము చేసినవారు కారు. కరణము, మటినమ్మక అనుచోటను పరునాత్మ మజుమాట అనుచోటను, పరుల కష్టము ఎటిగియు అనుచోటను, పరులకు, పిటికికి అనుచోటను ఇతడు ప్రాసలందు రేఫద్వయ మైత్రి ఘటించినాడు. “పేరణము లేని లేమయ” అనుచో పేరణమునకు శ.ర.లో అంగీ యనియు వ్యాఖ్యాతలు రవికయనియు వ్రాసినారు. పేరణము ఎక్కువగా ఒక నాట్య భంగిమమునకే ప్రాచీనులు వాడినారు. నాట్యమెరుగని స్రీ అనియు, చెప్పవచ్చును. “వీరణములు లేని పెండ్లి” అనుచో, వీరణములకు, చర్మవాద్య విశేషమని శర.లో వాద్యములు అని వ్యాఖ్యాతలును వ్రాసిరి. చర్మవాద్య విశేషమననెట్టిది. ఈనాడును కొందరు గొల్లవారు తమ యిండ్లలోని వివాహములందు ఒక పెద్ద డోలు వాయింతురు. ఆ డోలు మంగలివారు వాయించు డోలుకు నాల్గంతలయినను ఉండును. దానిని గొల్లవారు “వీరన్న డోలు” అందురు. ఎందుకాపేరు పెట్టినారనిన, వీరభద్రుని సేవలో వాయించినది కాన వీరన్నడోలైనదందురు. సాధారణముగా గొల్లలు వైష్ణవులే. కావున
సుమతి శతకము 167
ఆ యర్థము సరికాదు. వీరణడోలు (వీరణము అను పేరుగల డోలు) అను పదమే వారి నోళ్ళలో నలిగి వీరన్నడోలు అయినది. అంతే!
“జగడము చోట” అనుచో జగడ శబ్దము రుకటము అను సంస్కృత శబ్ద భవము. భారత కవులీ జగడ శబ్దమును అంత పెద్ద కలహాల గ్రంథములో వాడినట్లు నాకు గోచరింపలేదు. ఇదియు శ్రీనాథాంతర పదమనవలెను. (రుకట శబ్దము నొక తాయన్న కవియే ఒక చోటనే వాడెను).
“తలమాసిన ఒలుమాసిన” అనుచో, ఒలు అనగా ఒడలు (శరీరము అని అర్థము చెప్పుకొనవలసి యుండును). ఈ శబ్దము నిఘంటులలో లేదు. సుమతి శతకాన్ని ఉదాహరించిన శ. ర. లో ఒలు శబ్దము లేదు. ఇది ప్రాస భీతిచే సన్నగిల్లిన శబ్దమా లేక అట్టి ప్రయోగము వ్యవహారమందున్నదా. ఒడలు శబ్దము ఉత్తర సర్మారులోనే ఎక్కువగా వ్యవహారముననున్నది. రాయలసీమ, తెలంగాణములలో పై, పయి, పెయి అని ఎక్కువగా వాడుదురు. ఈ పదాలు మై, మెయి అను భారత కవుల పదాల గ్రామ్య రూపాలే కాని అన్యము కావు. కాని సర్మారులలో ఒడలు, ఒళ్ళు కాక ఒలు అను రూపము కూడ కలదేమో తెలియదు.
“చీరే శృంగార మండ్రు స్రీలకు సుమతీ” అనుటలో చీర అనగా స్రీలు కట్టుకొను కోక అని యర్థము కదా. ఈ పదము కూడ కవి యొక్క మధ్య కాలమును క్రీశ 1500-1600 ప్రాంతమును సూచించును. భారత కవులును, ప్రాచీన కవులును, చీరను స్రీ వస్త విశిష్టార్థమున కాక, వస్త సామాన్యార్థమునకే వాడిరి. “తలంజీర సుట్టియునూ అని తిక్కన వ్రాసెను. (ఆను 3-177)
“సంగరమున పారిపోకు సరసుడవైనన్” అనునది కొన్ని ముద్రణములలో సరసుడవైతే అని యున్నది.
“చీటికి ప్రాణంబు వ్రాలు” అనుచో చీటి యనగా పత్ర ఖండమని శ.ర. లోను, జాబు, రసీదు అని వ్యాఖ్యానములలోను కలదు. చీటి పదము తెనుగు పదమేనా? అని సందేహము! హిందూస్మానీలో చిట్టీ అను పదము నుండి వచ్చెనేమో అని యూహింతును.
“పిరికికి దళవాయితనము పెట్టకు” అనుదానిలో దళవాయితనము అనగా సేనా నాయకత్వమని అర్థము. ఈ పదము కూడ భారత కవులది కానట్లు తలతును.
168 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
“మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!!” అను పంక్తి ఒక ముద్రణలో “మనుజాధి పుడతడు గొల్వ మహిలో సుమతీ” అని కలదు. “కాపు కొండెడయిన” అనుచో కొండీడు అనుటకు కవికొండెడు అని ప్రయోగించెను.
“శుభముల నొందని చదువును” అను పద్యములో మూడవ పంక్తి “అభిలాష లేని కూటమి” అని కలదు. నేను చూచిన ఒక ప్రతిలో “గుభగుభలు” లేని కూటమి అని కలదు. (గుబగుబలని) కలదు కాని ప్రాసకై గుభగుభలు అని ట్రాస్తున్నాను).
“కడు బలవంతుడైనను” అను పద్యములో తుది గీటులో “పడుపుగ సంగడికి దానె పంపుట సుమతీ” అని కలదు. కాని ఒక ప్రతిలో “బడువగ సంగడికీ...” అని కలదు. బడువ అనగా నీచుడు అను నర్ధములో వ్యావహారమందు కలదు.
“తలదడివి బాస చేసిన” అని సుమతి, “తల దడిపి బాస జేసిన” అని సారంగధర ఏదిసరి?
“తాననుభవింప నర్థము” తాను అనుభవింపని యర్థము అనుటకు తప్పు ప్రయోగము. ఇదియు కవియొక్క అర్వాచీనత్వమునకు నిదర్శనము కాదగును.
“నీరే ప్రాణాధారము” అను పద్యములో “నీరే” అను దానికి సరిపోవునట్లు- నోరే, నారే, చీరే, అని యొక ప్రతిలో ముద్రించినారు. కాని తక్కువ వాటిలో నారియె, చీరయె అని ముద్రించినారు ఏవి కవి ప్రయోగాలో?
“పరసతుల గోష్టి నుండిన” అను పద్యములో మూడవ పంక్తి “గరిత సుశీలయె యైనను” అని యొక ప్రతిలోను “పరసతి సుశీలయైనను” అని ఒక ప్రతిలోను కలదు. “పరునాత్మ దలచు సతివిడు” మజుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ” అని ముద్రణ. ఒక ప్రతిలో “బరునాత్మ దలచు” అని కలదు. మరియు పద్యమిట్లుండెనా? పరునాత్మ తలచుసతి: విడుమర మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ”
“మది నొకనివలసి పద్యములో “మానక తిరుగన్ అది చిలుక పిల్లి పట్టిన” అని కలదు. ఇది కవి హృదయము కానట్లున్నది. పద్యపునడక, అల్లిక, ఎట్లెట్లో ఉన్నది.
“సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్”
సుమతి శతకము 169
అని కొన్ని ప్రతులలో ముద్రించి రలప్రాసము నుంచినారు. ఒక ప్రతిలో
“సిరి దా వచ్చిన వచ్చును
సరిపోల్పగ నారికేళ సలిలము భంగిన్” అని కలదు. ఇది మంచి పాఠము కాదా?
ఈ విధముగా ఈ చిన్న శతకములో ఇన్ని పాఠభేదాలుండుట దీని ప్రచారాధిక్యమునే సూచించును. కావున పూర్వ తాళపత్ర ప్రతులను సేకరించి సరియగు పాఠములను నిర్ణయించుట అవసరమని అంటున్నాను. ఇంకను కొన్ని ప్రధానములగు పాఠభేదములను విషయగురుత్వశంకతో వదలినాను.
70 ఏండ్ల వృద్ధుడొకడు తన బాల్మయులోని ఈ నీతిపద్యములు అచ్చులో లేదని విచారించి నాకిట్లు చదివి వినిపించెను.
“ఘన మెరుగనట్టి కోడలు,
వినయము లేనట్టి సుతుడు, వెరవని యనుజుం
డనుకూలగాని భార్యయు
మనుజున కిది మందులేని మరణము సుమతీ” ఒక ప్రతిలోని క్రింది యధిక పాఠము కలదు.
“వలరసము సతికి బుట్టక
బలిమిని దమకించి విటుడు పైకొనుటెల్లన్
మలయజము సానమీదను
జలముంచక తీసినట్టి చందము సుమతీ” అయితే యీ పద్యము ఎర్రన కొక్కోక కళాశాస్త మందిట్లున్నదని చెప్పిరి.
“వలరసము సతికి బుట్టక
బలిమిని దమకించి విటుడు పై కొనుటెల్లన్
జలముంచక సానపయిన్
మలయజమును తీయబూను మాదిరికాదె” ఒక పూర్వ లక్షణ గ్రంథములో ఈ క్రింది పద్యమునుదాహరించినారు.
కాదన్న వాడె కరణము
వాదడచినవాడె। మేటి వసుధేశుకడన్!
లేదన్నవాడె చనవరి।
గాథలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ॥
170 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వేమన పద్యాలలో పలువురు తమ పైత్యాన్ని పద్యాన్నిగా మార్చి దూర్చినట్లు, సుమతిలోను స్వమతిని అతికించిన వారు కూడ యుండిరేమో?
ఇంత దూరము చేసిన చర్చనుబట్టి సుమతి శతకకారుడు క్రీ.శ. 1500- 1600ప్రాంతము వాడని అభిప్రాయపడుదును.
ఈ శతకమునకు పీఠికను వ్రాసి చక్కని పాఠములను నిర్ణయించి పాఠాంతరము లనిచ్చి అవసరమగు పదముల విశేషార్థములను వ్రాసి, మూల సంస్కృత శ్లోకాలను వెదకిచూపి ఆకర్షణీయముగా ముద్రించుట అత్యంతావశ్యకమని నిరూపించుట కీవ్యాసలేశము పనికివచ్చుగాక.
సారస్వత పరిస్థితులు
కేవలము మతాభిమానముతో మత ప్రచారమునకై కావ్య రచన చేయు నాచారము తగ్గిపోయి కావ్య కళాదృష్టి తోడను సారస్వత స్పర్థతోడను కావ్య నిర్మాణము చేయు స్థితి ఎజ్జన కవి కాలమునాటికి క్రమముగా వచ్చినది. కావుననే శివభక్తిచేత శంభుదాసుడైనను, కవిత్వ రచనా విధానము చేత ప్రబంధ పరమేశ్వరుడైన ఎజ్టాప్రెగ్ధడ నృసింహ పురాణమును రచించి యహోబల నృసింహస్వామికి అంకితమిచ్చెను.
ఎజ్టాప్రెగ్గడ నియోగి బ్రాహ్మణుడు. శ్రీవత్స గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు. ఈ మహాకవిని గన్న తల్లిదండ్రులు-పోతాంబ సూరనలు. శంకర స్వామి పితామహుడు. గురువు. కవికాలము: ఎజ్టాప్రెగ్గడ రామాయణమును, హరివంశమును ప్రోలయ వేమారెడ్డి కంకితము చేసెను. ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ. 1324-53 వకు రాజ్యము చేసెను. కావున ఆ రాజాస్థానమునున్న ఈ కవి కూడ నీ కాలముననే యుండెననుట స్పష్టము. 1. హరివంశము: ఇది భారతమున కనుబంధ గ్రంథము. ఎజ్టాప్రెగ్గడ సంస్కృత హరివంశము నాంధ్రీకరించుటలో భారతాంధ్రీకరణ పద్ధతినే యనుసరించి సాధ్యమైనంతవరకు విషయములను సంగ్రహించి మూలకథాంశముల రచించెను. కాని యితడు మూలమందలి హంసడిభకోపాఖ్యానమును వజ్రనాభ వధఘట్టమును వదలి వేసినాడు. ఎజ్జన ముఖ్యముగా జెచిత్యము పాటించి మూలమును వదలక రసపోషణము చేయుచు తన రచనా పాటవముచే మూలమునకు గూడ మెటుగు పెట్టినట్లున్నది. ఉషాపరిణయమున నీతడు వర్ణించిన నూతన వధూవరుల ముగ్ధ శృంగార ప్రణయ భావములు - చిత్రరేఖ పాత్రపోషణములిట్టివి. శ్రీకృష్ణుని శైశవ
172 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
క్రీడోత్సవము, యశోదా దేవకీదేవుల మాతృభావము స్వభావసిద్ధముగా చిత్రింపబడి పోతనార్యుని భాగవత రచనకు వరవడియైనది. ఉదా:
ఎక్కడి కేనియు బోయెద
మీ కష్టపు పాటలు పడగ నేమోర్వము నీ
చొక్కపు కొడుకును నీవును
నొక్కతలము నొక్కయూరి నుండుడు నెమ్మిన్ (హరి) దీనికి సరియగు పోతన పద్యమిది.
ఓయమ్మ నీ కుమారుడు
మా యిండ్లను పాలు పెజుగు మననీడమ్మా
పోయెద మెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజుల వాణీ - (భాగ)
ఈ విధముగా యొజ్జన రచన మలతి యలలతి తెలుగు పదముల బింకముతో
నొప్పుచున్నది. ఎజ్జిన హరివంశమునందు పోతన భాగవతమునందును గూడ సత్యభామా యుద్ధము - రుక్మిణీ పరిణయము - కాళీయ మద్ధనము, కృష్ణలీలలు, వామనావతారము మొదలైన సమాన ఘట్టములు గలవు. ఇందు పోతనకంటె ఎజ్జన రచన మేలుబంతియైనది. అట్లయ్యును ఎజ్జిన రచనమును పోతన కవిత మించి పోయెననియే చెప్పవలయును. 2. _ నృసింహ పురాణము: ఇది యష్టాదశ పురాణములలో నొకటి కాదు. ఇందలి కథ బ్రహ్మోండాది పురాణాంతర్గతమైనది. భాగవతమున కూడ నీ కథ గలదు. కవి కొంత కల్పించెను. విష్ణుపురాణమున నృసింహావతార కథ గలదు. అందు నృసింహుడేల హిరణ్యకశిపుని జంపెనో చెప్పబడలేదు. దాని యందు నృసింహుడు స్తంభము బ్రద్దలు చేసుకొని వచ్చుటయు లేదు. సంస్కృత నృసింహ పురాణమునకు దీనికి పోలికయే లేదు. ఇందలి వర్ణనలు కవి స్వకపోల కల్పితములై ప్రబంధములందు వలె బుతు-చంద్రోదయాది వర్ణనలతో ప్రధాన కథకు భంగము కల్గింపక కథా సౌష్టవముతో చేయబడినవి.
ఎట్టాప్రెగ్గడ 173 బి ప్రైగ్గ
ఈ కథకు సనక సనందాదుల శాపము బీజమును, హిరణ్య కశిపుని వధ కార్యమునై యున్నది. హిరణ్య కశిపుని పాత్ర పోషణము విష్ణు సాయుజ్యము పొందువానిగా జిత్రింపబడక యహంభావ పూరితుడైన విష్ణుద్వేషిగా పరిణమించెను. నిధన సమయమందు కూడ హిరణ్యకశిపుడు జయుడను భావము పాఠకులకు జ్ఞప్తి కలుగదు.
ప్రబంధ కాలమునకు చెందక పోయినను ఆంధ్ర భాష యందు కుమార సంభవము తర్వాత పురాణ కథను ప్రబంధమువలె ప్రాఢముగా రచంచిన వాడగుటచే ఎజ్జినకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదు దగి యున్నది. నృసింహ పురాణమందలి కథ ప్రహ్లాద చరిత్ర. కావున యిందు కూడ పోతన రచనమునకు సాదృశ్యము కలదు. రసాతిశయమున పోతనది పై చేయియైనను జెచిత్య పోషణమున నెట్టిన మేటి యయ్యెను. భారత భాగవతాది పురాణములవలె నృసింహ పురాణము సంస్కృతము నుండి యాంధ్రీకరింపబడినది కాదు. ఇందలి కథ ఎజ్జనామాత్యుడు బ్రహ్మాండాద్యనేక పురాణముల నుండి గ్రహించి జెచిత్య పోషణ కొణకు యొక ప్రబంధముగా మార్చినాడు. కావ్యమున బెచిత్యము ప్రాణప్రదము కాన భాగవత కథ నుండి కవి చేసిన మార్పులను గమనింపవలసియున్నది. బెచిత్యములు: శ్రీ విష్ణుద్వార పాలకులైన జయ విజయులు - సనక సనందనాదుల నడ్డగించ నామహర్షులు వారిని అసురయోని జనింపుడని శపించిరి. పిమ్మట విష్ణువు అచటికి వచ్చి వారిననతి కాలములో తన యంతికము చేరునట్లను గ్రహించుటకును వేడుట మూలకథ. జయవిజయులకు వైకుంఠ మొసగు అధికారము విష్ణువునకుండగా ఆ మహర్షుల యాచింపనేల? ఈ సంఘటన సర్వాంతర్యామికి తెలియకుండ జరుగు టెట్లు? అల్ప దోషమునకే యింత ఘోర శాపమా? ఈ అనౌచిత్యముల పరిహరించుటకై ఎజ్జన సనక సనందాదులతో విష్ణువు జయ విజయులొనర్చిన దోషము తనదేననియు- అనతి కాలములో ద్వార పాలకులు తనలో నైక్యమగుదురనియు ఈ సంఘటనలన్నియు తన మాయా బలముచే వారి శ్రేయస్సుకై కల్పింబడినవని” మార్చి మూల కథకు జెచిత్యము గూర్చినాడు.
2. _ హిరణ్యకశిపుడు తన సోదరుని జంపినందులకై హరిని తదనుచరులగు దేవతలను ద్వేషించి దేవలోకముపై దండెత్తిపోయినట్లుగా భాగవతమున కలదు.
174 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఇందు వ్యక్తిగతమగు కలహము ప్రతిపాదింపబడినది. ముఖ్యముగా నీతడు పోరాడినది తన యహంకారమువలననే. దానికొక బంధు వినాశనము అను సాధారణ కారణము కంటె ఎజ్జన మజియొక ఉచిత కారణమూహించెను. దేవతలు రాక్షసులు సవతుల సంతానము కాన నందులో రాక్షస మాతయగు దితి కశ్యప ప్రజాపతికి జ్యేష్ట భార్య యగుటచే త్రిలోక రాజ్యమునకు దైత్యులకెక్కువ యధికారముండెననియు నా హక్కును సాధించుకొనుటకై హిరణ్యకశిపుడు స్వర్గముపై దండెత్తెననియు యీ కవి కల్పన. 8. భాగవతమందలి హిరణ్యకశిపుడు చేసిన బ్రహ్మ స్తుతి అతని యసురత్వమునకు విరుద్ధముగా వేదాంతమయమైయున్నది. దీని నెజ్బన జెచిత్యముగోరి “సముచితార్థ మధుర బహువిధ స్తోత్ర సమ్మద్ధ రచనమున నతడిట్లని విన్నవించె”నని మాత్రము రచించెను. 4. హిరణ్యకశిపుడు తపము చేయుచుండగా అతని భార్య గర్భిణియగు లీలావతిని దేవేంద్రుడు చెజపట్టెనను ఘోర విషయమును లీలావతి శత సంవత్సర గర్భ వృత్తాంతమును హిరణ్యకశిపుని శత దివ్య సంవత్సర లోపమును భాగవతమున కలవు. జెచిత్య పోషణ కొజికు ఎజ్జన మహాకవి నృసింహ పురాణమున వీనిని పరిహరించెను. ర్. _ హరి నృసింహ రూపమున నొక స్తంభమున నావిర్భవించుటకు గల కారణముగా నెట్టనచే నృసింహ పురాణమున నొక చక్కని సందర్భము గూర్చబడినది. నృసింహావతార సన్నివేశము హిరణ్యకశిపుని “సమంచిత కాంచన రత్న ఖచిత మహా స్తంభ శత సంఖ్యాతమగు సభా మండపమున” జరిగినట్లు వర్ణింపబడినది. అందుచే నా సభయందలి ఒకానొక స్తంభమునందు హరిని జూపుమని హిరణ్యకశిపుడు 'ప్రహ్లోదుని నడుగుటయు నంత హరి దాని నుండి యుద్భవించుటయు సక్రమముగా పరిణమించినది.
ఈ విధముగా నెజ్బన మూలమునకు జెచిత్యముచేత మెజగుపెట్టినాడనియే భావింపవలె.
పోతనపై యెజ్బన ప్రభావము: ఎజ్జన యొక్క రచన పోతనామాత్యునకు అనేక విధముల మార్గదర్శకమైనదనుటలో సందేహము లేదు. ఎజ్జిన వ్యాకరణ ఛందోలి.. లంకార లక్షణయుక్తముగా వ్రాసినాడు. పోతనామాత్యునకు ఎజ్జిన కున్నంత
ఎజ్బ్టాప్రెగ్గడ 175 కా దెగ్గ
పాండిత్యము లేకపోయినను పోతన కవిత్వమున గల మృదు మధుర రచన మాత్రము శ్రీఎజ్ఞన కబ్బలేదనిన విమర్శకు లంగీకరింతురని యనుకొందును. అవాజ్మానస గోచరమగు నొక విధమైన విష్ణు భక్యామృత రసము పోతనార్యుని కవిత్వములో ననపాయముగా వచ్చి భక్తి రసాబ్దిలో నోలలాడించును. ఎజ్జనార్యుని పోతనామాత్యు డనుకరించిన పద్యములనేకము గలవు.
1. కలడు మేదిని యందు గలడుదకంబుల
గలడు వాయువు నందు గలడు వహ్ని - (నృసిం)
2. కలడంభోధి గలండు గాలిగల దాకాశంబునన్ గుంభినిం గలదగ్నిన్...
3. ఇందు గల డందు లేడని... (భాగ)
అనుకరించిన పద్యములో మెఅగుబెట్టి పైగా మించి మంచి పద్యము వ్రాసినాడు.
“వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు దండ్రిగాడు (నృసింహ)
“శౌరి పదాంబుజ స్మృతి రసంబున దేలెడు నా మనంబు....
త్య అంబుజోదర దివ్య పాదారవింద...(భాగ)
ఈ రసవత్ఞండ సృష్టికి పై పద్యము మూలమనుటకు సందేహమేమియును లేదు.
అరణ్య పర్వ పూరణము: ఎజ్జనమీద ఏ మాత్రము గౌరవ భావము లేని కొందరు విమర్శకులు భారతారణ్య పర్వశేషమును పూరించలేదనియు, నన్నయ భారతమున మూడు పర్వములను పూర్తిగా వ్రాసినాడనియు - అక్కడక్కడ క్రిమిదష్టమైన అక్షరములను ఎజ్జిన సర్దెనను వాదములు చేసిరి.
అరణ్య పర్వాంతమున -
... ఎజ్జనార్యుండు సకల లోకైక విదితుడు - కం. ధీర విచారుడు తత్మవి
తా రీతియు కొంతదోప దద్రచనయకా
నారణ్య పర్వశేషము
పూరించె కర్ణపుట పేయముగాన్ - ”
176 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
అని యుండుటచే నేడాంధ్ర లోకము ఎట్జనామాత్యుడు అరణ్య పర్వశేషమును పూరించెనని నమ్ముచున్నది. మరియు ఉ. _ శారదరాత్రు లుజ్వల లసత్తరతారక హార పంక్తులం
జారుతరంబులయ్యె, వికసన్నవకైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణక
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబర పూరితంబులై”
అరణ్య పర్వములోనిది నన్నయ చివరి పద్యముగా - మరి ఈ క్రింది పద్యము నుండి ఎజ్జన కవిత్వము. చ. _ “స్ఫుర దరుణాంశు రాగరుచి బొంపిరి వోయి, నిరస్తనీరదా
వరణములై దళత్మమల వైభవ జృంభణముల్లసిల్ల ను
ద్ధుతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ జూడగన్”
దీనిని బట్టి అరణ్య పర్వమున గల మొత్తము 2,900 గద్య పద్యములందు నన్నయ 1300లును, ఎజ్జిన 1600లును రచించెగాన సగముకంటె నధికముగ ఎజ్టనయే రచించె ననుట స్పష్టము. రామాయణము: ఎట్టన రామాయణ మిప్పుడెచ్చటను కానరాదు. దీని నుండి కొన్ని పద్యములను కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహమున నుదాహ రించెను. ఒక సంకలన గ్రంథములో గూర్చబడిన యెజ్టాప్రెగ్గడ రామాయణములోని కొన్ని పద్యములను వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సేకరించినారు. ఆంధ్ర వాజ్మయమున యెజ్జనకు గల స్థానము
ఆంధ్రమున కవిత్రయము వారి ప్రయోగములు ప్రామాణికములనియు తద్భిన్నములగు కావ్యములు కావని లాక్షణికులు తలంతురు. వీరు కావ్య రచనకు మార్గదర్శకులనియు గురువు లనియు కూడ నంగీకరించి తర్వాతి కవులు వీరిని కావ్యారంభముల స్తుతింపజొచ్చిరి. నన్నయ వాగనుశాసనుడుగను, తిక్కనకవి బ్రహ్మ గాన నీతడు ప్రబంధ పరమేశ్వరుడనబడి రాబోవు ప్రబంధ యుగమునకు మార్గదర్శ కుడయ్యెను. అరణ్య పర్వమును పూరించుటయేగాక భారతానుబంధ గ్రంథమగు హరివంశమును గూడ రచించి భారతమును పరిపూర్ణముగా రచించిన వాడని ఖ్యాతి పొందెను.
ఎజ్జాప్రెగ్గద 177
నిజానికి భారతారణ్యపర్వ పూరణలో నొక పెద్ద సంకటము గలదు. నన్నయది సంస్కృత భూయిష్టశెలి. తిక్కన శైలి దేశీయ పదమయము. అరణ్య పర్వ పూరణ మీ రెంటికిని వంతెనవలె నుండవలెను. లేనిచో అతుకుల బొంత వలె తయారగును. ఎజ్జన కుభయ భాషలయందు కావ్య రచనా సామర్థ్యముండుటచే నీయసిధారా వ్రతమును బహు చాకచక్యముతో నిర్వహించి యాంధ్ర సారస్వతలోకము మెప్పును, కృతజ్ఞతను బడసిన వాడయ్యెను. అందుచే నీతనికి నన్నయ, తిక్కనలతో సమాన గౌరవ ప్రతిపత్తులు దక్కినవి. ఇదియే ఎజ్జనకాంధ్ర వాజ్మయ మందలి గల స్థానము. ఆంధ్రీకరణ విధానము: నన్నయ భట్టు మార్గముననే కథా ప్రధానముగ మూలము ననుసరించవలసినచో వర్ణనలు కొన్ని కలిపియు, కొన్ని విడిచియు కొన్ని మార్చియు స్వతంత్రముగా రచించెను. కవిత్వ శైలి: నన్నయ వలె నతి సంసృతముగాక, తిక్కన వలె నతి దేశీయముగాక రెండును సమపాళ్ళు గల్గి ఈతని కవితాశైలి రసవత్తరమై కావ్యమై యుచిత గుణాలంకార శోభితమై హృదయ రంజకముగానున్నది. నన్నయ తిక్కనలవలె స్రీవర్ణనలనతి సభ్యముగాజేసెను. ఉ. _ నీలపయోద మండలము నిచ్చల లీల వెలుంగ జేయుచుం
గ్రాలెడు వ్రాలు గ్రొమ్మెజుగుకైవడి దద్వనభూమి యంతయున్
లలిత దేహకాంతి పటలంబుల జేసి వెలుంగ జేయు న
బ్బాల వినీలకుంతల విభాసిని జూచి సవిస్మయాత్ముడై” తర్వాతి కవులపై నెజ్బన ప్రభావము
ఈతడు నన్నయ తిక్కనల కవితలోగల మేలును గ్రహించి - తన ప్రతిభచే తన కవితకు కొంత నూతన మార్గము దీసి రాబోవు ప్రబంధ కవులకు మార్గదర్శకుడైనాడు ఈతని కవితా చాయల పోతన భాగవతము నెంతవరకు గల్లెనో సమాన ఘట్టముల పరికించి చూచితిమి. నృసింహ పురాణములో క్షీర సముద్ర- వైకుంఠ- విష్ణు- వసంత- పానగోష్టి మొదలగు వర్ణనములు కొంత దీర్హములై కథకు అడ్డుతగిలి చమత్మార కల్పనలతో నలంకార భూయిష్టముగ రచియింపబడి ప్రబంధ కవుల యష్టాదశ వర్ణనాలకు దారి చూపినది.
178 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
శ్రీనాథుడు కాశీఖండములో - “పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని లేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు” అని చెప్పుకొనెను. దేవేంద్రుడు తనకు విష్ట్వాదుల బలముగలదని పొంగుచున్నాడని హిరణ్య కశిపుడు పల్మినపుడు ఎజ్జిన నృసింహ పురాణములో ఈ క్రింది పద్యము వ్రాసెను. “హరి తనకుంగలండని పురాంతకుడామురవైరిసేత లె ప్పరుసున మాన్పడల్లనుని పద్మభవుండుమనాత్మలోన ని ర్టరులకు మేలు గోరునని సంయమికోటి తలంపుల న్నిజ స్ఫురణమయావహించునని పొంగుచు నుండు మహేంద్రుడెప్పుడున్” నంది తిమ్మన పారిజాతాపహరణములో సత్యభామా గర్వమును గూర్చి నారదునిచే పల్కించిన పద్యమున ఎజ్జిన పైపద్య రచనానుకరణము గోచరించును. “చక్కని దాననంచు నెల జవ్వనినంచు జగంబులోన బే రెక్కిన దాననంచు బతియెంతయు నాకనురక్తుడంచు దా” ఎజ్జిన నృసింహ పురాణములో వన విహారము చేయు స్రీ వర్ణనల పద్యమునకు మెజుగుపెట్టి యనంతామాత్యుడు భోజరాజీయమున నిట్లనుకరించెను. “మునికాళ్ళు మోపి నిక్కిన పదచ్చవి నేల యును పల్లవించిన యొప్పుమెజియ వలులేది నతనాభి బలసి యొక్కింత సా గిన మధ్య యెంతయు ఘనతయు. నొయ్యడాకేల దవ్వుల నున్న తీగ దివిచిన నఖ దీప్త లంతంత వీటుకొనగ లీపపెజికేల నచ్చరలేమ యోర్తు గోసె బువ్వులు ప్రమద వికాసమెసగ” (నృ.పు)
ఎజ్టాప్రెగ్గడ 179
“తరుణీ రత్నము పువ్వు తీగె నొకచేతన్వంచి పాదాగ్రమున్
ధరణిన్ మోపి యొకింత నిక్కిత నుమధ్యంబొప్ప గక్ష ద్వయ స్ఫురణంబార కుచంబులుబ్బి నయనంబుల్విచ్చి లీలన్ముఖాం బురుహంబెత్తి యొకర్తు గోసెనెలమిన్ బుష్పంబులత్తోటలోన్- (భోజరా)
“సతబంధమహేశ్వరు శంభుదాసు - నధికతర యుక్తి నాదరించి” అని కాశీఖండములో శ్రీనాథుడే ఆదరించెను గదా!
ద్విపద రామాయణము
కవిత్వ విషయము
“ద్విపద కావ్యంబు, ముదిలంజ దిడ్డి కంత” యన్నియు సమమని వేణు గోపాలుండు పడందిట్టిన వాక్యము గొందణి సమ్మతమున సమంజసమై యుండును. కాని యీ రామాయణము వంటి కావ్యములంజదివిన తర్వాత నిట్టి యభిప్రాయము తప్పని తోచక పోదు. ద్విపద కావ్యములన్నింటిలో ద్విపద రామాయణము, గౌరన హరిశ్చంద్రయు శ్రేష్టములైనవి. పాల్కురికి సోమనాథుని బసవపురాణము గూడ వీనికిందీసిపోయినది కాదు. భారతమును బ్రథమమున నాంధ్రీకరించిన కీర్తి నన్నయ భట్టుది. రామాయణమును మొదట తెనిగించినది కోన బుద్దుడు. భాగవతము బమ్మెర పోతన ఖ్యాతి నిల్పినది. కోన బుద్దుని పిమ్మట భాస్కరుడు, మొల్ల, రఘునాథ రాయులును వేర్వేరు గ్రంథముల వ్రాసిరి. పిమ్మట కాణాదము పెద్దన గద్వాలయందు రామాయణమును వ్రాసెను. అతని గ్రంథ ముతృష్టమైనదయ్యును గద్వాల రాజుగారిచేం గొందథి పండితులకే బహుమతిగా నివ్వబడుటచే నా గ్రంథము కన్యాకుమారి నాసిక యందలి సర్పమణి వోలె రాజాగారి భాండాగారమందే ప్రకాశించుచున్నది. పెద్దన తర్వాత గోపీనాథము వేంకటకవియు, నిటీవల శ్రీ వావిలి కొలను సుబ్బారావుగారును దీనిని నాంధ్రీకరించిరి.
కోన బుద్దుని శైలి నాతికఠినమై లలిత పద గుంభితమై, యుచిత స్థలముల వర్ణనములు కలదై, పండితులకును బామరులకును నాదరణీయమై యున్నది. ఇతని గ్రంథము సగము కన్న నెక్కుడుసంస్కత పదములు గలిగి యున్నను, క్లిష్ట దీర్హ సమాసములతో నిండినది కాదు. అప్పకవిగారి మహాప్రబంధ లక్షణములన్నియు నిందులేవు. అయోధ్యాపురము గ్రంథాంతమందు శ్రీరాముడు సీతకు విమానమందా యా స్థలముల జూపుచో గొద్దిగా వర్ణింపబడియున్నది. కుమార సంభవములో
ద్విపద రామాయణము 181
నన్నెచోడుండు జగదీశ్వరుని రహఃక్రీడను హేయముగా వర్ణించెను. ఈ కవి గ్రంథ మందెచ్చటను నాజోలికే పోయినవాండు కాడు. ఇక్కని వర్ణనములందు మూలమునే యనుసరించినందున చిత్ర విచిత్ర గల్బనల మాట యెత్తుకొనలేదు. విశ్వామిత్రు నాశ్రయంబున రాత్రి వర్ణనము చాలా రమణీయముగానున్నది.
“చలియింపకున్నవి సకల వృక్షములు
మెలంగవు వన భూమి మృగ సమూహములు
నెతి విహంగములు నీడముల్ చేరి,
మణిచియున్నవి తను మంజుల ధ్వనులు,
దీంటుగ చీకటి దెసలు నాకసము,
కాటుక బూసిన కరణి నున్నదియు
నీలాంబరంబున నిండు ముత్తెములు
గీలించి బ్రహ్మాండ గేహ గోళమున
గడునొప్పగా మేలుకటైెత్తినట్ల
యుడు గణంబులతోడ నున్నది నింగి (పు-35) సీత యౌవనమునొందు విషయమును వేరుకవు లలంకారశాస్త్రము నంతయు
బోధించి యుందురు కాని ఈ కవి:
“ఇంతయై, యంతయై యెలజవ్వనమున వింతయై, యీ యింతి వెలయుట జూచి” యంతటితో విడిచెను, రామలక్ష్మణాదుల భార్యల నలువురి కన్యకల నిట్లు
వర్ణించెను.
శారద పూర్ణిమా చంద్రుని కళలో
చారు వాసంత వాసన పుష్పలతలో
సాన దీరిన మంచి జాతిరత్నములో
శ్రీ నిండంబట్టి నార్చి కుందనంపుం
గమ్మలో కతింబులు గడిగిన ముత్తి
యమ్ములో నెజతావి నలరు గంధంపుం
గొమ్మలోయన బెండ్లికూంతులొంప్పారి; (పు. 75)
182 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
రని వర్ణించు భాగము కాళిదాసుని “అనాఘఘ్రాతం పుష్పం” అను శ్లోకమును జ్ఞప్తికిందెచ్చును. జీవనస్థితికినై చేనుదున్ను ్రిజటాఖ్య విపు డెందాక రాయి రువ్వునో యందాకయుండు గోవులనిచ్చెదనిన రాముండు పల్మగా నతండు, కరమున పాషాణ కలితుందై.
అఅచి ధోవతి మొల నంట బిగించి,
కురుచైన శిఖముడి గొని యౌడుం గజచి,
నరముల బ్రాణముల్ నరినంటంబట్టి;
బిరబిర తన ముష్టి బెట్టుగాం ద్రిప్పి,
యురమున జందెము నుజ్టూతలూగ
సరయువు దాట విచ్చలవిడి నేసె; (పు. 108)
అరణ్యకాండమందు హేమంతము
దిశలెల్లం జలికి భీతిలి వెలిపట్టు,
ముసుకు పెట్టిన యట్లు ముంచెహిమంబు;
వెజపున వణంకెడు విరహిణులనగం,
దెజగొప్పం గదలు పూందీంగె వీక్షింపు (పు.153)
ఈ వర్ణన మందలి ప్రతి పజ్మిని జదివి యానందింపవలయును. అచ్చతెనుగు పదముల యల్లిక యందంద కాననగును. చుప్పనాతి తనకొడుకు తుంటలై పడియుండుటం జూచి మునులపై కెగసిన గతిని చిత్తగింపుండు.
తలను మోపెడు జడల్ ధరియించి బూది,
యలంది జన్నంబున నందబుంగూడి
తొలంగక మేకపోతుల మెడల్ విఅచి,
పొలుపార నుడికించి పొట్టలనిండ,
నెట్టన నమలి యెండిన కళాసములు,
గట్టి యేమియు నెటుంగనియట్ల యుండి,
క్రొవ్వి నాశిశువును గుమతులై పట్టి
యెవ్విధి జంపితిరి? (పు. 157)
ద్విపద రామాయణము 183
బజారి జంతు లిటునే కదా యుండవలయును! అనుప్రాసము లీకవి కిష్టము వచ్చినవి. విభషణుండు శ్రీరాములను,
నిత్య సత్యత్రాణ, నిత్యకళ్యాణ
నిత్య జగత్రాణ నిత్యగీర్వాణ. (పు. 801) యని స్తుతించెను. ఇంద్రజిత్తు భార్య సులోచన యిదే యంత్యప్రాసములతో
రవి కులాంబుధి సోమ, రామాభిరామ,
ప్రవిమల గుణధామ, పరరాజ భీమ,
జలద సన్నిభ గాత్ర, సారస నేత్ర,
విలసిత చారిత్ర, వితత పవిత్ర. (పు. 471) యనియు నుతించెను. ఈ పద్ధతిని బమ్మెర పోతనరా జనేక స్థలముల ననుసరించెను.
మహా పురాణమగుటచే నీ ప్రబంధ మందతిశయోక్తులుక్రేక్ష లక్కడక్కడ ముఖ్యముగా యుద్ధకాండ యందుం జేర్పబడి యున్నవి. శ్రీరాములు సముద్రునిపై బ్రహ్మోస్త్రము ప్రయోగించినపుడు.
బ్రహ్మయు నింద్రుండు భ్రమం గానరైరి,
బ్రహ్మాండ మెల్లను బగిలి నట్లయ్యె:
భువనంబు లెల్లను బొగిలి నట్లయ్యె. (పు. 309)
ఇత్యాదులు, కుంభకర్ణుడు యుద్ధభూమికి వచ్చినపుడు సహిత మిదే యవస్థ మనము సాధారణముగా “పైల్వానుల కుస్తీ చూచునపుడు కరతాళ ధ్వనులు చేయుదుము. ఇది రామ రావణయుద్ధము. దేవతలు విమానములందుం గూర్చుని కనుజెప్ప వేయక చూచుచున్నారు. ప్రతి రాక్షసవీరుడు గూలినపుడు నరులపై వానరులపై పుష్పవర్షమును గురిపించుచున్నారు.
“ట్రాయి యుద్ధమందు దేవతలు గూడ పోరాడుచుండిరి. ఇక్మడ మన దేవతలు చూపరులే. కాని యుభయలోకములకును “రాయిటరు” అయిన నారదుండు మాత్ర మొకతూరి రామదర్శనమునకై వచ్చెను. రెండవ తూరి యింద్రుడు తన విమానమును బంపెను. ఇమ్మహాకవి యనేక స్థలముల కథాసందర్భములను బ్రకృతి భావములను గలిపి వర్ణించినదీ క్రింది పంక్తుల వలన దెలియును.
184 సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
దారుణ స్ఫుట రోష దైత్య గర్వాంధ
కారంబుతో నంధకారంబు విణిసె
నతి మీటి వానరానన సరోజాత
ములతో సరోజాతములు వికసించె; (పు. 510) ఈ పద్ధతినే గౌరన తన హరిశ్చంద్ర యందనుసరించెను.
విశ్వామిత్రుండు రామలక్ష్మణులతో,
జెలంగు సారసగణ సేవ్యమై, పుణ్య
సలిలమై, యుత్ఫుల్ల జలజమై మిగుల
ఫేనమై, నిత్య